Revolver Rita (రివాల్వర్ రీటా)
కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన మూవీ "రివాల్వర్ రీటా". తమిళ దర్శకుడు జే.కే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
Available in:
About This Movie
కథ విషయానికి వస్తే.. చాలా సింపుల్ గా ఒక ఫ్లో లో వెళ్తుంది. తమిళనాడులోని పాండిచ్చేరిలో డ్రాక్యులా పాండియన్ (సూపర్ సుబ్బరాయన్) పెద్ద డాన్. అతడ్ని మించిన క్రూరమైన డాన్ డ్రాక్యులా బాబీ (సునీల్). అయితే పాండియన్ ని చంపడానికి ఒక ముఠా బయలుదేరుతుంది. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పాండియన్ అనుకోకుండా రీటా (కీర్తి సురేష్) ఇంట్లోకి చొరబడతాడు. కొంత సేపు రీటా ఫ్యామిలీతో ఘర్షణ తర్వాత, ప్రమాదవశాత్తూ పాండియన్ రీటా ఇంట్లో చనిపోతాడు. అప్పుడే రీటా ఫ్యామిలీకి పాండియన్ పెద్ద డాన్ అని తెలుస్తోంది. దాంతో ఎవ్వరికి తెలియకుండా ఎలాగైనా అతని మృతదేహాన్ని వదిలించుకోవాలని, ట్రై చేస్తారు. ఈ క్రమంలో పాండియన్ ని చంపాలని చూసిన ముఠా ఒకవైపు, మరో వైపు 'పాండియన్' కుమారుడు డ్రాక్యులా బాబీ తన తండ్రిని వెతుకుతారు. మరి ఇంత మంది మధ్యన పాండియన్ బాడీని రివాల్వర్ రీటా ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది. చివరికి పాండియన్ బాడీని ఏం చేసారనేది కథ.
Technical values : సినిమా కథ పరంగా చాలా సింపుల్ వే లో ఒక రాత్రిలో స్టోరీ మొత్తం నడిపిస్తారు మేకర్స్. రీటా గా కీర్తి సురేష్ బాగా నటించింది. అలాగే నటి రాధికా, సునీల్ మెప్పిస్తారు. అక్కడక్కడా ఇతర పాత్రధారులు మంచి ఫన్ జెనరేట్ చేసారు. అయితే డైరెక్టర్ చంద్రు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా ఉండగా, కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి ఉండాల్సింది. ఇక బీజీఎమ్ కూడా పూర్ గా ఉంటుంది.
నిజానికి సస్పెన్స్ క్రైమ్, థ్రిల్లర్ కథే అయినా, ఎక్కడా సన్నివేశాలు థ్రిల్ ఫీల్ ఇవ్వవు, కొత్తదనం ఆశించే ఆడియన్స్ కి నిరాశ తప్పదు. విలన్ గా సునీల్ పాత్రకు దర్శకుడు న్యాయం చేయలేదు. టెక్నికల్ పరంగా దర్శకత్వం, మ్యూజిక్ మైనస్ కాగా, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి. ఓటిటి లో ఒకసారి సినిమాని టైంపాస్ కి చూడొచ్చు.
Final Review : ఓవరాల్ గా రివాల్వర్ రీటా అంటూ వచ్చిన ఈ డబ్బింగ్ ఈ క్రైమ్ కామెడీ డ్రామా, ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది. ఇంట్రెస్టింగ్ గా లేని స్క్రీన్ ప్లే, బోర్ కొట్టే సన్నివేశాలతో ఆడియన్స్ కి విసుగు తెప్పించారు మేకర్స్. మొత్తమ్మీద ఆడియన్స్ ఒకసారి చూడడం కూడా ఎక్కువ అన్నట్టుంది.
Review Statistics
By Provider Type
Professional Reviews
What critics and publications are saying about Revolver Rita (రివాల్వర్ రీటా)
Movie Media
Revolver Rita Movie Review
Movies4U
Revolver Rita Movie Review
Movie Matters
Revolver Rita Movie Review
10tv Telugu News
Revolver Rita Movie Review
PinkVilla
Revolver Rita Movie Review
Times of India
Revolver Rita Movie Review
ABP Telugu
Revolver Rita Movie Review
Sakshi
Revolver Rita Movie Review
NTV Telugu
Revolver Rita Movie Review
IMDB
Revolver Rita Movie Review
123telugu.com