Register as a Reviewer
అగధ (Agadha)

అగధ (Agadha)

14 Aug 2026
Overall Rating
4.9/10
16 Reviews

ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎం ఎస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ హారర్ - థ్రిల్లర్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ ఆగష్టు 14న థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: M.S. Raju
Cast: Kamakshi Bhaskarla, Shravan Reddy, Ulka Gupta, Jovika Vijaykumar, Bhanu Chander, Shiju, Vanitha Vijaykumar, Roshan Basheer, Shreya Rani Reddy, Viva Raghava, Robert Master, Aarna Muler, Kanakavva.

Available in:

Reviews

What critics and the public are saying about అగధ (Agadha)

Media Reviews

12 Avg: 5.1/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
4

Below Average

Agadha movie review

అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చేసింది.. బట్ దిస్ అగధ.. నాకు తెలిసి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.. లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా మస్కా...

అగధ... డైరెక్ట్డ్ బై ఎమ్మెస్ రాజు గారు... అగధ సినిమా గురించి ఇప్పుడు చెప్పాలంటే అగధ... అగాధమే... సో.. బేసిగ్గా ఏందో ఆ హర్రర్.. ఎక్కడ కూడా భయమనేది లేదు... ప్రీమియర్ కే సినిమాకెళ్ళాను... కానీ నిద్రొచ్చేసింది.. బట్ దిస్ అగధ.. నాకు తెలిసి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు.. లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా మస్కా నో ఎదో ఉంది. బట్ డైరెక్టర్ గా అయితే ఫెయిల్ అయ్యారు. కొన్ని కళాఖండాలు తీసిన తర్వాత ఇప్పుడు అగధ సినిమా తీశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు కొడుతున్నాం ఈ సినిమాతో హిట్టు అన్నట్టు అన్నారు. 


కానీ ఈ సినిమాలో మాత్రం అన్నంత స్టఫ్ లేదు. అస్సలు బాలేదు సినిమా. మాములుగా నాకే సినిమాకి వెళ్లినా నిద్ర రాదు. కానీ ఈ సినిమాకి మాత్రం ఇంట్రడక్షన్ నుంచే కళ్ళు మూసుకుపోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. సింపుల్ గా సినిమా రిజల్ట్ గురించి చెప్పాలంటే కష్టమే... చాలా కష్టమే... ఇంకా చెప్పాలంటే ఎవరైనా చూసుంటే వాళ్ళని సినిమాలో ఎంత సేపు నిద్రపోకుండా ఉన్నారు అని అడగాల్సొస్తుంది. 

Aug 14, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
5

Average

Agadha movie review

అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు. థ్రిల్ మూవ్మెంట్స్ అసలేమీ కనిపించలేదు. రైటింగ్స్ టూ బ్యాడ్ అని చెప్పాలి. చెప్పుకోవడానికి నాకైతే ఒక్క...

అగధ... 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లో అగధ.. ఇక ఆగదా అని అనే స్టేజి నుంచి ఎప్పుడైపోద్దా అనిపించేలా చేసింది. ఒక హారర్ ఎలిమెంట్ లేదు. సస్పెన్సు లేదు. థ్రిల్ మూవ్మెంట్స్ అసలేమీ కనిపించలేదు. రైటింగ్స్ టూ బ్యాడ్ అని చెప్పాలి. చెప్పుకోవడానికి నాకైతే ఒక్క సీన్ కూడా లేదు. పాపం కష్టపడి మేకర్స్ తీశారు అనడానికి నాకొక్క సీన్ కూడా కనిపించలేదు. పైగా సినిమాలో మనుషుల కన్నా కాకులు మెయిన్ లీడ్ గా చేసారు అనిపించింది. 


సినిమాటోగ్రఫి అయితే సినిమాలో బాగుంది. బీజీఎమ్ కొంచెం బాగుంది. కాన్సెప్ట్ చిన్నగా బాగా రాసుకున్నా, స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. డైరెక్టర్ ఏం అనుకోని సినిమా తీశారో ఏం అర్ధం కాలేదు. రైటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. ఇక నా రేటింగ్ ఈ సినేమాకివ్వాలనిపిస్తే... 1.5/5


Aug 14, 2026 Watch
Great Andhra
Great Andhra Website
5

Average

Agadha Movie Review

MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its s...

MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its success.


Highlights

The climax twist

Cinematography


Drawbacks

Lack of novelty in the horror genre

Forced characters

Cliched episodes


Overall, “Agadha” does not provide excitment. It neither scares nor thrills consistently. Apart from the kala tantra episode and a few portions in the second half, it remains a routine horror drama. The ending also hints at a possible second part.


Aug 14, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Agadha Movie Review

నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి...

నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన అగధ మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దైవం, దుష్టశక్తి చుట్టూ సాగే కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌లో కథ ఎక్కడ మొదలై, ఎలా ముగుస్తుందో ముందే అంచనా వేసినా.. దైవశక్తిని ఎలా చూపించారు? దుష్టశక్తి ఎలాంటి విధ్వంసం సృష్టించింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అన్న అంశాలే సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. దర్శకుడు ఎంఎస్ రాజు మాటల్లో ‘అగధ’కు భారీగా బిల్డప్ ఇచ్చినప్పటికీ.. తెరపై మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.


ముఖ్యంగా సెకండాఫ్‌పై పెట్టుకున్న అంచనాలు నిరాశపరుస్తాయి. కథనం మరింత ఆసక్తికరంగా సాగాల్సిన చోట నెమ్మదించడం సినిమాకు మైనస్‌గా మారింది. ఇక బ్లాక్ మ్యాజిక్‌ను చూపించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టెక్నికల్ టీమ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ఎమ్మెస్ రాజు కథ కొత్తగా ఎంచుకున్నా, ట్రీట్మెంట్ పాత గానే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే అగధ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది. 


Aug 14, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Agadha Movie Review

దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్...

దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు. 


డైరెక్టర్ ఎమ్మెస్ రాజు మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్‌ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు. ఫైనల్ గా వన్ టైం వాచబుల్. 

Aug 14, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Agadha movie review

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్...

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ అగధ సినిమా. 


కానీ ఎప్పుడో ఒక సీన్లో మెరుపులు మెరిపించడమే తప్ప.. ఈ సినిమాలో ఫ్లో మాత్రం మిస్ అయింది. ఎగుడు దిగుడు కథనం.. అసహనం కలిగించే కొన్ని పాత్రల చిత్రణ.. ఆ పాత్రల్లో ఆర్టిస్టుల నటన.. స్లో నేరేషన్ అగధ ఫ్లోను దెబ్బ తీశాయి. రైటర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ కోసం ఎఫర్ట్ పెట్టారు కానీ.. అది సరిపోలేదు. ఆయన క్లారిటీ లేని రైటింగ్ వల్ల కథనం ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని సన్నివేశాల వరకు రాజు టేకింగ్ బాగున్నా.. కంప్లీట్ సినిమాను అందించలేకపోయారు. చివరగా: అగధ.. సరిపోని థ్రిల్



Aug 14, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Agadha Movie Review

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్...

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే. 


సినిమాలో.. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్‌. కాకపోతే దాన్ని టెక్నికల్‌ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు. టెక్నికల్‌ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.

Aug 14, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Agadha Movie Review

దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇం...

దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. కానీ ఇందులో అదే మిస్ అయింది. 


టెక్నికల్ గా ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ పేలవమైన బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి చూసేలానే ఉంది. ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..! 

Aug 14, 2026 Read Review
5

Average

Agadha movie Review

మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా ర...

మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. 


సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కొన్ని బాగున్నాయి. బీజీఎం ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉంటుంది. మహాదేవి పాత్రలో కామాక్షి అదరగొట్టింది. శ్రావణ్‌ రెడ్డి పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. గుహలోని సన్నివేశాలు థ్రిల్‌కి గురి చేస్తాయి. కానీ కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో థ్రిల్స్ సరిపోవని చెప్పొచ్చు. ఎంఎస్‌ రాజు చెప్పింతనంతగా అయితే సినిమా లేదు. డివైన్‌ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది. అగధ కొత్త అనుభవాన్నిస్తుంది. కొంత వరకు ఎంగేజ్‌ చేస్తుంది.

Aug 14, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Agadha movie review

దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. ఇంట్రెస్టింగ్ సీ...

దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. బట్ ఈ సినిమా స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం డైరెక్టర్ రాసుకోలేకపోయాడు. 


ఇంట్రెస్టింగ్ సీన్లు కూడా పెద్దగా ఏం లేవు. థ్రిల్లర్ మూవీ అంటే ట్విస్టులు, థ్రిల్స్, హారర్ వంటి ఎలిమెంట్స్ చాలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అవి ఊహించిన దానికంటే తక్కువే ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ వన్ టైం వాచబుల్. 

Aug 14, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Agadha movie Review

ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రి...

ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. అయితే ఈ సినిమాలో నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను ఎంఎస్ రాజు రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే.. హిందూ మతమే గొప్పది. హిందూ మతంలో ఆచరించే పద్దతులే ఉత్తమం అనే కోణంలో కథను నడించిన తీరు ఆకట్టుకొంటుంది.


ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ కొత్త రకమైన హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఎలిమెంట్స్, హిందూ మత అచారాలను జోప్పించి చేసిన మిస్టిక్ డివైన్ మిస్టరీ, సైకాలజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను ఎంగేజింగ్‌గా చెప్పడానికి ఎంఎస్ రాజు విజన్ బాగా ప్లస్ అయింది. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ. ఈ వారం మంచి హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకొంటే అగాధ మూవీ బెస్ట్ ఆప్షన్.


Aug 14, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Agadha movie Review

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్...

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది. 


ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అగధ’ అక్కడక్కడా ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్ గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.


Aug 20, 2026 Read Review

Public Reviews

4 Avg: 4.5/10
G
Goshika Shreshta CA/Advocate
4

Below Average

Agadha movie review

అగధ... రీసెంట్ టైమ్స్ లో నాకు ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్దాం అనిపించిన మూవీ. కానీ వెళ్ళాక తెలిసింది పెద్ద తప్పు చేసానని. ఆ తప్పుకి ఫలితం... నాకు రెండు గంటల టార్చర్. మాములుగా థ్రిల్లర్ మూవీస్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అలా అనుకునే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ అగధ కి వెళ్ళాము. బట్ సిని...

అగధ... రీసెంట్ టైమ్స్ లో నాకు ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్దాం అనిపించిన మూవీ. కానీ వెళ్ళాక తెలిసింది పెద్ద తప్పు చేసానని. ఆ తప్పుకి ఫలితం... నాకు రెండు గంటల టార్చర్. మాములుగా థ్రిల్లర్ మూవీస్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అలా అనుకునే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ అగధ కి వెళ్ళాము. బట్ సినిమా అయితే రెండు గంటలు నరకం చూపించింది. 


సినిమాలో ఒక్క సీన్ కూడా నాకు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఒక సస్పెన్సు లేదు, ఒక హర్రర్ లేదు, కనీసం థ్రిల్ మోవ్మెంట్స్ షాకయ్యేలా ఒక్కటి కూడా లేవు. పైగా తీసింది ఓ ఫేడవుట్ అయిన డైరెక్టర్.. అందుకేనేమో ట్రెండ్ కి తగ్గట్టు అనిపించకుండా... ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా గురించి నేను చెప్పడం అనవసరం... ఎవరైనా చూడాలనుకుంటే ఓటిటికి షిఫ్ట్ అవ్వండి అదే బెటర్. 

Aug 20, 2026
T
Talari Snehalatha IT Employee
5

Average

Agadha Movie Review

ippude Agadha movie chusoccha... trailer chusi movie baga thrilling ga untundanukunna.. but thrill kaadu kada... kaneesam entertainment koooda ledu. peddag twistlu kooda levu. perukemo... horror, thriller annaru. but rendu kooda levu. suspence kooda maintain cheyaledu directer. emaina konchem b...

ippude Agadha movie chusoccha... trailer chusi movie baga thrilling ga untundanukunna.. but thrill kaadu kada... kaneesam entertainment koooda ledu. peddag twistlu kooda levu. perukemo... horror, thriller annaru. but rendu kooda levu. suspence kooda maintain cheyaledu directer. 


emaina konchem better ga undi ante climax matrame. adi kooda fresh ga em ledu. but story point bagundi. alagani cinema ayithe nakassalu nacchaledu. edo friends force cheste vella weekend lo chill avudamani.. but chala bore feel ayya... ide cinema ku naa rating ivvalsoste 2 kante ekkuvivvanu. 

Aug 16, 2026
V
Velugubantla Ramadurga Private Employee
4

Below Average

Agadha Movie Review

I watched the Sunday matinee show of the movie *Agadha*. As for the film... the story is decent, but the screenplay isn't particularly impressive.there are quite a few boring scenes. Kamakshi Bhaskarla, who played the lead role, performed well. However, I didn't really care for the thriller elements...

I watched the Sunday matinee show of the movie *Agadha*. As for the film... the story is decent, but the screenplay isn't particularly impressive.


there are quite a few boring scenes. Kamakshi Bhaskarla, who played the lead role, performed well.


However, I didn't really care for the thriller elements in the movie.


I love thriller films, but this one lacked impactful thriller or horror sequences.


Still, general audiences might want to give it a try—it is worth a one-time watch.

Aug 18, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Agadha Movie Review

ఇప్పుడే ‘అగధ’ సినిమా చూసొచ్చాను. సినిమా అయితే అంతగా నచ్చలేదు, but directer తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది. కానీ డైరెక్షనే దొబ్బింది. థ్రిల్లర్ సినిమా తీస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా తీయాలి... అసలు ఈ సినిమాలో ట్విస్టులు గాని, థ్రిల్స్ గని నాకైతే ఏం ఎక్కలేదు. And సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక తెలిస...

ఇప్పుడే ‘అగధ’ సినిమా చూసొచ్చాను. సినిమా అయితే అంతగా నచ్చలేదు, but directer తీసుకున్న కోర్ పాయింట్ బాగుంది. కానీ డైరెక్షనే దొబ్బింది. థ్రిల్లర్ సినిమా తీస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా తీయాలి... అసలు ఈ సినిమాలో ట్విస్టులు గాని, థ్రిల్స్ గని నాకైతే ఏం ఎక్కలేదు.


And సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక తెలిసింది... మూవీ తీసింది ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు అని. ఆయన ప్రొడ్యూసర్ గా ఒకే గాని... డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత సెట్ అవలేదు అనిపిస్తుంది. ఎవరైనా ఈ సినిమాకెళ్లాలంటే ఇదే వీక్ వేరే మూవీస్ చాలా ఉన్నాయి. ఈ మూవీని లాస్ట్ ఆప్షన్ గా choose చేసుకొమ్మంట. అయినా వెళ్తామంటే వాళ్ళిష్టం. నాకైతే పెద్దగా నచ్చలేదు.

Aug 19, 2026

About This Movie

Story :

కథ విషయానికి వస్తే...  స్నేహితులైన ముగ్గురు మహిమ (ఉల్కా గుప్త), శ్యామ్ (శ్రవణ్ రెడ్డి) అలాగే బబ్లూ (వైవా రాఘవ్) ముగ్గురూ కలిసి ఛత్తీస్ ఘర్ అటవీ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాన్ చేసిన ఓ మిస్టీరియస్ గుహలోకి వెళ్దామని ప్రయత్నిస్తారు. అయితే ఆ ప్రయత్నంలో బబ్లూ అక్కడే చనిపోగా, శ్యామ్ మిస్ అవుతాడు. పైగా నిండు గర్భిణీ అయిన మహిమ కూడా కొన్ని నెలల్లో చనిపోతుంది. ఈ క్రమంలో ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి యోగిని మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అక్కడికి వస్తుంది. అసలు మహిమ ఎందుకు చనిపోతుంది. మహిమకు మహాదేవికి సంబంధమేంటి? మహాదేవి చిన్నాన్న కుటుంబం కథేంటి? అసలు అసలు వీటికి కారణమైన "అగధ" ఎవరు? ఇంతకీ ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీని మహాదేవి చేదించిందా? అన్నది మిగిలిన కథ. 

 

Plus points :

మాములుగా ఈ సినిమా గురించి ఆడియన్స్ కి చాలా వరకు తెలీదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడిగా మారాక నిర్మాత ఎం.ఎస్ రాజు అంతగా గుర్తుండిపోయే సినిమాలు చేయకపోయినా, ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తన గత చిత్రాలకు భిన్నంగా "అగధ" పేరుమీద డిఫరెంట్ కొత్త పాయింట్ తో స్టోరీ లైన్ రాసుకున్నారు. పైగా సినిమాలో అగధ చుట్టూ మెయింటైన్ చేసిన సస్పెన్స్ కూడా బాగుంది. పైగా కొన్ని డివోషనల్ టచ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక మెయిన్ లీడ్ లో నటించిన కామాక్షి భాస్కర్ల చాలా ఇంటెన్స్ తో కూడిన నటన చూపించి ఇంప్రెస్ చేసింది. అలాగే ఉల్కా గుప్త, శ్రవణ్ రెడ్డి, షిజు అబ్దుల్ రషీద్ సహా మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు బాగా యాక్ట్ చేసారు. 

 

Minus points :

అయితే ఈ అగధ మూవీ కాన్సెప్ట్ బాగానే రాసుకున్నప్పటికీ, కథకి తగ్గ కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొంతమేర సస్పెన్స్ బాగానే మైంటైన్ చేసినా, సెకండ్ హాఫ్ లో కథనం పూర్తిగా డల్ అయిపొయింది. మనం చాలా సినిమాల్లో చూసిన థ్రిల్లర్ మూవీస్ తరహాలోనే ఈ మూవీ కూడా ఉండడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. అలాగే కొన్ని సీన్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడంతో ఆడియన్స్ కి విసుగు పుట్టించాయి. అలాగే సినిమాలో కొందరి పాత్రలు అవసరం లేకపోయినా ఇరికించినట్టు
అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కొంచెం బాగానే ఉన్నా, వేరే సినిమాలు గుర్తొస్తాయి. పైగా సినిమాలో మహాదేవి ఆత్మలతో మాట్లాడడం కోసం వెళ్లే టైం లూప్ సీన్స్ కి కొన్ని సినిమాలనుండి కాపీ చేసినట్టు తెలుస్తుంది. ఇవి చూసిన ఆడియన్స్ కి రొటీన్ ఫీల్ తెస్తుంది. 

 

Technical Values :

అయితే సినిమాలో టెక్నికల్ గా వంక పెట్టడానికి పెద్దగా ఏం లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. అలాగే రాకేష్ వెంకటాపురం మ్యూజిక్, బీజీఎమ్ కూడా బాగున్నాయి. కాకపోతే జునైద్ సిద్ధఖీ ఎడిటింగ్ బాగా చేయాల్సింది. సినిమాలో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఇక డైరెక్టర్ ఎమ్మెస్ రాజు డైరెక్టర్ గా మారిన తర్వాత పెద్దగా సక్సెస్ఫుల్ మూవీస్ ఏం తీయలేదు. ఈ అగధ కాన్సెప్ట్ బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే మంచి ఫలితం ఉండేది.

 

Final Review :

ఓవరాల్ గా అగధ సినిమా గురించి చెప్పాలంటే మంచి స్టోరీ పాయింట్ తో తెరకెక్కినప్పటికీ, బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆకట్టుకోలేకపోయింది. అనవసరమైన సీన్లు ఎడిట్ చేసి, క్లైమాక్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ రాసుకుంటే మరోలా ఉండేదేమో. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. మిగతా వారికి కష్టమే.

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
16
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.1/10
Public
4.5/10
Why MRO?