Shambala (శంబాలా)

Shambala (శంబాలా)

2025
7.9/10
10 Reviews

ఎన్నాళ్ళనుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఓ మిస్టరి థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యుగంధర్ ముని అనే యువ దర్శకుడు "శంబాలా" మూవీని తెరకెక్కించాడు.

Available in:

About This Movie

శంబాలా అనే ఓ ఊరిలో ఈ కథ నేపథ్యం నడుస్తుంది. 80వ దశకంలో శంబాల అనే ఒక చిన్న ఊరిలో ఆకస్మికంగా ఒక భారీ ఉల్క నేల రాలుతుంది. అయితే సరిగ్గా ఆ ఉల్క కింద పడిన తర్వాత రోజు నుంచే, ఆ ఊరిలో ఊహించని ఘటనలు మొదలవుతాయి. శంబాలా ఊళ్ళో జనాలందరూ మెల్లిగా ఒకరి తర్వాత మరొకరు వారి మెడ వెనుక భాగంలో ఒక బొడుపిలా వచ్చి, అది విచ్చిన్నమయి చనిపోతూ ఉంటారు. అయితే అసలు ఆ ఉల్క ఏంటి అని పరిశోధించడానికి వచ్చిన ప్రభుత్వ జియో సైంటిస్ట్ పైగా విక్రమ్ (ఆది) ఆ ఉల్కని కాపాడడానికి, అలాగే ఆ ఊరి ప్రజల సమస్య కనుక్కోవడానికి వారి సమస్యలోకి వెళ్తాడు. అప్పటినుండి విక్రమ్ కి ఎదురైన ఇబ్బందులు ఏంటి? నాస్తికుడైన విక్రమ్ కు అలాగే ఆ ఉల్క గురించిన సమస్యలో శాస్త్రానికి - సైన్స్ కి మధ్య వార్ ఎలా నడిచింది? ఆ ఊరిలో చావుల్ని విక్రమ్ ఆపగలిగాడా? లేదా? అనేది సినిమా కథ. 

Technical values : శాంబాల చిత్రం కోసం మేకర్స్ బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న స్టోరీ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా కొన్ని శాస్త్రీయ, వాస్తు అంశాలకు సంబంధించిన విషయాలను అర్థం అయ్యే విధంగా చెప్పడం బాగుంది. ఆది నటన పరంగా మెప్పించడమే కాకుండా, శంబాల తో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఇక దర్శకుడిగా యుగంధర్ ముని తొలిసినిమాతోనే మంచి ప్రతిభని కనబరిచాడు. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. అయితే కథనం పరంగా కాస్త నెమ్మదించింది. చాలా సీన్స్ ఊహాజనితంగా సాగగా, AI విజువల్స్ కాకుండా యానిమేషన్స్ వాడుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

మొత్తంగా "శంబాలా" మూవీ డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. మరీ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా, సినిమాకెళ్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది. 

 

Review Statistics

7.9
Overall Rating
10
Total Reviews
From 2 Provider Types

By Provider Type

Movie Media
6.3/10
123telugu.com
6.0/10

Professional Reviews

What critics and publications are saying about Shambala (శంబాలా)

Movie Media

Shambala movie review

Telugumirchi.com

6.5/10
మొత్తంగా “శంబాల” మిస్టికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగిన అనుభూతిని అందించే సినిమా.
Jan 12, 2026

Shambala movie review

HMTV

7.0/10
వింతలు, భయానక ఘటనలు, మిస్టరీతో నిండిన కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చిన సినిమాల జాబితాలో ఇప్పుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన “శంబాల” కూడా చేరింది.
Jan 12, 2026

Shambala movie review

Asia net telugu

6.0/10
భయపెట్టిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ, థ్రిల్‌తో కట్టిపడేసే హర్రర్‌, థ్రిల్లర్‌ మూవీ `శంబాల`. ఆది సాయికుమార్‌ కెరీర్‌ని మలుపు తిప్పే మూవీ అవుతుంది.
Jan 12, 2026

Shambala movie review

Timesnowtelugu

6.0/10
అది నటించిన "శంబాల" మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి మంచి హైప్ క్రియేట్ చేయగా, ఫైనల్ గా డిసెంబర్ 25న థియేటర్లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 12, 2026

Shambala movie review

ABP Telugu

6.0/10
'శంబాల' రివ్యూ: శాస్త్రాలు vs సైన్స్... ఆది సాయి కుమార్ నటించిన శంబాలా మూవీ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 12, 2026

Shambala movie Review

GreatAndhra

5.0/10
ఆది హీరోగా నటించిన శంబాలా మూవీ డిసెంబర్ 25న విడుదలవగా, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Jan 12, 2026

Shambala movie review

Sakshi

/10
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్. సైన్స్ దేవుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
Jan 12, 2026

Shambala movie review

NTVtelugu.com

6.0/10
Shambala Movie Review : ఆది హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ "శంబాలా" మూవీ డిసెంబర్ 25న విడుదలై, మంచి రెస్పాన్స్ అందుకోగా 3/5 రేటింగ్ అందుకుంది.
Jan 12, 2026

Shambala Movie Review

IMDB

8.0/10
Shambala Movie Review : 1980లలో అత్యంత మూఢనమ్మకాల గ్రామమైన శంభాలలోకి ఒక ఉల్కాపాతం దూసుకెళ్లినప్పుడు, వింతైన అతీంద్రియ సంఘటనలు బయటపడతాయి, నాస్తిక శాస్త్రవేత్త ఒక పురాతన భయానక సంఘటనను ఎదుర్కోవలసి వస్తుంది - దానిని సైన్స్ వివరించలేకపోవచ్చు లేదా తప్పించుకోలేకపోవచ్చు.
Jan 12, 2026

123telugu.com

Shambala Movie Review

123telugu.com

6.0/10
Shambala Movie Review : ఆది హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ "శంబాలా" మూవీ ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన రాబట్టి, 3/5 రేటింగ్ అందుకుంది.
Jan 12, 2026