Register as a Reviewer
కర (Kara)

కర (Kara)

30 Apr 2026
Overall Rating
5.6/10
15 Reviews

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "కర". విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీలో మామితా బైజు హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ సంగీతం అందించాడు.

Director: Vignesh Raja
Cast: Dhanush, Mamitha Baiju, K.S. Ravikumar, Karunas, Jayaram, Prithvi Pandiarajan, Suraj Venjaramoodu, M.S. Baskar, Sreeja Ravi & Others.

Available in:

Reviews

What critics and the public are saying about కర (Kara)

Media Reviews

15 Avg: 5.6/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Kara movie Review

కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం...

కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సాలిడ్. చాలా సీన్లు రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకున్నారు. అందువల్ల ఆడియన్స్ కి మరీ ఇంత ఎమోషన్స్ ఏంట్రా తట్టుకోలేకపోతున్నాం అన్న ఫీల్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ ఓవర్‌డోస్‌గా అనిపిస్తుంది.


కొన్ని సీన్స్ బాగా హిట్ అవుతాయి… కానీ వెంటనే ఫ్లో బ్రేక్ అవ్వడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ మిస్ అవుతుంది. జివి ప్రకాష్ బీజీఎమ్ కూడా బాగుంది. ఓవరాల్ గా కర ఒక స్లో పేస్డ్ ఫిలిం. కానీ సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. విజువల్స్ కూడా బావుంటాయి. కానీ ఫ్రెష్ నెస్ కోరుకుంటే డిస్సపాయింట్ అవుతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి అయితే ఒకే గాని, లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్స్ ఇష్టపడే వాళ్లకయితే పెద్దగా సినిమా నచ్చకపోవచ్చు. 

Apr 30, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
6

Above Average

Kara Movie Review

‘కర’ సినిమాను ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని మొదట్లోనే అర్థమవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు వంటి సీరియస్ అంశాలను తీసుకున్న దర్శకుడు Vignesh Raja వాటిని ఎక్కువ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అదే ఎమోషన్ కొన్ని చోట్ల ఓవర్‌ డోస్ అయి, కథనం స్లోగా మారినట్టు అనిపిస్త...

‘కర’ సినిమాను ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని మొదట్లోనే అర్థమవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు వంటి సీరియస్ అంశాలను తీసుకున్న దర్శకుడు Vignesh Raja వాటిని ఎక్కువ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అదే ఎమోషన్ కొన్ని చోట్ల ఓవర్‌ డోస్ అయి, కథనం స్లోగా మారినట్టు అనిపిస్తుంది. హీరోగా Dhanush తనదైన నేచురల్ యాక్టింగ్‌తో కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, మొత్తం సినిమాను బలంగా లిఫ్ట్ చేయలేకపోయాడు.


కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చెత్తగా అనిపిస్తాయి. దొంగతనాలు చేయడమే తప్పంటే.. అవి చేస్తున్న ప్రతిసారి హీరో దేవుడ్ని ప్రార్థిస్తాడు, అలాగే హీరో దొంగతనాలు చేయడం తప్పు కాదన్నట్టు పోర్ట్ ట్రే చేస్తునట్టుంటుంది. తమిళ సినిమాల్లో ఇలాంటివి బాగానే చూపిస్తారు. బట్ నటీనటుల పెర్ఫార్మన్స్ కి అయితే పేరు పెట్టలేం. అందరూ బానే చేసారు. స్పెషల్లీ కెఎస్ రవికుమార్. ఆయన తన రోల్ లో జీవించేసారు. ఇక టెక్నికల్‌ గా చూస్తే విజువల్స్ 90ల వాతావరణాన్ని బాగా రీక్రియేట్ చేశాయి. అయితే ఎడిటింగ్ ఇంకా షార్ప్‌ గా ఉంటే సినిమా నెరేషన్ మరింత టైట్‌ గా ఉండేదనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘కర’ మంచి ఐడియాతో వచ్చిన సినిమా అయినప్పటికీ, ప్రెజెంటేషన్ మరియు పేస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Apr 30, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
6

Above Average

Kara movie Review

ధనుష్ నటించిన 'కర' సినిమా విషయానికి వస్తే... ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు… ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాడు దర్శకుడు Vignesh Raja. కానీ ఆ ఐడియాను ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎంగేజింగ్‌ గా స్క్రీన్‌ పై చూపించాలి అన్న విషయంలో మాత్రం సినిమా పూర్తిగా వ...

ధనుష్ నటించిన 'కర' సినిమా విషయానికి వస్తే... ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు… ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాడు దర్శకుడు Vignesh Raja. కానీ ఆ ఐడియాను ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎంగేజింగ్‌ గా స్క్రీన్‌ పై చూపించాలి అన్న విషయంలో మాత్రం సినిమా పూర్తిగా వర్క్ అవ్వలేదని అనిపిస్తుంది. హీరోగా Dhanush తన పాత్రలో ఎప్పటిలాగే నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమా నెరేషన్ స్లోగా ఉండడం, కొన్ని చోట్ల ఎమోషన్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ కంటిన్యూ కాలేదు.


ఇక కథలో ఉన్న రివేంజ్ ఎలిమెంట్, “ముల్లుని ముల్లుతోనే తీయాలి” అన్న కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఆ పాయింట్‌ ను మరింత టైట్ స్క్రీన్‌ ప్లే తో, ఎంగేజింగ్ నెరేషన్‌ తో తీసుకెళ్లి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేది. ‘కర’ = Strong concept, but underwhelming execution. మెసేజ్ ఉంది… కానీ ప్రెజెంటేషన్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. ఒక్క ముక్కలో కర గురించి చెప్పాలంటే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలాగా ఉంది. అంటే తెలుగు సినిమాల్లా నాలుగు పాటలు, ఫైట్లు లా కాకుండా, తమిళ సినిమాల్లో ఎలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఉంటాయో అలాంటి ఛాయలు కర లో ఉన్నాయి.  

Apr 30, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Kara movie Review

‘కర’ సినిమా గురించి ఒక్క లైన్‌ లో చెప్పాలంటే… “కాన్సెప్ట్ బాగుంది… కానీ ప్రెజెంటేషన్ కాస్త మిస్ అయింది. కోలీవుడ్ స్టార్ Dhanush నుంచి ఎప్పుడూ ఏదో డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి కూడా రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు లాంటి సాలిడ్ టాపిక్ తీసుకున్నాడు. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఎమోషన్ మనకి పూర్తి...

‘కర’ సినిమా గురించి ఒక్క లైన్‌ లో చెప్పాలంటే… “కాన్సెప్ట్ బాగుంది… కానీ ప్రెజెంటేషన్ కాస్త మిస్ అయింది. కోలీవుడ్ స్టార్ Dhanush నుంచి ఎప్పుడూ ఏదో డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి కూడా రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు లాంటి సాలిడ్ టాపిక్ తీసుకున్నాడు. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఎమోషన్ మనకి పూర్తిగా కనెక్ట్ అవుతుందా అంటే… అక్కడే కాస్త లాగ్ ఫీల్ అవుతుంది. 


డైరెక్టర్ Vignesh Raja కథను ఎమోషనల్‌ గా తీసుకెళ్లాలని ట్రై చేశాడు… కానీ కొన్ని చోట్ల ఓవర్‌ డోస్ అయ్యింది. కొన్ని సీన్స్ బాగానే హిట్ అవుతాయి. కానీ వెంటనే వచ్చే సీన్స్ వల్ల ఆ ఫీల్ కట్ అయిపోతుంది.

టెక్నికల్‌గా మాత్రం సినిమా సాలిడ్. థెని ఈశ్వర్ విజువల్స్ 90’s ఫీల్‌ ని బాగా తీసుకొచ్చాయి. అలాగే జివి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ కొన్ని సీన్స్‌ను బాగా లిఫ్ట్ చేసింది. సాంగ్స్ మాత్రం పర్లేదు. ఓవరాల్ గా కర సినిమాను ఇంకాస్త షార్ప్‌ గా, ఎంగేజింగ్‌ గా తీసి ఉంటే… ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అయ్యేది. 

Apr 30, 2026 Watch
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Kara movie Review

తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన కర సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్...

తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన కర సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. రెండు పాటలు బాగుండగా మిగిలిన బిట్ సాంగ్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. సినిమా అంతా 90 స్ బ్యాక్ డ్రాప్ లో జరగడంతో దాని తగ్గట్టు ఆర్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. 


ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. రైతుల కష్టాలు, బ్యాంకు లోన్లు అనే పాత కథ తీసుకొని దానికి దొంగ, నాన్న ఎమోషన్ లను కలిపి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. డైరెక్టర్ మొదటి సినిమాకి దీనికి సంబంధం ఉండదు. అసలు ఆ డైరెక్టరేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై బాగానే కనిపిస్తుంది. మొత్తంగా ధనుష్ మరోసారి తండ్రి ఎమోషన్ తో పాటు దొంగతనాల సస్పెన్స్ కథాంశంతో ‘కర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంది. 


May 01, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Kara movie Review

సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. ఆ మధ్య ఇడ్లి కొట్టు తో డీసెంట్ సినిమా ఇవ్వగా, ఈసారి "కర" అంటూ ఒక దొంగగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించే ప్రయత్నం చేయగా, క్యూట్ లుక్స్‌ తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. వృద్ధుడి పాత్రలో కేఎస్...

సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. ఆ మధ్య ఇడ్లి కొట్టు తో డీసెంట్ సినిమా ఇవ్వగా, ఈసారి "కర" అంటూ ఒక దొంగగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించే ప్రయత్నం చేయగా, క్యూట్ లుక్స్‌ తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. సూరజ్ వెంజర్మూడు, జయరాం, కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు.


టెక్నికల్ గా కర సినిమా చాలా బెస్ట్ గా ఉంది. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 90స్ కాలం నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసింది. దానికి తోడు సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందాన్ని తెచ్చింది. ఎడిటింగ్ విషయంలో మొదటి సగంలో ఉన్న కొన్ని సాగతీత సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త పకడ్బందీగా ఉండేది. ఓవరాల్‌గా కర.. ఇటు రైతు కష్టం.. అటు థ్రిల్లింగ్ రాబరీ.. మిక్స్డ్ బ్యాగేజ్ అన్నట్టుంటుంది. అంటే సినిమా ఓసారైతే బానే ట్రై చేయొచ్చు. 

May 01, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Kara Movie Review

కోలీవుడ్ స్టార్ Dhanush నటించిన ‘కర’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా థియేటర్లలో విడుదలకాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు Vignesh Raja ఎంపిక చేసిన కథలో బలం ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ విలేజ్ నేటివిటీ నేపథ్యం, నటీన...

కోలీవుడ్ స్టార్ Dhanush నటించిన ‘కర’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా థియేటర్లలో విడుదలకాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు Vignesh Raja ఎంపిక చేసిన కథలో బలం ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ విలేజ్ నేటివిటీ నేపథ్యం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. 


రైతులు, బ్యాంక్ లోన్ల సమస్యల వంటి సీరియస్ అంశాలను టచ్ చేసినా… కథనం కొంత అసంబద్ధంగా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు అతిగా ఉండడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు. కానీ నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటారు. మొత్తంగా ‘కర’ చిత్రం మంచి కాన్సెప్ట్‌ తో తెరకెక్కినప్పటికీ, కథనం బలహీనతలు, ఎమోషన్ ఓవర్‌ డోస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రైతు సమస్యలను ప్రతిబింబించిన డీసెంట్ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. 

May 01, 2026 Read Review
5

Average

Kara movie Review

కోలీవుడ్ స్టార్ లాస్ట్ ఇయర్ కుబేర తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగా, ఇడ్లి కడై తో డీసెంట్ మూవీ ఇచ్చాడు. తెలుగులో ఇడ్లి కొట్టు పేరిట రిలీజ్ అయింది గాని ఓటిటి లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇపుడు "కర" అంటూ సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసాడు. విఘ్నేష్‌ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలే...

కోలీవుడ్ స్టార్ లాస్ట్ ఇయర్ కుబేర తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగా, ఇడ్లి కడై తో డీసెంట్ మూవీ ఇచ్చాడు. తెలుగులో ఇడ్లి కొట్టు పేరిట రిలీజ్ అయింది గాని ఓటిటి లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇపుడు "కర" అంటూ సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసాడు. విఘ్నేష్‌ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్న ఈ మూవీ లో సహజత్వంతో కూడిన వాతావరణం ఉన్నా, అతిగా ఉన్న ఎమోషనల్ సీన్స్ కి పొంతనలేని కథనం ఆడియన్స్ ని సీట్లో కూర్చోబెట్టలేకపోయింది. 


అలాగే టెక్నికల్ గా థెని ఈశ్వర్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌ గా 1990ని తలపించేలా ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటింగ్‌ ఇంకా షార్ప్ చేయాల్సింది. దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే ఎమోషనల్‌గా, అంతే ఎంగేజింగ్‌ గా తెరకెక్కించారు. బ్యాంక్‌ లోన్ల విషయంలో జరిగే అన్యాయాలకు సంబంధించిన అంశాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ బాగుంది. ఇంకా షార్ప్ గా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా తీసుకెళ్తే సినిమా అదిరిపోయేది. ఓవరాల్ గా రైతు సమస్యలు, లోన్ల పేరుతో బ్యాంకులు చేసే అన్యాయాలను ఆడియన్స్ కి చూపించిన డీసెంట్ మూవీ `కర`. 


May 01, 2026 Read Review
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Kara movie review

ధనుష్ నుంచి మరో సినిమా వస్తే ఎక్స్‌ పెక్టేషన్స్ ఆటోమేటిక్‌ గా పెరుగుతాయి. అదే ‘కర’. ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ మాస్ సినిమా కాదని క్లియర్… కానీ థియేటర్‌లోకి వెళ్లాక ఫీల్ ఏమిటి అంటే… “ఇది స్లో కుక్డ్ మూవీ బాస్!” ముందుగా ధనుష్ గురించి మాట్లాడాలి… కరసామి పాత్రలో మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. ఎక్కడా ఓ...

ధనుష్ నుంచి మరో సినిమా వస్తే ఎక్స్‌ పెక్టేషన్స్ ఆటోమేటిక్‌ గా పెరుగుతాయి. అదే ‘కర’. ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ మాస్ సినిమా కాదని క్లియర్… కానీ థియేటర్‌లోకి వెళ్లాక ఫీల్ ఏమిటి అంటే… “ఇది స్లో కుక్డ్ మూవీ బాస్!” ముందుగా ధనుష్ గురించి మాట్లాడాలి… కరసామి పాత్రలో మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. ఎక్కడా ఓవర్ చేయకుండా, చాలా రియలిస్టిక్‌గా క్యారీ చేశాడు. హీరోయిన్ Mamitha Baiju కూడా చాలా నేచురల్‌గా నటించింది… ఎక్కడా యాక్టింగ్ చేస్తున్న ఫీల్ రావడం లేదు. 


టెక్నికల్‌గా సినిమా బాగానే ఉంది. 90’s వైబ్‌ ను సెటప్ చేసిన విధానం సూపర్. G. V. Prakash Kumar ఇచ్చిన BGM కొన్ని సీన్స్‌ లో బాగా ఎలివేట్ చేసింది… కానీ songs మాత్రం “ఓకే ఓకే” అన్నట్టే..

ఇప్పుడు అసలు విషయం… సినిమా పేస్! First half ఓకే అనిపిస్తుంది… కానీ second half లో కొంచెం లాగ్ ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు లాంటి సీరియస్ పాయింట్ టచ్ చేసినా… narration కొంచెం tight గా ఉంటే ఇంకో లెవెల్ ఉండేది. ఓవరాల్ గా “కర” అనేది మాస్ మసాలా కాదు కాస్త ఓపికతో చూడాల్సిన రియలిస్టిక్ డ్రామా. దాంతో పాటు అంచనాలు తగ్గించుకొని చూస్తే నచ్చొచ్చు. 

Apr 30, 2026 Watch
ABP Desam
ABP Desam Website
6

Above Average

Kara movie Review

ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసి కర స్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన...

ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసి కర స్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన సహజంగా ఉంది. వైట్ కాలర్ క్రిమినల్ తరహా పాత్రను జయరామ్ పోషించారు. పాత్రకు అవసరమైన కన్నింగ్ నేచర్‌ను కేవలం కళ్ళలో చూపించారు. 


ఇక ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు కనెక్ట్ అయ్యే సినిమా 'కర' అని చెప్పాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకుండా లోనులు తీసుకున్న మధ్య తగరతి ప్రజలను కొందరు అధికారులు జలగల్లా పీల్చుకుని తింటున్న సమయంలో ఎదురు తిరిగిన ఓ దొంగ కథ 'కర'. ధనుష్ లేని సినిమాను ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. నిదానంగా మొదలై చివరకు ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది.

Apr 30, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Kara movie Review

తమిళ స్టార్ Dhanush సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆయన నటించిన ‘కర’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, తెలుగులో కూడా అదే స్థాయిలో రిలీజ్ కావడం విశేషం.ఈ సినిమాలో కరసామి పాత్రలో ధనుష్ తనదైన నటనతో మెప్పిం...

తమిళ స్టార్ Dhanush సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆయన నటించిన ‘కర’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, తెలుగులో కూడా అదే స్థాయిలో రిలీజ్ కావడం విశేషం.

ఈ సినిమాలో కరసామి పాత్రలో ధనుష్ తనదైన నటనతో మెప్పించాడు. అలాగే హీరోయిన్‌గా నటించిన Mamitha Baiju సహజమైన నటనతో ఆకట్టుకుంది. పాత్రలకు తగ్గట్టుగా ఇద్దరూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం సినిమాకు ప్లస్‌గా మారింది.

టెక్నికల్ విషయాల్లోకి వెళ్తే, 90వ దశకపు వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. సంగీత దర్శకుడు G. V. Prakash Kumar అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం ఇచ్చింది. అయితే పాటలు మాత్రం పెద్దగా గుర్తుండేలా లేవు. విజువల్స్ నేచురల్‌గా ఉండగా, యాక్షన్ సన్నివేశాలు సాధారణంగా కనిపిస్తాయి.

కథ విషయానికి వస్తే, రైతులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య ఉన్న సమస్యలను టచ్ చేసే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అయితే సినిమా నడక కొంత స్లోగా ఉండటం, కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపించడం మైనస్‌గా మారింది.

మొత్తంగా ‘కర’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకపోయినా, మంచి కంటెంట్‌తో తీసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.

Apr 30, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Kara Movie Review

ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇక హీరోయిన్ మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించగా, తన పాత్రలో డీసెంట్ లుక్స...

ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇక హీరోయిన్ మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించగా, తన పాత్రలో డీసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే నటన పరంగా మరింత రాణించాల్సింది. కందస్వామిగా కెఎస్ రవికుమార్ జీవించాడు. ఇక జయరామ్, సూరజ్ కరుణాస్, పృథ్వీ రాజన్ తదితరులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. 


ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. తేని ఈశ్వర్ కథకు తగ్గట్టు కెమెరా వర్క్ బాగా చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మార్క్ సినిమాలో కనిపించలేదు సందర్భానుసారం వచ్చే రెండు పాటలు సోసో… తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుష్ గత చిత్రం 'ఇడ్లీ కడై' కూడా ఇదే తరహాలో తండ్రి సెంటిమెంటుతో వచ్చినదే. ఈసారి కూడా అదే జానర్ సినిమా కావటం వల్ల కర ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

May 01, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
4

Below Average

Kara Movie Review

తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు కథా కథనాల విషయంలో నిరాశపరచగా, ధనుష్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. కథలో ఆయన పాత్రకు ఉన్న బ...

తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు కథా కథనాల విషయంలో నిరాశపరచగా, ధనుష్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. కథలో ఆయన పాత్రకు ఉన్న బలం స్క్రీన్‌ పై అంతగా కనిపించలేదు. అలాగే హీరోయిన్ మమిత బైజు నటన కూడా కొంచెం ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపించింది. 


అయితే సీనియర్ నటులు కె.ఎస్. రవికుమార్, ఎం.ఎస్. భాస్కర్ మాత్రం తమ పాత్రల్లో బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇక కర సినిమా మొదటి భాగం సరాసరిగా అనిపించగా, రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగింది. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. ఓవరాల్ గా కర సినిమా ధనుష్ అభిమానులను కూడా మెప్పించలేకపోయింది.

May 01, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Kara Movie Review

తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మా...

తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది. 


టెక్నికల్‌ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా లేవు. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్‌ గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్‌ ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్‌ గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.

Apr 30, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Kara movie Review

కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్...

కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం పరవాలేదు.


కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కర సినిమా డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Apr 30, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కరసామి (ధనుష్) ఒక దొంగ. ఏం చదువుకోలేక, ఊళ్ళో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. కానీ దొంగతనాలు మానేసి సెటిల్ అవుదామని, చివరిగా ఒక పెద్ద దొంగతనం చేద్దామని ప్రయత్నించి దొరికిపోతాడు. అయితే కరసామి పోలీసుల నుండి తప్పించుకుని దొంగతనాలు మానేసి, తాను ప్రేమించిన మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. అయినా పేదరికం వల్ల పలు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కరసామి తండ్రి కందసామి (కెఎస్ రవికుమార్) మరణిస్తాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి బ్యాంకులో ఉన్న లోను కారణంగా, చనిపోయిన తన తండ్రి శవాన్ని కరసామి పొలంలో పాతిపెట్టడానికి బ్యాంకు ఒప్పుకోదు. ఈ క్రమంలో కరసామి తమని ఇబ్బంది పెట్టిన బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తాడు. మరి తమని, ఊరు వాళ్ళని బ్యాంక్ మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరాం) చేస్తున్న మోసాన్ని కర ఎలా తిప్పి కొడతాడు? చివరకు కర తన తండ్రి చివరి కోరికను తీర్చాడా? దొంగతనం చేసిన బ్యాంకు డబ్బును ఏం చేసాడు అన్నదే మిగిలిన కథ. 


90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఈ కథ నేపథ్యంలో సొసైటీలో పెద్ద మనుషుల మీద యువకుడు చేసిన పోరాటాన్ని, అతడి ఆవేదనను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే ధనుష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన రోల్ లో సెటిల్డ్ గా కనిపిస్తూ, పాత్రకు తగ్గ వేరియేషన్స్ చూపించాడు. ఇటు మమిత బైజు కూడా తన రోల్ లో ఇంప్రెస్ చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అలాగే దర్శకుడు విఘ్నేష్ రాజా రాసుకున్న మెయిన్ థీమ్ సినిమాకు మంచి ప్లస్ అయింది.


అయితే సినిమాలో కథ నేపథ్యాన్ని బలంగా రాసుకోలేదు దర్శకుడు. సినిమాలో ఎక్కువగా ఫాదర్ సెంటిమెంట్ చుట్టే తిరుగుతుంది, గాని కథలో భాగంగా అవసరమైన స్క్రీన్ ప్లే గాని, సీన్లు గాని లేవు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ ఎక్కువైంది. అలాగే లవ్ ట్రాక్ కూడా అంతగా పండలేదు. 


Technical values

ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే... దర్శకుడు విఘ్నేష్ రాజా కథ పాయింట్ బాగానే రాసుకున్నా, దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లు అన్నీ బాగానే ఉన్నా కొత్తదనం మాత్రం కనిపించలేదు. ఇక జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పర్లేదు, బీజీఎమ్ పై ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా బాగా చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


Final Review :

ఓవరాల్ గా ధనుష్ నుండి వచ్చిన "కర" మూవీ ఒక డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఓ వర్గం ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అలాగే విలేజ్ నేటివిటీ కోరుకునే ఆడియన్స్ ని కూడా కొంతవరకు మెప్పిస్తుంది. అయితే కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ సినిమాకు దూరం కావచ్చు. ధనుష్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ తక్కువ అంచనాలతో ఈ మూవీని ఓసారి చూసేయొచ్చు.  

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
15
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.6/10
Public
N/A
Why MRO?