Akhanda2
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 సినిమాపై భారీ అంచనాలుండగా, అఖండ కి సీక్వెల్ గా తెరకెక్కిన "అఖండ తాండవం" థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Available in:
About This Movie
అఖండ మొదటి భాగం ఎండ్ అయ్యేటప్పుడే సీక్వెల్ కంఫర్మ్ చేసిన బోయపాటి శ్రీను, అఖండ ముగింపులో బాలయ్య కూతురు పిలిస్తే తప్పకుండా వస్తానన్న మాటతో సీక్వెల్ మొత్తాన్ని తెరకెక్కించారు. అఖండ2 లో బాలమురళీకృష్ణ (బాలయ్య) కుమార్తె అయిన జనని (హర్షాలి మల్హోత్రా) ఓ సైంటిస్ట్. తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని భారత దేశ సైనికుల కోసం తన టీమ్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదే సమయంలో మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన టెర్రరిస్టులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం దేశంలో ఒక్కసారిగా ఒక అనుకోని సంఘటన కలకలం రేపుతుంది. ఆ ఘటన చాలా మంది ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఇలాంటి సమయంలో దేశంపై దాడికి ప్రయత్నిస్తున్న దుండగుల్ని అఖండ ఎలా అడ్డుకున్నాడు. అలాగే దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజల్ని ఎలా రక్షించి దారిలో పెట్టాడు. అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అన్నది అఖండ తాండవం స్టోరీ.
Technical values : సినిమాలో బాలకృష్ణ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే మొదటి నుండే బాలయ్య ప్రధాన ఆకర్షణగా నిలిచి రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. మిగతా పాత్రల్లో హర్షాలీ మల్హోత్రా పాత్రకి తప్ప మిగతా పత్రాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విలన్ గా ఆది పినిశెట్టి బాగానే ఉన్నా పేలలేదు. అఖండ 1 భారీ సక్సెస్ అఖండ2 సినిమాపై భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం. అందుకే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి అంచనాలను అందుకోలేకపోయాడు. కథ నేపథ్యంలో డెప్త్ ఉన్నా, ఎమోషన్స్ ని పండించలేదు. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ అయిపోయాయి. కొని సీన్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు VFX విజువల్స్ అంతగా ఆకట్టుకోవు. మ్యూజిక్ పరంగా థమన్ ఎస్ ఈ సినిమాకు రెండో బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఎక్కడా తగ్గకుండా సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో బోయపాటి శ్రీను కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
Final Review : అఖండ కి సీక్వెల్ గా వచ్చిన అఖండ2 మొదటి పార్ట్ లాగానే డివోషనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో కూడిన ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే కథనం పరంగా స్లో అయి బోర్ కొట్టించింది. బాలయ్య ఫ్యాన్స్ మినహా సాధారణ మూవీ లవర్స్ ఈ సినిమాకి కనెక్ట్ కాలేదు. అలాగే యాక్షన్ సీన్స్ కాస్త అతి కాగా, గ్రాఫిక్స్, ఎమోషన్స్ పండకపోవడం మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా అఖండ2 బాలయ్య అభిమానులకి మాత్రమే.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Akhanda2
Movie Media
Akhanda2 Movie Review
News18Telugu
Akhanda2 Movie Review
Namaste Telangana
Akhanda2 movie Review
Filmibeat
Akhanda2 Movie Review
ABP Telugu
Akhanda2 movie Review
GreatAndhra
Akhanda2 Movie Review
NTVtelugu.com
Akhanda2 movie Review
TV9 Telugu
Akhanda2 movie Review
Sakshi
Akhanda2 Movie Review
Samayam telugu
Akhanda2 movie Review
123telugu.com