Mark
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “మార్క్” (Mark). మాక్స్ దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.
Available in:
About This Movie
సస్పెండెడ్ సూపరిండెంట్ పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండేయ అలియాస్ "మార్క్" ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అయితే బీహార్ కి చెందిన ఓ పాపులర్ క్రిమినల్ భద్ర (నవీన్ చంద్ర) కి మార్క్ కి మధ్యే ఈ వార్ అంతా సాగుతుంది. సినిమా కథ అంతా వీళ్ళ మధ్యే. అయితే భద్ర తమ్ముడు రుద్ర (విక్రాంత్ సంతోష్) తాను ఫిక్స్ చేసిన పెళ్లి కాదని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు మార్క్ ఉన్న పోలీస్ స్టేషన్ కి భారీగా డ్రగ్స్ తో ఒక మాఫియా దొరుకుతుంది. అయితే సరిగ్గా ఇదే టైం లో సీఎం కాబోయే ఆది కేశవ (షైన్ టామ్ చాకో) అలాగే మరో 18 మంది పిల్లలు ఆ ప్రాంతంలో కిడ్నాప్ అవుతారు. అయితే వీళ్ళని కాపాడడానికి అలాగే డ్రగ్స్ కేసు పరిష్కరించడానికి కూడా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో మార్క్ ఏం చేసాడు. సస్పెన్సన్ లో మార్క్ అలాగే తన గ్యాంగ్ ఆ 18 మంది పిల్లల్ని ఎలా కాపాడారు? భద్ర కి, ఆది కేశవకి ఇంకా ఆ డ్రగ్ మాఫియా కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా కథ.
Technical values : మ్యాక్స్ కాంబినేషన్ లో సీక్వెల్ గా వచ్చిన "మార్క్" కి కథనం ప్లస్ అవ్వాలి గాని, అదే మైనస్ అయింది. సినిమా చూసినంత సేపు మ్యాక్స్ సినిమా గుర్తొస్తుంది గాని, ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు. సినిమా మొత్తం సుదీప్ మాత్రమే నడిపిస్తాడు. మిగతా పాత్రల్ని డైరెక్టర్ విజయ్ కార్తికేయ పవర్ ఫుల్ గా రాసుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాక్స్ తో హిట్ ఇచ్చిన విజయ్ దీంతో డిస్సపాయింట్ చేసాడు. కథ రొటీన్ గా ఉండగా, కథనం కూడా స్లో గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా, సుదీప్ ని స్టైలిష్ గా చూపించడంలో విఫలమయ్యాడు. అలాగే బీజీఎమ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Mark
Movie Media
Mark movie Review
Live Mint
Mark movie Review
The Indian Express
Mark movie Review
One india
Mark movie Review
Baap of Movies.com
Mark movie Review
Times of India
Mark movie Review
Timesnow
Mark movie Review
Filmibeat
Mark movie Review
IMDB
Mark movie Review
HMTV
Mark Movie Review
123telugu.com