Register as a Reviewer
అనకాపల్లి (Anakapalli)

అనకాపల్లి (Anakapalli)

02 Oct 2026
Overall Rating
5.1/10
8 Reviews

Anakapalli : విక్రమ్ సహిదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "అనకాపల్లి". ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Khagesh Tammineni
Cast: Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina, Indraja Absar, Srinivas Vadlamani, Naidu Kadregula

Available in:

Reviews

What critics and the public are saying about అనకాపల్లి (Anakapalli)

Media Reviews

8 Avg: 5.1/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Anakapalli movie review

అనకాపల్లి మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. అంటే రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయ్యి ఉంటాయి ఈ మూవీలో. కమర్షియల్ ఎలిమెంట్స్...

అనకాపల్లి మూవీ గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది మూవీ. అంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతది. అంటే రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయ్యి ఉంటాయి ఈ మూవీలో. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈవెన్ పాటలు కూడా చాలా బాగుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. సో ఓవరాల్ గా ఒక మంచి కమర్షియల్ సినిమా. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. 


అలానే సినిమాలో బేసిక్ గా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా ప్రాపర్ గా హ్యాండిల్ చేసేసారు సో అక్కడ మెయిన్. అండ్ సాంగ్స్ అవి కూడా బాగున్నాయి. సో ఓవరాల్ గా ఒక ప్రాపర్ అన్ని ఎలిమెంట్స్ ని కలిపిన ఒక ప్యాకేజ్ మూవీ లాగా, ఒక ఫ్యామిలీ డ్రామా లాగా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగా అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతది. సో ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ మూవీ, ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ప్రాపర్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో చాలా మూవీస్ లో మిస్ అయ్యే కొన్ని ఆస్పెక్ట్స్ కావాలనుకున్న కొన్ని ఆస్పెక్ట్స్ ఈ మూవీలో రకరకాలుగా కూడా ప్రాపర్ గా సెట్ అయిన ఫీలింగ్ అయితే వస్తది మనకి. ఓవరాల్ గుడ్ మూవీ. 

Oct 02, 2026 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Anakapalli Movie Review

హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విలన్‌ ని ప్రేమించడం.. అసలు ఆ అమ్మాయి అలా (ట్విస్ట్‌) ఎందుకు చేసింది అన్న ఇతివృత్తంతో సాగే విలేజ్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ తరహా కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే దీనికి కుటుంబ భావోద్వేగాలు, డ్రగ్స్‌ మాఫియాను జోడించి దర్శకుడు కాస్త ఆసక్తికరంగా రూపొందించారు. అయితే...

హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విలన్‌ ని ప్రేమించడం.. అసలు ఆ అమ్మాయి అలా (ట్విస్ట్‌) ఎందుకు చేసింది అన్న ఇతివృత్తంతో సాగే విలేజ్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ తరహా కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే దీనికి కుటుంబ భావోద్వేగాలు, డ్రగ్స్‌ మాఫియాను జోడించి దర్శకుడు కాస్త ఆసక్తికరంగా రూపొందించారు. అయితే అమ్మాయిని ఆకట్టుకోవడానికి, ప్రేమలో దించడానికి హీరో చేసిన ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు. రెగ్యులర్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌ అంతా ఎమోషన్‌, రివెంజ్‌ చుట్టూ తిరుగుతుంది. 


ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ బావుంది కదా.. కథ ముందుకు వెళ్లే కొద్ది కొత్తదనం ఆశించవచ్చేమో అనుకుంటే అదీ లేదు. రొటీన్‌ గానే ఉంది. పైగా ఇదే క్లైమాక్స్‌.. ఇక ఎండ్‌ అయిపోయిందనుకున్న ప్రతిసారీ కొత్త బ్లాక్‌తో మళ్లీ నిడివిని పెంచేశారు. ఫైనల్‌గా డివోషనల్‌ ఎలిమెంట్‌ ఇచ్చి కథను ముగించారు. అయితే ఈ కథ ద్వారా దర్శకుడు చాలా విషయాలను టచ్‌ చేశాడు. మిడిల్‌క్లాస్‌ కుర్రాడు దారి తప్పితే అతని జీవితం ఎలా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు? ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా ఏంటి? అన్నది ఈ కథ ద్వారా చెప్పాడు. ఫైనల్ గా కొన్ని ప్రేమకథలు పెళ్లితో పూర్తవుతాయి.. కొన్ని ప్రేమకథలు త్యాగంతో పవిత్రమవుతాయి అని ఎండ్ కార్డు వేశారు. యాక్షన్‌ సినిమాలు నచ్చేవారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త అనకాపల్లి బెటర్ అని చెప్పొచు. 

Oct 02, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Anakapalli movie Review

హీరో రౌడీయిజానికి ఆక‌ర్షితుడై తానూ అలా ఎద‌గాల‌నుకోవ‌డం.. ఈ లైన్ చూడ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆటోమేటిగ్గా సుకుమార్ సినిమా జ‌గ‌డం గుర్తుకొస్తుంది. అన‌కాప‌ల్లి కూడా ఆ లైన్ మీద న‌డిచే సినిమానే కానీ.. రౌడీయిజానికి ఒక ల‌వ్ స్టోరీని జోడించి రెంటినీ బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు అన‌కాప‌ల్లి మేక‌ర్స్....

హీరో రౌడీయిజానికి ఆక‌ర్షితుడై తానూ అలా ఎద‌గాల‌నుకోవ‌డం.. ఈ లైన్ చూడ‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆటోమేటిగ్గా సుకుమార్ సినిమా జ‌గ‌డం గుర్తుకొస్తుంది. అన‌కాప‌ల్లి కూడా ఆ లైన్ మీద న‌డిచే సినిమానే కానీ.. రౌడీయిజానికి ఒక ల‌వ్ స్టోరీని జోడించి రెంటినీ బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు అన‌కాప‌ల్లి మేక‌ర్స్. ఎంట‌ర్టైన‌ర్ల‌కు పేరుప‌డ్డ త్రినాథ‌రావు న‌క్కిన అందించిన క‌థ‌తో కొత్త ద‌ర్శ‌కుడు ఖ‌గేష్ ఈ సినిమాను రా అండ్ ర‌స్టిగ్గా తీర్చిదిద్దాడు. క‌థ అంత కొత్త‌గా అనిపించ‌దు కానీ.. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లకు తోడు బ‌ల‌మైన‌ ఎమోష‌న్లు.. కొంత‌మేర‌ క‌మ‌ర్షియ‌ల్ హంగులతో ప‌ర్వాలేద‌నిపిస్తుంది. 


అయితే హీరో హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ కాన్ఫ్లిక్ట్ బ‌లంగా ఉన్న అనకాప‌ల్లిలో క‌థ మాత్రం రొటీన్ అనిపిస్తుంది. రౌడీయిజం చుట్టూ న‌డిచే వ్య‌వ‌హార‌మంతా చాలా సినిమాల్లో చూసిందే. హీరో రౌడీయిజం మీద మోజుప‌డ‌డం చూడ‌గానే ఈ క‌థ‌కు ఎలాంటి ముగింపు ఉంటుందో ఒక అంచ‌నా వ‌చ్చేస్తుంది. సినిమాలో కొన్ని పాత్ర‌లు మొక్కుబ‌డిగా అనిపిస్తాయి. అన‌వ‌స‌ర స‌న్నివేశాలు, ఐటెం సాంగ్ లాంటివి క‌ట్ చేసి.. ఈ క‌థ‌ను ఇంకొంచెం క్రిస్ప్ గా చెబితే బాగుండేది. తార‌క్ పొన్నప్పను ఇంకా బాగా వాడుకోవాల్సింది. ఐతే కొన్ని ఎపిసోడ్లు బాగుండ‌డం.. పెర్ఫామెన్సులు ఆక‌ట్టుకోవ‌డం.. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు ఉండ‌డం వ‌ల్ల అన‌కాప‌ల్లికి పాస్ మార్కులు ప‌డ‌తాయి. చివరగా రా అండ్ రస్టిక్‌గా సాగిన అనకాపల్లి ప్రయాణం.


Oct 02, 2026 Read Review
5

Average

Anakapalli Movie Review

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే అనకాపల్లి యాక్షన్‌, లవ్‌ స్టోరీ గా తెరకెక్కింది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్‌ ఇచ్చిన విలన్‌ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యా...

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే అనకాపల్లి యాక్షన్‌, లవ్‌ స్టోరీ గా తెరకెక్కింది. అందులో చీకటి సామ్రాజ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆ ఊబిలోకి హీరో వెళ్లడం, ఈ క్రమంలో పేరెంట్స్ మధ్య, ప్రియురాలి మధ్య, తనకు లైఫ్‌ ఇచ్చిన విలన్‌ మధ్య ఎలా నలిగిపోయాడు? దాన్నుంచి బయటపడ్డాడా లేదా అనే దానిపై కథ నడుస్తుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగినా, ఇందులో ప్రేమ కథకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అయితే విలన్‌ ని హీరోయిన్‌ ప్రేమించే కథలు చాలానే వచ్చినా, ఇటీవల కాలంలో మాత్రం ఇది కొత్తది అని చెప్పొచ్చు. 


హీరోకి సినిమాల పిచ్చి.. విలన్‌కి దగ్గరగా చేయడం, తాను కూడా విలన్‌ లా మారిపోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసే సమయంలో ఆమె విలన్‌ కి దగ్గరయ్యే ట్విస్ట్ షాకిస్తుంది. ఆ తర్వాతనే కథనం ట్రాక్‌ తప్పినట్టుగా ఉంది. లాజిక్‌ లెస్‌ గా ఉంటుంది. హీరో బ్రేకప్‌లా ఫీలవడం కొంత రొటీన్‌ గానే ఉంటుంది. క్లైమాక్స్ లో సినిమా పుంజుకుంది. కానీ కన్‌క్లూజన్‌ మాత్రం మళ్లీ ట్రాక్‌ తప్పినట్టుగా ఉంటుంది. హీరో కోసం మారిన హీరోయిన్‌ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఏమాత్రం కన్విన్సింగ్‌ గా లేదు. సినిమాపై అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ ని దెబ్బతీసేలా ఉంది. ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. పేరెంట్స్ కి సంబంధించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. అదే స్థాయిలో ఎండింగ్‌ ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్ గా కొంత రొటీన్‌ ఉన్నా, సరికొత్త యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ వారం వచ్చిన వాటిలో బెటర్‌గా నిలుస్తుంది.



Oct 02, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Anakapalli Movie Review

అనకాపల్లి సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. కానీ బుల్లెట్టు పాత్ర చుట్టు డిజైన్ చేసిన ఎన్విరాన్‌మెంట్, క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి. అలాగే సూరి రోల్‌ను మలిచిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్...

అనకాపల్లి సినిమా విషయానికి వస్తే.. రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. కానీ బుల్లెట్టు పాత్ర చుట్టు డిజైన్ చేసిన ఎన్విరాన్‌మెంట్, క్యారెక్టర్స్ కొత్తగా అనిపిస్తాయి. అలాగే సూరి రోల్‌ను మలిచిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. సెకండాఫ్‌లో రొటీన్ రివేంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. చివర్లో డివోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను ముగించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది.


విక్రమ్ సహిదేవ్ సూరి పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా ప్రతీ సన్నివేశంలో టాలెంట్‌ను ప్రదర్శించారు. బుల్లెట్టు పాత్రలో తారక్ పొన్నప్ప మరోసారి చెలరేగిపోయాడు. హీరో క్యారెక్టర్‌ను మించి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. హీరోయిన్‌గా సంధ్య విశిష్ట గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోవడమే కాకుండా కీలక సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. యాక్షన్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. యాక్టర్ల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకొనే వారు అనకాపల్లి సినిమాను ఈ వారం ఎంచుకోవచ్చు. అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా నిరాశపరచదు.



Oct 02, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Anakapalli Movie Review

విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట కథానాయికగా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ క్రైమ్ లవ్ డ్రామా ‘అనకాపల్లి’ ఈ వారం థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఊర్లో గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ ప్రపంచంలోకి దిగిన సూర్య, తన లైఫ్‌లోకి అమ...

విక్రమ్ సహిదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట కథానాయికగా దర్శకుడు ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ క్రైమ్ లవ్ డ్రామా ‘అనకాపల్లి’ ఈ వారం థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఊర్లో గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ ప్రపంచంలోకి దిగిన సూర్య, తన లైఫ్‌లోకి అమృత అనే అమ్మాయి వచ్చాక ఎలాంటి ఎమోషనల్ అండ్ డ్రమటిక్ టర్న్స్ తీసుకున్నాడనే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది.


విక్రమ్ సహిదేవ్ మాస్ మేకోవర్, సంధ్య క్యూట్ పర్ఫార్మెన్స్, అండ్ తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం సినిమాకి మేజర్ హైలైట్స్! ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్ డ్రామా, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. కానీ, దశాబ్దాలుగా నలిగిపోయిన "రౌడీ కుర్రాడు - పద్ధతిగల పిల్ల" అనే పాతకాన్సెప్ట్ కావడం, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే వల్ల సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ కావడం సినిమా పేస్‌ని తగ్గించేసింది. అయితే కొన్ని రొటీన్ అంశాలు ఉన్నప్పటికీ రా అండ్ రస్టిక్ తరహా క్రైమ్ డ్రామాలను, తీవ్ర భావోద్వేగాలతో కూడిన ముగింపులను ఇష్టపడే ప్రేక్షకులకు అనకాపల్లి వన్ టైం వాచబుల్. 

Oct 02, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Anakapalli Movie Review

విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ట జంటగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ మాస్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. స్థానిక గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ బాట పట్టిన ఒక యువకుడి జీవితం, అతని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విక్రమ్ సహిదేవ్ తన వయస...

విక్రమ్ సహిదేవ్, సంధ్య వసిష్ట జంటగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ మాస్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. స్థానిక గూండా బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ను రోల్ మోడల్‌గా తీసుకుని క్రైమ్ బాట పట్టిన ఒక యువకుడి జీవితం, అతని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విక్రమ్ సహిదేవ్ తన వయసుకు తగ్గ మాస్ క్యారెక్టర్‌లో సీరియస్‌గా జీవించగా, సంధ్య వసిష్ట లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. తారక్ పొన్నప్ప డిఫరెంట్ విలనిజం, క్లైమాక్స్ ఎపిసోడ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు ప్రధాన అసెట్స్‌గా నిలిచాయి.


అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే వందల సార్లు చూసిన "రౌడీ హీరో - క్లాస్ హీరోయిన్" అనే రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ కాన్సెప్ట్ కావడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్! ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ బ్లాక్స్ బాగున్నప్పటికీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే మరియు హీరో-హీరోయిన్ల మధ్య బలమైన కెమిస్ట్రీ లేకపోవడంతో డెప్త్ మిస్ అయింది. కథకుడిగా ఖగేష్ తమ్మినేని కొత్తదనం చూపించలేకపోవడంతో ల్యాగ్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫైనల్ గా సాంకేతికంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా, రొటీన్ కథనం వల్ల ‘అనకాపల్లి’ కేవలం యాక్షన్ అండ్ క్రైమ్ లవర్స్‌కి మాత్రమే ఓకే అనిపించే యావరేజ్ అటెంప్ట్!

Oct 02, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Anakapalli Movie Review

విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అనకాపల్లి’. తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, క్రైమ్ చుట్టూ సాగిన ఈ అనకాపల్లి సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ ఈజ...

విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ‘అనకాపల్లి’. తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఓ కుర్రాడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ, క్రైమ్ చుట్టూ సాగిన ఈ అనకాపల్లి సినిమా.. కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకుంది. హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. హీరోయిన్ గా నటించిన సంధ్య వసిష్ఠ నటన సినిమాకి ప్లస్ అయింది. ఈ అనకాపల్లి కథలో ఇంటర్వెల్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి.


డైరెక్టర్ పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా.. అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ‘అనకాపల్లి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ క్రైమ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.



Oct 02, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... అనకాపల్లికి చెందిన సూర్య (విక్రమ్ సహిదేవ్) కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటాడు. అయితే అదే ఊళ్లో గూండా గా తన హవా చూపిస్తున్న బుల్లెట్ (తారక్ పొన్నప్ప)ని చూసి సూర్య అతడ్ని రోల్ మోడల్ గా తీసుకుని అతని లాగే అవ్వాలని, బుల్లెట్ దగ్గర చేరి తక్కువ కాలంలోనే అతనికి ప్రధాన అనుచరుడౌతాడు. ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే ( వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడ్ని మర్డర్ చేస్తారు. ఇలా తన లైఫ్ క్రైమ్ బాటలో వెళ్తున్న టైం లో అమృత (సంధ్య వసిష్ఠ) తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తొలిచూపులోనే సూర్య, అమృతతో ప్రేమలో పడతాడు. అయితే అమృతతో ప్రేమే సూర్య- బుల్లెట్ మధ్య విభేదాలకు కారణమవుతుంది. ఈ క్రమంలో సూర్య - అమృత ఒకటవుతారా? లేదా? సూర్య అమృత కోసం చేసిన త్యాగం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

కథ పరంగా సింపుల్ స్టోరీని తీసుకున్న డైరెక్టర్ దాన్ని ఆడియన్స్ కి నచ్చేలా తీయడంలో తడబడ్డాడు. క్రైమ్ లోనే లైఫ్ సాగిపోతున్న ఓ యువకుడి లైఫ్ లో ప్రేమ వచ్చాక అతని లైఫ్ ఎలాంటి మలుపు తీసుకుంది, ఎలా సాగింది అనే స్టోరీ లైన్ తో సాగుతుంది. ఇక సినిమాలో హీరో హీరోయిన్లు చక్కగా నటించి మెప్పించారు. లవ్ సీన్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ఫ్యామిలీ సీన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక హీరోగా నటించిన విక్రమ్ సహిదేవ్ తన ఏజ్ కి తగ్గ రోల్ తో బాగా నటించాడు. అలాగే హీరోయిన్ గా నటించిన సంధ్య వశిష్ఠ కూడా చాలా బాగా నటించింది. ఇక కీ రోల్ లో నటించిన తారక్ పొన్నప్ప బాగా నటించాడు. ఇందులో తన రోల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక మిగతా నటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. 

 

Minus Points : 

అయితే ఈ అనకాపల్లి సినిమా కాన్సెప్ట్ తో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలొచ్చాయి. హీరో మాస్... హీరొయిన్ క్లాస్.. హీరోయిన్ పరిచయంతో హీరో మంచిగా మారడానికి ప్రయత్నాలు... ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒకటడమో.. లేదా ఇంకేదైనా స్యాడ్ ఎండింగ్ ఇవ్వడం. ఈ కాన్సెప్ట్ కూడా అలాగే తెరకెక్కగా, డైరెక్టర్ దీన్ని ఆడియన్స్ మెచ్చేలా ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయాడు. మంచి ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లను రాసుకున్న దర్శకుడు స్టోరీ, స్క్రీన్ ప్లే లను జనరంజకంగా మలచడంలో విఫలమయ్యాడు.  కంటెంట్ లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నా, వాటికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. అండ్ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ ని కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేదు. అందులో వాళ్ళు విడివిడిగా బాగా నటించినా కెమిస్ట్రీ పండలేదు. కొన్ని బాగున్నా, రెగ్యులర్ సీన్స్ లా అనిపిస్తాయి. కొత్తదనం లేకపోవడం వల్ల సీన్స్ రెగ్యులర్ గా, రొటీన్ గా అనిపిస్తాయి. 

 

Technical Values : 

అయితే సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్ గా బాగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు ఖగేష్ తమ్మినేని డైరెక్టర్ గా పర్వాలేదనిపించారు. కానీ కథకుడిగా విఫలమయ్యారు. బోరింగ్ కథ, స్క్రీన్ ప్లే వల్ల సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇక దవ్‌జంద్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజీఎమ్ పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ బ్యాలన్స్ ఉంది. అనవసరమైన ల్యాగ్ సీన్స్ ని తగ్గించి ఉంటె బాగుండు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు. 

 

Final Review : 

ఇక "అనకాపల్లి" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ లవ్ క్రైమ్ డ్రామా రెగ్యులర్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో ఒక వర్గం ఆడియన్స్ ని అంటే, ఎలాంటి సినిమాలొచ్చినా చూసే రెగ్యులర్ ఆడియన్స్ ని కొంతవరకు మెప్పిస్తుంది. సినిమాలో కొత్తదనం లేని కథ, పస లేని కథనంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించగా, నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. 

Review Statistics

5.1
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.1/10
Public
N/A
Why MRO?