Raju Weds Rambai(రాజు వెడ్స్ రాంబాయి)
అఖిల్ రాజ్ - తేజస్వి రావు జంటగా నటించిన లవ్ "స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి". నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా, సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
Available in:
About This Movie
ప్రేమ - కుటుంబం పరువు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కథా నేపథ్యం ఓ పదిహేనేళ్ల కింద, అనగా 2010 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఓ మారుమూల పల్లెటూరులో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు (Akhil Raj), అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయిని (Tejaswi Rao) ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. రాంబాయి కూడా రాజుని ప్రేమిస్తుంది. కానీ రాజు తండ్రి రమేష్ (శివాజీ రాజా) మాత్రం తన కొడుకును హైదరాబాద్ పంపి, వేరే ఉద్యోగం ఏదో చేసుకోవాలని ఆశపడతారు. అలాగే మరోవైపు రాంబాయి తండ్రి వెంకన్న (Chaitu Jonnalagadda) తన కూతురికి కేవలం గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో వారి పెళ్లిని ఒప్పుకొని పెద్దల నడుమ రాజు - రాంబాయి ప్రేమ కథ ఎలా సాగింది? పెద్దలను ఎదిరించి రాజు - రాంబాయి పెళ్లి చేసుకున్నారా? రాంబాయి తండ్రి వెంకన్న వాళ్ళని ఏం చేసాడు అనేది చిత్ర కథ.
Plus & Minus Points : రాజు వెడ్స్ రాంబాయి కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు కాబట్టి, ఆడియన్స్ ని ఖచ్చితంగా కదిలిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి కథే హీరో. సినిమాలోని లవ్ ట్రాక్ మరియు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. అఖిల్ రాజ్, తేజస్విలు తమ నటనతో మెప్పించారు. సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే పలు విలేజ్ కామెడి సీన్స్ న్యాచురల్ గా ఉండి నవ్విస్తాయి. ఇక చైతు జొన్నలగడ్డ నెగిటివ్ రోల్ లో భయపెట్టాడనే చెప్పాలి. అలాగే సినిమా క్లైమాక్స్ కూడా అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. సినిమాలో మైనస్ ఏమైనా ఉందంటే అది స్లో నేరేషన్ అనే చెప్పాలి. సినిమాని ఇంకాస్త ఎడిట్ చేసి స్టోరీని వేగవంతం చేయాల్సింది. అలాగే ఇతర ప్రధాన పాత్రల్ని ఇంట్రెస్టింగ్ గా రాయాల్సింది, ముఖ్యంగా శివాజీరాజా పాత్రకి ఇంకా స్కోప్ ఉంది.
Technical values : సాంకేతికత చూసుకుంటే చిన్న సినిమాగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి పై నిర్మాతలు సరిగ్గా ఖర్చు పెట్టారని చెప్పొచ్చు. సెట్స్ కూడా రియలిస్టిక్ గా ఉండి ఆకట్టుకోగా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మంచి ప్లస్ అయింది. వాజిద్ బైగ్ కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక డైరెక్టర్ సాయిలు కాంపాటి ఎంచుకున్న కథ బాగున్నా, దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కాస్త తడబడ్డాడు. రాంబాయి పాట సినిమా జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడింది.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Raju Weds Rambai(రాజు వెడ్స్ రాంబాయి)
Movie Media
Raju Weds Rambai Movie Review
Telugu360.com
Raju Weds Rambai Movie Review
10tv Telugu News
Raju Weds Rambai Movie Review
Chitrajyothy
Raju Weds Rambai Movie Review
IMDB
Raju Weds Rambai Movie Review
Asianetnews Telugu
Raju Weds Rambai Movie Review
Filmibeat
Raju Weds Rambai Movie Review
Sakshi
Raju Weds Rambai Movie Review
ABP Telugu
Raju Weds Rambai Movie Review
NTVtelugu.com
Raju Weds Rambai movie Review
123telugu.com