The RajaSaab (ది రాజా సాబ్)

The RajaSaab (ది రాజా సాబ్)

2026
5.5/10
10 Reviews

రెబల్ స్టార్ ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్ లో నటించిన భారీ విజువల్ వండర్ "ది రాజా సాబ్". ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్ర్ర్ అండ్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 09న నేడు థియేటర్లలో విడుదలైంది. మరి రాజాసాబ్ ప్రేక్షకులని ఏ లెవెల్లో మెప్పించాడో తెలుసుకుందాం.

Available in:

About This Movie

కథ విషయానికి వస్తే... రాజాసాబ్ అలియాస్ రాజు (Prabhas) తన నానమ్మ గంగా దేవి (Zareena Wahab)  తో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. నానమ్మకు మతిమరపు ఉన్నా, తట్టుకుని ఆమెను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే కథలోకి ఎంటర్ అయితే ప్రభాస్ తాత చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే "రాజకుమారిపై మనసు పడిన ఓ స్వార్థపరుడి కథ అని చెప్పొచ్చు. ఒకప్పటి దేవనగర సామ్రాజ్య మహారాణి జమిందారీ అయిన "గంగా దేవి" తన భర్తకు అయిన కనకరాజుకు (Sanjay Dutt) దూరంగా ఉండాల్సి వస్తుంది. కనకరాజు అంటే గంగాదేవికి ఎంతో ప్రేమ. అందుకే రాజాసాబ్ తన నానమ్మ కోరిక మేరకు తాతను తీసుకురావాలని వెతుక్కుంటూ హైదరాబాద్ బయలుదేరతాడు. 

ఇదిలా ఉండగా, డబ్బునే ప్రేమించే కనకరాజు జమిందారిణి గంగా దేవిపై కన్నేసి,  ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకుని రాజ్య సంపద దోచుకోవాలని పథకం వేస్తాడు. ఈ క్రమంలో క్షుద్ర శక్తులను అవపోసన పట్టి ఆమెను వశం చేసుకుని పెళ్లి చేసుకుని సంపదతో పరారవుతాడు. ఇక వీళ్ళ కథ మధ్య గంగరాజు (Samudrakhani) పాత్ర ఏంటి, నానమ్మ కోరిక మేరకు తాతను వెతికేందుకు హైదరాబాద్ చేరుకున్న రాజా సాబ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తన తాతతోనే ప్రభాస్ ఎందుకు యుద్ధం చేస్తాడు అన్నది మిగిలిన కథ. 

Plus & Minus Points : రాజాసాబ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రభాసే అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా మొదట్నుంచి చివరి దాకా వన్ మ్యాన్ షో తో ముందుకు తీసుకెళ్లాడు. ప్రభాస్ లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమాలో బాగా చూపించాడు మారుతి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తాడు. ఇక సంజయ్ దత్, జరీనా వాహబ్ కూడా తమ విలక్షణ నటనతో సినిమాకి ప్లస్ అయ్యారు. అలాగే సముద్రఖని, బొమర్ ఇరానీ తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేసారు. సినిమాలో కోట సన్నివేశాలు మాత్రం అద్భుతంగా డిజైన్ చేసారు మేకర్స్. 

అయితే రాజాసాబ్ సినిమాకి కథ ఎంత ప్లస్సో కథనం అంత మైనస్ అయింది. స్లో నరేషన్ తో ఉండి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి చాలా ల్యాగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఏకంగా మూడు గంటల నిడివితో ఉన్న రాజా సాబ్ లో ఫస్ట్ హాఫ్ లో ఇరికించిన కామెడీ సీన్స్ ని తీసేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే హీరోయిన్లు మాళవికామోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లకు సరైన పాత్ర దక్కకపోగా, వాళ్ళు గ్లామర్ షో కోసం మాత్రమే ఉన్న భావన కలుగుతుంది. స్టోరీ విషయంలో మారుతి పెట్టిన ఫోకస్ స్క్రీన్ ప్లే పై పెట్టలేకపోయాడు. 

 

Review Statistics

5.5
Overall Rating
10
Total Reviews
From 1 Provider Types

By Provider Type

Movie Media
4.9/10

Professional Reviews

What critics and publications are saying about The RajaSaab (ది రాజా సాబ్)

Movie Media

The Rajasaab movie Review

Thyview

5.0/10
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజా సాబ్ థియేటర్లో పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి కథ రెడీ చేసుకున్న డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడంలో విఫలమయ్యాడు. ఓవరాల్ గా ఈ సినిమాని ప్రభాసే కాపాడాలి.
Jan 21, 2026

The RajaSaab movie Review

Mahidhar Vibes

5.0/10
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ కాగా, హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్ వన్ మ్యాన్ షో గా సాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయినా, క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు.
Jan 21, 2026

The RajaSaab Movie Review

Ragadi

5.0/10
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఫైనల్ గా థియేటర్లో రిలీజ్ కాగా, హారర్ కామెడీ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కంటెంట్ పరంగా డిస్సపాయింట్ చేసింది. ప్రభాస్ వన్ మ్యాన్ షో గా సాగే రాజా సాబ్ సంక్రాంతి విన్నర్ రేస్ నుండి తప్పుకునే అవకాశం ఉంది.
Jan 21, 2026

The RajaSaab movie Review

Asianet news telugu

5.0/10
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా విజువల్ గా ఆకట్టుకున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఎక్కువవడంతో ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ కొట్టిస్తుంది.
Jan 21, 2026

The RajaSaab Movie Review

One india

5.5/10
'ది రాజా సాబ్' మంచి కథతో మొదలైనా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటంతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. భారీ అంచనాలతో వెళ్లే అభిమానులకు కొంత నిరాశ కలిగించొచ్చు. అయితే ప్రభాస్ కామెడీ టైమింగ్, వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అలరిస్తాయి.
Jan 21, 2026

The Rajasaab movie review

Telugu360.com

4.5/10
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ ఫైనల్లీ థియేటర్లలో రిలీజ్ కాగా, విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది.
Jan 21, 2026

The Rajasaab movie review

GreatAndhra

4.0/10
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ కాగా, గ్రాండియర్ విజువల్స్ తో కూడిన మూవీ క్రిటిక్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
Jan 21, 2026

The RajaSaab Move review

Tupaki

4.5/10
ప్రభాస్ నటించిన The Rajasaab సినిమా పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కాగా, ఫ్యాన్స్ ని తప్ప కామన్ ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించడం లేదు.
Jan 21, 2026

The Rajasaab movie Review

Telugu Samayam

5.0/10
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన The Rajasaab సినిమా ఎలా ఉందంటే కథ, నటన, విజువల్స్, కామెడీ, మ్యూజిక్ అన్నీ బాగున్నా కొత్తదనం లేని కిచిడిలా ఉంది.
Jan 21, 2026

The RajaSaab Movie Review

123telugu.com

5.5/10
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ పొంగల్ స్పెషల్ గా థియేటర్లో రిలీజ్ అవగా, విజువల్ వండర్ గా ఆకట్టుకున్నా, స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా డిస్సపాయింట్ చేసింది.
Jan 21, 2026