Champion

Champion

2025
6.5/10
10 Reviews

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అనశ్వర రాజన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫిక్షనల్ యాక్షన్ డ్రామా "ఛాంపియ‌న్". ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది.

Available in:

About This Movie

తెలంగాణా నేపథ్యంలో "ఛాంపియన్" సినిమా తెరకెక్కగా, ఈ సినిమా కథ బైరాన్ పల్లి పోరాటం నేపథ్యంలో సాగుతుంది. ఇక కథ విషయానికి వస్తే, టాలెంటెడ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడైన మైఖేల్ (రోషన్) లండన్ కి వెళ్లి, తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటాడు. ఇదే సమయంలో మరోవైపు బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు దాడులు చేస్తూ ఉంటారు, అయితే బైరాన్ పల్లి ప్రజలు రజాకార్లను తిప్పి కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో మైఖేల్ కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం బైరాన్‌పల్లి గ్రామానికి వస్తాడు. అక్కడ మైఖేల్ ఉన్న రెండు వారాలు, మరియు అక్కడ జరిగిన సంఘటనలు మైఖేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్న మైఖేల్, ఉద్యమ కారుడు అయి సాధించింది ఏమిటి?, బైరాన్ పల్లి లో రజాకార్ల దాడులను ఊరి ప్రజలతో కలిసి మైఖేల్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. 

Technical values :

అద్వైతం లఘు చిత్రంతో ఆకట్టుకున్న ప్రదీప్ అద్వైతం నాలుగేళ్లు కష్టపడి తెరకెక్కించిన "ఛాంపియన్" సినిమాలో అతడి కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. రోషన్, అనశ్వర రాజన్ తో పాటు కీలకపాత్రల్లో నటించిన కళ్యాణ్ చక్రవర్తి, మురళి శర్మ తదితరులు నటన పరంగా ఆకట్టుకున్నారు. అయితే ఎమోషనల్ కంటెంట్ తో సాగే కథ నేపథ్యం బాగున్నా, కథనం స్లో గా ఉండి, ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తుంది. ఇక మిక్కీ జె మేయర్ అందించిన పాటలు సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే నిర్మాతలు ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్ తాము పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనబడేలా చేసారు. ఓవరాల్ గా కథనం విషయంలో ప్రదీప్ మరింత శ్రమించి ఉండాల్సింది. 

Final Review : ఓవరాల్ గా ఛాంపియన్ మూవీ తెలంగాణ బైరన్ పల్లి పోరాట నేపథ్యంతో ఆకట్టుకోవడమే కాకుండా, రోషన్ ని ఓ మెట్టెక్కించిందని చెప్పాలి. అలాగే దర్శకుడిగా ప్రదీప్ అద్వైతం కూడా ఇంప్రెస్ చేసాడు. అయితే సినిమా సక్సెస్ మాత్రం ఆడియన్స్ చేతుల్లో ఉంది.

 

Review Statistics

6.5
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
5.4/10

Professional Reviews

What critics and publications are saying about Champion

Movie Media

Champion Movie Review

Telugu Rajyam

4.0/10
రోషన్, అనశ్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఛాంపియన్ సినిమా క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయింది.
Jan 19, 2026

Champion Movie Review

Tupaki

5.0/10
రోషన్ హీరోగా బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Champion Movie Review

Filmibeat

5.0/10
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Champion Movie Review

Chitrajyothy

5.5/10
రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Champion movie review Telugu

ABPTelugu

6.0/10
శ్రీకాంత్ తనయుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణలోని బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో ఫిక్షన్ కథతో తెరకెక్కగా మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Champion Movie Review

TV9 Telugu

6.0/10
ఛాంపియన్ మూవీ రివ్యూ.. రోషన్ ఖాతాలో మరో హిట్టు.. మనసులు గెలిచాడు..
Jan 19, 2026

Champion Movie Review

Great Andhra

4.0/10
బైరాన్ పల్లి పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఛాంపియన్ లో రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 19, 2026

Champion Movie Review

Asianet news Telugu

6.0/10
రజాకార్ల ఎపిసోడ్‌ చూసినదే అయినా, బైరాంపల్లి ప్రజల తిరుగుబాటుని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కోణంలో కొత్తగా ఆవిష్కరించిన సినిమా 'ఛాంపియన్‌'.
Jan 19, 2026

Champion Movie Review

NTVtelugu.com

6.5/10
రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ బైరాన్ పల్లి నేపథ్యంలో తెరకెక్కగా, డిసెంబర్ 25న విడుదలై ఆకట్టుకుంటుంది.
Jan 19, 2026

Champion movie Review

123telugu.com

6.0/10
రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ మూవీ డిసెంబర్ 25న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోగా, క్రిటిక్స్ నుండి మిక్సడ్ రివ్యూస్ అందుకుంది.
Jan 19, 2026