గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)
Garividi Lakshmi : టాలెంటెడ్ హీరోయిన్ ఆనంది మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గరివిడి లక్ష్మీ. బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ ఫోక్ ఎంటర్టైనర్ ను గౌరీ నాయుడు జమ్ము డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ అందుకుంటుంది.
Available in:
Reviews
What critics and the public are saying about గరివిడిలక్ష్మి (Garividi Lakshmi)
Media Reviews
3 Avg: 5.7/10Average
Garividi lakshmi movie review
చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుత...
చిన్న స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం.. అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం.. ఇలా గరివిడి లక్ష్మీలో కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్ర కథ ఎంట్రీ ఇవ్వడం, నేర్చుకోవడం, స్టేజ్ మీద మొదటి పర్ఫామెన్స్ ఇవ్వడం, అవమానాలు ఇలా అన్నీ ముందుకు సాగుతుంటాయి.
ఇక సెకండాఫ్లో గరివిడిలక్ష్మి వైభవాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఆమె పేరుని, గాత్రాన్ని చివరకు సినీ ప్రముఖులు కూడా ఎంతలా వాడుకున్నారు.. తన పేరు చెప్పుకుని ఎవరెవరికో స్టేజ్ మీదే ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం ఇవన్నీ మనసుని కదిలిస్తుంటాయి. నమ్మిన వారే మోసం చేయడం, చివరకు అన్నీ కోల్పోయి అనాథగా మిగలడం ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంటాయి. పాటలు మాత్రం థియేటర్లో ఊపును తీసుకు వస్తాయి. మాటలు అంత గొప్పగా అనిపించవు. చివరగా ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గరివిడిలక్ష్మికి నివాళిలా అనిపించే రేంజ్లో సినిమా లేకపోయినా.. ఆమెకి ఇన్నేళ్లు రాని గుర్తింపుని తీసుకు వచ్చే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
Above Average
Garividi lakshmi movie review
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో ఒక ఫోక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ఆనంది, రాగ్ మయూర్, షకలక శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.ఇందులో గరివిడి లక్ష్మి జీవితంలో చూసిన పతనం మంచి ప్రభావవంతంగా ఇందుల...
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చిన చిత్రాల్లో ఒక ఫోక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ కూడా ఒకటి. టాలెంటెడ్ నటీనటులు ఆనంది, రాగ్ మయూర్, షకలక శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
ఇందులో గరివిడి లక్ష్మి జీవితంలో చూసిన పతనం మంచి ప్రభావవంతంగా ఇందులో కనిపిస్తాయి. బుఱ్ఱకథ అనే కళని ఆమె తనదైన శైలిలో మార్చి తనకి తెలియకుండానే ఎలా కమిలిపోయారు అనే ఎమోషనల్ పార్ట్ ఇందులో వర్క్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని ఫోక్ సాంగ్స్ థియేటర్స్ లో మాస్ ఆడియెన్స్ ని ఊగేలా చేస్తాయి. ఇక సెకండాఫ్ లో చివరి 30 నిమిషాలు చూసే ఆడియెన్ ని అలా హుక్ చేసి ఉంచుతాయి. ఈ పార్ట్ అంతా సినిమాకి, గరివిడి లక్ష్మికి న్యాయం చేసినట్టు అనిపించింది.
అయితే ఏ బయోపిక్ చూసినా సరే సాలిడ్ ఎలివేషన్స్ ఆ పాత్రకి ఉంటాయి కానీ అలాంటి సన్నివేశాలు ఇందులో డిజైన్ చేసుకోలేకపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. అలాగే సినిమాలో ఫస్టాఫ్ కూడా ఏమంత ఇంపాక్ట్ కలిగించేలా లేదు. నెమ్మదిగా కథనం పికప్ అవుతూ వెళుతుంది. దీనితో చూసే ఆడియెన్ కి ఒక బయోపిక్ ఇవ్వాల్సిన హై ని ఈ చిత్రం అందించలేదు. ఇక సెకండాఫ్ లో కూడా కొంతమేర ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘గరివిడి లక్ష్మి’ ప్రతీ ఒకరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చారిత్రక వ్యక్తుల కథల్లో ఒకటిగా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలు ఊగించిన గరివిడి లక్ష్మి కోసం ఒకప్పుడు ఉన్న సాధనాలు రీత్యా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆమె ‘ఎవరు’ అని ప్రపంచానికి చూపించిన సినిమా ఇది. అయితే ఈ క్రమంలో సెకండాఫ్ లో ఎమోషనల్ పార్ట్ బాగా వర్క్ అవుతుంది. పాటలు, సంగీతం, ఆనంది సాలిడ్ పెర్ఫామెన్స్, ఇతర నటీనటుల దన్ను కూడా బాగుంది కానీ ఈ తరహా బయోపిక్ లకి కావాల్సిన హై మూమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి. పైగా ఒక స్లో ఫస్టాఫ్ కూడా డల్ గా అనిపిస్తుంది. వీటిని పక్కన పెడితే ఈ తరహా బయోపిక్ లు ఇష్టపడేవారిని ఈ చిత్రం మెప్పిస్తుంది. మిగతా ఆడియెన్స్ తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చెయ్యండి.
Above Average
Garividi lakshmi movie review
#GarividiLakshmi is a well-made film with good casting, an authentic script (though I’m not sure about its historical accuracy), an entertaining first half, and an emotional second half.Like most biopics, it chronicles the rise and fall of the legendary Uttarandhra folk singer.Anandi is brilliant, t...
#GarividiLakshmi is a well-made film with good casting, an authentic script (though I’m not sure about its historical accuracy), an entertaining first half, and an emotional second half.
Like most biopics, it chronicles the rise and fall of the legendary Uttarandhra folk singer.
Anandi is brilliant, the direction feels genuine, and the music is superb.
Producer Krithi & TG Vishwa Prasad deserve appreciation for producing this film.
Worth giving it a try! 👍
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... విజయనగరం జిల్లా గరివిడి గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ ఊళ్ళో దేవకమ్మ(రాశి) కూతురైన లక్ష్మి (ఆనంది) చిన్నతనం నుండే తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతుంది. తల్లి దేవకమ్మ దేవతకు అంకితం కావడం వల్ల సంసారం చేయలేనని భర్తతో విడిపోవడంతో భర్త వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడు. ఆ రకంగా తండ్రికి దూరమైతే, అమ్మ దగ్గర ఉన్నా దేవకమ్మ తన కొలుపు చెబుతూ హడావిడిగా ఉంటుంది. లక్ష్మిని పట్టించుకునే సమయం కూడా ఉండదు. అయితే ఈ క్రమంలో తల్లి దేవుడమ్మ కూతురు లక్ష్మికి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుందామని పెళ్లి చేసేస్తే, రెండు నెలలకే ఆ పెళ్లి పెటాకులైపోతుంది. దాంతో ఒంటరితనం దూరం చేసుకోవడం కోసం పాటకు దగ్గరవుతుంది. సొంతంగా పాటలు పాడుతూ ఊళ్ళో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండా గరివిడికి వచ్చిన బుర్రకథ ట్రూప్ లో సత్తిబాబు (రాగ్ మయూర్) పరిచయంతో బుర్రకథ చెప్పడం ప్రారంభిస్తుంది. అయితే ఓ దశలో తమ బుర్రకథ కూడా బోర్ కొట్టడంతో, అప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రెండీ మాస్ పాటలను పాడుతూ, అందర్నీ ఆకట్టుకుంటూ పాపులర్ అవుతుంది. ఈ క్రమంలో సినిమాల్లోకి కూడా వెళ్లే ప్రయత్నంలో విఫలమవుతుంది. పైగా అమ్మకు కూడా దూరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించింది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎవరెవరు సాయపడ్డారు? చివరకు గరివిడి లక్ష్మి ప్రయాణం ఎలా సాగింది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus points :
మామూలుగా బయోపిక్ సినిమాలకు టాలీవుడ్ లో ముందు నుండే ఆదరణ ఎక్కువ. అందులో కొంతమంది డైరెక్ట్ గా ఆయా ప్రఖ్యాత వ్యక్తుల జీవిత చరిత్రను బయోపిక్ గా తీస్తారు. మరికొందరు వాళ్ళ లైఫ్ ను ప్రేరణగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో సినిమాలు తీస్తారు. మహానటి, ఎన్టీఆర్ లాంటి బయోపిక్ లే ఉదాహరణ. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరిడివి లక్ష్మీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఎర్లీ 20s లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడుస్తుంది. ఇక సినిమాలో గరిడివి లక్ష్మీ ఉత్తరాంధ్ర సహా ఎన్నో ప్రాంతాల్లో ఆమె తన అద్భుతమైన గాత్రం, కళా ప్రతిభతో ఎలా ప్రేక్షకులని అలరించారు, ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలను గురించి చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా ఆమె గురించి తెలియని కూడా ఈ సినిమాతో చెప్పడం బాగుంది. ఈ విషయంలో మేకర్స్ బాగానే కష్టపడ్డారు. పైగా ఇందులో గరివిడి లక్ష్మీ పతనం దానికి గల కారణాలు కూడా బాగా చూపించారు. కొన్ని సీన్లు చూసినపుడు మహానటి సినిమా గుర్తొస్తుంది.
కథ పరంగా దర్శకుడు మంచి కథను ఎంచుకోగా, గరివిడి లక్ష్మి సినిమాతో ఆ వ్యక్తికి ఘన నివాళి ఇచ్చారని చెప్పొచ్చు. అన్నిటికి మించి సినిమాలో ఉత్తరాంధ్ర యాసను బాగా వాడారు. ఇక గరివిడి లక్ష్మిగా ఆనంది అద్భుతంగా నటించింది. పైగా పాటల్లో లిప్ సింక్, హవా భావాల్లో మంచి నేర్పరితనం కనిపిస్తుంది. ఎమోషన్స్ సీన్స్ లోనూ బాగా పండించింది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ను ఆనంది యాక్సెప్ట్ చేసి మంచి పని చేసింది. అలాగే కీ రోల్స్ లో నటించిన నరేష్, రాగ్ మయూర్ లు సినిమాకి మంచి ప్లస్ అయ్యారు. అలాగే అంకిత్ కొయ్య, శ్రీనివాస్ అవసరాల తదితరులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
Minus points :
అయితే ఈ చిత్రానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, సినిమాకి సరైన ట్రీట్మెంట్ రాసుకోవడంలో ఆడియన్స్ ను కొత్తగా ఎంటర్టైన్ చేసేలా చేయడంలో తడబడ్డాడు. అయితే సినిమాలో ఆమె ఎదిగిన స్థాయి నుండి ఆమె పతనాన్ని బాగా ఎమోషనల్ గా చూపించారు కానీ, ఆమె చిన్నతనం నుండి ఎదిగిన తీరు గాని, ఆమె చూసిన హై మూమెంట్స్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మినహా ఇతర పాత్రలను స్ట్రాంగ్ గా చూపించలేదు. అంటే నరేష్, రాగ్ మయూర్ లాంటి వాళ్ళ పాత్రలు బాగానే ఉన్నా, ఆమె కెరీర్ కి తోడ్పడ్డ వాళ్ళ రోల్స్ ను అంత బాగా చూపించలేదు. అలాగే ఈ సినిమా చూసినంత సేపు కొంతమంది ఆడియన్స్ కి మహానటి లాంటి సినిమాలు గుర్తొస్తాయి.. అందువల్ల కంపేర్ చేస్తే గరివిడి లక్ష్మీ పాత్రకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. అలాగే ఇందులో పెద్దగా ఎలివేషన్లకు స్కోప్ ఇవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ కాకుండా ఇతర సీన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. పైగా పైగా వాటిలో పస లేదు. కథనం బాగా నెమ్మదిగా సాగుతూ ల్యాగ్ ఫీల్ ఇస్తుంది.
Technical values :
టెక్నికల్ గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఆదిత్య జువ్వడి 90s వాతావరణాన్ని కెమెరాతో అద్భుతంగా చూపించారు. అలాగే విలేజ్ సెట్ వర్క్ పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ అర్జున్ ఇచ్చిన సంగీతం బాగుంది. సాంగ్స్ చాలా న్యాచురల్ గా పల్లె పాటల్లా అనిపించాయి. ఈ పాటల్లో పాత జానపద గేయాలను వాడిన విధానం బాగుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. కొన్ని ల్యాగ్ సీన్స్ ను ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ గా తొలిచిత్రంతోనే బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు గౌరీ నాయుడు జమ్ము. సినిమాకి అతను పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఇలాంటి కథను ఎంచుకుని దర్శకుడు రచయితగా మంచి మార్కులు కొట్టేసాడు. కానీ సినిమాలో భావోద్వేగాలపైనే కాకుండా మిగతా సీన్లపైనా ఇంట్రెస్టింగ్ గా కథనం అల్లాల్సింది. అంటే కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ కూడా అలా సింపుల్ గా వెళ్ళిపోయాయి.
Final Review :
ఇక ఫైనల్ గా గరివిడి లక్ష్మీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు, అలాగే బుర్రకథలు ఇష్టపడే ఆడియన్స్ కి ఖచ్చితంగా మెప్పించే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని, గ్రామాల్లో ప్రజలను తన పాటలతో ఉర్రూతలూగించిన గరివిడి లక్ష్మి కోసం ఒకసారి చూసేయొచ్చు. అయితే ఇప్పటి జనాలకి ఆవిడ గురించి అస్సలు తెలియకపోవడం, అలాగే సినిమాలో సాంగ్స్, ఎమోషన్స్ అన్ని బాగున్నా, జనరల్ గా ఒక బయోపిక్ లకి కావాల్సిన హై మూమెంట్స్ ఇందులో మిస్ అవడం మైనస్ అయ్యాయి. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కాస్త తక్కువ అంచనాలతో ట్రై చేస్తే మెప్పించే అవకాశం ఉంది.