Register as a Reviewer
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

11 Sep 2026
Overall Rating
4.9/10
25 Reviews

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్". 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Aditya Hasan
Cast: AnandDeverakonda, VaishnaviChaitanya, Sivaji, Vasuki, Rohan

Available in:

Reviews

What critics and the public are saying about ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Media Reviews

20 Avg: 5.1/10
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Epic movie Review

ఎపిక్ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే... నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంతగా కనెక్ట్ కాలేదు. డైరెక్టర్ చెప్పాలనుకున్నదేంటో తెలియట్లేదు. బట్ స్టిల్ మూవీ నేను ఎంజాయ్ చేశాను అన్న ఫీల్ తోనే బైటికి వచ్చాను. ఒక డౌట్ ఏంటంటే ట్రైలర్ చూశాక.. కావాలని మే...

ఎపిక్ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే... నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంతగా కనెక్ట్ కాలేదు. డైరెక్టర్ చెప్పాలనుకున్నదేంటో తెలియట్లేదు. బట్ స్టిల్ మూవీ నేను ఎంజాయ్ చేశాను అన్న ఫీల్ తోనే బైటికి వచ్చాను. ఒక డౌట్ ఏంటంటే ట్రైలర్ చూశాక.. కావాలని మేకర్స్ ఇలా కట్ చేసారా అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు. 


అయితే ఈ సినిమాలో స్టోరీకి ఒక సెటప్ ఉంటుంది కదా. ఇందులో డైరెక్టర్ చేసిన ఆ సెటప్ మాస్టర్స్. ఈ కాన్సెప్ట్ నే సినిమా చుట్టూ అల్లుకున్నాడు. అయితే ఆదిత్య హాసన్ చేసిందేంటంటే... ఎదో వేరే సినిమాలు చూసి కొన్ని క్యారెక్టర్ల తీరు రాసుకున్నట్టుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ రోల్ ఎలాగో ఉంటుంది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా మరీ అమాయకుల్లా చూపించి, ఫారిన్ కి వచ్చేసరికి కాసేపటికే కంప్లీట్ గా మార్చేస్తారు. దానికి ఆడియన్స్ కనెక్ట్ కావచ్చు. డిస్కనెక్ట్ కావచ్చు. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ రాసాడు. ఫైనల్ గా నేను ఎంజాయ్ చేశాను. ఎండింగ్ కి జస్ట్ ఒకే. 

Sep 11, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
4

Below Average

Epic movie reivew

సో ఎపిక్ సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. సో ముందుగా నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే... దీనికి 90స్ సిరీస్ కి ఏంటి సంబంధం. ఎదో ఆ పేరు వాడదాం... దాన్ని చూసి వస్తారు అని పెట్టినట్టుంది. రెండున్నర గంటల సినిమా చూసా.. నాకెక్కడ ఎక్కలే. అండ్ ఆ రిలేటెడ్ 90స్ సీన్స్ అయితే బాగున్నాయి. కానీ అవి తప్ప సినిమాలో ఏం బా...

సో ఎపిక్ సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. సో ముందుగా నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే... దీనికి 90స్ సిరీస్ కి ఏంటి సంబంధం. ఎదో ఆ పేరు వాడదాం... దాన్ని చూసి వస్తారు అని పెట్టినట్టుంది. రెండున్నర గంటల సినిమా చూసా.. నాకెక్కడ ఎక్కలే. అండ్ ఆ రిలేటెడ్ 90స్ సీన్స్ అయితే బాగున్నాయి. కానీ అవి తప్ప సినిమాలో ఏం బాలేవు. అసలు టెక్నికల్లి సినిమా అయితే నాకస్సలు నచ్చలేదు భయ్యా. సినిమాగా చూస్తే ఇదో లవ్ స్టోరీ అంటారు. కానీ లవ్ ఏం అనిపించలేదు. కనిపించలేదు. 


మొత్తం హీరోతో, హీరోయిన్ తో ఎవ్వరితోనూ కనెక్ట్ అవలేం. ప్రతి విషయాన్నీ పైన పైన టచ్ చేస్తారు కానీ, కథలో ఏముండదు. సినిమాలో అసలు హీరోకి కామన్సెన్స్ కూడా లేదు అన్నట్టు చూపించాడు. ఒక్క డైలాగ్ నచ్చలేదు. కామెడీ చాలా ట్రై చేస్తారు కానీ నచ్చలేదు. హైలెట్ ఏంటంటే హీరో హీరోయిన్ల క్యారెక్టర్ ఏది వర్కౌట్ కాదు. వాళ్ళెందుకలా సినిమాలో చేస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ ఉంటది కానీ, దానికి రీసన్ చెప్పరు. ఎదో క్లైమాక్స్ లో ఎదో విషయం చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తారు. కానీ అస్సలు నచ్చలేదు. మిగతా ఆడియన్స్ గురించి ఏమో మరి. ప్రతి దానికి ఎక్క్యూజ్ ఇచ్చినట్టు ఉంటుంది కానీ... మెయిన్ గా సినిమాలో సాగదీస్తారు. దాని వల్ల ఇరిటేషన్ ఉంటుంది సినిమా. ఫైనల్ గా అస్సలు నచ్చలేదు.  




Sep 11, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
4

Below Average

Epic movie Review

ఎపిక్... actuall గా ఈ సినిమా మీరు చూసి ఆదిత్య హాసన్ ఈ మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో దానికి మీరు కనెక్ట్ అయితే, మీరు థియేటర్ లోంచి బైటికి వచ్చేటపుడు ఎస్... మంచి పాయింట్ చెప్పాడు. ఇది మంచి ఎపిక్ స్టోరీ అని బైటికొస్తారు. ఒకవేళ కనెక్ట్ అవకపోతే నాలాగా బైటికి వస్తారు. ఎందుకంటే సినిమాలో డైరెక్టర్ చెప్...

ఎపిక్... actuall గా ఈ సినిమా మీరు చూసి ఆదిత్య హాసన్ ఈ మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో దానికి మీరు కనెక్ట్ అయితే, మీరు థియేటర్ లోంచి బైటికి వచ్చేటపుడు ఎస్... మంచి పాయింట్ చెప్పాడు. ఇది మంచి ఎపిక్ స్టోరీ అని బైటికొస్తారు. ఒకవేళ కనెక్ట్ అవకపోతే నాలాగా బైటికి వస్తారు. ఎందుకంటే సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకుంది మంచి పాయింటే. కానీ సినిమాలో దాని రిలేటెడ్ సీన్స్ నాలుగైదు కూడా కనిపించలేదు. నాకైతే నచ్చలేదు. 


ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగానే మనల్ని నవ్విస్తాయి. అండ్ వైష్ణవి - ఆనంద్ మధ్యలో సీన్స్ బాగున్నాయి. అండ్ వైష్ణవి ఆ క్యారెక్టర్ లో జీవించడానికి ట్రై చేస్తుందా అన్నట్టు అనుమానం వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో చాల సీన్స్ ల్యాగ్ గా అనిపించాయి. పైగా రొటీన్ సీన్స్ ఇలా ఉన్నాయేంట్రా అనిపించేట్టు ఉంటాయి. 


ఇక ఫాదర్ గా శివాజితో మంచి సీన్స్ క్లైమాక్స్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఏంటిరా బాబు ఇలా సాగదీస్తున్నాడు ఏంట్రా అని అనిపిస్తుంది. అండ్ హీరో అయితే బాగా నటించాడు కానీ, హీరొయిన్ రోల్ మళ్ళీ బేబీ క్యారెక్టరే చేసినట్టు ఉందని అనిపించింది మళ్ళీ. ఫైనల్ గా ఆదిత్య లో మంచి డైరెక్టర్ ఉన్నాడు కానీ. కొంచెం ల్యాగ్ పెట్టుకుని... ఎపిక్ ని గొపిక్ లా తీసాడు. 

Sep 11, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
4

Below Average

Epic movie review

ఇక ఎపిక్ సినిమా గురించి చెప్పాలంటే... సో.. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాటిక్ పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది. మంచి జోక్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా పర్లేదు. బానే ఉంది అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది. కొన్ని మంచి మెసేజ్స్ కూడా ఉంటాయి....

ఇక ఎపిక్ సినిమా గురించి చెప్పాలంటే... సో.. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాటిక్ పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది. మంచి జోక్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా పర్లేదు. బానే ఉంది అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది. కొన్ని మంచి మెసేజ్స్ కూడా ఉంటాయి. ఫాదర్ తో మంచి సీన్స్ ఉంటాయి. కానీ అవి తక్కువైపోయాయి. అంటే సందర్భానికి తగట్టు లేవు. అండ్ సినిమాలో క్లైమాక్స్ కూడా బాగుంది.


అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. అండ్ ఇండియన్ కల్చర్ కి చాలా దూరంగా ఉంటాయి అవి. ఎందుకంటే వాటి వల్ల ఫ్యామిలీస్ చాలా దూరంగా ఉంటారు ఆ సీన్స్. అవి చూస్తే ఒక రకంగా బేబీ సినిమాయే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. నేనేమంటున్నానంటే సినిమా అంతా బూతులు చూపించి ఇదేదో ఎపిక్ కళాఖండం అంటే ఎలా ఒప్పుకోవాలి. నేను బేసిగ్గా ఇలాంటి రివ్యూ చేస్తానని అనుకోలేదు. ఏమో గైస్... ఈ సినిమా నన్ను కొంచెం ట్రిగర్ చేసింది. ఏమో నాకైతే నచ్చలేదు. మరి మీకెలా అనిపించిందో చెప్పండి.

Sep 11, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
4

Below Average

Epic first semister Review

ఎపిక్... ఎపిక్ మూవీ ఎలా ఉందంటే... నాతోతైటే కాదండి.. అసలు ఎలా ఉందని సింపుల్ గా చెప్పాలంటే లవంగం లాంటి సినిమా... అంతే ఇక.. అసలు ఏంట్రా ఇది అన్నట్టుంది. అసలు ఇది రెలీటబుల్ సినిమా అంటే.. అన్ రెలాటబుల్ సినిమా.. కూడా కాదు.. ఇరిటటబుల్ సినిమా.. అంత ఇరిటేటింగ్ గా ఉంది. చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అన్నిటిక...

ఎపిక్... ఎపిక్ మూవీ ఎలా ఉందంటే... నాతోతైటే కాదండి.. అసలు ఎలా ఉందని సింపుల్ గా చెప్పాలంటే లవంగం లాంటి సినిమా... అంతే ఇక.. అసలు ఏంట్రా ఇది అన్నట్టుంది. అసలు ఇది రెలీటబుల్ సినిమా అంటే.. అన్ రెలాటబుల్ సినిమా.. కూడా కాదు.. ఇరిటటబుల్ సినిమా.. అంత ఇరిటేటింగ్ గా ఉంది. చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అన్నిటికి మించి హీరో కి హీరోయిన్ ఒక్క రోజులోనే పరిచయం అవుద్ది. అప్పుడే ప్రేమ ముద్దు వరకు వెళ్తుంది. పైగా రూమ్ కి కూడా వెళ్ళిపోతుంది, లివింగ్ రిలషన్షిప్ కి. 


అసలు డైరెక్టర్ ఎలా రాశాడో కూడా అర్ధం కాదు. మంచి ఫర్నిచర్స్ తో మంచి ఫ్లాట్ దొరుకుతుంది లండన్ లో హీరోకి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హీరోకి అంత ఈజీగా ఎలా దొరుకుతాయి అన్ని... నాకైతే నాట్ పాసిబుల్ లాగానే ఉన్నాయి అన్ని సీన్లు. అండ్ హీరో కెరీర్ లో ఏదో చేద్దామని వచ్చి, రాంగ్ రూట్లోకి వచ్చి ఇరుక్కున్నట్టు చూపిస్తారు. అసలు ఇదంతా ఎందుకు.. ఏ సీన్ కూడా రియాలిటీకి తగ్గట్టు లేదు. అసలు ఈ సినిమా ఎవరికీ నచ్చుతుందంటే బేబీ లాంటి సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నాన్న ఎమోషన్స్ కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంది. ఓవరాల్ గా నాకు నచ్చలేదు. 


Sep 11, 2026 Watch
One India
One India Website
6

Above Average

Epic semister movie review

EPIC-First Semester Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌'. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఆదిత్...

EPIC-First Semester Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌'. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ అండ్ లైఫ్ డ్రామా తాజాగా ప్రేక్షకుల ముందు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. డైరెక్టర్ ఆదిత్య ఈ సినిమాకు మంచి కథను ఎంచుకున్నా, ఆ కథకి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు.


సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, నెమ్మదించిన వేగం. ఫస్టాఫ్, అలాగే సెకండాఫ్‌లో ఎక్కువ శాతం సీన్లు ప్రధాన జంట మధ్య ఉండే డైలాగ్స్ చుట్టూనే తిరుగుతాయి. ఇవి పదే పదే ఒకే తరహాలో సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతాయి. క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్‌ లో ఎమోషనల్ సీన్లు ఉన్నప్పటికీ.. ఇవి రావడం చాలా ఆలస్యమైంది. అలాగే '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో ఉన్న కనెక్షన్ కూడా స్టోరీకి పెద్దగా ఉపయోగపడలేదు.


ఓవరాల్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి ఆలోచనతో వచ్చినప్పటికీ.. స్క్రీన్‌ప్లే సరిగ్గా రాయకపోవడంతో స్టోరీ ముందుకు సాగదు. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా.. మొత్తంగా 'ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌' అనేది లవ్ స్టోరీలను ఇష్టపడే వారిని మెప్పించే ప్రేమకథా చిత్రం. అంచనాలు లేకుండా వెళ్తే చూడదగిన చిత్రం.


Sep 11, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Epic Movie Review

‘90s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబం, కెరీర్ అంశాల చుట్టూ సాగుతుంది. సినిమా కోసం కలలు కనే ఆదిత్యను కుటుంబం లండన్ పంపి...

‘90s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబం, కెరీర్ అంశాల చుట్టూ సాగుతుంది. సినిమా కోసం కలలు కనే ఆదిత్యను కుటుంబం లండన్ పంపించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడ కడలితో పరిచయం, ఆ తర్వాత ప్రేమ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది ప్రధాన కథాంశం.


సినిమా ప్రారంభంలో వచ్చే కుటుంబ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆనంద్ దేవరకొండ సహజమైన నటనతో మెప్పించగా, వైష్ణవి చైతన్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. శివాజీ, వాసుకి సన్నివేశాలు కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. హేశం అబ్దుల్లా సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి.


అయితే కథ, కథనం విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించడంతో పాటు, సినిమా అక్కడక్కడా నెమ్మదిస్తుంది. ప్రేమకథను కూడా మరింత బలంగా చూపించి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. మొత్తంగా మంచి ప్రయత్నంగా నిలిచిన ‘Epic’.. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓసారి ఓకే అనిపిస్తుంది.

Sep 11, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Epic movie review

ఎపిక్ సినిమా విషయానికి వస్తే... పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన క...

ఎపిక్ సినిమా విషయానికి వస్తే... పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా వనపర్తి నుంచి యూకేకి వెళ్లి అక్కడ చదువుకొని ఇక్కడకు వచ్చి దర్శకుడు అయ్యాడు. ప్రమోషన్స్ లో దర్శకుడి లైఫ్ లో, యూకే లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు అన్నారు 


కానీ సినిమా చూస్తే ఇది దర్శకుడి బయోపిక్ అనిపిస్తుంది. ఇది ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. క్లైమాక్స్ లో కథ పూర్తి కాకుండా పార్ట్ 2 ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. దర్శకుడు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకొని బాగానే రాసుకొని తెరకెక్కించినా సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా విదేశాల్లో చదువుకోడానికి వెళ్లి ఒకే రూమ్ లో జీవించిన ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య జరిగే కథ. 

Sep 11, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Epic First Semister Movie review

ఎపిక్'లో దర్శకుడు ఆదిత్య హాసన్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చూపించానని తెలిపారు. ఎవరి పాయింట్ ఏమిటి? అనేది పక్కన పెడితే... ప్రేక్షకులు సినిమాగా చూస్తారు. అందులోనూ '#90స్' వెబ్ సిరీస్ విజయం, 'బేబీ' విజయం తర్వాత ఆనంద్ - వైష్ణవి జంటగా నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉందా?...

ఎపిక్'లో దర్శకుడు ఆదిత్య హాసన్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చూపించానని తెలిపారు. ఎవరి పాయింట్ ఏమిటి? అనేది పక్కన పెడితే... ప్రేక్షకులు సినిమాగా చూస్తారు. అందులోనూ '#90స్' వెబ్ సిరీస్ విజయం, 'బేబీ' విజయం తర్వాత ఆనంద్ - వైష్ణవి జంటగా నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉందా? అంటే... అనుకున్నంత లేదనే చెప్పాలి. ఆదిత్య హాసన్ చెప్పాలనుకున్న పాయింట్‌లో స్పష్టత లోపించింది. పెర్ఫార్మన్స్ పరంగా హీరోహీరోయిన్లు బాగా నటించారు. 


చదువుల కోసం విదేశాలు వెళ్ళిన విద్యార్థులు 'ఎపిక్'లో తమను తాము చూసుకునే అవకాశాలు ఎక్కువ. కథ, క్యారెక్టర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతారు కూడా. కానీ, తెలుగు రాష్ట్రాల్లో యువతకు అర్థం కావడం కాస్త కష్టమే. 'ఎపిక్' ఫస్టాఫ్ సీన్స్ నవ్వించాయి. పాటలు మెప్పించాయి. కానీ సెకండాఫ్ సంభాషణలు ప్రేక్షకుల మనసులను తాకేలా లేవు. క్యారెక్టర్లలో సీరియస్‌నెస్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో ఓ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. అయితే... ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటన - ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొంత కవర్ చేసింది. థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.


Sep 11, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Epic movie review

90s – A Middle Class Biopic’తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘Epic’.. ప్రేమ, ఫ్యామిలీ, కెరీర్ చుట్టూ తిరిగే కథ. చిన్నప్పటి నుంచి సినిమా మీద పిచ్చితో ఉండే ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)ను కుటుంబం లండన్ పంపిస్తుంది. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అతని జీవితాన్ని మరో మలుపు తిప్పుతు...

90s – A Middle Class Biopic’తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘Epic’.. ప్రేమ, ఫ్యామిలీ, కెరీర్ చుట్టూ తిరిగే కథ. చిన్నప్పటి నుంచి సినిమా మీద పిచ్చితో ఉండే ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)ను కుటుంబం లండన్ పంపిస్తుంది. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అతని జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత ప్రేమ, కెరీర్, లైఫ్ మధ్య అతని జర్నీ ఎలా సాగిందనేదే సినిమా.


సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను దర్శకుడు బాగానే డీల్ చేశాడు. ఆనంద్ దేవరకొండ తన ఇన్నోసెంట్ లుక్, నేచురల్ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కు బాగా సెట్ అయ్యాడు. వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మంచి ప్లస్. శివాజీ, వాసుకి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. హేశం అబ్దుల్లా మ్యూజిక్, BGM సినిమాకు మంచి ఫీల్ ఇచ్చాయి.


అయితే అసలు సమస్య కథ, స్క్రీన్‌ప్లే దగ్గరే వస్తుంది. హీరో గోల్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, లవ్ ట్రాక్‌కు సరైన ఎమోషనల్ బిల్డప్ లేకపోవడం మైనస్. కొన్ని సీన్స్ రొటీన్‌గా అనిపించడంతో పాటు సినిమా అక్కడక్కడా ల్యాగ్ అవుతుంది.

మొత్తంగా ‘Epic’లో మంచి ఐడియా, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నాయి.. కానీ వాటిని కలిపే బలమైన కథనం మాత్రం మిస్సైంది. ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు.. కానీ ‘ఎపిక్’ అనిపించేంత ఇంపాక్ట్ మాత్రం ఇవ్వదు.

Sep 11, 2026 Read Review
Gulte
Gulte Website
5

Average

Epic movie Review

Epic movie review ... directed by Aditya hasanPositives:1.⁠ ⁠Dialogue Writing2.⁠ ⁠Situational Humour In First HalfNegatives:1.⁠ ⁠Second Half2.⁠ ⁠Inconsistent Narration3.⁠ ⁠Lack of Dramatisation4.⁠ ⁠Overreliance on ‘RealityOverall, EPIC has its share of positives but they were few and far between. Af...

Epic movie review ... directed by Aditya hasan


Positives:


1.⁠ ⁠Dialogue Writing

2.⁠ ⁠Situational Humour In First Half


Negatives:


1.⁠ ⁠Second Half

2.⁠ ⁠Inconsistent Narration

3.⁠ ⁠Lack of Dramatisation

4.⁠ ⁠Overreliance on ‘Reality


Overall, EPIC has its share of positives but they were few and far between. After a promising first half, the film gets into a monotonous zone and gets tedious to sit through. The overreliance on telling a personal story as it happened without adding enough drama, worked against the film. You may give it a try for some sensible writing and a few good moments in the first half but it definitely is not what the audience expected from Aditya Hasan’s debut feature film.


Bottom Line – Epic ‘Struggles’


Rating – 2.25/5

Sep 11, 2026 Read Review
5

Average

Epic movie review

ఫారెన్‌ వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ జీవితాలను అద్దంపట్టే కథతో రూపొందించిన చిత్రమిది. ఒక అబ్బాయి ప్రేమ, పెళ్లి కంటే ముందు లైఫ్‌లో సెటిల్‌ కావడమనేది మంచి సందేశాన్ని అందించిన చిత్రమిది. అమ్మాయి, ప్రేమ వంటి అంశాలు కూడా ముఖ్యమే, కానీ వాటి మాయలో పడి గోల్‌ ని మిస్‌ అయితే లైఫ్‌ తలక్రిందులవుతుందనే విషయాన్న...

ఫారెన్‌ వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ జీవితాలను అద్దంపట్టే కథతో రూపొందించిన చిత్రమిది. ఒక అబ్బాయి ప్రేమ, పెళ్లి కంటే ముందు లైఫ్‌లో సెటిల్‌ కావడమనేది మంచి సందేశాన్ని అందించిన చిత్రమిది. అమ్మాయి, ప్రేమ వంటి అంశాలు కూడా ముఖ్యమే, కానీ వాటి మాయలో పడి గోల్‌ ని మిస్‌ అయితే లైఫ్‌ తలక్రిందులవుతుందనే విషయాన్ని ఇందులో సున్నితంగా చెప్పాడు దర్శకుడు ఆదిత్య హాసన్‌. అయితే సినెమాల్కో చాలా సీన్స్ లాగ్‌ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం చాలా నీట్‌గా డీల్‌ చేశాడు. అక్కడే దర్శకుడి టాలెంట్‌ కనిపిస్తుంది. రొటీన్‌కి భిన్నంగా నడిపించినతీరు బాగుంది. ఆలోచింప చేసేలా ఉంది.


ఇక దర్శకుడు ఆదిత్య హాసన్‌ ఈ మూవీ కథని అదిరిపోలా రాసుకున్నారు.. డైలాగ్‌లు అదిరిపోయాయి. చాలా వరకు రియాలిటీకి దగ్గరగా మూవీని తెరకెక్కించారు. ఇందులో హీరో పాత్రతో కుర్రాళ్లు రిలేట్‌ అవుతారు, హీరోయిన్‌ పాత్రతో చాలా మంది అమ్మాయిలు రిలేట్‌ అవుతారు. పేరెంట్స్ కి సంబంధించిన పాత్రలు పెద్దవాళ్లకి కనెక్ట్ అవుతాయి. ఇలా అందరిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ఎపిక్‌. జెంజీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి యూత్‌ఫుల్‌ లవ్‌ రొమాంటిక్‌ కామెడీగా ఆకట్టుకుంటుంది, ఆలోచింప చేస్తుంది. బాధ్యతల్ని గుర్తు చేస్తుంది.




Sep 11, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Epic Movie Review

‘90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ.. లవ్, కెరీర్, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ, ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ...

‘90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ.. లవ్, కెరీర్, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ, ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఆనంద్ తన ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో నేచురల్‌గా మెప్పించగా, వైష్ణవి కూడా మంచి నటన కనబరిచింది.


హేశం అబ్దుల్లా మ్యూజిక్, BGM సినిమాకు ప్లస్. అయితే కథ, స్క్రీన్‌ప్లే అంతగా బలంగా లేకపోవడం, రొటీన్ సీన్స్, ల్యాగ్ మైనస్‌గా మారాయి. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం నిరాశపరుస్తుంది. ఓవరాల్‌గా టైమ్‌పాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ‘Epic’ ఓకే అనిపించొచ్చు.

Sep 11, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Epic Movie review

చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఇరవై నాలుగేళ్ళ ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. ఈ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి. అయితే కథను కన్‌ఫ్యూజ్‌ కాకుండా తెరపై ఎలా అవిష్కరించాం అన్నది చాలా ప్రధానం. కానీ దర్శకుడు తను రాసుకున్న సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథగా చెప్పుకోవాలంటే ఇందులో ఏమీ లేదు. ఒకే గదిలో ఆది...

చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఇరవై నాలుగేళ్ళ ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. ఈ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి. అయితే కథను కన్‌ఫ్యూజ్‌ కాకుండా తెరపై ఎలా అవిష్కరించాం అన్నది చాలా ప్రధానం. కానీ దర్శకుడు తను రాసుకున్న సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథగా చెప్పుకోవాలంటే ఇందులో ఏమీ లేదు. ఒకే గదిలో ఆదిత్యా, కడలి సంభాషణలు, అలాగే ఊళ్లో ఉన్న స్నేహితుడితో ఫోన్‌ సంభాషణ బావున్నప్పటికీ చూసిన సన్నివేశమే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ సన్నివేశాలను కాస్తంత ట్రిమ్‌ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సితార సంస్థకు తగ్గట్టు గ్రాండ్‌గా ఉన్నాయి. 


ఇక సినిమాలో హీరో హీరోయిన్ల తొమ్మిది నెలల జర్నీకి సరైన ముగింపు ఇవ్వలేదనిపిస్తుంది. ఎండింగ్‌ పాయింట్‌ బలంగా లేదు. ఇంకేదో చెప్పాలి.. చెప్పలేకపోయాం అన్నట్లుగా అసంతృప్తిగా సినిమా ముగిసిపోయింది. సినిమాలో యూత్‌ఫుల్‌ మూమెంట్స్‌ ఎన్నో ఉన్నప్పటికీ.. వాటిని కలిపి బలమైన కథగా మార్చడంతో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. ‘90’s లాంటి సిరీస్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఓ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడి సినిమా అంటే డెఫినెట్‌ గా అంచనాలు ఉంటాయి. కానీ వాటిని దర్శకుడు అందుకోలేకపోయాడు. ఈ సినిమా విషయంలో అతని రాత.. తీత అంచనాలకు అనుగుణంగా లేవు. ‘90’s సిరీస్‌ కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఈ సినిమా కొందరు మాత్రమే చూసేలా ఉంటుంది.



Sep 11, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Epic movie review

నిజ జీవితంలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో ప్రేమలో పడేవాళ్లే కాబట్టి.. మిగతా జానర్లతో పోలిస్తే లవ్ స్టోరీల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఐతే ‘ఎపిక్’లో ప్రేమజంట మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్.. ఆయా సమయాల్లో వారి మధ్య జరిగే కాన్వర్జేషన్ల వరకు భలేగా అనిపిస్తాయి. అబ్బాయి-అమ్మాయి కలిసిన తొలి రోజే ముద్దు ప...

నిజ జీవితంలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో ప్రేమలో పడేవాళ్లే కాబట్టి.. మిగతా జానర్లతో పోలిస్తే లవ్ స్టోరీల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఐతే ‘ఎపిక్’లో ప్రేమజంట మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్.. ఆయా సమయాల్లో వారి మధ్య జరిగే కాన్వర్జేషన్ల వరకు భలేగా అనిపిస్తాయి. అబ్బాయి-అమ్మాయి కలిసిన తొలి రోజే ముద్దు పెట్టేసుకోవడం.. తర్వాత మంచం ఎక్కేయడం లాంటి సీన్లు చూసి అందరినీ ఈ గాటన కట్టేస్తారా? ఫారిన్లో చదువుకునే వాళ్లంతా ఇంతేనా అనే అభ్యంతరాలు వ్యక్తం అయితే కావచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు టైటిల్ కిందే ఇది ’నా పాయింట్ ఆఫ్ వ్యూ’ అని చెప్పుకున్నాడు కాబట్టి అందరినీ కలిపి జనరలైజ్ చేసేశాడని అనుకోవాల్సిన పని లేదు. 


అయితే ప్రేమకథలో కాన్ఫ్లిక్ట్ రావడానికి ముందు వరకు ఆదిత్య-కడలి పాత్రల మధ్య సన్నివేశాలన్నీ చాలా వరకు అందంగా రూపుదిద్దుకున్నాయి. అయితే ప్రేమకథలో సమస్యంటూ మొదలయ్యాక అది ప్రేక్షకులకు ఒకింత అసహనం కలిగించడం మామూలే. కానీ ఇందులో దాని మోతాదు మరీ ఎక్కువైపోయింది. కొన్ని సీన్లు కొంచెం సిల్లీగా.. సాగతీతగా అనిపిస్తాయి. ఆఖర్లో ఎపిక్ ‘ఫైనల్ సెమిస్టర్’ అంటూ పార్ట్-2కు లీడ్ ఇస్తుంటే.. ఎవరైనా ఎగ్జైట్ అయ్యేవాళ్లు ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.


ఓవరాల్ గా కథా కథనాల పరంగా సగటు లవ్ స్టోరీలను దాటి డైరెక్టర్ ఆశ్చర్యపరచలేకపోయాడు. ముఖ్యంగా లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్.. ఆ తర్వాతి పరిణామాలను రొటీన్ గా రాసుకుని.. కథనాన్ని మరీ స్లోగా నడిపించడం ద్వారా నిరాశకు గురిచేశాడు ఆదిత్య. చివరగా: ఎపిక్.. తియ్యగా మొదలై.. చేదుగా ముగిసింది.


Sep 11, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Epic Movie Review

ఎపిక్ సినిమాకు కర్త, కర్మ, క్రియ దర్శకుడు ఆదిత్య హసన్. కథ, కథనాలు రాసుకొన్న తీరు చాలా మెచ్యుర్డ్‌ గా, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా ఉండటం సినిమాకు విలువను పెంచింది. నేటి తరం యువకుల జీవనశైలిని ప్రతిబింబించేలా చూపిస్తూనే.. తల్లిదండ్రుల ఎమోషన్స్, స్నేహితుల బాధ్యతను ప్రతీ సీన్‌ లో చెప్పిన విధానం ఈ సినిమాను...

ఎపిక్ సినిమాకు కర్త, కర్మ, క్రియ దర్శకుడు ఆదిత్య హసన్. కథ, కథనాలు రాసుకొన్న తీరు చాలా మెచ్యుర్డ్‌ గా, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా ఉండటం సినిమాకు విలువను పెంచింది. నేటి తరం యువకుల జీవనశైలిని ప్రతిబింబించేలా చూపిస్తూనే.. తల్లిదండ్రుల ఎమోషన్స్, స్నేహితుల బాధ్యతను ప్రతీ సీన్‌ లో చెప్పిన విధానం ఈ సినిమాను క్లాసిక్‌గా మలిచింది. లవ్, రొమాన్స్, కామెడీ అంశాలతో మొదటి భాగాన్ని ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు. ఫీల్‌గుడ్‌ లాంటి ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్‌ను నడిపించాలంటే ఎవరికైనా కత్తి మీద సాములా అనిపిస్తుంది. 


సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల మానసిక సంఘర్షణ చూస్తే.. 90 జనరేషన్ కాకుండా నేటి తరం యువతీ, యువకుల లైఫ్‌ కు సాక్ష్యంగా నిలిచేలా చేస్తుంది. కాకపోతే సెకండాఫ్‌ లో కొంత మేరకు సాగదీసినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్‌కు కంప్లీట్‌నెస్ లేకపోవడం కొంత అసంతృప్తి గురి చేసేలా చేస్తుంది. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాన్ని, మానసిక సంఘర్షణను దర్శకుడు ఆదిత్య చూపించడంలో పక్కాగా సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. ఈ వారం మీరు చూసే సినిమాల జాబితాలో ఎపిక్ ని హాయిగా చేర్చుకోవచ్చు.


Sep 11, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Epic Movie Review

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బేబి జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సినిమా ‘ఎపిక్’. అయితే ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా విషయానికి వస్తే... దాదాపు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసినవారికి ఈ...

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బేబి జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సినిమా ‘ఎపిక్’. అయితే ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా విషయానికి వస్తే... దాదాపు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసినవారికి ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సినిమా ఆరంభంలోని కొన్ని నిమిషాల కథనం డీసెంట్ గా చాలా ప్లెజెంట్ గా సాగుతుంది. 


ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఓకే కానీ అసలు లీడ్ జంట నడిచే సన్నివేశాలు ఆ కథనమే ఇబ్బందికరంగా ఒక క్లారిటీ లేకుండా చాలా రొటీన్ గా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అసలు దర్శకుడు ఆ ఇద్దరితో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేది ఎంతకీ అర్ధం కాదు. అలాగే ఈ సినిమాలో ఇంత సాగదీత అవసరమా అని అనిపించక మానదు. ఇలా వీరి ట్రాక్ లో బలం లోపించినట్టు అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఎపిక్’ లో అక్కడక్కడా మూమెంట్స్ బాగున్నాయి. కొన్ని ఫ్యామిలీ సీన్స్ లో ఎమోషన్స్, అలాగే ఫన్ సీన్స్ బాగున్నాయి. లీడ్ జంట కూడా ఇందులో బాగా చేశారు. కానీ కథనం ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సో దీనితో అక్కడక్కడా సినిమా ఆకట్టుకుంటుంది.


Sep 11, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Epic Movie Review

‘ఎపిక్’ మూవీని చూసిన తర్వాత ఇది మన ‘90స్’ తీసిన ఆదిత్య హాసన్ రాసుకున్న కథేనా? మనోడు తీసిన సినిమానేనా? అని అనిపిస్తుంది. ‘90స్’ తర్వాత ఆదిత్య హాసన్ మీద పెరిగిన బాధ్యత అంతా ఇంతా కాదు. పైగా ‘90స్’ వరల్డ్ నుంచి తీసుకున్న ఆదిత్య పాత్రతో ఈ ‘ఎపిక్’ అనే సినిమాని రాసుకున్నాడు. కానీ ‘ఎపిక్’ చూశాకా చాలా మంది న...

‘ఎపిక్’ మూవీని చూసిన తర్వాత ఇది మన ‘90స్’ తీసిన ఆదిత్య హాసన్ రాసుకున్న కథేనా? మనోడు తీసిన సినిమానేనా? అని అనిపిస్తుంది. ‘90స్’ తర్వాత ఆదిత్య హాసన్ మీద పెరిగిన బాధ్యత అంతా ఇంతా కాదు. పైగా ‘90స్’ వరల్డ్ నుంచి తీసుకున్న ఆదిత్య పాత్రతో ఈ ‘ఎపిక్’ అనే సినిమాని రాసుకున్నాడు. కానీ ‘ఎపిక్’ చూశాకా చాలా మంది నిరుత్సాహ పడే అవకాశం ఉంటుంది. ‘90స్’తో అద్భుతమైన ఫీల్ కలిగించిన ఆదిత్య హాసన్.. ‘ఎపిక్’తో మాత్రం ఫీల్‌ను కలిగించలేకపోయాడు. 


అసలు హీరో, హీరోయిన్ల ఉద్దేశం ఏంటి? వారి టార్గెట్ ఏంటి? ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు.. ఏ మాత్రం అర్థం కాలేదు. ఇక హీరో హీరోయిన్ గురించి ఏమైనా చెప్పాలంటే.. బేబీ లో క్యారెక్టర్సే ఇందులో చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎపిక్ అనే టైటిల్‌కి అయితే ఆదిత్య హాసన్ న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. ‘90స్’ రేంజ్‌లో ఇది ట్రెండ్ అయి ప్రభంజనం సృష్టించేంత అయితే లేదనిపిస్తుంది. ‘ఎపిక్’ యూత్‌కి కొన్ని చోట్ల హాయిగా, ఇంకొన్ని చోట్ల భారంగా అనిపించే అవకాశం ఉంది. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఆదిత్య హాసన్ కొన్ని సబ్జెక్టులు పాస్ అయినా.. కొన్నింట్లో ఫెయిల్ అయ్యాడు.


Sep 11, 2026 Read Review
Ideal Brain
Ideal Brain Twitter Channel
6

Above Average

Epic Movie review

#Epic is a mature film. Not a typical love story. A story which is practical.Both Anand Deverakonda and Vaishnavi have done a fabulous job.Director Aditya Hasan does his job with conviction and he credited it as Aditya Hasan PoV at the end. It has got ups and downs in the second half. But there are...

#Epic is a mature film. Not a typical love story. A story which is practical.


Both Anand Deverakonda and Vaishnavi have done a fabulous job.


Director Aditya Hasan does his job with conviction and he credited it as Aditya Hasan PoV at the end.


It has got ups and downs in the second half. But there are a few strongly written scenes that stay with you.


Worth a watch!

Sep 11, 2026 Read Review
Venky Reviews
Venky Reviews Twitter Channel
5

Average

Epic movie review

#Epic A Relationship Drama That Never Really Connects!First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing conflict around the live in relationship, and the second half becomes tiring with forced emotions and cha...

#Epic A Relationship Drama That Never Really Connects!


First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing conflict around the live in relationship, and the second half becomes tiring with forced emotions and characters behaving inconsistently. Even the parents angle towards the end fails to create much impact, leading to an unsatisfying climax.


The UK setting adds very little, and for a film trying to be relatable, a lot of it just feels artificial. Hesham’s music is decent. Performances by the lead cast are sincere but the writing lets them down big time. Not up to the mark!


Rating: 2/5

Sep 11, 2026 Read Review

Public Reviews

5 Avg: 4.4/10
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Epic movie Review

Epic is a below par attempt that blends family emotions, romance, and career aspirations. Anand Deverakonda and Vaishnavi Chaitanya deliver natural performances, with their chemistry being one of the film’s highlights. The family scenes and music also work well in the movie. but family audiance did'...

Epic is a below par attempt that blends family emotions, romance, and career aspirations. Anand Deverakonda and Vaishnavi Chaitanya deliver natural performances, with their chemistry being one of the film’s highlights.


The family scenes and music also work well in the movie. but family audiance did'nt come to the theater. However, the weak screenplay and slow pacing hold the film back. The hero’s career journey isn’t explored effectively, while the romance gets more attention than necessary.

A few bold and intimate scenes feel forced and don’t add much to the story.


Overall, Epic has a good concept and some engaging moments, but inconsistent writing and unnecessary romantic portions make it an average watch.

Sep 11, 2026
A
Arige Srikanth Private Employee
3

Not Good

Epic movie Review

just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi. inka...

just ippude ‘Epic’ movie chusaa.. honestly naaku assalu connect avvaledu. Story concept interesting ga unna, screenplay chala weak ga undi. Anand Deverakonda, Vaishnavi iddaru natural ga chesaaru, chemistry kuda bagundi. but movie lo konni places lo unnecessary romance scenes ekkuva aipoyaayi.


inka simple ga cheppalante reason lekunda, situation demand cheyakunna romantic sence pettaru directer.. asalu audiance ivi chusi vastarani anukunnado emo mari.


Story ki pedda value ledu... ledu anadam kanna.. directer values ivvaledani chepali.. evo konni sences pedithe aadestundi anukunnademo.

konni bold scenes valla flow disturb ayyinattu anipinchindi. and family audiance assalu theaters ki raru...


ikkadithe ee cinema katham.. weekend lo shed ki vellipotundi anipistundi.

Sep 11, 2026
M
Mulollu Praveen Kumar CA/Advocate
5

Average

Epic movie Review

‘Epic’ first semister movie నుంచి చాలా expect చేసి వెళ్లాను.. కానీ సినిమా చూస్తున్నంతసేపు “ఇంకెప్పుడు అయిపోతుందా?” అనే feeling వచ్చింది. mainly Hero character కి clear goal లేకపోవడం, love storyకి proper build-up లేకపోవడం major minus. Anand – Vaishnavi chemistry ఉన్నా, దాన్ని support చేసే strong sce...

‘Epic’ first semister movie నుంచి చాలా expect చేసి వెళ్లాను.. కానీ సినిమా చూస్తున్నంతసేపు “ఇంకెప్పుడు అయిపోతుందా?” అనే feeling వచ్చింది. mainly Hero character కి clear goal లేకపోవడం, love storyకి proper build-up లేకపోవడం major minus.


Anand – Vaishnavi chemistry ఉన్నా, దాన్ని support చేసే strong scenes మాత్రం లేవు. First half కొంత వరకు okay అనిపించినా, second half పూర్తిగా drag అయినట్టు అనిపించింది. Routine scenes, weak screenplay వల్ల emotional moments కూడా పెద్దగా impact ఇవ్వలేదు.


Music మాత్రం decent. Overall గా మంచి ideaని తీసుకుని, దానికి సరైన కథనం ఇవ్వలేకపోయిన సినిమా. నా opinionలో అయితే ‘Epic’ కన్నా ‘Average’ అనే word నే ఎక్కువగా suit అవుతుంది.

Sep 11, 2026
A
4

Below Average

Epic movie review

Just now ‘Epic’ first semister చూసా.. honestly, సినిమా decent గా ఉంది. Anand Deverakonda చాలా naturalగా చేశాడు, Vaishnavi కూడా తన roleలో బాగుంది. ఇద్దరి chemistry సినిమాకు main highlight.Family scenes అయితే చాలా relatableగా అనిపించాయి. but heavy bold sences. Music, BGM కూడా మంచి feel ఇచ్చాయి.కానీ st...

Just now ‘Epic’ first semister చూసా.. honestly, సినిమా decent గా ఉంది. Anand Deverakonda చాలా naturalగా చేశాడు, Vaishnavi కూడా తన roleలో బాగుంది. ఇద్దరి chemistry సినిమాకు main highlight.


Family scenes అయితే చాలా relatableగా అనిపించాయి. but heavy bold sences. Music, BGM కూడా మంచి feel ఇచ్చాయి.


కానీ story విషయానికి వస్తే ఇంకా strongగా ఉండాల్సింది. First half engagingగా ఉన్నా, second halfలో అక్కడక్కడా lag feel అవుతుంది.

Love track కూడా ఇంకాస్త depthతో ఉంటే emotional connect ఇంకా బాగుండేది.


Overal lగా ఇది good material కాకపోయినా, friends తో కలిసి chill గా చూడటానికి ఒకసారి try చేయొచ్చు. expectations లేకుండా వెళ్తే decent experience. other wise dissapointment.

Sep 11, 2026
T
Tharuni Valluru Small Business Owner
5

Average

Epic movie Review

నాకు ‘Epic’ సినిమా ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ చాలా నేచురల్‌nగా చేశాడు. వైష్ణవి కూడా బాగుంది, ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మ్యూజిక్, BGM కూడా నచ్చాయి. కానీ సెకండాఫ్‌ కి వచ్చేసరికి కథ కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించింది. కొన్ని సీన్స్...

నాకు ‘Epic’ సినిమా ఓవరాల్‌గా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ బాగున్నాయి. ఆనంద్ దేవరకొండ చాలా నేచురల్‌nగా చేశాడు. వైష్ణవి కూడా బాగుంది, ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మ్యూజిక్, BGM కూడా నచ్చాయి.


కానీ సెకండాఫ్‌ కి వచ్చేసరికి కథ కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉన్నాయి. లవ్ స్టోరీని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ చాలా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ కలగొచ్చు.

Sep 11, 2026

About This Movie

Story : 

వనపర్తికి చంద్ర శేఖర్ (శివాజీ) భార్య శోభారాణి (వాసుకి) ల చిన్నకొడుకు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)ను పెద్ద చదువులు చదివిద్దామని చూస్తే, అతను మాత్రం సినిమా డైరెక్టర్ అవుతానన్న డ్రీం తో బతుకుతుంటాడు. ఇది చూసి విసిగిపోయిన చంద్రశేఖర్, తన ఆర్ధిక స్థోమత సరిపోకున్నా, తెలిసిన వాళ్ళ సాయంతో ఆదిత్యని లండన్‌ కి పంపించి చదివిస్తారు. ఊరు, సినిమా తప్పా మరో ప్రపంచం తెలియని ఆదిత్య ఒక్కసారిగా లండన్‌ లో అడుగు పెడతాడు. అయితే  అక్కడ పరిచయమైన కడలి (వైష్ణవి చైతన్య) తో ప్రేమలో పడతాడు ఆదిత్య. ఎంతలా అంటా తక్కువ పరిచయంలోనే రూమ్ కి వచ్చేస్తుంది. ఈ క్రమంలో తన కెరీర్ కోసం వచ్చిన ఆదిత్య పక్కదారి తప్పాడా? ఆదిత్య - కడలి జర్నీ ఎంత వరకు వెళ్తుంది? ఫ్యామిలీ అండ్ కెరీర్ గురించి ఆదిత్య అలోచించి లైఫ్ లో ముందుకెళ్ళడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

ఈ ఎపిక్ సినిమా 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసిన వారికి కాస్త తొందరగా కనెక్ట్ అవుతుంది. ఆ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ సీక్వెల్ అన్నట్టే. కానీ ఆ సిరీస్ కి ఏమాత్రం సంబంధం లేనట్టే ఉంటుంది సినిమా. ఇదొక డిఫరెంట్ టీనేజ్ లవ్ స్టోరీ లాగానే తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. సినిమాలో ఆదిత్య ఫారిన్ వెళ్లేంత వరకు మంచి ఫ్యామిలీ సీన్స్ తో ఆహ్లాదంగా సాగుతుంది. ఇక  ఆనంద్ దేవరకొండ తన రోల్ లో న్యాచురల్ గా నటించాడు. ఊళ్ళో పెరిగిన కుర్రాడిలా అమాయకుడిలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని బాగా ప్లే చేసాడు. అలాగే వైష్ణవి కూడా తన గ్లామర్ షో తోనే కాకుండా, నటన పరంగానూ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక శివాజీ - వాసుకిలపై ఫ్యామిలీ సీన్స్ బిగ్ ప్లస్ పాయింట్. కానీ వారి నిడివి సినిమాలో ఎక్కువ ఉండదు. 

 

Minus Points :

ఈ సినిమాకి 90స్ మిడ్స్ సీరిస్ తో కలిపి నేపథ్యాన్ని ఎంచుకోవడం కథకి ప్లస్ అయినా, ఈ సినిమా స్టోరీని సరిగా రాసుకోలేకపోవడమే మైనస్ అయింది. ఎలా అంటే క్యారెక్టర్స్ బాగానే రాసుకున్నా, సినమాలో హీరో గోల్ ఏంటో చెప్పి దాని కోసం కష్టపడే ఒక్క సీన్ ని కూడా సినిమాలో సరిగాచూపించలేదు. అండ్ లీడ్ పెయిర్స్ మధ్య కెమిస్ట్రీని బాగా చూపించాడు, కానీ వాటి చుటూ అల్లుకున్న సీన్స్ కొన్నిటికీ పొంతనే ఉండదు. పైగా హీరోయిన్ క్యారెక్టర్ ని బోల్డ్ గానే డిజైన్ చేసుకున్నట్టున్నాడు. ఒకరకంగా ఇబ్బందిగానే ఉన్నాయి. అండ్ చాలా రొటీన్ సీన్స్ తో ల్యాగ్ చేస్తున్నట్టు చాలా సన్నివేశాలు అనిపిస్తాయి. అసలు డైరెక్టర్ ఈ సినిమా కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్ధం కానట్టు ఉంటుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ని కూడా ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. 

 

Technical Values : 

సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ సాలిడ్ గా ఉంది. అలాగే సినిమాకి హేశం అబ్దుల్లా అందించిన మ్యూజిక్ మంచి ప్లస్ అయింది. బీజీఎమ్ కూడా బాగుంది. అండ్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ మాత్రం చాలా ఉంది.  అనవసరమైన ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఇక ఫైనల్ గా డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమా కాన్సెప్ట్ ని బాగా రాసుకున్నా, దానికి సరైన స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. కొన్ని పాయింట్స్ సినిమాలో చాలా బాగున్నాయి. పేపర్ మీద డైలాగ్స్ పరంగా అందులో డెప్త్ కూడా ఉంది. కానీ అది స్క్రీన్ మీద కనిపించలేదు.
 

Final Review : 

ఓవరాల్ గా ఈ "ఎపిక్" అనే సినిమా ఎపిక్ లవ్ స్టోరీ అవుతుందనుకుంటే... అసలు ఏమవుతుందో కూడా చెప్పలేనట్టు సినిమా ఉంది. అక్కడక్కడా స్టార్టింగ్ లో ఫ్యామిలి సీన్స్ బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది, న్యాచురల్ గా ఉంది. బేబీ తర్వాత ఇందులో కూడా లీడ్ పెయిర్ బాగా నటించారు. కానీ వాళ్ళ మధ్య క్యారెక్టర్టైజేషన్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాల్సింది. ఫైనల్ గా కథ, కథనాలు స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల మూవీ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ఫన్ కోసం చూస్తే చూడొచ్చు. కొత్తదనం కోరుకుంటే మాత్రం కన్నీళ్లే. 

Review Statistics

4.9
Overall Rating
Avg. of all reviews
25
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.1/10
Public
4.4/10
Why MRO?