OG (ఓజి)

OG (ఓజి)

2025
7.0/10
10 Reviews

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన సినిమాల్లో భారీ అంచనాలతో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ డ్రామా "ఓజి". మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని సాహో ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేసాడు.

Available in:

About This Movie

Detailed Description : 1993 అప్పటి బాంబే బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుంది. ఆ సమయంలో బాంబే పోర్ట్ కి దాదా అయిన "సత్య దాదా" (ప్రకాష్ రాజ్).ఈ సత్య దాదాకి అండగా వెన్నంటే ఉంటాడు "ఓజస్ గంభీర" (Gambheera). అయితే ఓ అనుకోని కారణం వల్ల గంభీర సత్య దాదాకి దూరంగా వెళ్ళిపోతాడు. బాంబే కి దూరంగా వెళ్ళిపోయి కన్మణి ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. ఈ క్రమంలో సత్య దాదా ఫ్యామిలీ ని అంతం చేసి పోర్ట్ ని సొంతం చేసుకోవాలని వేరే మాఫియా ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో సత్యదాదా ని కాపాడడానికి ఓజి వస్తాడా? ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ కి (ఇమ్రాన్ హష్మీ) చెందిన RDX కంటైనర్లు సత్య దాదా పోర్ట్ కి వచ్చాక ఏమయ్యాయి. వాటిని దక్కించుకోవడానికి ఓమి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. మధ్యలో గంభీరా ని చంపాలని అర్జున్ (అర్జున్ దాస్) ఎందుకు అనుకుంటాడు. ఈ ఘర్షణలో ఓజి ఏం కోల్పోయాడు. అసలు ఈ గంభీర ఎవరు అనేది తెలియాలంటే ఓజి సినిమా చూడాలి. 

 

Technical Values : ఓజి సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేసారంటే, మధ్యలో వచ్చిన హరిహరవీరమల్లు, బ్రో వంటి సినిమాలని కావాలనే ఈ సినిమా కోసం పట్టించుకోలేదు. అత్తారింటికి దారేది తర్వాత సరైన స్ట్రెయిట్ సినిమా లేని పవన్ కళ్యాణ్ కి ఓజి పర్ఫెక్ట్ మాస్ ఫిల్మ్ దక్కిందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మేకర్స్ బిర్యానీ వడ్డించారని చెప్పొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎంతటి నైపుణ్యం కలవాడో ఓజి తో మరోసారి చూడోచ్చు. ప్రతి ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్స్ ఫ్యాన్స్ కి విజిల్స్ వేయిస్తాయి. అలాగే కీలకపాత్రల్లో నటించిన ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, వెంకట్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అలాగే విలన్ గా ఇమ్రాన్ హష్మీ అదరగొట్టేసాడు. ఓజి కి ధీటుగా ఒమీ పాత్ర బలంగా నిలుస్తుంది.

ఇక డైరెక్టర్ గా సుజీత్ ఓజితో మరో మెట్టు ఎక్కేసాడని చెప్పాలి. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సుజీత్ తన ఫెవరేట్ హీరోని తనకంటే బాగా ఎవ్వరూ చూపలేరని చూపించాడు. మేకింగ్ పరంగా సుజీత్ బాగా కష్టపడ్డాడు. అలాగే కథ నేపథ్యం చిన్నదే తీసుకున్నా, స్క్రీన్ ప్లే విషయంలో మెస్మరైజ్ చేసాడు. సుజీత్ తర్వాత ఆ రేంజ్ లో మెప్పించింది థమన్ ఎస్. మ్యూజిక్ పరంగా థమన్ ప్రతి పాటకు ప్రాణం పెట్టేసాడు. పర్ఫెక్ట్ స్టైలిష్ మాస్ యాక్షన్ సినిమాకు అంతే స్థాయిలో బీజీఎమ్ ఇచ్చాడు. అలాగే నిర్మాత డివివి దానయ్య ఖర్చుకు వెనకాడకుండా ఓజి కి పెట్టిన ప్రతి పైసా ఫ్రేమ్ లో కనిపిస్తుంది. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ పీక్స్ లో ఉంది. 

Final Review : ఇక ఓవరాల్ "ఓజి" సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందని చెప్పాలి. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ని "ఓజి" గా ప్రెజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ ని బాగా మెప్పించగా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెప్పించాడు. అన్నిటికి మించి ఓజి పార్ట్ 2 అనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ కి కిక్కెకించిందని చెప్పాలి. ఓవరాల్ గా చాలా కలం తర్వాత టాలీవుడ్ లో ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీగా ఓజి ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. 

 

Review Statistics

7.0
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
6.2/10

Professional Reviews

What critics and publications are saying about OG (ఓజి)

Movie Media

OG movie review

Ragadi

6.5/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజి" సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 25న రిలీజ్ కాగా, చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కాలరెగరేసుకునేలా ఓజి చేసిందని చెప్పాలి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించిన ప్రతి ఫ్రేమ్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది.
Jan 21, 2026

OG movie review

Thyview

7.0/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో నటించిన సినిమా "ఓజి". దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులకోసమే తీసినట్టు ఉంటుంది. పీకే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులని కూడా మెప్పిస్తుంది.
Jan 21, 2026

OG movie review

Filmibeat

6.0/10
పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సరిగ్గా అలాంటి మాస్ సినిమా అందించాడు సుజీత్. కథ పరంగా అంతగా లేకపోయినా స్క్రీన్ ప్లే పరంగా మెప్పించి ఫ్యాన్స్ కి పవన్ ఫ్యాన్స్ కి పండగ సినిమా అందించాడు.
Jan 21, 2026

OG movie review

TV9Telugu

6.0/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ OG . ఆకాశమంత అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ కి పండగ కిక్కిచ్చింది.
Jan 21, 2026

OG movie Review

NTV Telugu

6.0/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, కలెక్షన్ల పరంగా ఇతర భాషల్లో మాత్రం అంతగా రాణించలేదు. అయితే పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఓజి ఫుల్ మీల్స్ అని చెప్పాలి.
Jan 21, 2026

OG movie Review

Great Andhra

5.5/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా ఫైనల్ గా థియేటర్లో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాకపోయినా ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్కిచ్చిందని చెప్పాలి.
Jan 21, 2026

OG movie review

ABP Telugu

6.0/10
ఓజి అంటూ పవర్ ఫుల్ ముంబై గ్యాంగ్ స్టర్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే డైరెక్టర్ సుజీత్ కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు
Jan 21, 2026

OG movie Review

IMDB

6.0/10
ఓజి అంటూ పవర్ ఫుల్ ముంబై గ్యాంగ్ స్టర్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే డైరెక్టర్ సుజీత్ కూడా మేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.
Jan 21, 2026

OG movie Review

Samayam Telugu

6.0/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "ఓజి" సినిమా బాంబే మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కగా ఫ్యాన్స్ ని బాగా మెప్పించింది.
Jan 21, 2026

OG movie Review

123telugu.com

6.5/10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "ఓజి" సినిమా ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చిందని చెప్పాలి.
Jan 21, 2026