The Great Pre Wedding Show (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)

The Great Pre Wedding Show (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)

2025
6.5/10
10 Reviews

టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో". రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

Available in:

About This Movie

శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో ఈ కథ నడుస్తుంది. రమేష్ (Thiruveer) ఒక ఫోటో స్టూడియోను నడుపుతూ ఊళ్ళో పెళ్లి, మరియు ఇతర కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు తీస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. అలాగే ఆ ఊళ్ళో పంచాయితీ కార్యాలయంలో పనిచేసే సెక్రెటరీ హేమ (Teena Shravya)తో ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన ఆనంద్ (Narendra Ravi)కి సౌందర్య (Yamini)కి పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో రమేష్ తో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ డీల్ కుదుర్చుకొంటాడు. ఇక రమేష్ కూడా తన టాలెంట్ అంతా వాడి ఆనంద్ - సౌందర్య ప్రీ వెడ్డింగ్ షూట్ ని కెమెరాలో బాగా తీస్తాడు. కానీ ఆ ఫుటేజ్ మెమొరీ చిప్ ని రమేష్ అసిస్టెంట్ ఎక్కడో అనుకోకుండా పారేస్తాడు. ఫలితంగా ఆనంద్ - సౌందర్య పెళ్లి ఆగిపోతుంది. మరి ఆ చిప్ ని రమేష్ వెతికాడా? ఆనంద్ - సౌందర్య పెళ్లి జరిగిందా లేదా? మధ్యలో రమేష్ - హేమ లవ్ ట్రాక్ ఏంటి? అనేది సినిమా కథ. 

Plus & Minus Points : చిన్న సినిమాగా తెరకెక్కిన "ది గ్రేట్  ప్రీ వెడ్డింగ్ షో" కి కథే పెద్ద హీరో. చిన్న కథే అయినా దాన్ని డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో నడిపించిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. హీరో తిరువీర్ ఎప్పట్లానే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ఎవరి పాత్రల్లో వారు అదరగొట్టారు. సినిమా మొత్తం పక్కా విలేజ్ స్టయిల్ లో న్యాచురల్ గా సాగుతుంది. అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 

ఇక మైనస్ పాయింట్స్ పరంగా మరీ ఎక్కువ ఏం లేవు. లెంగ్త్ పరంగా కూడా చిన్నగా ఉండగా, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయాల్సింది. క్లైమాక్స్ కూడా ఇంకాస్త బలంగా ఉండాల్సింది.

Technical values : యూట్యూబ్ వీడియోస్ తో ఫేమస్ అయిన దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ తనకు ఫస్ట్ సినిమా అయినా కూడా తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ని అందించాడు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగే సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా బాగుంది. చిన్న సినిమా అయినా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 

Review Statistics

6.5
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
6.2/10

Professional Reviews

What critics and publications are saying about The Great Pre Wedding Show (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)

Movie Media

The Great Pre Wedding Show Movie Telugu

Thyview

6.0/10
యువహీరో తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కగా, ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

Zee News

6.0/10
తిరువీర్ నుంచి జనాలు ఆశించే క్లీన్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందిస్తుంది. సహజమైన కామెడీతో ఫ్యామిలీ ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంటుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

Times Now Telugu

6.0/10
తిరువీర్ నుంచి జనాలు ఆశించే క్లీన్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందిస్తుంది... హాయిగా సింపుల్ విలేజ్ డ్రామాని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

TV9Telugu

6.0/10
తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సహజంగా ఉంటుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

GreatAndhra

6.0/10
చిన్న సినిమాగా తెరకెక్కిన "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో" ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

Filmibeat

6.5/10
తిరువీర్ నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కగా, ఎలాంటి హంగులు, ఆర్బాటాలు కనిపించని స్వచ్ఛమైన హాస్య చిత్రం.
Jan 21, 2026

The Great Pre Wedding Show movie Review

NTV Telugu

6.0/10
చిన్న సినిమాగా తెరకెక్కిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విలేజ్ కామెడీ డ్రామాగా, న్యాచురల్ కామెడీతో క్రిటిక్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

IMDB

7.7/10
తిరువీర్ హీరోగా నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

ABPTelugu

6.0/10
తిరువీర్ హీరోగా నటించిన ఆర్గానిక్ కామెడీ సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు.
Jan 21, 2026

The Great Pre Wedding Show Movie Review

123telugu.com

6.0/10
యువ హీరో తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. థియేటర్లతో పాటు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Jan 21, 2026