మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram Trailer)
"మా ఇంటి బంగారమంటే"... మహాలక్ష్మి అనుకున్నారా... ఇది అమ్మోరు కత్తి బాబోయ్..!
Available in:
About This Movie
టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈసారి "మా ఇంటి బంగారం" అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి హై వోల్టేజ్ ఎనర్జిటిక్ గా రెడీ అయ్యారు. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి - సమంత కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ "మా ఇంటి బంగారం" అనే టైటిల్ తో తెరకెక్కగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఓ బేబీ లాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఆల్రెడీ కాంబో హైప్ తో మంచి అంచనాలున్న ఈ సినిమాకు ట్రైలర్ చూసాక రెస్పాన్స్ అదిరిపోయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత సమంత నటిస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ చూసి కొంతమంది ఫ్యామిలీ టైపు మూవీ అనుకున్నా, ఇది పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ మూవీ అని ట్రైలర్ చూసాక క్లారిటీ వస్తుంది. ట్రైలర్ లో సామ్ ఓ వైపు సాంప్రదాయబద్ధంగా, అమాయక కోడలిగా, హోమ్లీ లుక్స్ తో సాధారణ గృహిణిలా కనిపిస్తూనే... మరో సైడ్ ఎవరికీ తెలియని బ్యాక్ స్టోరీ చూపించకుండా... తన పవర్‌ఫుల్ యాక్షన్ తో ఆడియన్స్ కి మరో కథను చూపించడానికి రెడీ అవుతుంది.
ఇక సమంత "మా ఇంటి బంగారం" మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతుందని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చినట్టుంది. ఇక ట్రైలర్ లో సామ్ కనిపించే ప్రతి షాట్ కూడా డిఫరెంట్ గా, సూపర్ గా చూపించారు దర్శకురాలు నందిని రెడ్డి. "హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే" అంటూ సామ్ చేత చెప్పించిన ఇలాంటి కొన్ని డైలాగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇక నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సమంత భర్త దర్శకుడు అయిన రాజ్ నిడిమోరు కథ సహకారం అందించి నిర్మాతగానూ వ్యవహరించడం జరిగింది. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది.