Dhandoraa

Dhandoraa

2025
7.0/10
10 Reviews

గ్రామీణ నేపథ్యంలో కులాల ఘర్షణ ప్రధానంగా తెరకెక్కిన తాజా చిత్రం "దండోరా". నందు, శివాజీ, రవి కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాని మురళికాంత్ దేవసోత్ దర్శకత్వం వహించాడు.

Available in:

About This Movie

2004 ఆంధ్ర ప్రదేశ్ నేపథ్యంలో దండోరా కథ నడుస్తుంది. ఓ మారుమూల గ్రామంలో రైతు అయిన శివాజీ (శివాజీ) అలాగే తన కొడుకు విష్ణు (నందు) అలాగే సుజాత (మాణిక) తో జీవనం సాగిస్తారు. అయితే ఆ ఊళ్ళో తక్కువ కులానికి చెందిన రవి (రవి) తనకంటే ఎక్కువ కులానికి చెందిన అమ్మాయి అయిన సుజాతని ప్రేమించడంతో ఈ ఊళ్ళో సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో తమకంటే తక్కువ కులపు అబ్బాయి, శివాజీ కూతుర్ని ప్రేమించడంతో, శివాజీ తన స్నేహితులతో కలిసి ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడు, దాని వల్ల ఊళ్ళో జరిగిన పెనుమార్పులేంటి? శివాజీ జీవితాన్ని మార్చిన తన కొడుకు కూతురు, అలాగే ఊరి ప్రెసిడెంట్ సాబ్ (నవదీప్), వేశ్య శ్రీలత (బిందు మాధవి) ఊళ్ళో ఎలాంటి మార్పు తీసుకొచ్చారనేదే ఈ "దండోరా". 

Technical values : కులాల ఘర్షణ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉన్నా, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి అంచనాలు ఉంటాయి. అలాగే దండోరా కూడా కథ పరంగా మొదటి నుండి ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే స్లో గా ఉన్నా, పల్లెటూరి నేపథ్యం ప్రేక్షకులకి బోర్ అనిపించదు. ఇక సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా శివాజీ నటన అని చెప్పొచ్చు. అలాగే కీలక పాత్రల్లో నటించిన బిందు మాధవి, నందు, రవి కృష్ణ, నవదీప్ లు కూడా ఆకట్టుకున్నారు. దర్శకుడు మురళీ కాంత్ తొలి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచాడు. అయితే మార్క్ కె రాబిన్ బీజీఎమ్ బాగున్నా, పాటలు అంతగా ప్రభావం చూపలేదు. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకోగా, వెంకట్ శకమూరి కెమెరా వర్క్ మెప్పించింది.

 

Review Statistics

7.0
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
5.8/10

Professional Reviews

What critics and publications are saying about Dhandoraa

Movie Media

Dhandoraa Movie Review

Times Now Telugu

6.0/10
కుల వివక్షపై చేసిన ఓ మంచి విలేజ్ ఎమోషనల్ డ్రామా దండోరా. వాస్తవాన్ని చూపించేందుకు చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
Jan 17, 2026

Dhandoraa Movie Review

TV9 Telugu

6.0/10
ప్రేమ కుల ఘర్షణ ల నేపథ్యంలో తెరకెక్కిన దండోరా సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ ఆకట్టుకుంటుంది.
Jan 17, 2026

Dhandoraa Movie Review

News18 Telugu

6.0/10
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా చిత్రం కుల వివక్ష, పరువు హత్య కాన్సెప్ట్‌తో తెరకెక్కగా మురళీ కాంత్ దర్శకత్వం వహించాడు.
Jan 17, 2026

Dhandoraa Movie Review

Filmibeat

6.0/10
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకుంటుంది.
Jan 17, 2026

Dhandoraa Movie Review

Asianetnews Telugu

6.0/10
కుల వివక్ష, సామాజిక రుగ్మతలను చర్చిస్తూనే అన్ని భావోద్వేగాల మేళవింపుతో నడిపించిన మంచి కమర్షియల్‌ మూవీ 'దండోరా'.
Jan 17, 2026

Dhandoraa Movie Review

Chitrajyothy

5.0/10
చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద, ఎలా బతికినా అది గొప్పగా ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే దండోరా.
Jan 17, 2026

Dhandoraa Movie Review

ABPTelugu

6.0/10
'కోర్ట్' తర్వాత శివాజీ నటించిన సినిమా 'దండోరా'. కుల వివక్ష, అంతిమ సంస్కారాల నేపథ్యంలో బతుకు గురించి చెప్పే చిత్రమిది.
Jan 17, 2026

Dhandoraa Movie Review

NTVtelugu.com

6.0/10
గ్రామీణ కులఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన దండోరా మూవీ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
Jan 17, 2026

Dhandoraa Movie Review

Telugu Samayam

5.0/10
గ్రామీణ కులఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన దండోరా మూవీ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
Jan 17, 2026

Dhandora Movie Review

123telugu.com

6.0/10
శివాజీ, నవదీప్, బిందుమాధవి, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన దండోరా చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 17, 2026