Nari Nari Naduma Murari (నారి నారి నడుమ మురారి)
టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన సినిమా "నారి నారి నడుమ మురారి". సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.
Available in:
About This Movie
ఇంజనీరింగ్ చదివి ఓ కంపెనీలో ఆర్కిటెక్ గా వర్క్ చేస్తున్న గౌతమ్ (శర్వానంద్) తన కంపెనీలోని వర్క్ చేస్తున్న నిత్య (సాక్షి వైద్య) ని చూసి ప్రేమలో పడతాడు. నిత్య కూడా గౌతమ్ ని ఇష్టపడి ఇద్దరూ పెళ్లిచేసుకుందాం అనుకుంటారు. అయితే నిత్య తండ్రి ప్రముఖ లాయర్ అయిన రామ లింగయ్య గౌతమ్ - నిత్య ల పెళ్ళికి ఒప్పుకున్నా, పెళ్లి మాత్రం హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త) మళ్ళీ గౌతమ్ - నిత్య మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. అందువల్ల గౌతమ్ రిజిస్టర్ పెళ్లికి తను రెడి కాలేకపోతాడు. ఈ క్రమంలో గౌతమ్ నిత్యాని పెళ్లి చేసుకున్నాడా లేదా దియాని పెళ్లి చేసుకున్నాడా? చివరికి ఏమైంది అనేదే కథ.
Technical values : కథ విషయానికి వస్తే.. చాలా సినిమాల్లో చుసిన కథే.. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో.. వీళ్ళ మధ్య ఫ్రస్టేషన్ తో కూడిన ఫన్. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్స్ సంయుక్త, సాక్షి కూడా వాళ్ళ పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసారు. వీళ్ళ మధ్య జెనరేట్ అయ్యే ఫన్ ఆ కన్ఫ్యూజన్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. అలాగే నటుడు నరేష్, సుదర్శన్, సంపత్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు వారి పరిధి మేరకు బాగా మెప్పించారు. శ్రీవిష్ణు కామియో రోల్ సినిమాకి ప్లస్ అయింది.
అయితే దర్శకుడు కథ పరంగా మెప్పించలేకపోయినా, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కానీ ఫ్రెష్ కామెడీ మాత్రం మిస్ అయింది. తక్కువ అంచనాలతో చూస్తే సినిమా మెప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. కథనం మొత్తం ఊహాజనితంగా సాగుతుంది కాబట్టి, పెద్దగా ఎగ్జైటింగ్ గా అనిపించదు. కానీ నిర్మాణ విలువలు బాగున్నాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వర్క్ అంతగా మెప్పించలేదు. ఎడిటర్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. దర్శకుడు రామ్ అబ్బరాజు పై ఈసారి స్క్రీన్ ప్లే పరంగా కొంతవరకు దెబ్బేసాడని చెప్పాలి.
Final Review : ఓవరాల్ గా "నారీ నారీ నడుమ మురారి" మంచి కామెడీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇటు శర్వానంద్ కి కూడా మంచి సక్సెస్ తీసుకొచ్చింది.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Nari Nari Naduma Murari (నారి నారి నడుమ మురారి)
Movie Media
Nari Nari Naduma Murari Movie Review
Ragadi
Nari Nari Naduma Murari Movie Review
Mahidhar Vibes
Nari Nari Naduma Murari Movie Review
Thyview
Nari Nari Naduma Murari Movie Review
Filmibeat
Nari Nari Naduma Murari Movie Review
News18Telugu
Nari Nari Naduma Murari Movie Review
Tupaki
Nari Nari Naduma Murari Movie Review
Samayam telugu
Nari Nari Naduma Murari Movie Review
Asianet news telugu
Nari Nari Naduma Murari
NTV Telugu
Nari Nari Naduma Murari Movie Review
123telugu.com