Anaganaga Oka Raju (అనగనగ ఒక రాజు)

Anaganaga Oka Raju (అనగనగ ఒక రాజు)

2026
7.0/10
10 Reviews

ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ "నవీన్ పోలిశెట్టి" హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత పక్కా ఎంటర్టైన్మెంట్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "అనగనగ ఒకరాజు". మారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

Available in:

About This Movie

కథ విషయానికి వస్తే.. గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). అయితే తన తాత చేసిన దుబారా రసిక ఖర్చుల వల్ల జమీందారీ కుటుంబంలో పుట్టినా రాజు బైటికి తెలియని పేదరికంలోనే బతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో కనీసం పెళ్లి చేసుకుని అయినా కోటీశ్వరుడు కావాలని చూస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా రాజుకి చారులత (మీనాక్షి చౌదరి) కనిపిస్తుంది. ఈమె పెద్దిపాలెం భూపతిరాజు (రావు రమేష్) కూతురని, కోట్ల ఆస్తికి వారసురాలి తెలుస్తుంది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటే తన లైఫ్ కూడా సెటిల్ అవుతుందని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం చారులతపై ఆమె తండ్రి పెట్టిన బాధ్యత గురించి రాజుకి అసలు నిజం తెలుస్తోంది. ఆ నిజమేంటి? నిజం తెలిసాక రాజు జీవితం ఎలా మారుతుంది. మధ్యలో ఎర్రబాబు (తారక్ పొన్నప్ప) పాత్ర ఏంటి?, తన సమస్యల నుండి రాజు ఎలా బయట పడ్డాడు ? అసలు ఛారులతని పెళ్ళి చేసుకుని ఏం సాధించాడన్నదే కథ. 

Technical Values :

విభిన్న సినిమాలతో తన ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న "నవీన్ పోలిశెట్టి" మూడేళ్ళ విరామం తర్వాత "అనగనగా ఒకరాజు" అంటూ వచ్చాడు. ఈ సినిమాలో కూడా ఎప్పట్లాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కామెడీ టైమింగ్ తో నవీన్ ఆకట్టుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే సినిమా అంతా నవీన్ వన్ మ్యాన్ షో చేసాడని చెప్పాలి. పాత్రకు తగ్గ వేరియేషన్స్ కూడా బాగా చూపించాడు. ఇటు హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కూడా తన నటనతో మెప్పించింది. అలాగే రావు రమేశ్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక దర్శకుడు మారి మొదటి సినిమా అయినా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. అయితే మిగతా పాత్రలకు మరింత బలంగా రాసుకోవడంలో తడబడ్డారు. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించింది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ పాటలు పర్లేదు గాని, బీజీఎమ్ లో కొత్తదనం లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

Final Review : అనగనగా ఒక రాజు" అంటూ వచ్చిన నవీన్ పోలిశెట్టి సంక్రాంతికి ప్రేక్షకుల్ని నవ్వించడమే టార్గెట్ గా వచ్చేయగా, అందులో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే కొన్ని రెగ్యులర్ సన్నివేశాలని మినహాయిస్తే ఫ్యామిలీతో ఈ సినిమాని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.  

 

Review Statistics

7.0
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
5.9/10

Professional Reviews

What critics and publications are saying about Anaganaga Oka Raju (అనగనగ ఒక రాజు)

Movie Media

Anaganaga Oka Raju Movie Review

Thyview

6.0/10
ఆడియన్స్ ని నవ్వించడమే ప్రధానంగా వచ్చిన అనగనగా ఒకరాజు మూవీ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తాన్ని నవ్వించేంత బలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

Ragadi

6.0/10
పండక్కి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా కావాలి, ఆ సత్తా అనగనగా ఒకరాజు కి కావాల్సినంత ఉంది.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

IMDB

7.0/10
నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒకరాజు సినిమా కథ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించగా, సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

Namaste Telangana

5.5/10
అనగనగా ఒకరాజు సినిమా కథలో కొత్తదనం లేకపోయినా, ఆడియన్స్ ని నవ్వించడంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడంలో రాజు సఫలమయ్యాడు.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

Asianet news telugu

5.5/10
నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమా కథలో కొత్తదనం లేకపోయినా, ఆడియన్స్ ని బాగా నవ్విస్తాడు. ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశం ఉంది.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

NTV Telugu

5.5/10
నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమా కథలో కొత్తదనం లేకపోయినా, అక్కడక్కడా బాగా నవ్విస్తాడు.
Jan 22, 2026

Anaganaga Oka Raju

Filmibeat

5.5/10
నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమా ఫుల్ టైమ్ పాస్ అండ్ పైసా వసూలు మూవీ. కాబట్టి సరదాగా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

GreatAndhra

5.5/10
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒకరాజు సినిమా ఆపరేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పలేం కానీ, ఆపరేషన్ సేఫ్ అన్న భావన కలిగిస్తుంది.
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

Samayam Telugu

6.0/10
కథలో కొత్తదనం కోరుకునే నవీన్.. రొటీన్ సినిమా చేశాడేంటి అని కొంతమంది నిరాశ చెందొచ్చు. కానీ అనగనగా ఒకరాజు సంక్రాంతి పండక్కి ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది
Jan 22, 2026

Anaganaga Oka Raju Movie Review

123telugu.com

6.0/10
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒకరాజు సినిమా సంక్రాంతి పండక్కి ఫ్యామిలీస్ ని మెప్పిస్తుంది.
Jan 22, 2026