Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

2026
7.5/10
10 Reviews

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ "మన శంకర వర ప్రసాద్ గారు". నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తాజాగా ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. సో మూవీ రివ్యూ పై ఓ లుక్కేద్దాం.

Available in:

About This Movie

కథ విషయానికి వస్తే అనిల్ రావిపూడి అన్ని సినిమాల్లో ఉండే స్టోరీ లైన్ లాంటిదే. చాలా సింపుల్ గా ఉంటుంది. భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో ఛీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా "శంకర వరప్రసాద్" (Chiranjeevi) పని చేస్తాడు. అంతే కాదు తను ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. ఈ క్రమంలో తనకి పరిచయం అయిన అమ్మాయి శశిరేఖని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే శశిరేఖ ప్ పాపులర్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన "జీవిఆర్ గ్రూప్స్ కంపెనీ అధినేత (Sachin khadekar) కూతురు. అయితే మొదటి పరిచయంతోనే వరప్రసాద్ - శశిరేఖ ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అయితే ప్రసాద్ అంటే ఇష్టం లేక శశిరేఖ తండ్రి ప్రసాద్ ని - శశిరేఖ, మరియు పిల్లల నుంచి విడదీస్తాడు. కొంతకాలం శశిరేఖకు దూరమైనా ప్రసాద్ మళ్ళీ కలుస్తాడు. మరి వీరు విడిపోవడానికి కారణాలేంటి? మళ్ళీ ఎలా కలిశారు. మధ్యలో తనకు పోటీగా వచ్చిన ఆఫీసర్ "మైనింగ్ మొఘల్ వెంకీ గౌడ" (Venkatesh) ఎంట్రీ ఇచ్చాక కథ ఎలా మారింది. ఈ క్రమంలో ఓ సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అయిన వీరేంద్ర పాండే (Sudev Nair) శశిరేఖని, తన పిల్లలని చంపాలని చూస్తాడు.  ఫైనల్ గా ఏం జరిగిందన్నదే కథ. 

Plus & Minus Points  :  మాములుగా అనిల్ రావిపూడి సినిమాల్లో పెద్దగా బలమైన కథ ఉండదు. ఎంటర్టైన్మెంటే లక్ష్యంగా ఆడియన్స్ ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు తీస్తాడు. ఇప్పుడు కూడా మన శంకర వర ప్రసాద్ ని ఎంటర్టైనర్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాని తన కామిక్ టైమింగ్ తో ముందుండి నడిపిస్తాడు. మొదట్నుంచి చివరిదాకా హిలేరియస్ గా ఉండగా, వింటేజ్ చిరు కామెడీ హైలెట్ అవుతుంది. అలాగే వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్ కి వెళ్తుంది. చిరు, వెంకీ ఉన్న ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. అలాగే సచిన్ ఖడేకర్, అభినవ్ గోమటం, హర్ష వర్ధన్, కేథరిన్ వారి పాత్రల పరిధిలో బాగా చేసారు. 

మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఎప్పట్లాగే అనిల్ రావిపూడి యావరేజ్ స్టోరీ లైన్ తో వచ్చాడు. కథలో కొత్తదనం ఉండదు. అలాగే చిరంజీవిలోనే కామెడీని పూర్తి స్థాయిలో పిండుకోలేదనిపిస్తుంది. అలాగే చిరు లుక్స్ విషయంలో శ్రద్ధ వహించాల్సింది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ మంచి సాంగ్స్ ఇచ్చినా, బీజీఎమ్ పరంగా ఎక్స్పర్ట్ చేసినంత చేయలేదు.

Technical values : టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసుకుంటే, నిర్మాణ విలువలు డీసెంట్ గానే ఉన్నాయి. కథ పరంగా భారీ బడ్జెట్ తీసే సినిమా కాదు కాబట్టి, మేకర్స్ నార్మల్ గానే బడ్జెట్ పెట్టారు. సెట్టింగ్స్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇచ్చిన ఫోక్ సాంగ్స్ బాగున్నాయి. అయితే అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా కాస్త ఫోకస్ చేయాల్సింది. తమ్మిరాజు ఎడిటింగ్ బావుంది. అనిల్ రావిపూడి ఇంతకు ముందు సినిమాల్లో చూపించిన క్రింజ్ కామెడీ ఇందులో చాలా తక్కువే ఉంటుంది. మేకింగ్ క్వాలిటీ బాగుంది. 

Review Statistics

7.5
Overall Rating
10
Total Reviews
From 4 Provider Types

By Provider Type

Movie Media
6.4/10
Thyview
6.0/10
Ragadi
6.5/10
123telugu.com
6.5/10

Professional Reviews

What critics and publications are saying about Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

Movie Media

Mana shankara vara prasad garu movie review

One india

6.5/10
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ సంక్రాంతి స్పెషల్ గా విడుదలై థియేటర్లలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరొసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు. పాత కథను కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మెప్పించారు.
Jan 12, 2026

Mana shankara vara prasad garu movie review

Tupaki

6.0/10
భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరంజీవి సూపర్ హిట్ కొట్టాలని హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో "మన శంకర వర ప్రసాద్ గారు" అంటూ వచ్చేసారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ కి రెండున్నర గంటల పాటు ఏ ఢోకా లేకుండా నవ్వుకోవడానికి సరైన మూవీగా నిలిచింది.
Jan 12, 2026

Mana Shankara varaprasad garu movie review

Chitrajyothy

6.5/10
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమా రూపొందగా, చిరు, వెంకీ కాంబో సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.
Jan 12, 2026

Mana shankara vara prasad garu movie review

Asianet news telugu

6.0/10
చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. చిరంజీవి, వెంకటేష్‌ అభిమానులు మాత్రం ఊగిపోతారు.
Jan 12, 2026

Mana shankara vara prasad garu movie review

Filmibeat

6.5/10
Review Content : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. హిట్ సినిమాకు కావాల్సిన అన్నిరకాల మాస్, మసాలాలు ఉన్న చిత్రం ఇది. పండుగ ప్రేక్షకులకు విందు భోజనం లాంటి సినిమా ఇది.
Jan 12, 2026

Mana shankara Varaprasad movie review

Mahidhar Vibes

6.5/10
ప్రతి సారి దొరుకుతాడు అనుకున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా "దొరకను" అన్నాడు. మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ చూసి రొటీన్ స్టఫ్ వస్తుందనుకున్న క్రిటిక్స్ కి ఊహకందని మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. చిరు- వెంకీ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయే కామెడీతో మన శంకర వర ప్రసాద్ ని సక్సెస్ చేసేసారు అనిల్ రావిపూడి.
Jan 12, 2026

Mana shankara vara prasad garu movie review

Telugu Samayam

6.5/10
చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, సంక్రాంతి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత రావిపూడి మరోసారి పండకి వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి వస్తున్నాం అన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తన మార్క్ సినిమా...
Jan 12, 2026

Thyview

Mana shankara vara prasad garu movie review

Thyview

6.0/10
చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుంది అని ప్రూవ్ చేసుకున్నారు. స్టోరీ లో పెద్దగా బలం లేకున్నా, మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు.
Jan 12, 2026

Ragadi

Mana shankara varaprasad movie review

Ragadi

6.5/10
చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియెన్స్ కి బోసన్. ఇక ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ అయితే ట్రీట్ గా నిలుస్తాయి.
Jan 12, 2026

123telugu.com

Mana shankara Vara prasad garu movie review

123telugu.com

6.5/10
చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్ గారు" మూవీ సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాగా, ఎక్స్పెక్ట్ చేసినట్టే కథ పరంగా రొటీన్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకుంది. ఆడియన్స్ ని నవ్వించడమే టార్గెట్ గా వచ్చిన ఈ మూవీ, ఆ పనిలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
Jan 12, 2026

You Might Also Like