Crazy Kalyanam movie review
By 123telugu
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’ కూడా ఒకటి. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ అట్రాక్షన్ అనుపమ అనుకోవచ్చు కానీ ఇందులో ఆశ్చర్యపరిచేది మాత్రం నటుడు నరేష్ అని చెప్పాలి. తాను తన లోని నటుడ్ని చూపించి ఆద్యంతం ఆశ్చర్యపరుస్తారు. తన నుంచి కామెడీ టైమింగ్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎంతో కదిలిస్తారు. అలాగే అనుపమ సహజంగా నటించి మెప్పించింది.
అయితే మంచి ఎంటర్టైనర్ గా సాగాల్సిన ఈ సినిమాని అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమాని బాగా సాగదీశారు. అనవసరమైన ఇరికించినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే.. ‘క్రేజీ కళ్యాణం’ కొంతమేరకు మంచి ఫన్ అందించే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే నటుడు పెర్ఫామెన్స్ కూడా సినిమాలో మరో హైలైట్ గా నిలిచింది. కానీ పట్టు లేని సెకండాఫ్, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు సినిమాలో పొటెన్షియల్ ని దెబ్బ తీశాయి. వీటితో ఈ చిత్రం కొంత మేరే ఓకే అనిపిస్తుంది.
Above Average
Crazy kalyanam movie review
By Filmi Beat
తెలంగాణ నేపథ్యంతో దర్శకుడు బద్రప్ప గాజుల రాసుకొన్న ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు, టర్నింగ్‌లు, సంచలనాలు లేకుండా ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ అఫైర్స్‌తో సింపుల్‌గా రన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఫస్టాఫ్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాను నడిపి ఉంటే బెటర్‌గా ఉండేది. అయితే ఫస్టాఫ్‌ను కామెడీకి పెద్ద పీట వేసి సాధాసీదాగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్‌పై ఫోకస్ చేయడంతో ఆడియన్స్ సినిమాలో లీనమయ్యేలా చేసింది. చివరి 20 నిమిషాలు వీకే నరేష్‌పై నడిపించిన డ్రామా బాగా వర్కవుట్ అయింది. చివర్లో అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ట్విస్ట్ ఫీల్‌గుడ్‌గా ఉండటంతో సినిమా సంతృప్తికరంగా ముగుస్తుంది.
ఇక ఈ సినిమాకు పూర్తిగా ఫేస్‌గా అనుపమ పరమేశ్వరన్ అని చెప్పుకోవాలి. మూవీ భారాన్నంత తన భుజాలపై మోసింది. ఫన్, లవ్, ఎమోషన్స్ ఉన్న కీర్తీ పాత్రలో ఒదిగిపోయింది. అనుపమ తర్వాత సినిమాలో బలంగా మారిన క్యారెక్టర్ పర్వతాలు. ఈ పాత్రలో వీకే నరేష్ అదరగొట్టాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు ఒంటి చేత్తో నడిపించాడు. అఖిల్ రాజ్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. తరుణ్ భాస్కర్ సినిమాకు ఎంటర్టైనర్గా పూర్తి న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. ఫ్యామిలీ డ్రామా, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన లవ్ స్టోరీ, కుటుంబ నేపథ్యంగా ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.
Above Average
Garividi Lakshmi movie Review
గరివిడి లక్ష్మి.. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి గారి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు తీర్థాల్లో, పండగల్లో బుర్రకథలు నేను కూడా చూశాను. అందుకే ఈ సినిమా నాకు కనెక్ట్ అవుతుంది అనిపించి థియేటర్ లో చూశాను. సినిమా చూసిన తర్వాత నిజంగా నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ లో దాదాపు ఒక అరగంట అక్కడక్కడా కొంచెం లాగ్ అనిపించినా క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా ఎమోషనల్ గా అనిపించింది.
అడల్ట్ కంటెంట్, ఎక్స్పోజింగ్ లాంటివి ఏమీ ఉండవు. జనాల్ని బుర్రకథల్లో కొంతమంది వల్గర్ గా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలాంటి వల్గారిటీ కూడా లేకుండా చాలా నేచురల్ గా చూపించారు. ఆనంది గారి పెర్ఫార్మెన్స్... ఇలాంటి రోల్ చేయడం నిజంగా చాలా కష్టం. బుర్రకథ చెప్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ చుట్టూ ఎంతో మంది జనాలు ఉన్నా నేచురల్ గా యాక్ట్ చేయడం చిన్న విషయం కాదు. అందులోనూ రెప్యుటేషన్ ఉన్న ఆనంది లాంటి యాక్ట్రెస్ ద్వారా. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆమె చాలా బాగా నటించారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ అయితే నాకు పర్సనల్లీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. మొత్తానికి గరివిడి లక్ష్మి అనే మూవీ ఒక హానెస్ట్ ఎమోషనల్ బయోపిక్ అండి. ఆనంద్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, మంచి మ్యూజిక్, నేచురల్ విలేజ్ అట్మాస్పియర్, ఇంటర్వెల్ సీన్, ఎమోషనల్ క్లైమాక్స్ బ్యూటిఫుల్ ఫోక్ మ్యూజిక్ అండ్ పవర్ఫుల్ క్లైమాక్స్ డిస్పైట్ సం లాగ్ సీన్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5.
Hit
Garividi Lakshmi movie review
By TV9 Telugu
బయోపిక్స్ తీయాలి అనుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.. అలాగే కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడం చాలా కష్టం. గరివిడి లక్ష్మి బయోపిక్ మాత్రం చాలా హానెస్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇది ఎప్పుడో జరిగిన కథ కాదు ఒక 30 ఏళ్ల కింద జరిగిన స్టోరీ మాత్రమే. ఈ బయోపిక్ పూర్తిగా మహానటి టెంప్లేట్ లోనే సాగింది. అసలు కథ ఏంటో తెలియకుండా, అంచనాలే లేకుండా వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్కు వస్తుంది..
గరివిడి లక్ష్మి అలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది. నిజంగా ఆమె ఎవరు ఏం చేసేవారు అనేది చాలామందికి ఎలాంటి ఐడియా లేదు.. కానీ సినిమా మొదలైన కాసేపటికే ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థమైంది.. మనం చాలా సినిమాల్లో చూసిన జానపదాలు ఆమె నోటి నుంచి వచ్చినవే అని తెలిసింది.. చదువు లేకపోయినా జానపదాన్ని దశాబ్దం పాటు ఏలింది అనేది అర్థమైంది.. ఈ సినిమా చూస్తున్నంత సేపు మహానటి గుర్తుకొచ్చింది. సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే వాడుకున్నాడు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము. చాలావరకు మహానటి సినిమా పోలికలు ఇందులో కూడా కనిపిస్తాయి. దర్శకుడు గౌరీ నాయుడు ఒక మంచి కథను తీసుకొని చాలా మంచి ప్రయత్నం చేశాడు.
Above Average
Garividi Lakshmi movie review
By Gulte
People Media Factory has produced Garividi Lakshmi, a Biopic based on the life of Legendary Folk Singer from Uttarandhra. The idea of making a Biopic of a Burra Katha artist itself has instilled curiosity factor on the film and Anandhi’s Live Performance of a Song created buzz for the movie.
Positives:
1. Garividi Lakshmi’s Life & Times
2. Pre-Climax & Climax Portions
3. Anandhi’s Performance
Negatives:
1. Mahanati’s storytelling pattern
2. Not so engaging first half
Finally, Garividi Lakshmi has an engaging pre-climax, climax and a few other good moments here and there. However, the not-so-engaging first half worked against the film’s overall graph. A bit more care in writing and screenplay, would have made the film great. That said, the film and the makers of it deserve our respect for their attempt to tell us the story of Garividi Lakshmi.
Bottom line: Final Act Worked. Other Two Acts, Arent
Average
Garividi Lakshmi movie Review
By Great Andhra
Garividi Lakshmi movie review
Highlights
Anandhi’s performance
Folk music
Drawbacks
Slow-paced narrative
Dull first half
Lack of a contemporary storytelling approach
On the whole, Garividi Lakshmi is a sincere attempt to document the life and contribution of a folk artist. However, its sluggish narrative and lack of dramatic engagement undermine the effort. Despite Anandhi’s strong performance and the effective use of folk music, the film makes for a largely tedious watch.
Bottom Line: Honest, but Boring
Average
Garividi Lakshmi Movie review
By NTV Telugu
ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుదైన గాయని జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ (అంకిత్ కొయ్య) ఆమె నిజమైన కథను శోధించే క్రమంలో సాగే ఈ చిత్రంలో, టైటిల్ రోల్ పోషించిన ఆనంది తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్, విజయనగర నేటివిటీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు అండ్ క్లైమాక్స్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయి.
అయితే, ఒక సాధారణ బయోపిక్‌లో ఉండే మాస్ 'హై' ఎలివేషన్లు మిస్ అవ్వడం, లక్ష్మి సాధించిన విజయాల కంటే పతనాన్నే ఎక్కువగా చూపించడం కాస్త నిరాశపరుస్తుంది. దానికి తోడు స్లోగా సాగే ఫస్టాఫ్ సినిమా టెంపోను తగ్గిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక విస్మరించబడిన కళాకారిణిని గుర్తుచేసే నిజాయితీ గల ప్రయత్నం. డీసెంట్ ఎమోషన్స్, జానపద సంగీతం, ఆనంది నటన కోసం బయోపిక్స్ ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో థియేటర్లో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు!
Above Average
Garividi lakshmi movie review
By Sakshi
ఉత్తరాంధ్ర జానపద కళారూపం బుర్రకథలో తనదైన ముద్ర వేసిన అరుదైన గాయని ‘గరివిడి లక్ష్మి’ జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇక సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో జీవించేసింది! నటుడు నరేష్, రాగ్ మయూర్ లు నటనతో ఆకట్టుకోగా, చరణ్ అర్జున్ అందించిన ఫోక్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ని ఊపేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ గుండెలను పిండేస్తాయి. డెబ్యూ డైరెక్టర్ గౌరీ నాయుడు జమ్ము విజయనగర నేటివిటీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు.
అయితే బయోపిక్ లో ఉండాల్సిన మెయిన్ ‘హై’ ఎలివేషన్లు మిస్ కావడం పెద్ద డిజప్పాయింట్మెంట్. ఆమె సక్సెస్ గ్రాఫ్ కన్నా పతనాన్నే ఎక్కువగా చూపించారు. ఫస్టాఫ్ బాగా స్లోగా సాగడం వల్ల ఆడియెన్ కి కనెక్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఒక గొప్ప జానపద కళాకారిణి కథను ప్రపంచానికి పరిచయం చేసిన నిజాయితీ గల ప్రయత్నమే 'గరివిడి లక్ష్మి'. ఆనంది మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ క్లైమాక్స్ ప్లస్ అయినా.. స్లో పేసింగ్ అండ్ కమర్షియల్ హై ఎలివేషన్లు లేకపోవడం మైనస్. బయోపిక్స్, డిఫరెంట్ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడేవారు లో-ఎక్స్‌పెక్టేషన్స్‌తో హ్యాపీగా ఒక లుక్ వేయొచ్చు
Above Average
Garividi Lakshmi Movie review
By One India
1990 వ దశకంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఇంటా మార్మోగిన పేరు రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి.. అలా ఓ దశాబ్దం పాటు తన జానపద గేయాలతో అలరించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. అయితే తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు.
ఇక హీరోయిన్ ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్రలో జీవించిందనే చెప్పాలి. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది ఆనంది. ఆమెతోపాటు సీనియర్ నటుడు నరేష్, యంగ్ హీరో రాగ్ మయూర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రాశి, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఇక ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో లేకపోవడం కొంత వెలితిగా అనిపిస్తుంది. కానీ రియల్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.
Above Average
Garividi Lakshmi Movie Review
By Tupaki
సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఐతే సావిత్రి స్థాయిలో కాకపోయినా.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలో సినిమాకు అవసరమైన నాటకీయత ఉంది. చాలామంది కళాకారులు జీవితంలో ఎంత ఎత్తు చూస్తారో.. అంత లోతుకు పడిపోతారు. దానికి గల సంఘటనలు ఏంటి? చుట్టూ ఉన్న జనాలు ఎలా మోసం చేస్తారు అని.. గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన అనేక ఉదంతాల ఆధారంగా పాటలతో, ఎమోషన్లతో ఈ సినిమాని బాగానే తెరకెక్కించారు. కథ పరంగా ‘మహానటి’ని తలపించే ‘గరివిడి లక్ష్మి’లో విషయానికేమీ లోటు లేదు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా ఇది.
ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ‘మహానటి’లాగే రాసుకున్నారు. గరివిడి లక్ష్మి కథ కూడా ఆల్మోస్ట్ సావిత్రి స్టోరీలాగే అనిపిస్తుంది. లక్ష్మి బాల్యం.. కళాకారిణిగా ఎదగడం.. తన ప్రేమ.. జీవితంలో మోసాలు.. ఇవన్నీ ‘మహానటి’ని గుర్తుకు తెస్తాయి. గరివిడి లక్ష్మి’కి ఎమోషనల్ సీన్లే ఆయువుపట్టు. పాటలు, బుర్రకథలు సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా రిలేటయ్యే అవకాశముంది. ఈ కథతో అందరూ కనెక్టవుతారని చెప్పలేం కానీ.. నచ్చేవాళ్లకు మాత్రం ఇది బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది.
Above Average
Garividi lakshmi movie review
By Filmi Beat
బుర్రకథకు జన పదాలను జోడించిన లక్ష్మీ జీవితాన్ని ప్రజలకు చెప్పాలని దర్శకుడు గౌరీ నాయకుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ప్రయత్నానికి వారు చేసిన రీసెర్చ్, కథను రూపొందించిన తీరు, తెరపైన ఎమోషనల్‌గా సన్నివేశాలను నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. వీటన్నిటికి తోడు పాత్రను తెర మీద సజీవంగా పండించడంలో ఆనందిని నుంచి పెర్ఫార్మెన్స్ను రాబట్టుకొన్న విధానానికి దర్శకుడిని ఎంత అభినందించినా తక్కువే.
ఇక ఈ సినిమా కథ ప్రవాహాన్ని చూస్తే మహానటి సినిమా ఫార్మాట్ అనుక్షణం గుర్తుకు వస్తుంది. మరుగున పడిన అద్బుతమైన కళాకారిణి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించాలనే నిర్మాతల అభిరుచి, ఈ సినిమా కోసం వారు చేసిన కృషి తెరపైన ప్రతీ సీన్లో కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్న సేపు ఎమోషన్స్, జాయ్ వెంటాడుతూనే ఉంటుంది. ప్రతీ సన్నివేశంలో అభినయంతోపాటు డ్యాన్సులు, హావభావాలు, పాత్రకు తగ్గిన యాటిట్యూడ్ తో అదరగొట్టింది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో మెప్పించింది. ఓవరాల్ గా ఓ మంచి అనుభూతిని అందించిన సినిమాను చూశామనే సంతృప్తి కలుగుతుంది.
Hit
Garividi lakshmi movie review
చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ ఎంట్రీ ఇవ్వడం, నేర్చుకోవడం, స్టేజ్ మీద మొదటి పర్ఫామెన్స్ ఇవ్వడం, అవమానాలు ఇలా అన్నీ ముందుకు సాగుతుంటాయి.
ఇక సెకండాఫ్‌లో గరివిడిలక్ష్మి వైభవాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఆమె పేరుని, గాత్రాన్ని చివరకు సినీ ప్రముఖులు కూడా ఎంతలా వాడుకున్నారు.. తన పేరు చెప్పుకుని ఎవరెవరికో స్టేజ్ మీదే ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం ఇవన్నీ మనసుని కదిలిస్తుంటాయి. నమ్మిన వారే మోసం చేయడం, చివరకు అన్నీ కోల్పోయి అనాథగా మిగలడం ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంటాయి. పాటలు మాత్రం థియేటర్లో ఊపును తీసుకు వస్తాయి. మాటలు అంత గొప్పగా అనిపించవు. చివరగా ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గరివిడిలక్ష్మికి నివాళిలా అనిపించే రేంజ్లో సినిమా లేకపోయినా.. ఆమెకి ఇన్నేళ్లు రాని గుర్తింపుని తీసుకు వచ్చే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
Average