Andhra King Taluka
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆంధ్ర కింగ్ తాలూకా" నవంబర్ 27న విడుదలైంది. ఓ సినిమా హీరో సగటు అభిమానిగా రామ్ ఇందులో నటించాడు. అలాగే భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో నటించాడు.
Available in:
About This Movie
ఆంధ్ర కింగ్ తాలూకా కథ 20స్ బ్యాక్ డ్రాప్ లో రాజమండ్రి నేపథ్యంలో సాగుతుంది. అయితే రాజమండ్రిలో ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని)కి తన చిన్నతనం నుంచే "ఆంధ్ర కింగ్" సూర్య (ఉపేంద్ర) అంటే ప్రాణం. కథ కూడా ఆయనకు థియేటర్లో బ్యానర్ కట్టడంతో మొదలవుతుంది. అంతే కాదు సాగర్ రాజమండ్రి సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అవుతాడు. ఈ క్రమంలో సాగర్ మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) తో ప్రేమలో పడతాడు. మహాలక్ష్మి కూడా సాగర్ ని ఇష్టపడుతుంది. అయితే సాగర్ స్థాయిని చూసి సహించలేని మహాలక్ష్మి తండ్రి సాగర్ ని అవమానిస్తాడు. అప్పుడు సాగర్ తనకు ఒప్పొసిట్ గా ఊళ్ళోనే పెద్ద థియేటర్ కట్టి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని సాగర్ ఛాలెంజ్ చేస్తాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం హీరో సూర్యనే సాగర్ ని కలవడానికి వస్తాడు. చివరగా సాగర్ థియేటర్ కట్టాడా? మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది చిత్ర కథ.
Technical Values : సినిమా కథ నేపథ్యం 20స్ బ్యాక్ డ్రాప్ లో సాగడం సినిమాకి మంచి ప్లస్ అని చెప్పొచ్చు. మూవీ మేకర్స్ అమాంతం సినిమాని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అలాగే రామ్ ఎప్పట్లాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, భాగ్యశ్రీ తన గ్లామర్ తో ఆకట్టుకుని నటన పరంగానూ ఓ మెట్టెక్కింది. అలాగే ఉపేంద్ర స్పెషల్ రోల్ లో తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. అయితే డైరెక్టర్ మహేష్ బాబు కథ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథనం పరంగా కాస్త తడబడ్డాడని చెప్పాలి. హీరో తన అభిమానిని కలిసే కారణం ఇంకాస్త బలంగా రాసుకొని ఉండాల్సింది. ఇక సినిమాకి రెండో ప్లస్ పాయింట్ మ్యూజిక్. వివేక్ - మెర్విన్ ఇచ్చిన పాటలు మంచి ప్లస్ అవగా, బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. అక్కడక్కడా కొన్ని సీన్లని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఇక నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమా కోసం బాగానే శ్రమించారు.
Final Review : ఓవరాల్ గా "ఆంధ్రా కింగ్ తాలూకా" అంటూ వచ్చిన ఈ సినిమాలో లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఫ్యాన్స్ ని మెప్పించిందనే చెప్పాలి. అలాగే రామ్ భాగ్య శ్రీ బోర్సే బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా రామ్ పాత్ర తాలూకు సన్నివేశాలు అంటే, సగటు హీరో అభిమాని హీరోపై చూపించే ప్రేమ, అభిమానం, తపన రామ్ బాగా చేసాడు. కాకపోతే స్క్రీన్ ప్లే బోరింగ్ వలన కొందరు ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ ఇస్తుంది.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Andhra King Taluka
Movie Media
Andhra King Taluka movie Review
Ragadi
Andhra King Taluka Movie Review
Thyview
Andhra King Taluka Movie Review
News18Telugu
Andhra king Taluka movie Review
GreatAndhra
Andhra King Taluka Movie Review
IMDB
Andhra King Taluka Movie Review
Samayam telugu
Andhra King Taluka Movie Review
NTVtelugu.com
Andhra king Taluka Movie Review
Asianet news telugu
Andhra king Taluka Movie Review
ABP Telugu
Andhra King Taluka Movie Review
123telugu.com