Premante Movie Review (ప్రేమంటే మూవీ రివ్యూ)
టాలెంటెడ్ హీరో కం కమెడియన్ ప్రియదర్శి హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రోమ్ కామ్ లవ్ డ్రామా "ప్రేమంటే". నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో విడుదలయింది.
Available in:
About This Movie
హైదరాబాద్ లో ఉండే మధుసూదనరావు (ప్రియదర్శి) అలాగే రమ్య (ఆనంది) పెళ్ళిచూపుల్లో ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన మూడు నెలల వరకు ఇద్దరి జీవితం చాలా చక్కగా సాగుతుంది. కానీ మధు గురించి రమ్యకి ఒక షాకింగ్ నిజం తెలియడంతో ఆమె వదిలేయాలని చూస్తుంది. కానీ విషయం తెలుసుకున్న మధు రమ్యని చివరి సారిగా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటాడు. సరే నన్న రమ్య తనతో ఉన్నా, మధు చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇంతకీ మధు చేసే పనులేంటి? రమ్య తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ ఇద్దరి మధ్యలో హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ) ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని విడదీయాలని చూస్తుంది. చివరికి మధు - రమ్య కలుస్తారా? ఆశా మేరీ పరిస్థితేంటి? అనేది సినిమా కథ.
హీరో ప్రియదర్శి విషయానికి వస్తే... కొన్ని డిజాస్టర్ సినిమాల తర్వాత ఇది తనకు బెటర్ సినిమా అని చెప్పాలి. సినిమాలో తన పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ చూపించాడు. అలాగే ఆనంది కూడా చక్కని నటన కనబరిచింది. సినిమా మొత్తం డీసెంట్ కామెడీ సీన్స్ తో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో అలరిస్తుంది. డైరెక్టర్ కథలో పస లేకున్నా, కథనం కొంతవరకు ఆకట్టుకుంటుంది. అలాగే ప్రియదర్శి - ఆనంది కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక యాంకర్ సుమ కూడా సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది. తన కామెడీ టైమింగ్ తో బాగానే ఆకట్టుకుంది. మిగిలిన నటులు పరిధి మీకు ఆకట్టుకున్నారు.
Technical values :
అయితే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే స్లో అయ్యే సరికి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ నవనీత్ డల్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఆడియన్స్ కి చికాకు తెప్పించొచ్చు. అలాగే వెన్నెల కిషోర్, హైపర్ ఆది, లాంటి టాప్ కమెడియన్స్ ఉన్నా, వాళ్ళని వాడుకోలేదు. ఇక సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. విశ్వంత్ రెడ్డి కెమెరా వర్క్, లియోన్ జేమ్స్ మ్యూజిక్ బాగున్నా, కొత్తగా ఏం అనిపించదు.
Final Review : ఓవరాల్ గా ప్రేమంటే సినిమాతో ప్రియదర్శి, ఆనంది లు తమ నటనతో మెప్పించినా, మంచి కామెడీ సీన్స్ తో అక్కడక్కడా ఆకట్టుకున్నా, బోరింగ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. కొత్తదనం ఆశించకుండా, నవ్వుకోవడానికి మాత్రమే ప్రేమంటే మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Premante Movie Review (ప్రేమంటే మూవీ రివ్యూ)
Movie Media
Premante Movie Review
Movie Matters
Premante Movie Review
Ragadi
Premante Movie Review
Filmibeat
Premante Movie Review
Asianet news telugu
Premante Movie Review
TV9Telugu
Premante Movie Review
ABP Telugu
Premante Movie Review
Tupaki
Premante Movie Review
Sakshi
Premante Movie Review
NTV Telugu
Premante Movie Review
123telugu.com