Register as a Reviewer
పాపం ప్రతాప్ (Papam Prathap)

పాపం ప్రతాప్ (Papam Prathap)

17 Apr 2026
Overall Rating
4.5/10
15 Reviews

టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "పాపం ప్రతాప్". విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీని ఎస్.పి. దుర్గా నగేష్ డైరెక్ట్ చేసాడు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది.

Director: S.P.Durga Naresh
Cast: Thiruveer, Payal Radhakrishna, Ajay Ghosh, Raasi, and others

Available in:

Reviews

What critics and the public are saying about పాపం ప్రతాప్ (Papam Prathap)

Media Reviews

15 Avg: 4.5/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Papam Prathap Movie Review

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—al...

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.


సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్ వస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అక్కడే సినిమా కాస్త దారి తప్పింది బాస్! తిరువీర్ మాత్రం సినిమా మొత్తాన్ని మోసేశాడు. కానీ వేరే వాళ్ళు పెద్దగా హెల్ప్ అవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే…

పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ కాస్త బోర్… కానీ క్లైమాక్స్ ఎమోషన్ కొంతమందికి connect అవుతుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్, క్లైమాక్స్ బాగుంటాయి. కానీ మూవీ ఓవరాల్ గా అంతగా ఎక్కదు. సో అదండీ పాయింట్. 

Apr 17, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Papam Prathap Movie Review

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీర...

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… 

ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… సెకండాఫ్! పేస్ స్లో అవుతుంది… కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కాస్త అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ ఇస్తాయి. ఇంకొంచెం క్రిస్ప్‌గా రాస్తే సినిమా లెవెల్ ఇంకాస్త పెరిగేది.


 పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…

తిరువీర్ literally carries the film!

అతని ఎమోషన్స్, కళ్లతో చేసే యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.

పాయల్ రాధాకృష్ణ కూడా బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా, జెన్యూన్‌గా కనిపిస్తుంది.


 టెక్నికల్‌గా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి BGM సీన్స్ కి good support. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ – గోదావరి visuals super fresh ఫైనల్‌గా… పాపం ప్రతాప్ పెద్ద సినిమా కాదు… కానీ ఒక సింపుల్, హార్ట్‌ఫెల్ట్ విలేజ్ డ్రామా. కొన్ని ఫ్లాజ్ ఉన్నా… క్లైమాక్స్ ఎమోషన్ connect అయితే, ఓవరాల్ గా One-time watch for its feel-good vibes..

Apr 17, 2026 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
4

Below Average

Papam Prathap Movie Review

పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దాన...

పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది. 


టెక్నికల్ గా కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!

Apr 17, 2026 Read Review
T2B Live
T2B Live Website
5

Average

Papam Prathap Movie Review

ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు… కానీ పెళ్లి అయిన మూడో రోజే పెళ్ళికూతురు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది…దాంతో హీర...

ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు… కానీ పెళ్లి అయిన మూడో రోజే పెళ్ళికూతురు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది…దాంతో హీరో తనని తిరిగి బ్రతిమలాడి తిరిగి రప్పించుకుంటాడు..కానీ మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. అసలు వీళ్ళకి ప్రాబ్లెం ఏంటి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…


ఇక హీరోగా తిరువీర్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ఓకే అనిపించగా అజయ్ ఘోష్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో నరేషన్ తో సాగింది. సినిమా ఎందుకో ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ చాలా స్లో నరేషన్ తో సాగుతూ రిపీటివ్ సీన్స్ తో సాగింది…ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఊపు అందుకుని క్లైమాక్స్ లో పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఒకసారి చూసేయొచ్చు అనిపించేలా ఉంది పాపం ప్రతాప్. 

Apr 17, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Papam Prathap Movie Review

ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చా...

ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చాలా సరదాగా సాగిపోతాయి. హీరోకు ఉన్న వింత సమస్యను రివీల్ చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి.


అయితే సెకండాఫ్ ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులు లేకపోయినా సినిమా బాగుండేది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే... ఈ సినిమాకు ప్రధాన బలం తిరువీర్ నటన. భార్య దూరమైన బాధను, లోపల ఉన్న ఆవేదనను తన కళ్లతోనే పలికించాడు. ఒక సగటు మధ్యతరగతి భర్త పడే కష్టాలను అద్భుతంగా పండించాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా ఉంది. కేఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను ఫ్రెష్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 'పాపం ప్రతాప్'.. మనసును హత్తుకునే స్వచ్ఛమైన గ్రామీణ వినోదం.


Apr 17, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
3

Not Good

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించారు. పాయల్‌ రాధాకృష్ణకు మంచి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆమె కూడా చక్కగా నటించారు. అమ్మ పాత్రలో రాశి ఆకట్ట...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించారు. పాయల్‌ రాధాకృష్ణకు మంచి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆమె కూడా చక్కగా నటించారు. అమ్మ పాత్రలో రాశి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ తమ పాత్రల్లో చక్కగా నటించారు. మిగతా వారు పర్లేదనిపించారు.


ఇక సినిమా విషయానికి వస్తే... కథలో అసలు పాయింట్ పక్కనపెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వీక్‌నెస్ క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు చేసిన పబ్లిసిటీ 'పాపం ప్రతాప్'కు మెయిన్ మైనస్ పాయింట్. ప్రేమ కథకు డిజార్డర్ యాడ్ చేసిన సినిమా తీయాలనే ఆలోచన బావుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కూడా బావుంది. కానీ, ఎగ్జిక్యూట్ చేసిన తీరు బాలేదు. కామెడీలో డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైంది. అది కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. కానీ, సినిమాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేయలేదు. ప్రతాప్ సమస్యను దర్శకుడు సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోవడం కష్టమే. థియేటర్లకు వెళ్లిన వాళ్ళను చూసి పాపం ఆడియన్స్ అనుకోవాలి!

Apr 17, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... కథ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్‌...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... కథ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలచడం అనేది కత్తిమీద సాము లాంటిదే. కానీ అది కాస్త గాడి తప్పింది. ఫస్టాఫ్ అంతా బాగానే వెళ్లిపోతుంది. హీరోకు ఉన్న సమస్యేంటి అనేది ల్యాగ్ చేయకుండా త్వరలోనే రివీల్ చేసాడు దర్శకుడు.. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. 


సినిమాలో కొన్ని డబుల్ మీనింగ్ జోకులు, సీన్లు అవసరం లేదేమో అనిపించింది. క్లైమాక్స్ ఓకే..! నిర్మాణ విలువలు కథా నేపథ్యానికి తగ్గట్లుగా, రాజీ పడకుండా చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చిన్నదే అయినా.. 90ల నాటి గోదావరి నేటివిటీని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. పల్లెటూరి కథ.. డీసెంట్ ఎంటర్‌టైనర్..!

Apr 17, 2026 Read Review
4

Below Average

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందనేది కామెడీ కోణంలో రూపొందించారు. అయితే కామెడీ పండలేదు కదా, చిరాకు తెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు గోల గోలగా, అరుపులు, కేకలు అన్నట్టుగానే సాగుతుంది.


సినిమాలో కొన్ని కామెడీ సీన్లు బానే ఉన్నా, అవి తప్ప ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదు సరికదా, పెద్ద టార్చర్‌గా సాగుతుంది. ఒక్క సీన్‌కి మించి మరో సీన్‌ చిరాకు తెప్పిస్తాయి. ఆర్టిస్ట్ ల ఓవర్‌ పర్ఫెర్మెన్స్, లౌడ్‌గా రియాక్ట్ అయిన తీరు కామెడీని పండించడంలో విఫలమయ్యాయి. ప్రతి సీన్‌ ఓవర్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ దారుణం అంటే, దాన్ని మించి సెకండాఫ్‌ ఉంది. సీన్లు, ఆర్టిస్ట్ లు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా ప్రతిదీ సినిమాకి మైనస్‌గానే మారాయి. ఏదైనా ఇందులో ఆకట్టుకునే అంశం ఉందంటే ఇది రియల్‌ లైఫ్‌ స్టోరీ అని లాస్ట్ లో చెప్పడం, క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎమోషనల్‌ సీన్‌, అది తప్పితే మూవీ మొత్తం ఔట్‌ ఆఫ్‌ ది కంట్రోల్‌లో సాగిందని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పాపం ఆడియెన్స్. రెండున్నర గంటలు చుక్కలు. 


Apr 17, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
5

Average

Papam Prathap Movie Review

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. ఎప్పట్లాగే తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. అమాయకుడిగా, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వాడిలా నటించి మెప్పిస్తాడు. పాయల్ రాధకృష్ణ తన పాత్రకు తగ్గట్టుగా ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. సీనియర్ నటి రాశీ అమ్మ పాత్రలో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్ తం...

తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. ఎప్పట్లాగే తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. అమాయకుడిగా, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వాడిలా నటించి మెప్పిస్తాడు. పాయల్ రాధకృష్ణ తన పాత్రకు తగ్గట్టుగా ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. సీనియర్ నటి రాశీ అమ్మ పాత్రలో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్ తండ్రిగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.


 టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓ కొత్త సమస్యతో భార్యాభర్తల మధ్య కథగా రాసుకొని నవ్వించడంలో, ఎంటర్టైన్ చేయడంలో పాపం ప్రతాప్ సక్సెస్ అయినా భావోద్వేగాలు ఇంకాస్త పండించాల్సింది. కొన్ని డైలాగ్స్ మాత్రం ఎమోషనల్ గా మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టి హీరోకి ఏదో ఒక సమస్య ఉంది అనే విషయాన్ని నేరుగా ఆడియెన్స్‌కి చెప్పేసాడు దర్శకుడు. మొత్తంగా ‘పాపం ప్రతాప్’ ఓ కొత్త సమస్యతో ప్రేక్షకులని నవ్విస్తూ ఎమోషనల్ చేసే సినిమా.

Apr 17, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
4

Below Average

Papam Prathap Movie Review

తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, కథాకథనాల పరంగానూ రొటీన్ స్టఫ్ అన్న టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా, కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు అంతా బలహీనంగానే ఉంటుంది. ఇక టెక్నికల్ గా పాటలు ఏమంత వినసొంపుగా, గుర్తు పెట్టుకునేలా ఉండవు. క్యాస్టూమ...

తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, కథాకథనాల పరంగానూ రొటీన్ స్టఫ్ అన్న టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా, కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు అంతా బలహీనంగానే ఉంటుంది. ఇక టెక్నికల్ గా పాటలు ఏమంత వినసొంపుగా, గుర్తు పెట్టుకునేలా ఉండవు. క్యాస్టూమ్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ ఇవేవీ కూడా సినిమాకి అదనపు హంగుల్లా కనిపించవు. నిర్మాణ విలువలు కూడా అంతగా కనిపించవు. 


నటీనటుల విషయానికి వస్తే తిరువీర్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్ర వరకు ఓకే అనిపిస్తుంది. రాశీ, అజయ్ ఘోష్ పెయిర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. గోపరాజు రమణ కారెక్టర్, అతను చేసే కామెడీ కొన్ని సార్లు ఓవర్ అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. రవి ఆంటోని, ప్రసాద్ బెహరా అక్కడక్కడ నవ్విస్తారు. మిగిలిన పాత్రలన్నీ కూడా వారి పరిధి మేరకు నటించారు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. చివరకు పాపం తిరువీర్ అనేట్టుగానే ఉంటుంది. మంచి పాయింట్‌లను పట్టుకుని తిరువీర్ కథల్ని ఓకే చేస్తాడు. కానీ ఎగ్జిక్యూషన్‌లో తేడా కొట్టేస్తుంటుంది. ఈ పాపం ప్రతాప్ కూడా అంతే.. పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోతుంది.


Apr 17, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Papam Prathap Movie Review

ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తిరువీర్ హీరోగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా బీలో యావరేజ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.సినిమాలో నటీనటులు తమ పరిధిలో బాగానే నటించినా… అసలు సమస్య కథ, కథనం దగ్గరే కని...

ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తిరువీర్ హీరోగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా బీలో యావరేజ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.


సినిమాలో నటీనటులు తమ పరిధిలో బాగానే నటించినా… అసలు సమస్య కథ, కథనం దగ్గరే కనిపిస్తుంది. “పిండే బాగోలేకపోతే వంట ఎలా బాగుంటుంది?” అన్నట్టుగా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల టెక్నికల్ టీమ్ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయింది.


అయితే 90స్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను డిజైన్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కొంతవరకు ప్లస్‌గా నిలిచాయి. కానీ రొటీన్ కథనం, ఆసక్తి కలిగించని సీన్స్ కారణంగా సినిమా ఎక్కడా ఎంగేజ్ చేయలేకపోయింది. మొత్తంగా ‘పాపం ప్రతాప్’ కొన్ని టెక్నికల్ ప్లస్‌లతో ఉన్నా… ఓవరాల్ గా కొన్ని మంచి కామెడీ సీన్లతో పాపం ప్రతాప్ కొంతవరకు నవ్విస్తాడు. 

Apr 17, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
3

Not Good

Papam Prathap Movie Review

‘పాపం ప్రతాప్’ అంటూ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. తిరువీర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటులు వారి పరిధిలో బాగానే నటించినా, మిగతా విభాగాల్లో మూవీ ఏమాత్రం ఆశించిన విధంగా లేదు. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ వాతావరణాన్ని బాగా డిజైన్ చేసా...

‘పాపం ప్రతాప్’ అంటూ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. తిరువీర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటులు వారి పరిధిలో బాగానే నటించినా, మిగతా విభాగాల్లో మూవీ ఏమాత్రం ఆశించిన విధంగా లేదు. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ వాతావరణాన్ని బాగా డిజైన్ చేసారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అసలు పిండే బాగా లేకపోతే వంటకాలు ఎలా బాగుంటాయి అంటారు. పసలేని కథ, కథనాల కారణంగా టెక్నిషియన్స్ కూడా న్యాయం చేయలేకపోయారు. అంతలో కొంత కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫి బెటర్‌గా అనిపిస్తుంది. 


అన్వర్ అలీ ఎడిటింగ్ కంగాళీగానే ఉంది. ఈటీవీ విన్, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ఈ సినిమాలో కంటెంట్ పరంగా ఎలాంటి నాణ్యత కనిపించదు. రెండున్నర గంటలపాటు ఈ సినిమా ప్రేక్షకుడికి మానసిక సమస్యగానే మారుతుంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా తెచ్చుకొన్న బజ్‌కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఇన్నీ విషయాలు చర్చించుకొన్న తర్వాత.. పాపం ప్రతాప్ సినిమా చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.

Apr 17, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

Papam Prathap Movie Review

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. రొటీన్ టాక్ అన్న రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తిరువీర్ నటన బాగుంది. అలాగే సినిమా మొదటి ఇరవై నిమిషాల్లో అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. కథలోని అసలు విషయాన్నీ వెల్లడించే ప...

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. రొటీన్ టాక్ అన్న రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తిరువీర్ నటన బాగుంది. అలాగే సినిమా మొదటి ఇరవై నిమిషాల్లో అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. కథలోని అసలు విషయాన్నీ వెల్లడించే ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. అయితే ఈ రెండు విషయాలు తప్ప, సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.


చూస్తుంటే, తిరువీర్ తన గత చిత్రానికి ప్రమోషన్లు సరిగ్గా లేవన్న ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, తన శక్తినంతా ఈ సినిమా ప్రమోషన్ల కోసం తీవ్రంగా వెచ్చించినట్లు అనిపించింది. కానీ స్క్రిప్ట్‌ను ఖరారు చేయడంలో మాత్రం తగినంత శ్రద్ధ పెట్టలేదు. మార్చిలో వచ్చిన ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపుసాని’, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ - ఈ రెండు ఈటీవీ విన్ చిత్రాలకు మంచి కాన్సెప్ట్‌లు ఉన్నప్పటికీ, ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే, కథనం కారణంగా చప్పగా ముగిశాయి. ఓవరాల్ గా మూవీ పెద్దగా ఆకట్టుకోదు.

Apr 17, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Papam Prathap Movie Review

తిరువీర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం పాపం ప్రతాప్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నటీనటుల విషయానికి వస్తే తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ మంచి నవ్...


తిరువీర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం పాపం ప్రతాప్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటీనటుల విషయానికి వస్తే తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ మంచి నవ్వులు పంచుతాయి. టెక్నికల్‌గా సినిమాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించగా, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది.

అయితే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో బలం లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినా, మొత్తం కథనం రొటీన్‌గా అనిపిస్తుంది.

మొత్తానికి… పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామాగా, కొన్ని కామెడీ ఎలిమెంట్స్‌తో మాత్రమే పరిమితమైంది. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓకే అనిపించే సినిమా.

Apr 17, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Papam Prathap Movie Review

తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కన...


తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినా, కథాకథనాలు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బేసాయి. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా నీట్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు. 


అలాగే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి లైన్ ని తీసుకున్నా, కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి కానీ, ఇదే స్టోరీ లైన్ కి తగ్గ డెప్త్, లాజిక్ ని మాత్రం తాను మిస్ అయ్యారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పాపం ప్రతాప్’ లో యువ నటుడు తిరువీర్, అజయ్ ఘోష్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కగా మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్ నెస్ తక్కువ అయ్యింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించే సింపుల్ విలేజ్ డ్రామాలా మిగిలింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ట్రై చెయ్యండి.

Apr 17, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : కథ విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ప్రతాప్ (తిరువీర్) తాను చిన్నప్పట్నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ని పెద్దలు వద్దన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. బుజ్జమ్మకి కూడా ప్రతాప్ అంటే ఇష్టం. కానీ వీళ్ళ పెళ్లి  ప్రతాప్ తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కి ఇష్టం ఉండదు. ఏది ఏమైనా అంతా సవ్యంగా గడుస్తుంది అన్న తరుణంలో ప్రతాప్ ఓ వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలుసుకున్న బుజ్జమ్మ పెళ్ళైన మూడు రోజులకే ప్రతాప్ పై కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇది ఏకంగా ఊళ్ళో పంచాయితీ వరకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రతాప్ తనకున్న సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించుకున్నాడా? ఫైనల్ గా ప్రతాప్ - బుజ్జమ్మ కలిసారా? లేదా? అనేది కథ.


ఇక సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది నటీనటుల గురించి... సినిమాలో తిరువీర్ తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాకుండా, మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. అమాయకత్వంతో పాటు, ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. హీరోయిన్ రోల్ చేసిన పాయల్ రాధాకృష్ణ కి మాత్రం కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక హీరో తండ్రిగా నటించిన అజయ్ ఘోష్ నటన సినిమాకు మంచి ప్లస్ అయింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ని కూడా చూపించారు. మిగతా నటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.


ఇక మైనస్ గురించి చెప్తే.. సినిమాలో హీరో సమస్య గురించి సస్పెన్స్ ఉంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయగా, ఆ తర్వాత ఆ సమస్య గురించి తెలిసాక కూడా హీరోయిన్ అంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిందో, దానికి హీరోయిన్ చెప్పే రీసన్ అంతబాగా రాసుకోలేదు. ఈ పాయింట్ కి ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. పైగా ఈ మాత్రం దానికా ఇంత సాగదీసింది అన్న ఫీల్ వస్తుంది. పైగా సెకండ్ హాఫ్ మరింత ల్యాగ్ అయిపోతుంది. మెయిన్ గా హీరోకు ఉన్న సమస్యని ఆడియన్స్ కి అర్ధమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ గా, కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 


Technical values : టెక్నికల్ గా చూసుకుంటే.. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే కె.ఎమ్. రాధాకృష్ణన్ అందించిన సంగీతం, ప్లస్ బీజీఎమ్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక దర్శకుడు దుర్గా నగేష్ మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా, దాన్ని ఆసక్తిగా మలచలేకపోయాడు. ముఖ్యంగా కథలో బలమైన ఎమోషన్ మిస్ అయింది.


Final Review : ఓవరాల్ గా "పాపం ప్రతాప్" మూవీ లో తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం కూడా బాగుంది. కాకపోతే స్ట్రాంగ్ నేరేటివ్ లేకపోవడంతో ఆడియన్స్ కి బోర్ ఫీల్ వస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు, గాని రెగ్యులర్ మూవీ లవర్స్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

4.5
Overall Rating
Avg. of all reviews
15
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
4.5/10
Public
N/A
Why MRO?