పెద్ది (Peddi Trailer)
Peddi Trailer Talk : ఆటాడుతున్నాడనుకుంటే... పోరాడుతున్నాడట! ఈ "పెద్ది" కథ శానా ఉంది..!
Available in:
About This Movie
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన "పెద్ది" థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీపై ముందు నుండి భారీ అంచనాలున్నాయి. పోస్టర్ మొదలు టీజర్, సాంగ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండి హైప్ అమాంతం పెంచేయగా ఫైనల్ గా థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలై ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్ళిపోయింది.
ఇక ట్రైలర్ ని గమనిస్తే... టీజర్ లో చెప్పిన కాన్సెప్ట్ నే ట్రైలర్ లో మొత్తం అమలు చేసినట్టు తెలుస్తూనే ఉంది. ఏ గోల్ అచీవ్ చేసినా ఈ భూమ్మీద ఉన్నపుడే చేసేయాలి అన్నట్టు... సినిమాలో ఏ ఆటైనా అది పెద్ది ఆటే అన్నట్టు చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. ముఖ్యంగా డైలాగ్స్ లో మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్నట్టు తెలుస్తుంది. కథ పరంగా చిన్న కాన్సెప్ట్ ఉన్నట్టు అనిపించినా ఆడియన్స్ కి తెలియందేదో బుచ్చిబాబు దాచేసినట్టు... , ఇంకేదో ఎమోషనల్ గా ఆడియన్స్ మనసుల్ని పెండేయడానికి బుచ్చిబాబు పెద్ది సినిమాని రెడీ చేస్తున్నట్టు ఉంది.
ఇక ట్రైలర్ లో ఆ ఫైనల్ షాట్... అంటే క్రికెట్ నుండి కుస్తీకి మారుతున్న షాట్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అలాగే దానికి తగ్గట్టు సాలిడ్ బీజీఎమ్ ఇచ్చాడు ఏఆర్ రహ్మాన్. అలాగే ట్రైలర్ లో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ల రోల్స్ కి కూడా స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉండనుందని తెలుస్తుంది. ఎటొచ్చి జాన్వీ కపూర్ ని గ్లామర్ రోల్ కే పరిమితం చేస్తున్నట్టు ఉంది. ఫైనల్ గా సంక్రాంతి తర్వాత మరో సరైన సినిమా లేని టాలీవుడ్ కి "పెద్ది" ద్వారా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న పెద్ది సినిమా జూన్ 4న వరల్డ్‌వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.