45( ఫార్టీ ఫైవ్ )
కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, అలాగే యంగ్ స్టార్ రాజ్ బి శెట్టి త్రయం కలిసి నటించిన మూవీ "45". భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా కన్నడలో డిసెంబర్ లోనే రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం ఈ ఇయర్ లో రిలీజ్ అయింది.
Available in:
About This Movie
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన వినయ్ (రాజ్ బి శెట్టి) కి ఓ రోజు నిద్దర్లో ఓ కల వస్తుంది. ఆ కలలో తానూ ఓ కుక్క కారణంగా బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు కలొస్తుంది. అయితే ఆ తర్వాత రోజు నుండి వినయ్ కలలోని సన్నివేశాలు మెల్లిగా నిజమవుతుంటాయి. ఈ క్రమంలో వినయ్ కలలో వచ్చిన ఆ కుక్క పేరు రోసీ. ఆ కుక్క రాయప్ప (ఉపేంద్ర) అనే డాన్ కి చెందినది. అయితే తాను తల్లిలా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్ ని సరిగ్గా 45 రోజుల్లో చంపేస్తానని రాయప్ప వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ్నుంచి వినయ్ జీవితం మారిపోతుంది. తాను చావడం ఇక కంఫర్మ్ అనుకున్న తరుణంలో వినయ్ జీవితంలోకి శివ (శివరాజ్ కుమార్) వస్తాడు. వినయ్ కి సాయం చేస్తాడు. ఇంతకీ వినయ్ కి శివ ఎందుకు సాయం చేయాలనుకుంటాడు. రాయప్ప వినయ్ ని ఏం చేసాడు. చివరికి రాయప్ప, వినయ్ లో ఎవరైనా చస్తారా? లేక మరో ముగింపు ఉంటుందా అనేది సినిమాలో చూడాలి.
Technical Values :
కన్నడలో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా అంతే అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. రాజ్ బి శెట్టి సెటిల్డ్ పెర్ఫార్మన్స్, ఉపేంద్ర అదిరిపోయే విలనిజం తో పాటు, శివరాజ్ కుమార్ కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. అయితే కథ కథనంలో మాత్రం డైరెక్టర్ చాలా స్లో అయ్యాడు. దర్శకుడిగా అర్జున్ జన్యా స్టార్ హీరోలని ఈ సినిమాకి ఒప్పించినా, సరైన కథా, కథనాలను ఆకట్టుకునేలా రాయడంలో విఫలమయ్యాడు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నా, సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ బాగుండవు. అలాగే ఉపేంద్ర గెటప్ బాగానే ఉన్నా, పాత్రలో కొత్తదనం ఉండదు. అయితే సాంకేతికంగా 45 సినిమాకి నిర్మాతలు ఖర్చు పెట్టిన తీరుని అభినందించాలి. మొత్తంగా కర్మ సిద్ధాంతాన్ని భిన్నంగా ప్రేక్షకులకు అందించాలనే ఆలోచన మంచిదే. కాని తెలుగులో బ్రో, గోపాల గోపాల లాంటి సినిమాలు ఇప్పటికే రావడంతో తెలుగు ఆడియన్స్ కి అస్సలు రుచించలేదని చెప్పాలి.
Final Review : ఓవరాల్ గా "45" కథ విషయానికి వస్తే డైరెక్టర్ అనుకున్న కోర్ పాయింట్ బాగున్నా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన 45లో క్లైమాక్స్ తప్ప మిగతా సీన్లు పెద్దగా గుర్తుండవు.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about 45( ఫార్టీ ఫైవ్ )
Movie Media
45 Movie Review
Gadgets360
45 Movie Review
The Hollywood Reporter India
45 Movie Review
Deccan Herald
45 Movie Review
First Showz.com
45 Movie Review
NDTV
45 Movie Review
India Today
45 Movie Review
The Times Of India
45 Movie Review
IMDB
25 December 2025
Cinema Express
45 Movie Review
123telugu.com