Jatadhara (జటాధర)
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జటాధర". వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక హర్రర్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, సోనాక్షి సిన్హా ప్రతినాయకి పాత్రలో నటించింది.
Available in:
About This Movie
శివ (Sudheer Babu) ఒక కార్పోరేట్ జాబర్, అలాగే ఒక ఘోస్ట్ హంటర్. దయ్యాలు లేవని నమ్మే శివ ఖాళీ సమయంలో తన ఫ్రెండ్స్ తో కలిసి దయ్యాల వేట కూడా చేస్తూ ఉంటాడు. కానీ తన తల్లి కోసం పూజలు చేస్తూ, తాయత్తులు కూడా కట్టుకుంటాడు. ఇదిలా ఉండగా శివ కలలోకి రోజూ ఒక పీడకల చేత వేదించబడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల వల్ల తన సొంత ఊరు రుద్రారం కి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ తన మేనమామ ఇంట్లో ఉన్న ధన పిశాచి (Sonakshi Sinha) గురించి తెలుస్తుంది. ఇంతకీ ఆ ఇంట్లో భూమిలోపల దాగి ఉన్న అపారమైన నిధికి ధనపిశాచి కి ఉన్న సంబంధమేంటి? ఆ పిశాచి శివ బలిని ఎందుకు కోరుతుంది. చివరికి శివ కథ ఏమైంది అనేది కథ.
Plus & Minus Points : టాలీవుడ్ లో టాలెంట్ ఉండి సక్సెస్ కోసం చాలా ఎదురుచూస్తున్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ప్రతి సినిమాకి మంచి కథా బలంతో వచ్చే సుధీర్ బాబు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఇక ఈసారి ఓ హర్రర్ డివోషనల్ థ్రిల్లర్ తో వచ్చాడు. జటాధరలో కూడా తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. అలాగే ఇక బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాకి మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ధన పిశాచిగా సోనాక్షి అద్భుతంగా నటించింది. మిగతా కీలక నటులు వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక కథ పరంగా ఇంతకు ముందు థ్రిల్లర్ మూవీస్ తో పోలిస్తే జటాధర డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిందని చెప్పాలి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం మెప్పించలేకపోయిందని చెప్పాలి. అలాగే ఇందులో కొన్ని సాంగ్స్ ఇరికించినట్టు ఉంటాయి. అలాగే కొన్ని సీన్లు ఒకదానితో మరొకటి సంబంధం లేనట్టు ఉండడంతో స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా అనిపించదు.
Technical values : జటాధర సినిమాలో నిర్మాణ విలువలు అంత బాగా లేవని చెప్పాలి. సెట్స్ పరంగా కొన్నిటికి బాగానే ఖర్చు పెట్టినా, VFX ఎఫెక్ట్స్ మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే మ్యూజిక్ పరంగా చాలా డిస్సపాయింట్ చేసారు మేకర్స్. డైరెక్టర్లు ఇద్దరూ వెంకట్ కళ్యాణ్ అలాగే అభిషేక్ జైస్వాల్ ఉండి కూడా సరైన ప్రతిభ చూపించలేదు. అలాగే జటాధర మూవీలో 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఎడిట్ చేయాల్సింది.
Final Review : ఓవరాల్ గా "జటాధర" కథ పరంగా ఆకట్టుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోలేదు. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఓ మోస్తరు నచ్చుతుందేమో గాని, కామన్ ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేస్తారు.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Jatadhara (జటాధర)
Movie Media
Jatadhara Movie Review
Cinema Picha
Jatadhara Movie Review
Thyview
Jatadhara Movie Review
IMDB
Jatadhara Movie Review
Namaste Telangana
Jatadhara Movie Review
One india
Jatadhara Movie Review
News18Telugu
Jatadhara Movie Review
Filmibeat
Jatadhara Movie Review
NTVtelugu.com
Jatadhara Movie Review
ABP Telugu
Jatadhara Movie Review
123telugu.com