Register as a Reviewer
అమీర్ లోగ్ (AmeerLog)

అమీర్ లోగ్ (AmeerLog)

21 Aug 2026
Overall Rating
5.6/10
8 Reviews

టాలీవుడ్ లో ఈ వారం విడుదలైన మూవీ లో "అమీర్ లోగ్" మూవీ కూడా ఒకటి. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ మూవీ.. ఓ చిన్న యూత్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కాగా థియేటర్లలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

Director: Ramana Reddy Soma
Cast: Hari munnangi, Sasidhar Kocharlakota, Manoj, Vedha Jalandharr, Ravan Nitturu,Sai Yogi Vishwender Reddy Kommidi, Pawon Ramesh And Others.

Available in:

Reviews

What critics and the public are saying about అమీర్ లోగ్ (AmeerLog)

Media Reviews

7 Avg: 5.6/10
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Ameer log movie review

అమీర్‌ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశార...

అమీర్‌ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశారు. ముగ్గురు లైఫ్ లో సెటిల్ అవుదాం అనే దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బస్తి క్రికెట్ మ్యాచ్ తో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఏమవుతుంది అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి అయితే పెంచారు. ఇక సెకండ్ హాఫ్ లో క్రికెట్ అయిపోయి బిర్యానీ చుట్టూ కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. 


ఇక సినిమాలో అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా హైదరాబాద్ బస్తి బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు. మొత్తంగా ‘అమీర్ లోగ్’ ఓ ముగ్గురు హైదరాబాదీ బస్తి కుర్రాళ్ళ కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.


Aug 21, 2026 Read Review
6

Above Average

Ameer Log movie Review

పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్‌, కల్చర్‌, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్‌ లోగ్‌` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్‌, హరి మున్నంగి, మనోజ్‌ ఆవుల, శశిధర్‌ కొచ్చర్ల కోట, విశ్వేశ్వర్‌ ర...

పాతబస్తీ నేపథ్యంలో చాలా అరుదుగా సినిమాలు వస్తుంటాయి. ఆ స్లాంగ్‌, కల్చర్‌, నేటివిటీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అలా చాలా రోజుల తర్వాత అలాంటి కథతో ఇప్పుడు `అమీర్‌ లోగ్‌` అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో వేద జలంధర్‌, హరి మున్నంగి, మనోజ్‌ ఆవుల, శశిధర్‌ కొచ్చర్ల కోట, విశ్వేశ్వర్‌ రెడ్డి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


సినిమా పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించింది. వారి స్వచ్ఛమైన మనసులను ఆవిష్కరించింది. పాత్రల తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ ఫన్‌ వర్కౌట్ అయ్యింది. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు, కామెడీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. సాగదీత ఎక్కువగా ఉంది. సినిమాలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సినిమా ఎలా తీశామనేది కాదు, ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ మూవీ విషయంలో ఆ మీటర్‌ తేడా కొడుతుందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ అమీర్ లోగ్ పాతబస్తీ జీవితాలను ఆవిష్కరించిన మూవీ. జెన్యూన్‌ అటెంప్ట్. పాతబస్తీ వాళ్లని ఆకట్టుకునే మూవీ అవుతుంది.


Aug 21, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Ameer Log Movie Review

ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుం...


ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ సాయి యోగి, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అమీర్ లోగ్'. మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముగ్గురు పనిలేని యువకులు తమ జీవితాలను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం అనే స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు.. ‘మేం ఫేమస్’, ఈ మధ్యనే వచ్చిన ‘దీవానా’ చిత్రాలు ఈ తరహా కథతోనే వచ్చాయి. కాకుంటే దర్శకుడు రమణా రెడ్డి పాతబస్తీ నేటివిటీని చూపించే ప్రయత్నం చేశారు.


గతంలో డెక్కన్ సినిమా పేరుతో కొన్ని లోకల్ సినిమాలు వస్తుండేవి. ఇది కూడా ఆ తరహా సినిమానే. ఓల్డ్ సిటీ నేపథ్యం ఓకే అయినా బాష విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సగానికి పైగా ఓల్డ్ సిటీ ఉర్దూతోనే సినిమా నడిచింది. హిందీతో పరిచయం లేని వారికి ఈ సినిమా ఏమాత్రం అర్థం కాదు. సబ్ టైటిల్స్ వేసినా బావుండేది. తెలుగు ఆడియన్స్ కి అయితే అంతగా అర్థం కాకపోవచ్చు. దీనికి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. లాస్ట్ సీన్ లో ఓ చిన్న డైలాగ్ తో ‘అమీర్ లోగ్’ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వటం కొసమెరుపు.

Aug 21, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Ameer Log movie review

హైదరాబాదీ నేటివిటీ, ఫ్రెండ్షిప్, యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో వచ్చిన ‘అమీర్ లోగ్’ అక్కడక్కడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్త ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి.అయితే రొటీన్ కథ, ఊహించగలిగే సీన్స్, వీక్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత...


హైదరాబాదీ నేటివిటీ, ఫ్రెండ్షిప్, యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో వచ్చిన ‘అమీర్ లోగ్’ అక్కడక్కడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్త ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్స్ కొన్ని సీన్స్‌లో వర్క్ అయ్యాయి.


అయితే రొటీన్ కథ, ఊహించగలిగే సీన్స్, వీక్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది.

ఫైనల్‌గా: ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓకే అనిపించే టైమ్‌పాస్ మూవీ. కానీ కొత్తగా ఏదైనా ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు!


హైదరాబాద్ నేటివిటీ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ అమీర్ లోగ్ నచ్చే అవకాశం ఉంది. 


Aug 21, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Ameer log movie review

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ డ్రామా, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి బిలో యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న ప...

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ డ్రామా, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో పక్కా హైదరాబాదీ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి బిలో యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.


అయితే అసలు సమస్య కథ, కథనంలోనే కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు, తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించేయగలిగేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. దీంతో ఫ్రెష్‌నెస్ మిస్ అవుతుంది.


ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడా మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ, రొటీన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ వీక్‌గా ఉండటం సినిమాకు మరో మైనస్. దీంతో సినిమా ఇచ్చే ఇంపాక్ట్ చివరి వరకు కొనసాగదు.


‘అమీర్ లోగ్’ అనేది ఫ్రెండ్స్ బ్యాచ్ కలిసి చూస్తే కొంతవరకు ఎంజాయ్ చేసే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కామెడీ, ఎమోషన్స్, హైదరాబాదీ నేటివిటీ కొన్ని చోట్ల ఆకట్టుకున్నా.. రొటీన్ కథనం, ఊహించగలిగే సన్నివేశాలు, బలహీనమైన క్లైమాక్స్ నిరాశపరుస్తాయి.

ఫ్రెండ్స్‌తో కలిసి టైమ్‌పాస్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు.. కానీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్!

Aug 21, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Ameer Log movie Review

అమీర్ లోగ్ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రమణారెడ్డి సోమ రాసుకొన్న కథ పక్కా హైదరాబాద్ నేటివిటి కథ. బస్తీ అంటే ఓ కాలనీ కాదు.. ఓ ఎమోషన్ అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. స్నేహం, జులాయితనం, అల్లరి చిల్లరి వేషాలు, కుర్రతనం లాంటి అంశాలు మేలవించి ముగ్గురు కుర్రాళ్ల చుట్టు అల్లుకొన్న కథ బాగుంది. కొత్తవ...

అమీర్ లోగ్ సినిమా విషయానికి వస్తే... దర్శకుడు రమణారెడ్డి సోమ రాసుకొన్న కథ పక్కా హైదరాబాద్ నేటివిటి కథ. బస్తీ అంటే ఓ కాలనీ కాదు.. ఓ ఎమోషన్ అనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. స్నేహం, జులాయితనం, అల్లరి చిల్లరి వేషాలు, కుర్రతనం లాంటి అంశాలు మేలవించి ముగ్గురు కుర్రాళ్ల చుట్టు అల్లుకొన్న కథ బాగుంది. కొత్తవారైనా అవార్డు విన్నింగ్ ఏ మాత్రం తక్కువ కాకుండా పెర్ఫార్మెన్స్‌ను ముగ్గురు కుర్రాళ్లు ఇచ్చారు.


కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని అలరించేలా రాసుకున్నారు. ఎస్‌వీకే సినిమాటోగ్రఫి గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. పాతబస్తీని చాలా అందంగా, ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించారు. హైదరాబాద్ బ్లూస్, డాలర్ డ్రీమ్స్ తర్వాత అలాంటి ఫ్లేవర్ ఉన్న డెక్కన్ సినిమా ఇది. పాతబస్తీ కనెక్ట్ ఉన్నవాళ్లు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. డిఫరెంట్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వారం ఈ సినిమాపై తప్పకుండా ఓ లుక్కేయండి.


Aug 21, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Ameer Log movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. అంతా చిన్న ఆర్టిస్టులు నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది. టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చి...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా చిత్రం ‘అమీర్ లోగ్’ కూడా ఒకటి. అంతా చిన్న ఆర్టిస్టులు నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


టాలీవుడ్ లో ఇది వరకు ఫ్రెండ్షిప్ నేపథ్యంలో అది కూడా పక్కా హైదరాబాదీ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా నాచురల్ గా అక్కడక్కడా మంచి మూమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే సరైన కథ కథనాలు ఉండవు. సినిమా మొత్తం ఎక్కడో ఒక చోట ప్రతి సీన్ చూసినట్టే ఉంటుంది. తర్వాతి సీన్స్ ని ఊహించేయొచ్చు. 


ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అమీర్ లోగ్’, ఓ బ్యాచ్ స్నేహితులు కలిసి చూడాలగలిగేలానే ఉంటుంది కానీ, కొన్ని మూమెంట్స్ మాత్రం రెగ్యులర్ గానే ఉన్నాయి. అక్కడక్కడా కామెడీ, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ముఖ్యంగా ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఆ రొటీన్ ఫీల్ సీన్స్, వీక్ క్లైమాక్స్ పార్ట్ డిజప్పాయింట్ చేస్తాయి. సో వీటితో కొంచెం రొటీన్ గా ఉన్నా మీ ఫ్రెండ్స్ బ్యాచ్ తో చూడాలి అనుకుంటే కొంతమేర ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుంది.




Aug 21, 2026 Read Review

Public Reviews

1 Avg: 6.0/10
A
Arige Srikanth Private Employee
6

Above Average

Ameer Log Movie Review

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇ...

ఇప్పుడే అమీర్‌ లోగ్ సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసి ఇదేదో హైదరాబాద్ స్టయిల్లో ఒక ఫలక్ నామా దాస్, పెళ్లి చూపులు సినిమాల స్టయిల్లో ఉంటుందని వెళ్ళా. కానీ నేను ఊహించినంత ఏం లేదు గాని, ఒకే ఒకసారి ఖాళీ ఉంటె ట్రై చేయొచ్చు. 


మనందరికీ తెలిసిన కథనే మళ్ళీ డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు డైరెక్టర్. ఇందులో యాక్టర్ల పేర్లు తెలీవు గాని, అందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. చాలా న్యాచురల్ గా హైదరాబాద్ స్టయిల్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ వాళ్లయితే బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్లకయితే కష్టం. పైగా ఇరుముడి లాంటి సినిమాని థియేటర్లో ఉంచుకుని ఈ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఓవరాల్ నాట్ బ్యాడ్.. ఇట్స్ వన్ టైం వాచబుల్. 

Aug 21, 2026

About This Movie

Story : 

పాతబస్తీలో ఉండే శ్రీను (హరి మున్నంగి), మల్లేశ్ (శశిధర్ కంచర్లకోట), రఫీక్ (మనోజ్) చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలు కూడా తీసుకోకుండా క్రికెట్ ఆడుతూ కాలం, బెట్టింగ్ లు చేస్తూ గడుపుతుంటారు. అలాంటి సమయంలో అదే బస్తీలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గీతక్క (వేద జలంధర్) శీనుకి వాళ్ళ ఆఫీస్ లోనే ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అయితే ఓసారి అక్కడ ఎంప్లాయిస్‌ తో శ్రీను బస్తి టీమ్ క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోతారు. ఇదే వీళ్ళ లైఫ్ టర్న్ చేస్తుంది. ఓడిపోయినందుకు శ్రీను ఆఫీస్ బాయ్స్ కి బిర్యానీ పార్టీ ఇస్తాడు. ఆ బిర్యానీ గీతక్క బాయ్ ఫ్రెండ్ హరికి నచ్చి, వాళ్లకి బిర్యానీ హోటల్ పెట్టమని సలహా ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఆ బిజినెస్ మంచి సక్సెస్ అవుతుంది. అయినప్పటికీ వీళ్ళ పొరపాట్ల వల్ల బిర్యానీ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి బస్తీలోని "చాచా" (విశ్వేంధర్ రెడ్డి కొమ్మిడి) ఎలాంటి సహకారం అందించాడు. చివరికి బిర్యానీ బిజినెస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా టర్న్ చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points : 

పాతబస్తీలో ఉండే శ్రీను (హరి మున్నంగి), మల్లేశ్ (శశిధర్ కంచర్లకోట), రఫీక్ (మనోజ్) చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలు కూడా తీసుకోకుండా క్రికెట్ ఆడుతూ కాలం, బెట్టింగ్ లు చేస్తూ గడుపుతుంటారు. అలాంటి సమయంలో అదే బస్తీలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గీతక్క (వేద జలంధర్) శీనుకి వాళ్ళ ఆఫీస్ లోనే ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అయితే ఓసారి అక్కడ ఎంప్లాయిస్‌ తో శ్రీను బస్తి టీమ్ క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోతారు. ఇదే వీళ్ళ లైఫ్ టర్న్ చేస్తుంది. ఓడిపోయినందుకు శ్రీను ఆఫీస్ బాయ్స్ కి బిర్యానీ పార్టీ ఇస్తాడు. ఆ బిర్యానీ గీతక్క బాయ్ ఫ్రెండ్ హరికి నచ్చి, వాళ్లకి బిర్యానీ హోటల్ పెట్టమని సలహా ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఆ బిజినెస్ మంచి సక్సెస్ అవుతుంది. అయినప్పటికీ వీళ్ళ పొరపాట్ల వల్ల బిర్యానీ పాయింట్ క్లోజ్ అవుతుంది. ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి బస్తీలోని "చాచా" (విశ్వేంధర్ రెడ్డి కొమ్మిడి) ఎలాంటి సహకారం అందించాడు. చివరికి బిర్యానీ బిజినెస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా టర్న్ చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

అమీర్ లోగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఎంటర్టైనింగ్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ లో ఎన్ని సినిమాలొచ్చినా ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. పక్కా హైదరాబాదీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా న్యాచురల్ గా ఉండి యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక సినిమా ఇంట్రడక్షన్ నుండి మంచి ఎంటర్టైనింగ్ సీన్స్ తో డైరెక్టర్ ముందుకు తీసుకెళ్లాడు. చాలా సీన్లు ఊహించినట్టే ఉంటాయి, కానీ ఆకట్టుకుంటాయి. అలాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమాలో రాసుకున్న పాయింట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా "ఎవరికైనా సరే పని చేసుకుంటేనే ఇజ్జత్"... అనే పాయింట్ ని డైరెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన హరి, శశిధర్, మనోజ్ లు వాళ్ళ రోల్స్ లో బాగా నటించారు. అలాగే కీ రోల్స్ లో నటించిన విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, అలాగే వేద, రావణ్ నిట్టూరు, సాయి యోగి కూడా వాళ్ళ పరిధిమేరకు బాగా నటించి మెప్పించారు.   

 

Minus Points :

ఇలాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా కంటెంట్ కి కొంచెం కనెక్ట్ అయినా చాలు ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. పైగా ఫ్రెష్ కథలేమి అవసరం లేదు. కానీ ఈ సినిమాలో కథ, కథనాలు మొత్తం ఊహించినట్టే సాగుతాయి. ఒకప్పుడు ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, ఫలక్ నామ దాస్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. పైగా వీటితో కంపేర్ చేస్తే... ఇందులో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు తక్కువ. అలాగే సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గా అలా అలా వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ సీన్లు చాలా కట్ చేసి ఇంట్రెస్టింగ్ గా మలిచే అవసరం చాలా ఉంది. ఒక్క సహజంగా చూపించే సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ తప్ప కథ పరంగా ప్లస్ ఏం అనిపించలేదు. 

 

Technical Values: 

టెక్నికల్ గా చూస్కుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టి, సహజంగా తెరకెక్కించేందుకు ట్రై చేసారు. అలాగే స్మరన్ సాయి మ్యూజిక్, బీజీఎమ్ మంచి ప్లస్ అయింది. సలిగంటి విజయ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ పర్లేదు. కానీ అనవసరమైన సీన్లు కొన్ని ఎడిట్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ రమణ రెడ్డి సోమ మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా, దాన్ని ఆడియన్స్ కి అర్ధమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. "ఇష్టపడి చేసే పని దాని ద్వారా నలుగురికి మంచి జరిగితే వాళ్ళే అమీర్ లోగ్".. అంటూ డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగుంది కానీ, రొటీన్ కథ కథనాలతో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. 


Final Review : 

ఇక ఓవరాల్ గా అమీర్ లోగ్ అంటూ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కథ పరంగా బాగానే ఉన్నా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేక అలరించడంలో తడబడింది.  కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ గుర్తుండిపోయే విధంగా సీన్స్ ఏమి లేవు. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం కష్టమే, కానీ ఒక వర్గం ఆడియన్స్ అంటే.. యూత్ మూవీస్ ఇష్టపడే యంగ్ ఆడియన్స్ కి కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. 

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.6/10
Public
6.0/10
Why MRO?