అనుమాన పక్షి (Anumana Pakshi)
Anumana Pakshi : అతిగా ఆలోచించే "అనుమాన పక్షి".. ఎలా నెట్టుకొస్తాడేమో... త్వరలోనే మన ముందుకు..
Available in:
About This Movie
టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన "రాగ్ మయూర్" (Rag mayur) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా బండి మూవీతో పరిచయమై, శివరాపల్లి వెబ్ సిరీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ మెయిన్ లీడ్ గా "అనుమాన పక్షి" అనే పేరుతో ఓ కామెడీ డ్రామా తెరకెక్కింది. డీజే టిల్లు ఫేం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇక అనుమాన పక్షి టీజర్ ని గమనిస్తే... పూర్తిగా కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తేలా ఉంటుందని టీజర్ ని బట్టి తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరో లేచిన దగ్గరి నుంచి దగ్గినా, తుమ్మినా ప్రతి దానిని అనుమానించే ఓ యూట్యూబర్ గా రాగ్ మయూర్ కనిపించనున్నాడు. అలాంటి వ్యక్తి చుట్టూ తిరిగే కథగా, ఆ అనుమానం వల్ల వచ్చే కామెడీయే ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రతి విషయం లోనూ నెగిటివ్ గా అలోచించే అతని లైఫ్ లో ఎలాంటి ఘటనలు జరిగాయి, అతని ద్వారా ఇతరులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది.
ఇక ఈ అనుమాన పక్షి సినిమాలో మెర్లీన్ ఫిలిప్ (Merin Philip) హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటి రాశి, అజయ్, బ్రహ్మాజీ, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీ రోల్స్ లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.