Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 1-12 of 1647 reviews

Hanuman Ansh movie Review

5.0
out of 10
సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. రెండు కోట్లు కొడితే ఇంత కొట్టింది, నాలుగు కోట్లు కొడితే మూడు కోట్లు కొట్టింది అని కూడా చాలా చాలా పెద్ద బాగుంది బాగుంది అంటారు ఏందో అనుకున్నా. సో ఏందిరా సినిమా అనుకుంటే మాత్రం తర్వాత తెలిసింది సినిమాకి...

సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. రెండు కోట్లు కొడితే ఇంత కొట్టింది, నాలుగు కోట్లు కొడితే మూడు కోట్లు కొట్టింది అని కూడా చాలా చాలా పెద్ద బాగుంది బాగుంది అంటారు ఏందో అనుకున్నా. సో ఏందిరా సినిమా అనుకుంటే మాత్రం తర్వాత తెలిసింది సినిమాకి ఇంత పెద్ద బాబా లైఫ్ స్టోరీ మీద బేస్ అయిన సినిమా నిమ్కరోలి బాబా అని చెప్పేసి తెలిసిన అన్నమాట. సో సినిమా ఎలా ఉందంటే మాత్రం నేను అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇలా ఉంటది అనుకున్నా అలా ఉండకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా కూడా. చాలా స్పిరిచువల్ గా హనుమంతుడి ప్రార్థన ఎలా ఉంటది దేవునితో ఆ బాబా జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. 


ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ చాలా గట్టిగా హెల్ప్ అయింది అని చెప్తా. బడ్జెట్ తెలుస్తా ఉంది అండ్ చాలా వరకు కూడా నేచురల్ లొకేషన్ లో తీశారు, అది మంచిగా అనిపించింది. వీటన్నిటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ పర్ఫార్మెన్సెస్ శోభినవ్ సత్య గారు యాస్ నిమ్కరోలి బాబా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది అన్నమాట. ఆయన చేసేది సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయి ట్రైన్ సీన్ అని చెప్పేసి.. నేను హనుమంతుడి భక్తుడిని నాకు అట్లాంటి సీన్స్ పడ్డప్పుడల్లా మంచిగా అనిపించింది సినిమాలో. ఏదో శక్తులు ఉన్నాయి బాబాకి అన్నట్టు చూపెట్టకుండా అలా వెళ్ళిపోయింది సినిమా. సో హనుమాన్ అన్ష్ నాకైతే నచ్చింది. 

Oct 10, 2026 Hindi +1
5.0
out of 10
chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...Theater loki velli kurchogane ardam aipoyindi, idi movie la ledu, oka roju motham office lo kurchoni boring meeting lo unna feel ichindi.Asalu story slow ga, pedda drama la konchem kuda entertainment lekunda s...

chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...


Theater loki velli kurchogane ardam aipoyindi, idi movie la ledu, oka roju motham office lo kurchoni boring meeting lo unna feel ichindi.

Asalu story slow ga, pedda drama la konchem kuda entertainment lekunda saagindi. Eppudo 20 years back vachina old emotional melo drama serials la unnai scenes.


Commercial elements assalu levu... but story lo message chala bagunnai.. ilanti movie chuse audiance vere untaru.. nakaithe theater ki velthe kasepu navvukunnama... intiki vachesama annattu undali... may be ilanti movies chuse audiance vere vallu chalamandi undocchu.. but nenaithe kadu... overall konni manchi messages humans ki chepparu kabatti.. maree boring kakunda avarage ga undani cheppocchu.

Oct 10, 2026 Hindi +1
6.0
out of 10
Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.movie might feel it's a bit slow. But for someone like me looking to unplug, it genuinely delivers a deeply moving, serene experience.The way they portrayed Neem Karoli Baba’s life - leaving home at twelve, moving through life like a flowing river without getting tied down...

Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.


movie might feel it's a bit slow. But for someone like me looking to unplug, it genuinely delivers a deeply moving, serene experience.


The way they portrayed Neem Karoli Baba’s life - leaving home at twelve, moving through life like a flowing river without getting tied down -really hit home. It doesn't really on cinematic tricks; it just focuses on pure human connection and spiritual depth.


I'm walking out of the hall feeling completely calm and recharged. If you have a devotional side or just need a soul-soothing break after a chaotic workweek, i think this is definitely worth catching on the big screen!


Oct 10, 2026 Hindi +1
7.0
out of 10
Hanuman ansh.. chala rojula nundi ee cinema chuddamani anukunna.. hindi lo chuddam vacchu.. but telugulone neem karoli baba gurinchi telusukovalani.. and na favorate god Hanuman gurinchi cheppe vishayalu telugulo inka baga ardham avutayani telugu version vacchaka vella. ika cinema chusaaka one word lo cheppalante jai hanuman... life journey ela undalo ee cinema chuste chala mandiki telustundi. i m...

Hanuman ansh.. chala rojula nundi ee cinema chuddamani anukunna.. hindi lo chuddam vacchu.. but telugulone neem karoli baba gurinchi telusukovalani.. and na favorate god Hanuman gurinchi cheppe vishayalu telugulo inka baga ardham avutayani telugu version vacchaka vella.


ika cinema chusaaka one word lo cheppalante jai hanuman... life journey ela undalo ee cinema chuste chala mandiki telustundi. i mean spiritual movies istapade vallake ee cinema ekkuva connect ayye chance undi. because cinema commerial movies laga ee cinema chuste chala mandiki bore kottestundi.


hanuman bhaktulaki matram baga connect avtundi.. and ee cinemalo peddaga gods gurinchi gani.. history and religion gurinchi chepparu... oka manishi manishiga ela batakalo... neat ga chepparu.. adokkati matram movielo nerchukovacchu.

Oct 10, 2026 Hindi +1

Hanuman ansh movie review

Tupaki

By Tupaki

6.0
out of 10
కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు నచ్చవచ్చో, నచ్చకపోవచ్చో... తెలీదు కానీ, కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజువల్ మాయాజాలంతో ముంచెత్తాల్సిన అవసరమే లేదని.. జీవన సారాన్ని బోధిస్తూ ఆలోచన రేకెత్తించేలా కథను చెప్పి...

కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు నచ్చవచ్చో, నచ్చకపోవచ్చో... తెలీదు కానీ, కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజువల్ మాయాజాలంతో ముంచెత్తాల్సిన అవసరమే లేదని.. జీవన సారాన్ని బోధిస్తూ ఆలోచన రేకెత్తించేలా కథను చెప్పినా ప్రేక్షకులు తన్మయత్వానికి గురవుతారని ‘హనుమాన్ అంశ్’ రుజువు చేస్తుంది. మనిషిలోనే పరమాత్ముడున్నాడని చెబుతూ.. మానవసేవే మాధవ సేవ అని చాటుతూ.. సక్రమమైన మార్గంలో జీవించమని బోధిస్తుంది ‘హనుమాన్ అంశ్’. 


దాదాపు షిరిడీ సాయిబాబా జీవితాన్ని పోలినట్లే ఉంటుంది కరోలి బాబా కథ కూడా. కానీ ప్రతి సన్నివేశం హడావుడి లేకుండా.. హాయిగొలిపేలా చాలా ప్రశాంతంగా సాగుతాయి. పన్నెండేళ్ళ వయసులో ఆధ్యాత్మిక మార్గం పట్టి ఇల్లు విడిచి వచ్చేసిన లక్ష్మీ నారాయణ.. బాబాగా పరిణామం చెందే సన్నివేశాలు అద్బుతంగా అనిపిస్తాయి. ఎవరితోనూ అనుబంధం ఏర్పరుచుకోకుండా నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉండాలనే ఆలోచన రేకెత్తే సన్నివేశం హృదయాన్ని హత్తుకుంటుంది. ఓవరాల్ గా ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా జెన్యూన్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. దీన్నొక సగటు సినిమాలా చూస్తే నచ్చకపోవచ్చు. దైవచింతన.. ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లను ఇది అమితంగా ఆకట్టుకుంటుంది. చివరగా హనుమాన్ అంశ్.. కదిలించే కరోలి బాబా కథ. 

Oct 10, 2026 Hindi +1

Hanuman Ansh movie Review

5.0
out of 10
హనుమాన్ అంశ్ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి బాబా మహిమలను హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం.....

హనుమాన్ అంశ్ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి బాబా మహిమలను హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమాకు వెళ్తే కచ్చితంగా ఏదో గుళ్లో కూర్చున్నట్లు నాలుగు వైపులా రామ్ రామ్ అని వినిపిస్తూ ఉంటుంది. 


దేవుడి భక్తి కంటే ఒక వ్యక్తిని ఎక్కువగా కీర్తించడం లాంటివి సామాన్య ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక గురువులను, వాళ్ల మహిమలను బలంగా నమ్మే వాళ్లకు ఈ ద్వితీయార్థం బాగా నచ్చుతుంది. కానీ లాజిక్స్ వెతికే వాళ్లకు మాత్రం ఈ మహిమలన్నీ కాస్త అతిగా అనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో బాబాకు ఉన్న విపరీతమైన భక్తుల వల్లే ఈ సినిమా అక్కడ అంత పెద్ద విజయం సాధించింది. ఇక తెలుగు హక్కులను హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద సంస్థ తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఓవరాల్ గా చూసుకుంటే భక్తి, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఓవరాల్‌ గా హనుమాన్ అంశ్.. మంచి సినిమా..!

Oct 10, 2026 Hindi +1

Hanuman ansh movie review

6.0
out of 10
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగులో విడుదలైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో శోభినవ్ సత్య బాబా పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. ఎలాంటి అనవసర కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే, సెకండాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగడ...

కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగులో విడుదలైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో శోభినవ్ సత్య బాబా పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. ఎలాంటి అనవసర కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే, సెకండాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగడం కొద్దిగా ఓపికకు పరీక్ష పెడుతుంది.


ఓవరాల్ గా ఆధ్యాత్మిక భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం, ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి డివైన్ రికమండేషన్! అయితే చాలా సహజంగా ఉండే ఈ సినిమాలో ఎడిటింగ్ పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బోర్ ఫీల్ తగ్గేది. ఇక తెలుగు డబ్బింగ్ సంభాషణలు మూల భావాన్ని పాడు చేయకుండా నీట్ గా కుదిరాయి. ఫైనల్ గా హనుమాన్ అంశ్ హడావిడి లేకుండా హృదయానికి హత్తుకునే ఒక నిండైన ఆధ్యాత్మిక మూవీ. 

Oct 10, 2026 Hindi +1
5.0
out of 10
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువురు బాబాలు, సాధుసంతులను దర్శించుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందిన నీమ్ కరోలీ బాబా (Neem Kar...

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువురు బాబాలు, సాధుసంతులను దర్శించుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందిన నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవిత గమనాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో ఆయన సాంగత్యంలోకి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన మహిమలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య చక్కగా ఒదిగిపోయారు. ఇతర నటీనటుల సహజ నటనతో పాటు సాధు సుశీల్ తివారి తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. దర్శకుడు విశాల్ చతుర్వేది తన స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. అయినా కొన్నిచోట్ల మాత్రం కథ నత్తనడకలో సాగడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మేకర్స్ ఈ మూవీని మూడు భాగాలుగా నిర్మించాలని భావించటమే అందుకు కారణం కావచ్చు. మిగిలిన రెండు భాగాల కోసం ఇక్కడ కామా పెట్టారని అనుకోవాలి. ఉత్తర భారతీయులను అంతగా ఆకట్టుకున్న అంశాలు ఇందులో ఏమున్నాయనే భావనతో ‘హనుమాన్ అంశ్’ చిత్రం చూడటానికి వెళ్ళినవారు చాలా వరకూ నిరాశకు గురి కావచ్చేమో కానీ.. సాధుసంతుల జీవితాలలోని అద్భుతాల ఆవిష్కరణను చూడాలనుకుని థియేటర్లకు వెళ్ళేవారికి మాత్రం ‘హనుమాన్ అంశ్’ నచ్చుతుంది.


Oct 10, 2026 Hindi +1
5.0
out of 10
హనుమాన్ అంశ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథ...

హనుమాన్ అంశ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథనం ఎపిసోడ్ల తరహాలో సాగడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా ఉండటం వల్ల సినిమా వేగం తగ్గుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఉండే భారీ మలుపులు, ఉత్కంఠ ఇందులో కనిపించదు. 


ఇక దేవుడికి సంబంధించిన మూవీ అన్నప్పుడు మాయలు, వారి లీలలకు ప్రయారిటీ ఉంటుంది. వాటినే ఆడియెన్స్ ఆశిస్తారు. అవి లేకపోతే చప్పగా సాగుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. నీమ్‌ కరోలి బాబా జర్నీని చూపించారు. డ్రామా కూడా పెద్దగా లేదు. ఉన్నచోట కూడా పండలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని ఉన్నా, అవి కనెక్ట్ కాలేదు. దీనికితోడు నాటకీయత కూడా పెద్దగా లేదు. దేవుడి పవర్‌కి సంబంధించిన సీన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా సింపుల్‌గా ఉన్నాయి. దీంతో అవి కిక్‌ ఇవ్వలేకపోయాయి. క్లైమాక్స్ కూడా అసంతృప్తిగానే ఉంటుంది. అయితే మూఢ విశ్వాసం కాకుండా మనం పని మన చేయాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడిని ఆరాధించాలి అని చెప్పిన తీరు బాగుంది. మొత్తంగా హనుమాన్ అంశ్ భక్తి, మానవత్వం, నిస్వార్థ సేవ వంటి అంశాలతో ఆలోచింపజేసే ఆధ్యాత్మిక చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితంపై ఆసక్తి ఉన్నవారికి, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ఆడియెన్స్ కి మాత్రం ఇది ఏమాత్రం ఎక్కడు. పైగా తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం అంత ఈజీ కాదు. కనెక్ట్ అయితే మాత్రం ఏదో మ్యాజిక్‌ జరుగుతుందని చెప్పొచ్చు.


Oct 10, 2026 Hindi +1

Hanuman Ansh movie Review

5.0
out of 10
తెలుగు తెరపై అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు ప్రేక్షకులను అటు అధ్యాత్మికంగా, కమర్షియల్‌గా కూడా రంజింప చేశాయి. అలాంటి కోవలోనే శ్రీరామ భక్తుడు హనుమాన్ భక్తుడిగా మారిన నీల్ కరోలి బాబా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది మాత్రం కమర్షియల్ హంగులకు దూరంగా డాక్యుమెంటరీ తరహాలో డ్రామాకు చోటు లేకుండా ఈ సినిమాను ముఖ్యంగా అధ్యాత్మిక కోణంలో ఆయన మహనీయతను చాటి చె...

తెలుగు తెరపై అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు ప్రేక్షకులను అటు అధ్యాత్మికంగా, కమర్షియల్‌గా కూడా రంజింప చేశాయి. అలాంటి కోవలోనే శ్రీరామ భక్తుడు హనుమాన్ భక్తుడిగా మారిన నీల్ కరోలి బాబా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది మాత్రం కమర్షియల్ హంగులకు దూరంగా డాక్యుమెంటరీ తరహాలో డ్రామాకు చోటు లేకుండా ఈ సినిమాను ముఖ్యంగా అధ్యాత్మిక కోణంలో ఆయన మహనీయతను చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కథలో వచ్చే రెండు, మూడు సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకుడిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాయి. 


శ్రీరాముడు, హనుమాన్ అంశాల చుట్టు సాగిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని పూర్తిగా భక్తి, అధ్యాత్మికత తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఇప్పటికే ఉత్తరాది భారతీయలను భక్తి తన్మయత్మంలో ముంచేయడమే కాకుండా 400 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఆలస్యమైనప్పటికీ బతుకమ్మ, దసరా పండుగ సెలవులను టార్గెట్ చేసుకొని రిలీజ్ చేశారు. భక్తి పరమైన సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వారికి స్పూర్తిని కలిగించిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని తెలుసుకొనే అవకాశం దక్కుతుంది. ఎక్కువగా ఆశించకుండా వెళితే.. మంచి అనుభూతితో మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

Oct 10, 2026 Hindi +1

Hanuman Ansh movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ వైబ్స్‌తో సాగుతుంది. శోభినవ్ సత్య బాబా పాత్రలో జీవించగా, అద్భుతమైన బిజీఎమ్ ఆ...

కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ వైబ్స్‌తో సాగుతుంది. శోభినవ్ సత్య బాబా పాత్రలో జీవించగా, అద్భుతమైన బిజీఎమ్ ఆడియన్స్‌ని ఒక దివ్యమైన అనుభూతికి గురిచేస్తుంది.


అయితే, సెకండాఫ్‌లో డ్రామా కాస్త నెమ్మదించి కథనం సాగదీతగా అనిపించడం, ఆడియన్స్ ఓపికకు చిన్న పరీక్షే! అయినప్పటికీ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ లోపాన్ని కవర్ చేస్తాయి.


ఫైనల్ వర్డిక్ట్: బాక్సాఫీస్‌ను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన ‘హనుమాన్ అంశ్’ సాధారణ ప్రేక్షకులకే కాక, ఆధ్యాత్మిక ప్రియులకు ఈ వికెండ్‌లో ఫ్యామిలీతో చూడదగ్గ ఒక పవర్‌ఫుల్ మస్ట్-వాచ్ డివైన్ రికమండేషన్!

Oct 10, 2026 Hindi +1

Hanuman Ansh movie Review

7.0
out of 10
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవగా, థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక భక్తి, బయో...

కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవగా, థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక భక్తి, బయోపిక్ సినిమాలకు బలమైన భావోద్వేగాలే ప్రాణం. ఆ విషయంలో ‘హనుమాన్ అంశ్’ ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమా ఆద్యంతం ఒక దైవికతతో కొనసాగుతూ చూసే ప్రేక్షకునిని బాబాతో ప్రయాణం చేస్తున్నట్టుగా లీనం అయ్యేలా చేస్తుంది.


ఎలాంటి రాజకీయ అజెండాలు, అనవసర ప్రచారాలు జోడించకుండా కేవలం బాబా వ్యక్తిత్వం, ఆయన నిస్వార్థ కరుణపైనే దృష్టి సారిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. బాబాగా నటుడు శోభినవ్ సత్య నటన హుందాగా, సహజంగా సాగింది. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో ఓపిక ఒకింత తక్కువే ఉంటుంది. అయితే ఆ ఓపికకి పరీక్ష పెట్టేలా కొన్ని మూమెంట్స్ ఈ సినిమాలో చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. వీటితో కొంచెం చూసే ఆడియెన్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకాస్త స్లోగా సాగదీతగా వెళుతుంది. ఇక మొత్తంగా చూస్తే, ‘హనుమాన్ అంశ్’ బలమైన భావోద్వేగాలతో కూడిన నిజాయితీగల ఆధ్యాత్మిక చిత్రం. అద్భుతమైన నేపథ్య సంగీతం, బాబా విషయంలో కొన్ని అబ్దుతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం కొంత సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ, నీమ్ కరోలీ బాబా భక్తులకే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక దైవికతను నింపి ఆడియెన్స్ ని బయటకి పంపిస్తుంది. 


Oct 10, 2026 Hindi +1
Why MRO?