Register as a Reviewer
కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)

కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)

09 Oct 2026
Overall Rating
5.7/10
18 Reviews

Comrade Kalyan : శ్రీ విష్ణు టైటిల్‌ రోల్‌ లో నటించిన లేటెస్ట్ మూవీ "కామ్రేడ్ కళ్యాణ్". మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేసారు. ఇక ఈ మూవీ నక్సలిజం నేపథ్యంలో కామెడీ కం యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Janakiram Marella
Cast: Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye & Others.

Available in:

Reviews

What critics and the public are saying about కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)

Media Reviews

16 Avg: 5.6/10
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Comrade kalyan movie review

'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ నాన్-స్పాయిలర్ రివ్యూ.. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ప్లాట్ కొంచెం అవుట్‌డేటెడ్ ఉంది కానీ, కామెడీ బాగుండడంతో ఒకేఇష్ ఫీల్స్ ఇచ్చింది. అంత సింపుల్ ప్లాట్ లైన్‌ ని కూడా ఫర్ ద మోస్ట్ పార్ట్ వర్క్ అయ్యేలా చేసింది శ్రీవిష్ణు అండ్ సత్యనే! ఆ ప్లేస్‌లో వీళ్ళు కాకుండా ఎవరున్నా ఈ...

'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ నాన్-స్పాయిలర్ రివ్యూ.. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ప్లాట్ కొంచెం అవుట్‌డేటెడ్ ఉంది కానీ, కామెడీ బాగుండడంతో ఒకేఇష్ ఫీల్స్ ఇచ్చింది. అంత సింపుల్ ప్లాట్ లైన్‌ ని కూడా ఫర్ ద మోస్ట్ పార్ట్ వర్క్ అయ్యేలా చేసింది శ్రీవిష్ణు అండ్ సత్యనే! ఆ ప్లేస్‌లో వీళ్ళు కాకుండా ఎవరున్నా ఈ మూవీ ఇప్పుడు ఇచ్చిన ఫీల్ ఇచ్చేది కాదు. కాకపోతే సెకండాఫ్‌కి వచ్చేసరికి మరీ అవుట్‌డేటెడ్ ఫీల్స్. ఈ మూవీలో చాలా మూవీస్ మీద పేరడీస్ లేదా ఫన్స్ ఉంటాయి, అవి వర్క్ అవ్వలేదు. కొన్ని కామెడీ సెట్ పీసెస్ 'జల్సా'లో పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ మధ్య ఉండే సెట్ పీసెస్‌లా ఉంటాయి. కాకపోతే ఆ సీరియస్‌నెస్‌ని తీసేసి ఫన్ యాంగిల్ తీసుకొస్తారు. 


ఏదో ఒక టైమ్ పాస్‌కి మూవీ చూడాలి, నాలుగు జోక్స్ ఉంటే రెండైనా వర్క్ అవుతాయి అనే ఫీలింగ్‌తో వెళ్తే ఈ మూవీ ఎండింగ్ వరకు కూర్చోగలరు. సెకండాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే అర్థమైపోద్ది ప్లాట్ ఎంత సీరియస్ ఉన్నా మెయిన్ ఎయిమ్ కామెడీ అని. కానీ ఫర్ ద మోస్ట్ పార్ట్ షీ డస్ నథింగ్. ఆ ప్లేస్‌లో ఎవరున్నా వర్క్ అయిపోద్ది, రాధిక గారు వర్క్ అవ్వలేదు. షైన్ టామ్ చాకోకి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు, ఆ ప్లాట్ పాయింట్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఎండింగ్‌లో రియల్ ఇన్సిడెంట్స్ వి పేపర్ కటింగ్స్ వేస్తారు, ఐడియా వరకు మంచి ఐడియానే కానీ దాన్ని మెలోడ్రామాటిక్‌గా ప్రెజెంట్ చేసినప్పుడే ఇష్యూస్ వచ్చాయి. శ్రీవిష్ణు గారి నుంచి ఇంతకన్నా బెటర్ కామెడీ ఫిలిం ఆశిస్తాం! 

Oct 09, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
7

Hit

Comrade Kalyan movie Review

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పాలంటే అద్దిరిపోయింది సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ సినిమా అసలు. అంటే సినిమా త్రో అవుట్ ది మూవీ ఫన్ ఉంటుంది, అండ్ ఆ కామ్రేడ్ కాన్సెప్ట్ లో కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ క్రియేట్ చేశారు. శ్రీవిష్ణు అన్న ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ ఉంటది, సత్యన్న నుంచి పీక్స్ ఫన్ ఉంటుంది....

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పాలంటే అద్దిరిపోయింది సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ సినిమా అసలు. అంటే సినిమా త్రో అవుట్ ది మూవీ ఫన్ ఉంటుంది, అండ్ ఆ కామ్రేడ్ కాన్సెప్ట్ లో కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ క్రియేట్ చేశారు. శ్రీవిష్ణు అన్న ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫన్ ఉంటది, సత్యన్న నుంచి పీక్స్ ఫన్ ఉంటుంది. తర్వాత ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఈ అన్నల కాన్సెప్ట్, ఆ కామ్రేడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లోని ఒక డిఫరెంట్ లెవెల్ సబ్జెక్ట్ తీసుకున్న ఫీలింగ్ కలిగింది, ఒక ట్విస్ట్ తో కూడుకున్న సబ్జెక్ట్ ఉంటది. అన్ని చాలా బాగా అనిపించాయి.


ఫన్ తో బాగానే పోతుంది అండ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. సో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అటు లవ్ ట్రాక్ కావచ్చు, ఇటు కామెడీ కావచ్చు, ఇటు అంటే ఆ ట్విస్ట్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి మూవీలో అయితే మటుకు. ఆయన ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతది. ఓవరాల్ గా మూవీ అయితే మటుకు అద్దిరిపోయింది అని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ కూడా కొంచెం బ్యూటిఫుల్ గా బాగానే ఉన్నారు. 


అండ్ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్టర్ కూడా ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ అది చాలా కొత్త కాన్సెప్ట్ అని కూడా అనిపించింది యాక్చువల్ గా. ప్రతి ఒక్కరికి కూడా ఒక కోర్ ఎమోషన్ ఉంటది అండ్ దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఏది ఎక్కడ రివీల్ చేయలో అక్కడే రివీల్ అయ్యాయి. ఫైనల్ గా బాగుంది. 

Oct 09, 2026 Watch
Devi Priya
Devi Priya Twitter Channel
5

Average

Comrade Kalyan movie Review

#ComradeKalyan #IDreamRating 2.5/5కలపడం కష్టమైన రెండు అంశాలు కలిపి తీసిన సినిమాతొలిసగం మొత్తం కళ్యాణ్ కనిపిస్తాడుకామన్ ఆడియన్ కు నచ్చేనవ్వులు పండిస్తాడు.మలిసగంలో కామ్రేడ్ గా మారాక నవ్వులు తగ్గాయిబండిని శ్రీవిష్ణు లాక్కు వచ్చే ప్రయత్నం బలంగా చేసారుతొలిసగం నవ్వుల కోసం చూడొచ్చు.మలిసగం అక్కడ అక్కడ నవ్వు...

#ComradeKalyan #IDreamRating 2.5/5


కలపడం కష్టమైన రెండు అంశాలు కలిపి తీసిన సినిమా


తొలిసగం మొత్తం కళ్యాణ్ కనిపిస్తాడు


కామన్ ఆడియన్ కు నచ్చే


నవ్వులు పండిస్తాడు.


మలిసగంలో కామ్రేడ్ గా మారాక నవ్వులు తగ్గాయి


బండిని శ్రీవిష్ణు లాక్కు వచ్చే ప్రయత్నం బలంగా చేసారు


తొలిసగం నవ్వుల కోసం చూడొచ్చు.


మలిసగం అక్కడ అక్కడ నవ్వుల కోసమే చూడాలి.


బెటర్ స్క్రిప్ట్ కు చాన్స్ వుంది..వాడుకోలేదు


పంచ్ లైన్


కామెడీ కళ్యాణ్

Oct 09, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Comrade Kalyan movie review

మావోయిస్టు / నక్సల్స్ కాన్సెప్ట్ తెలుగు తెరపై వర్కవుట్ అవ్వదని 'ఆచార్య'తో ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ శ్రీవిష్ణు సినిమా అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు అంటే కామెడీ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రతి కథకు ఓ కోర్ పాయింట్ ఉంటుంది. అది పాతదైనా...

మావోయిస్టు / నక్సల్స్ కాన్సెప్ట్ తెలుగు తెరపై వర్కవుట్ అవ్వదని 'ఆచార్య'తో ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ తరుణంలో 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ శ్రీవిష్ణు సినిమా అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు అంటే కామెడీ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రతి కథకు ఓ కోర్ పాయింట్ ఉంటుంది. అది పాతదైనా ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ అయితే దాని చుట్టూ ఎంత వినోదమైనా పండించవచ్చు. కామ్రేడ్ / మావోయిస్టు / నక్సల్ కాన్సెప్ట్ ఈతరం ప్రేక్షకులలో చాలా తక్కువ మందికి, మరీ ముఖ్యంగా థియేటర్లకు వస్తున్న యువతకు ఓల్డ్ కాన్సెప్టే. అయితే దర్శకుడు జానకిరామ్ పాత సినిమాల తరహాలో తీయడానికి ప్రయత్నించారు. 1990 వాతావరణాన్ని తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్ అయ్యారు. 


ఇక శ్రీవిష్ణుకు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏమీ కాదు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, నటనతో ఈజీగా చేసేశారు. మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. సత్య మరోసారి తన ట్యాలెంట్ చూపించారు. ఫైనల్ గా 'కామ్రేడ్ కళ్యాణ్'లో కామెడీ ఉంది. పలు సన్నివేశాల్లో నవ్వించింది. అయితే... శ్రీవిష్ణు సినిమా అనేసరికి సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వినోదం ఫుల్లుగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఆ స్థాయిలో సినిమా లేదు. కామ్రేడ్ కాన్సెప్ట్ కొంత కామెడీకి హెల్ప్ అయ్యింది కానీ ఎమోషన్స్‌ వర్కవుట్ అవ్వడంలో హెల్ప్ చేయలేదు. శ్రీవిష్ణుతో పాటు సత్య నవ్వించారు. వాళ్ళ వినోదం కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.


Oct 09, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Comrade Kalyan movie review

పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని నడిపించాడు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే...

పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ కామ్రేడ్ కళ్యాణ్ చిత్రాన్ని నడిపించాడు. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే మాత్రం చాలా చోట్ల బాగా నవ్వులు పూస్తాయి. ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు బాగా పేలడంతో మొదటి భాగం ఎక్కడా బోర్ కొట్టదు. కానీ ద్వితీయార్థం మొదలయ్యాక అడవి నేపథ్యంలో సీన్స్ ఉండటంతో నవ్వించే స్కోప్ బాగా తగ్గిపోయింది. 


చుట్టూ తుపాకులు పట్టుకున్న వాళ్ల మధ్య ఫన్ క్రియేట్ చేయడం కష్టంగా మారడంతో ఇక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదిస్తుంది. మధ్యలో రాజకీయ నాయకుడి కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా మళ్లీ కొంత వినోదాన్ని రాబట్టే ప్రయత్నం చేసినా అది అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా హీరో మార్క్ కామెడీని పక్కనపెట్టి, పతాక సన్నివేశాల్లో భారీగా సందేశాలు ఇవ్వడం కొంత ఇబ్బందిగా మారుతుంది. సినిమాను మెసేజ్‌లతో కాకుండా సరదాగా ఎండ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక శ్రీవిష్ణు వన్ మ్యాన్ షోగా సినిమాలో అలరించాడు. అయితే మాటల రచయితలు రాసిన ట్రెండీ డైలాగ్స్ చాలా చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, వరుస సెలవులు రావడం ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసిరానుంది. ఓవరాల్ గా కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణ్..!


Oct 09, 2026 Read Review
6

Above Average

Comrade kalyan movie review

నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌ కి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి, అందులోని హ్యూమర్‌ ప్రధానంగా చేసుకొని రూపొందిన చిత్రమే కామ్రేడ్ కళ్యాణ్. అదే సమయంలో చిన్నపాటి సందేశాన్ని కూడా ఇందులో మేళవించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీవిష్ణు వన్ సైడ్ కామెడీతో నడిపిస్తాడు. మధ్యలో సత్య హెల్ప్ అవుతాడు. ఇక సెకండాఫ్‌లో.. త...

నక్సల్‌ బ్యాక్‌ డ్రాప్‌ కి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి, అందులోని హ్యూమర్‌ ప్రధానంగా చేసుకొని రూపొందిన చిత్రమే కామ్రేడ్ కళ్యాణ్. అదే సమయంలో చిన్నపాటి సందేశాన్ని కూడా ఇందులో మేళవించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శ్రీవిష్ణు వన్ సైడ్ కామెడీతో నడిపిస్తాడు. మధ్యలో సత్య హెల్ప్ అవుతాడు. ఇక సెకండాఫ్‌లో.. తాను నక్సల్‌ కాదని నిరూపించుకునే ప్రయత్నం చుట్టూ సాగుతుంది. అటు నక్సల్స్ కి, ఇటు పోలీసులకు మధ్య శ్రీవిష్ణు, సత్య నలిగిపోతూ వారిని మ్యానేజ్‌ చేసే ప్రయత్నం కొంత ఉత్కంఠభరితంగా, మరికొంత ఫన్నీగా ఉంటుంది. అయితే మూవీలో చాలా వరకు బలవంతపు కామెడీ కనిపించింది. 


అదే సమయంలో నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌ తీసుకొని దాన్ని కామెడీగా చూపించడం కనెక్టింగ్‌ గా లేదు. ఈ అంశాలు పక్కన పెడితే మాత్రం ఇదొక మంచి సందేశాత్మక, అదే సమయంలో నక్సల్స్ పేరుతో జరిగే మోసాలకు సంబంధించి అవగాహన కలిగించే మూవీ. అయితే ఫన్‌ జనరేట్‌ చేయడంలో ఇంకా ఫోకస్‌ చేయాల్సింది. కానీ చాలా వరకు మెప్పించాడు. కామెడీని ఇంకా గ్రిప్పింగ్‌ గా రాసుకుంటే సినిమా అదిరిపోయేది. ఫైనల్‌ గా సరదాగా నవ్వులు పూయించే కామ్రేడ్‌ కళ్యాణ్‌. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు.

Oct 09, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

Comrade kalyan movie review

ముందుగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఒక ఫక్తు లైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్. అలాంటి ఈ కథలో ఎదో కొత్తదనం డిఫెరెంట్ స్క్రీన్ ప్లే లాంటివి ఎక్స్ పెర్ట్ చేస్తే, సీన్స్ వైజ్ మాత్రమే సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఈ మధ్య రావడం లేదు, క...

ముందుగా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఒక ఫక్తు లైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్. అలాంటి ఈ కథలో ఎదో కొత్తదనం డిఫెరెంట్ స్క్రీన్ ప్లే లాంటివి ఎక్స్ పెర్ట్ చేస్తే, సీన్స్ వైజ్ మాత్రమే సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఈ మధ్య రావడం లేదు, కాబట్టి అలాంటి మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం సినిమా బాగానే నచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో లూప్ హోల్స్ ఉన్నాయి. అక్కడక్కడా కథ డ్రాగ్ అవుతుంది. ఎటు నుండి ఏటో వెళుతుంది అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ గా కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం, బోర్ అనిపించే రేంజ్ లో సీన్స్ పెద్దగా లేకుండా

సినిమా ఒక ఫ్లోలో సీన్ బై సీన్ వెళుతూ ఉంటుంది. 


ఇక మరోసారి శ్రీ విష్ణు తన కామెడీతో మెప్పించాడు. డైలాగ్స్ మరోసారి యూత్ ను బాగానే టార్గెట్ చేయగా, సత్య కూడా మరోసారి తన కామెడీ టైమింగ్ తో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపించగా సంగీతం ఓకే అనిపించేలా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు బాగానే అనిపించగా, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినట్లు అనిపించింది. మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైంకి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వస్తారు. ఫైనల్ గా అద్బుతం కాకున్నా కానీ ఉన్నంతలో డీసెంట్ ఎంటర్ టైన్ మెంట్ తో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ బాగానే ఆకట్టుకుంటుంది. మరీ ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే యావరేజ్ గా అనిపించవచ్చు.

Oct 09, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Comrade Kalyan movie review

మాములుగా శ్రీవిష్ణు సినిమాలో కాస్త కామెడీ ఉంటే చాలు ఆటోమేటిక్‌‌గా సినిమా పాసైపోతుంది. ఇక కామ్రేడ్‌ కల్యాణ్‌ నక్సల్స్‌ నేపథ్యమున్న సినిమా అని ట్రైలర్‌ లో చెప్పినా, శ్రీవిష్ణు మార్కు కామెడీ ఉంటుందని నమ్మకం పెంచుకున్నారు ఆడియన్స్‌. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన...

మాములుగా శ్రీవిష్ణు సినిమాలో కాస్త కామెడీ ఉంటే చాలు ఆటోమేటిక్‌‌గా సినిమా పాసైపోతుంది. ఇక కామ్రేడ్‌ కల్యాణ్‌ నక్సల్స్‌ నేపథ్యమున్న సినిమా అని ట్రైలర్‌ లో చెప్పినా, శ్రీవిష్ణు మార్కు కామెడీ ఉంటుందని నమ్మకం పెంచుకున్నారు ఆడియన్స్‌. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన్నం. పూర్తిగా వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఇక సినిమా ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల ప్రేమ, సత్య కామెడీలతో సరదాగా సాగితే, సెకెండాఫ్‌లో అదే కొరవడింది. కథ అన్నల నేపథ్యంలోకి వెళ్లడంతో పెద్దగా కామెడీ పండించడానికి ఆస్కారం లేకుండా పోయింది. 


అయితే మంత్రి కిడ్నాప్‌ తో మళ్లీ కథ కామెడీ ట్రాక్‌ లో పడుతుంది. అడవి సన్నివేశాలు సినిమా స్పీడ్‌ను కాస్త తగ్గించిన భావన కలిగింది. అందులోనూ సత్య కనిపించిన ప్రతిసారీ కామెడీ బాంబు వేసే వెళ్తాడు. క్లైమాక్స్‌ మాత్రం తేలిపోయినట్టుంది. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్‌ అయినా కామెడీ జానర్‌ సినిమా కాబట్టి పట్టించుకోవాలనే ఆలోచన రాకుండా రైటర్స్‌ జాగ్రత్త పడ్డారు. ఆచార్య దళం, ప్యారడైజ్‌ కాకి వంటి డైలాగ్‌ లు నవ్వులు పూయించాయి. గతంలో వచ్చిన నక్సల్‌ సినిమాల రిఫరెన్స్‌ లు ఆకట్టుకుంటాయి. అయితే కామెడీకి కేరాఫ్‌ అయిన శ్రీవిష్ణు సినిమా కాబట్టి సినిమా క్లైమాక్స్‌ మరోలా ప్లాన్‌ చేసి ఉంటే బాగుండేది. కామెడీ సినిమాకు లాజిక్కులతో పని ఉండదు కాబట్టి.. నవ్వులు కావాలనుకునేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈవారం పెద్ద చిత్రాలేమీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.


Oct 09, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Comrade Kalyan movie review

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా మలచడం విశేషం. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, కపటం లేని నటనతో కమెడియన్...

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా మలచడం విశేషం. శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, కపటం లేని నటనతో కమెడియన్ సత్య థియేటర్లలో నవ్వులు పూయించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.


అయితే, కంటెంట్ పరంగా పెద్దగా లోపాలు లేకపోయినా, సెకండాఫ్‌లో కామెడీని దాటి యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణల మోతాదు పెరగడంతో సినిమా వేగం తగ్గింది. దీంతో పక్కా కామెడీ చిత్రంగా ఆశించిన స్థాయి అనుభూతి లభించదు. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఇక ఓవరాల్‌ గా ఈ "కామ్రేడ్ కళ్యాణ్" చూసి "లాల్ సలాం" అని పై శృతిలో అరవలేం కానీ, అనకుండా ఉండలేం! శ్రీవిష్ణు అభిమానులకు, కామెడీ కోరుకునేవారికి ఇది ఒక మంచి చాయిస్.

Oct 09, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Comrade kalyan movie review

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ తీరు.. ఇలా ఏ యాంగిల్‌లోంచి చూస్తే ఆ యాంగిలో‌లో తప్పులు, ఒప్పులు కనిపిస్తాయి. ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కృష్ణ వంశీ లాంటి దర్శకుడే సింధూరం అనే చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. ఎవరి సైడ్ తీసుకోకుండా.. నిర్ణయం ఏంటి? అన్నది ప్రేక్ష...

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ తీరు.. ఇలా ఏ యాంగిల్‌లోంచి చూస్తే ఆ యాంగిలో‌లో తప్పులు, ఒప్పులు కనిపిస్తాయి. ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కృష్ణ వంశీ లాంటి దర్శకుడే సింధూరం అనే చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. ఎవరి సైడ్ తీసుకోకుండా.. నిర్ణయం ఏంటి? అన్నది ప్రేక్షకులకే వదిలేశాడు. ఇక చాలా సినిమాల్లో అన్నలనే హీరోలుగా చూపించారు. కొన్ని చిత్రాల్లో పోలీసులనే హీరోలుగా చూపించారు. ఇలా ఎవరి కోణం వారికి ఉంటుంది. అలాంటి సీరియస్ సబ్జెక్ట్‌లను తీసుకుని భాను, నందు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. ప్రతీ చోటా సిల్లీ, లాజిక్ లెస్ సీన్లు, జబర్దస్త్ టైపులో కామెడీ పంచుల్ని రాసుకుని నడిపించారు. వినోదం పరంగా చూసుకుంటే కామ్రేడ్ కళ్యాణ్ నవ్విస్తుంది. కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం కామ్రేడ్ కళ్యాణ్ సిల్లీ అనిపిస్తుంది.



సుదర్శన్ శ్రీవిష్ణు.. సత్య, శ్రీ విష్ణు కాంబోలో వచ్చే సీన్స్ నవ్విస్తాయి. రాధిక శరత్ కుమార్ పాత్ర కూడా కాస్త ఎంటర్టైనింగ్‌గానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్‌ నే నమ్ముకున్నారు మేకర్స్. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా రాసుకున్నారు చివరకు వచ్చేసింది.. ఏదో ముగించేయాలి కాబట్టి.. అర్జెంట్‌గా అందరూ మారిపోవాలి అన్నట్టుగా సీన్స్ సాగుతాయి. ఓవరాల్‌ గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైం పాస్ వీకెండ్ సినిమాగా నిలుస్తుంది. కాసేపు నవ్వుకోవాలి.. శ్రీ విష్ణు, సత్య కామెడీని ఎంజాయ్ చేయాలి అని అనుకునేవారు ఈ సినిమాని ఓ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.


Oct 09, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Comrade kalyan movie review

శ్రీ విష్ణు టైటిల్ రోల్‌ లో మహిమా నంబియార్ కథానాయికగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అ...

శ్రీ విష్ణు టైటిల్ రోల్‌ లో మహిమా నంబియార్ కథానాయికగా, జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’. 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ను ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అడవిలో కామ్రేడ్ ట్రాక్, ఎంటర్‌టైనింగ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఎపిసోడ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.


అయితే కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ప్రారంభంలో కథనం కాస్త స్లోగా సాగడం చిన్న మైనస్. కొన్ని డబ్బింగ్ సమస్యలు మరియు క్లైమాక్స్ ఇంకాస్త ఇంపాక్ట్‌ ఫుల్‌గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. ఓవరాల్ గా కథనంలో కొత్తదనం పెద్దగా లేకపోయినా... శ్రీవిష్ణు-సత్య కాంబో అందించే నాన్‌స్టాప్ ఫన్ అండ్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ కోసం ‘కామ్రేడ్ కళ్యాణ్’ నిష్ఫలంగా ఒకసారి నవ్వుకోవడానికి హ్యాపీగా చూడదగ్గ డీసెంట్ మూవీ. ఫైనల్లీ కామ్రేడ్ కళ్యాణ్ కామెడీ కళ్యాణే కానీ..!


Oct 09, 2026 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Comrade kalyan movie review

సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడి...

సీరియస్ సినిమాలతో మొదలుపెట్టి.. కామెడీ వైపు టర్న్ అయి.. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకువచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... నక్సలిజం అన్నది చాలా సీరియస్.. సెన్సెటివ్ సబ్జెక్ట్. హీరో ఆ అవతారం ఎత్తాడంటే ఆ కథ నడిచే టోనే వేరుగా ఉంటుంది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు థియేటర్లో కూర్చుంటే.. మొత్తం కామెడీనే ఉంది. పైగా ఈ కథ కొంచెం మింగుడుపడనట్లే సాగుతుంది. నక్సలైట్లు ఇంత సిల్లీగా వ్యవహారాలు నడుపుతారా.. పోలీసులు ఇంత డమ్మీగా ఉంటారా.. ఒక మామూలు కుర్రాడు ఇద్దరితో ఇలా ఆడేసుకుంటాడా అనిపించేలా ఇందులో కథ నడుస్తుంది. 


కానీ కథ-పాత్రల గురించి ఎక్కువ ఆలోచించకుండా.. లాజిక్కులేమీ పట్టించుకోకుండా.. కేవలం కామెడీ మీదే ఫోకస్ చేసి నవ్వుకుంటాం అంటే మాత్రం శ్రీవిష్ణు అండ్ గ్యాంగ్ టైంపాస్ వినోదాన్ని అందిస్తుంది. కానీ స్క్రిప్టులో బిగి మాత్రం లేదు. నక్సలిజం మీద కథను మరీ ఇంత నాన్ సీరియస్ గా నడిపించడం మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ కామెడీని బాగానే డీల్ చేయగలడనడానికి అనేక సన్నివేశాలు రుజువుగా నిలుస్తాయి. తన కామెడీ ఫ్లో బాగుంది. కానీ సీరియస్ గా కథ చెప్పాల్సిన చోట మాత్రం మరీ తేలిగ్గా నడిపించేశాడు. చివరగా కామ్రేడ్ కళ్యాణ్..శ్రీవిష్ణు-సత్యల కామెడీ కోసం ఓసారి చూసేయొచ్చు. 


Oct 09, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Comrade Kalyan movie review

దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేలవించి వండిన ఫన్ ఒక కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి చాలా కన్వినియె...

దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న ఈ కామ్రేడ్ కళ్యాణ్ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేలవించి వండిన ఫన్ ఒక కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి చాలా కన్వినియెంట్ స్క్రీన్ ప్లే‌ తో తమకు అనుకూలంగా కథను, సన్నివేశాలను పేర్చుకొన్న చిత్రంగా చెప్పవచ్చు. శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కామెడీ, కమెడియన్ సత్య, సుదర్శన్ ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.


రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్‌ గా చిన్న లవ్ స్టోరి, ఇంటర్వెల్ టిస్ట్, నక్సలైట్ల ఎపిసోడ్, ఎమోషనల్ క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. చివర్లో చిన్న సందేశంతో ఈ సినిమా సీరియస్ సినిమా కాదు.. వినోదాత్మక చిత్రమని చెప్పే ప్రయత్నం చేశారు.ఇక టెక్నికల్ గా సాయి శ్రీరాం అడవి అందాలను బాగా కెమెరాలో బంధించాడు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పరంగా ఒకే. ఓవరాల్ గా సినిమా నుంచి ఎక్కువగా ఆశించకుండా సరదాగా ఈ వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న సినిమాగా చెప్పొచ్చు. భారీ అంచనాలతో వెళితే నిరాశపడే ప్రమాదం ఉంది. కాబట్టి కామెడీ, ఫన్ అంశాలను దృష్టిలో పెట్టుకొని వెళితే టైంపాస్ మూవీ అనే ఫీలింగ్‌ తో బయటకు రావొచ్చు.


Oct 09, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Comrade Kalyan movie review

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుంది. కానీ దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త...

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా 90ల నాటి ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ మాడగుల నేపథ్యంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుంది. కానీ దర్శకుడు దీనిని సీరియస్ డ్రామాగా కాకుండా ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో ఆవిష్కరించారు. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇవ్వలేదు. మిగతా ఆర్టిస్టులు బాగా చేసారు.


కంటెంట్ పరంగా ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిన అంశాలు పెద్దగా లేకపోయినా, సెకండాఫ్‌లో కామెడీని యాక్షన్, సెంటిమెంట్, సంస్కరణ... డామినేట్ చేయడం వల్ల సినిమా వేగం దెబ్బతింది. దీంతో ప్రేక్షకులకు కామెడీ సినిమా చూస్తున్నామన్న అనుభూతి ఆశించిన స్థాయిలో ఉండదు. మొత్తమ్మీద ఈ "కామ్రేడ్ కళ్యాణ్" చూసి "లాల్ సలాం" అని గట్టిగా పై శృతిలో అరవలేం కానీ, అనకుండా మాత్రం ఉండలేం. అందుకే మధ్య స్థాయిలో "లాల్ సలాం".  

Oct 09, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Comrade kalyan movie review

Sree Vishnu who has become a bankable hero when it comes to entertainment tried yet another comedy entertainer, Comrade Kalyan. Kona Venkat presents the film which is directed by a newcomer, Janakiram and produced by another newcomer, Krishna. The film has an interesting Naxal backdrop.Positives:1.⁠...

Sree Vishnu who has become a bankable hero when it comes to entertainment tried yet another comedy entertainer, Comrade Kalyan. Kona Venkat presents the film which is directed by a newcomer, Janakiram and produced by another newcomer, Krishna. The film has an interesting Naxal backdrop.


Positives:

1.⁠ ⁠Around an hour of entertainment in the first half

2.⁠ ⁠Pre-interval twist

3.⁠ ⁠Sree Vishnu’s Performance

4.⁠ ⁠Couple of Satya’s Comedy episodes


Negatives:

1.⁠ ⁠Not-so-engaging romantic track

2.⁠ ⁠Over cooked second half with too many elements

3.⁠ ⁠Cliche climax

4.⁠ ⁠Take off of the film


Finally, Comrade Kalyan has an entertaining one-hour in the first half and this portions are sure to work well with the audience. However, the second half gives a feeling of ‘all over the place’. You may give it a try for entertainment it offers at times. A bit more care in the writing and a bit of fine tuning in the second half, would have made the film a good watch


Bottomline: Passable with Few Laughs

Oct 09, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Comrade kalyan movie review

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినూత్న సబ్జెక్టు లతో అలరించే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంది. ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుక...

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వినూత్న సబ్జెక్టు లతో అలరించే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంది. ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇందులో అందుకు భిన్నంగా ఫన్ ట్రీట్ దొరుకుతుంది. దర్శకుడు దీనిని ఆద్యంతం వినోదభరితంగా మంచి ఫన్ మూమెంట్స్ తో డిజైన్ చేశారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో ఆ అంశాన్ని పూర్తిస్థాయి కామెడీ కోణంలో నడిపించిన తీరు ఇంప్రెస్ చేస్తుంది.


అయితే సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చేవరకు కథనంలో మూమెంట్స్ స్లోగా కొంచెం డల్ అనిపిస్తాయి. వీటితో పాటు పాత్రల పరిచయం కూడా అంత బలంగా కుదరలేదు అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుండి మంచి కామెడీ సీన్స్ తో నవ్విస్తుంది. ఇక మొత్తంగా చూస్తే, ‘కామ్రేడ్ కళ్యాణ్’ మంచి ఫన్ మూమెంట్స్ తో సాగే టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. శ్రీవిష్ణు, సత్యల కామెడీ ట్రాక్ థియేటర్ లో మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. ఆరంభ సన్నివేశాలు, క్లైమాక్స్ కాస్త తడబడినా.. ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఇందులో కొదవ లేదు. సో ఈ వారాంతానికి ఓ డీసెంట్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే ఇదొక ఛాయిస్ గా నిలుస్తుంది.




Oct 09, 2026 Read Review

Public Reviews

2 Avg: 6.0/10
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

Comrade kalyan movie Review

just ippude 'Comrade Kalyan' movie chusanu, naakaithe idi chala simple and outdated plot la anipinchindi. but Sri Vishnu and Satya valla comedy timing valla movie chala varaku work ayyi, oka time-pass feel ichindi. Veellu kakunda vere evaru unna ee cinema ye matram kooda adedi kademo.First half sill...

just ippude 'Comrade Kalyan' movie chusanu, naakaithe idi chala simple and outdated plot la anipinchindi. but Sri Vishnu and Satya valla comedy timing valla movie chala varaku work ayyi, oka time-pass feel ichindi. Veellu kakunda vere evaru unna ee cinema ye matram kooda adedi kademo.


First half silly jokes tho, second half lo main plot loki vellaka comedy scope taggipoyindi. Sudden ga sentiment, message evvadaniki try chesinappudu writing weak ga undi.


Overall ga, trailer lo jokes nachite, kevalam Sri Vishnu-Satya comedy kosam oka sari try cheyachu.

Oct 09, 2026
A
Arige Srikanth Private Employee
7

Hit

Comrade Kalyan movie review

just ippude Comrade kalyan first show chusostunna... just one word lo cheppalante nacchesindi..asalu cinemaki velladaniki mundu social medialo movie flop.. naxalites ni comedians chesesaru.. content lo seriousness ledu em ledu annaru kaani... trailer chusaaka nenu idi pakka comedy movie ani fix atyi...

just ippude Comrade kalyan first show chusostunna... just one word lo cheppalante nacchesindi..


asalu cinemaki velladaniki mundu social medialo movie flop.. naxalites ni comedians chesesaru.. content lo seriousness ledu em ledu annaru kaani... trailer chusaaka nenu idi pakka comedy movie ani fix atyipoye theater ki vellanu..


because trailer chuste evarikaina idi serious action drama kadu.. naxal back drop just edo tiskundamani tiskunnaru.. story kosam anipistundi.. anduke nenu peddaga expectations pettukokunda movieki enjoy cheddamani vellanu.. and i m satisfied..


comedy ki elanti doka ledu.. sri vishnu and satya, sudarshan full navvistaru... evaraina chudalanukunte logics pakkana betti, normal comedy movie ga try cheste pakka nacchuddi.

Oct 09, 2026

About This Movie

Story : 

కథ విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో అన్నల ప్రభావం ఎక్కువగా ఉండే మాడగుల ప్రాంతంలో కళ్యాణ్ (శ్రీవిష్ణు) థియేటర్ ఆపరేటర్ గా లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. అక్కడ ఒరియా అమ్మాయి సితార (మహిమ నంబియార్) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె అన్న చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుంటే, ఆ డబ్బు తాను చెల్లిస్తానని మాటిస్తాడు కళ్యాణ్. ఈ క్రమంలో అప్పు తీర్చే క్రమంలో ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్కీమ్ పెడతారు. అయితే ఈ స్కీమ్ వల్ల అనుకోని పరిస్థితుల్లో కళ్యాణ్ కాస్త కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడు. మరి సడన్ గా కళ్యాణ్ కామ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. మధ్యలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ జార్జ్ కుట్టి (షైన్ టాం చాకో) కథేంటి? కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్ కుమార్), అలాగే శంకరన్న (శత్రు), కామ్రేడ్ నాయకుడు మాస్టర్ (సాయి చంద్) తో కళ్యాణ్ కి సంబంధం ఏంటి? చివరికి ఈ సమస్యల నుండి బయటపడి కళ్యాణ్ - సితార ఒకటయ్యారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

ఈ సినిమాకు ముందు నుండి శ్రీవిష్ణు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా  కనిపించాడు. ఎందుకంటే టైటిల్ పోస్టర్ నుండి సాంగ్స్, ట్రైలర్ సహా రిలీజ్ డేట్ వరకు శ్రీవిష్ణు అదిరిపోయే ప్రమోషన్లు చేసాడు. పైగా అసలు శ్రీవిష్ణు సినిమాకు "కామ్రేడ్ కళ్యాణ్" అంటూ టైటిల్ అనౌన్స్ చేయగానే ఇదేదో కొత్తగా ఉండబోతుందని అనుకున్నారు జనాలు. చాలా మంది సీరియస్ కంటెంట్ అనుకున్నా, దాదాపు ఫన్ ట్రీట్ గానే సినిమాని లాగించారు. ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమాలో డోకా లేదని చెప్పాలి. ఇక తెలుగులో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలొచ్చినా, ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి హాస్యభరితంగా తెరకెక్కడం విశేషం. 

 

ఇక కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌ తో మెప్పించాడు. కామెడీ చేసే విషయంలో తనలాగా ఎవరూ నటించలేరని ప్రూవ్ చేసారు. ఇక హీరోయిన్ మహిమా నంబియార్ కు తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా బాగా నటించింది. కమెడియన్ సత్య మరోసారి చెలరేగిపోయి సినిమాకు బూస్ట్ ఇచ్చాడు. అలాగే సుదర్శన్, రాధిక, ఉపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో, సాయిచంద్, శత్రు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. 

 

Minus Points : 

అయితే సినిమా కథ సింపుల్ గా రాసుకున్న డైరెక్టర్, ట్రీట్మెంట్ ను కూడా అంతే సింపుల్ గా రాసుకున్నాడు. టైటిల్ ని చూసి మూవీ సీరియస్ గా ఉందనుకుంటే మోసపోతారు. ఫక్తు కామెడీ సినిమా ఇది. అయితే మూవీ మెయిన్ కథలోకి వెళ్ళడానికి మాత్రం చాలా టైం తీసుకుంది.  సినిమా స్టార్ట్ మాత్రం స్లోగా మొదలైంది అని చెప్పాలి. హీరో ఎంట్రీ ఇచ్చేవరకు కథనంలో మూమెంట్స్ స్లోగా కొంచెం డల్ అనిపిస్తాయి. ఆ తర్వాత పికప్ అయ్యాయి. అప్పుడు వరకు కథనం అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించదు. వీటితో పాటు పాత్రల పరిచయం కూడా అంత బలంగా కుదరలేదు అనిపిస్తుంది.

అంతే కాకుండా ఆరంభంలో వచ్చే కొన్ని జోకులు ఆశించిన స్థాయిలో పేలకపోగా, అక్కడక్కడా డబ్బింగ్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. సెకండాఫ్ లో కథనం ఫ్లో కాస్త మందగిస్తుంది. కీలక సమయంలో వచ్చే హీరో ఎలివేషన్ సాంగ్ మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉండాల్సింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అంతగా కన్విన్స్ చేయలేకపోయాయి. ఎండింగ్ కూడా ఇంకాస్త ప్రభావవంతంగా ఇచ్చి ఉంటే బాగుండేది.

 

Technical Values : 

ఇక టెక్నికల్ గా చూస్తే.. సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించిన పాటలు, బీజీఎమ్ స్కోర్ డీసెంట్‌ గా ఉన్నాయి. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ అక్కడక్కడా బాలన్స్ ఉంది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటె కథలో స్పీడ్ పెరిగేది. ఇక రచయితలు ఇక దర్శకుడు జానకిరామ్ మారెళ్ల కథ కంటే కామెడీ పండించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అందులోనైనా రాణించారు. ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యారు.

 

Final Review : 

ఫైనల్ గా "కామ్రేడ్ కళ్యాణ్" ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి ఫన్ అండ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. శ్రీవిష్ణు అండ్ సత్య కామెడీ తో పాటు లవ్ ఎపిసోడ్స్, అడవిలో కామ్రేడ్ ట్రాక్ అలరిస్తుంది. అయితే కొత్త కథ కథనం కావాలనుకున్నవారు కొంత డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్ మూవీ లవర్స్, అండ్ శ్రీవిష్ణు సినిమాలను ఇష్టపడే వారు కామ్రేడ్ కళ్యాణ్ ని లైక్ చేస్తారు.

 

Review Statistics

5.7
Overall Rating
Avg. of all reviews
18
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.6/10
Public
6.0/10
Why MRO?