హనుమాన్ అంశ్ (Hanuman Ansh)
దేశ వ్యాప్తంగా హనుమాన్ భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకుపోయిన "హనుమాన్ అంశ్" చిత్రం ఫైనల్ గా తెలుగులోనూ ఆదరణ పొందడానికి సిద్ధమైంది. కేవలం కేవలం 2 కోట్ల బడ్జెట్ తో 400 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ తాజాగా తెలుగులో అక్టోబర్ 9న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేసారు.
Reviews
What critics and the public are saying about హనుమాన్ అంశ్ (Hanuman Ansh)
Media Reviews
9 Avg: 5.6/10Average
Hanuman Ansh movie Review
సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. రెండు కోట్లు కొడితే ఇంత కొట్టింది, నాలుగు కోట్లు కొడితే మూడు కోట్లు కొట్టింది అని కూడా చాలా చాలా పెద్...
సో హనుమాన్ అండ్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా. నేను హిందిలో చూద్దాం అనుకున్నా, కాబట్టి నాకు షో కొంచెం లేట్ అయింది, కరెక్ట్ టైమింగ్ దరకలేదు. సో తెలుగులో చూడలేదు హిందీలో చూశాను. సినిమా నాకు నచ్చింది. రెండు కోట్లు కొడితే ఇంత కొట్టింది, నాలుగు కోట్లు కొడితే మూడు కోట్లు కొట్టింది అని కూడా చాలా చాలా పెద్ద బాగుంది బాగుంది అంటారు ఏందో అనుకున్నా. సో ఏందిరా సినిమా అనుకుంటే మాత్రం తర్వాత తెలిసింది సినిమాకి ఇంత పెద్ద బాబా లైఫ్ స్టోరీ మీద బేస్ అయిన సినిమా నిమ్కరోలి బాబా అని చెప్పేసి తెలిసిన అన్నమాట. సో సినిమా ఎలా ఉందంటే మాత్రం నేను అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇలా ఉంటది అనుకున్నా అలా ఉండకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా కూడా. చాలా స్పిరిచువల్ గా హనుమంతుడి ప్రార్థన ఎలా ఉంటది దేవునితో ఆ బాబా జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
ముఖ్యంగా సినిమాకు మ్యూజిక్ చాలా గట్టిగా హెల్ప్ అయింది అని చెప్తా. బడ్జెట్ తెలుస్తా ఉంది అండ్ చాలా వరకు కూడా నేచురల్ లొకేషన్ లో తీశారు, అది మంచిగా అనిపించింది. వీటన్నిటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ పర్ఫార్మెన్సెస్ శోభినవ్ సత్య గారు యాస్ నిమ్కరోలి బాబా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది అన్నమాట. ఆయన చేసేది సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయి ట్రైన్ సీన్ అని చెప్పేసి.. నేను హనుమంతుడి భక్తుడిని నాకు అట్లాంటి సీన్స్ పడ్డప్పుడల్లా మంచిగా అనిపించింది సినిమాలో. ఏదో శక్తులు ఉన్నాయి బాబాకి అన్నట్టు చూపెట్టకుండా అలా వెళ్ళిపోయింది సినిమా. సో హనుమాన్ అన్ష్ నాకైతే నచ్చింది.
Above Average
Hanuman ansh movie review
కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు నచ్చవచ్చో, నచ్చకపోవచ్చో... తెలీదు కానీ, కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజ...
కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకు నచ్చవచ్చో, నచ్చకపోవచ్చో... తెలీదు కానీ, కాస్త దైవచింతన ఉన్న వాళ్లెవ్వరైనా సరే.. ‘హనుమాన్ అంశ్’ చూస్తూ అందులో లీనం అయిపోవాల్సిందే. ఇక రాముడిని కొలిచేవాళ్లు.. హనుమంతుడి భక్తులైతే పరవశంలో మునిగిపోతారు. దేవుడి సినిమా అనగానే మాయలు మహిమలు చూపిస్తూ.. విజువల్ మాయాజాలంతో ముంచెత్తాల్సిన అవసరమే లేదని.. జీవన సారాన్ని బోధిస్తూ ఆలోచన రేకెత్తించేలా కథను చెప్పినా ప్రేక్షకులు తన్మయత్వానికి గురవుతారని ‘హనుమాన్ అంశ్’ రుజువు చేస్తుంది. మనిషిలోనే పరమాత్ముడున్నాడని చెబుతూ.. మానవసేవే మాధవ సేవ అని చాటుతూ.. సక్రమమైన మార్గంలో జీవించమని బోధిస్తుంది ‘హనుమాన్ అంశ్’.
దాదాపు షిరిడీ సాయిబాబా జీవితాన్ని పోలినట్లే ఉంటుంది కరోలి బాబా కథ కూడా. కానీ ప్రతి సన్నివేశం హడావుడి లేకుండా.. హాయిగొలిపేలా చాలా ప్రశాంతంగా సాగుతాయి. పన్నెండేళ్ళ వయసులో ఆధ్యాత్మిక మార్గం పట్టి ఇల్లు విడిచి వచ్చేసిన లక్ష్మీ నారాయణ.. బాబాగా పరిణామం చెందే సన్నివేశాలు అద్బుతంగా అనిపిస్తాయి. ఎవరితోనూ అనుబంధం ఏర్పరుచుకోకుండా నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉండాలనే ఆలోచన రేకెత్తే సన్నివేశం హృదయాన్ని హత్తుకుంటుంది. ఓవరాల్ గా ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా జెన్యూన్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. దీన్నొక సగటు సినిమాలా చూస్తే నచ్చకపోవచ్చు. దైవచింతన.. ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లను ఇది అమితంగా ఆకట్టుకుంటుంది. చివరగా హనుమాన్ అంశ్.. కదిలించే కరోలి బాబా కథ.
Average
Hanuman Ansh movie Review
హనుమాన్ అంశ్ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు వి...
హనుమాన్ అంశ్ చిత్రం విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా రూపొందింది. సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. విరామం వరకు సినిమా చాలా పర్ఫెక్ట్ గా, ఒక దైవిక భావన కలిగించేలా ముందుకు వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు అసలు విషయాన్ని పక్కనపెట్టి బాబా మహిమలను హైలైట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమాకు వెళ్తే కచ్చితంగా ఏదో గుళ్లో కూర్చున్నట్లు నాలుగు వైపులా రామ్ రామ్ అని వినిపిస్తూ ఉంటుంది.
దేవుడి భక్తి కంటే ఒక వ్యక్తిని ఎక్కువగా కీర్తించడం లాంటివి సామాన్య ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆధ్యాత్మిక గురువులను, వాళ్ల మహిమలను బలంగా నమ్మే వాళ్లకు ఈ ద్వితీయార్థం బాగా నచ్చుతుంది. కానీ లాజిక్స్ వెతికే వాళ్లకు మాత్రం ఈ మహిమలన్నీ కాస్త అతిగా అనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో బాబాకు ఉన్న విపరీతమైన భక్తుల వల్లే ఈ సినిమా అక్కడ అంత పెద్ద విజయం సాధించింది. ఇక తెలుగు హక్కులను హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద సంస్థ తీసుకుని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. ఓవరాల్ గా చూసుకుంటే భక్తి, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఓవరాల్ గా హనుమాన్ అంశ్.. మంచి సినిమా..!
Above Average
Hanuman ansh movie review
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగులో విడుదలైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో శోభినవ్ సత్య బాబా పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. ఎలాంటి అనవసర కమర్షియల్...
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగులో విడుదలైంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో శోభినవ్ సత్య బాబా పాత్రలో హుందాగా నటించి మెప్పించారు. ఎలాంటి అనవసర కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే, సెకండాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగడం కొద్దిగా ఓపికకు పరీక్ష పెడుతుంది.
ఓవరాల్ గా ఆధ్యాత్మిక భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం, ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి డివైన్ రికమండేషన్! అయితే చాలా సహజంగా ఉండే ఈ సినిమాలో ఎడిటింగ్ పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బోర్ ఫీల్ తగ్గేది. ఇక తెలుగు డబ్బింగ్ సంభాషణలు మూల భావాన్ని పాడు చేయకుండా నీట్ గా కుదిరాయి. ఫైనల్ గా హనుమాన్ అంశ్ హడావిడి లేకుండా హృదయానికి హత్తుకునే ఒక నిండైన ఆధ్యాత్మిక మూవీ.
Average
Hanuman Ansh Movie Review
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువు...
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి మూలం ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, ఆ పైన ఆధ్యాత్మిక బాట పట్టి, నీమ్ కరోలీ బాబాగా ప్రసిద్ధుడైన ఓ సాధువు కథ ఇది. పదకొండేళ్ళ వయసులో ఇల్లు వదిలి దేశాటన జరిపి, పలువురు బాబాలు, సాధుసంతులను దర్శించుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక శిక్షణను పొందిన నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవిత గమనాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో ఆయన సాంగత్యంలోకి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన మహిమలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య చక్కగా ఒదిగిపోయారు. ఇతర నటీనటుల సహజ నటనతో పాటు సాధు సుశీల్ తివారి తన నేపథ్య సంగీతంతో ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. దర్శకుడు విశాల్ చతుర్వేది తన స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. అయినా కొన్నిచోట్ల మాత్రం కథ నత్తనడకలో సాగడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మేకర్స్ ఈ మూవీని మూడు భాగాలుగా నిర్మించాలని భావించటమే అందుకు కారణం కావచ్చు. మిగిలిన రెండు భాగాల కోసం ఇక్కడ కామా పెట్టారని అనుకోవాలి. ఉత్తర భారతీయులను అంతగా ఆకట్టుకున్న అంశాలు ఇందులో ఏమున్నాయనే భావనతో ‘హనుమాన్ అంశ్’ చిత్రం చూడటానికి వెళ్ళినవారు చాలా వరకూ నిరాశకు గురి కావచ్చేమో కానీ.. సాధుసంతుల జీవితాలలోని అద్భుతాల ఆవిష్కరణను చూడాలనుకుని థియేటర్లకు వెళ్ళేవారికి మాత్రం ‘హనుమాన్ అంశ్’ నచ్చుతుంది.
Average
Hanuman Ansh movie review
హనుమాన్ అంశ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చే...
హనుమాన్ అంశ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆధ్యాత్మికత, దయ, ప్రేమ, నిస్వార్థ సేవ వంటి విలువలను ప్రధానంగా రూపొందించారు. మనిషిలో మార్పు రావడానికి ఎదురయ్యే అనుభవాలు ఎలా కారణమవుతాయో చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అంశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథనం ఎపిసోడ్ల తరహాలో సాగడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా ఉండటం వల్ల సినిమా వేగం తగ్గుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఉండే భారీ మలుపులు, ఉత్కంఠ ఇందులో కనిపించదు.
ఇక దేవుడికి సంబంధించిన మూవీ అన్నప్పుడు మాయలు, వారి లీలలకు ప్రయారిటీ ఉంటుంది. వాటినే ఆడియెన్స్ ఆశిస్తారు. అవి లేకపోతే చప్పగా సాగుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. నీమ్ కరోలి బాబా జర్నీని చూపించారు. డ్రామా కూడా పెద్దగా లేదు. ఉన్నచోట కూడా పండలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని ఉన్నా, అవి కనెక్ట్ కాలేదు. దీనికితోడు నాటకీయత కూడా పెద్దగా లేదు. దేవుడి పవర్‌కి సంబంధించిన సీన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా సింపుల్‌గా ఉన్నాయి. దీంతో అవి కిక్ ఇవ్వలేకపోయాయి. క్లైమాక్స్ కూడా అసంతృప్తిగానే ఉంటుంది. అయితే మూఢ విశ్వాసం కాకుండా మనం పని మన చేయాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడిని ఆరాధించాలి అని చెప్పిన తీరు బాగుంది. మొత్తంగా హనుమాన్ అంశ్ భక్తి, మానవత్వం, నిస్వార్థ సేవ వంటి అంశాలతో ఆలోచింపజేసే ఆధ్యాత్మిక చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితంపై ఆసక్తి ఉన్నవారికి, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ఆడియెన్స్ కి మాత్రం ఇది ఏమాత్రం ఎక్కడు. పైగా తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం అంత ఈజీ కాదు. కనెక్ట్ అయితే మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుందని చెప్పొచ్చు.
Average
Hanuman Ansh movie Review
తెలుగు తెరపై అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు ప్రేక్షకులను అటు అధ్యాత్మికంగా, కమర్షియల్‌గా కూడా రంజింప చేశాయి. అలాంటి కోవలోనే శ్రీరామ భక్తుడు హనుమాన్ భక్తుడిగా మారిన నీల్ కరోలి బాబా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది మాత్రం కమర్షియల్ హంగులకు దూరంగా...
తెలుగు తెరపై అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు ప్రేక్షకులను అటు అధ్యాత్మికంగా, కమర్షియల్‌గా కూడా రంజింప చేశాయి. అలాంటి కోవలోనే శ్రీరామ భక్తుడు హనుమాన్ భక్తుడిగా మారిన నీల్ కరోలి బాబా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్శకుడు విశాల్ చతుర్వేది మాత్రం కమర్షియల్ హంగులకు దూరంగా డాక్యుమెంటరీ తరహాలో డ్రామాకు చోటు లేకుండా ఈ సినిమాను ముఖ్యంగా అధ్యాత్మిక కోణంలో ఆయన మహనీయతను చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కథలో వచ్చే రెండు, మూడు సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకుడిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాయి.
శ్రీరాముడు, హనుమాన్ అంశాల చుట్టు సాగిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని పూర్తిగా భక్తి, అధ్యాత్మికత తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఇప్పటికే ఉత్తరాది భారతీయలను భక్తి తన్మయత్మంలో ముంచేయడమే కాకుండా 400 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఆలస్యమైనప్పటికీ బతుకమ్మ, దసరా పండుగ సెలవులను టార్గెట్ చేసుకొని రిలీజ్ చేశారు. భక్తి పరమైన సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వారికి స్పూర్తిని కలిగించిన నీమ్ కరోలీ బాబా జీవితాన్ని తెలుసుకొనే అవకాశం దక్కుతుంది. ఎక్కువగా ఆశించకుండా వెళితే.. మంచి అనుభూతితో మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
Above Average
Hanuman Ansh movie Review
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ హంగుల...
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్యూర్ డివైన్ వైబ్స్‌తో సాగుతుంది. శోభినవ్ సత్య బాబా పాత్రలో జీవించగా, అద్భుతమైన బిజీఎమ్ ఆడియన్స్‌ని ఒక దివ్యమైన అనుభూతికి గురిచేస్తుంది.
అయితే, సెకండాఫ్‌లో డ్రామా కాస్త నెమ్మదించి కథనం సాగదీతగా అనిపించడం, ఆడియన్స్ ఓపికకు చిన్న పరీక్షే! అయినప్పటికీ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ లోపాన్ని కవర్ చేస్తాయి.
ఫైనల్ వర్డిక్ట్: బాక్సాఫీస్‌ను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన ‘హనుమాన్ అంశ్’ సాధారణ ప్రేక్షకులకే కాక, ఆధ్యాత్మిక ప్రియులకు ఈ వికెండ్‌లో ఫ్యామిలీతో చూడదగ్గ ఒక పవర్‌ఫుల్ మస్ట్-వాచ్ డివైన్ రికమండేషన్!
Hit
Hanuman Ansh movie Review
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం త...
కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవగా, థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక భక్తి, బయోపిక్ సినిమాలకు బలమైన భావోద్వేగాలే ప్రాణం. ఆ విషయంలో ‘హనుమాన్ అంశ్’ ఖచ్చితంగా మెప్పిస్తుంది. సినిమా ఆద్యంతం ఒక దైవికతతో కొనసాగుతూ చూసే ప్రేక్షకునిని బాబాతో ప్రయాణం చేస్తున్నట్టుగా లీనం అయ్యేలా చేస్తుంది.
ఎలాంటి రాజకీయ అజెండాలు, అనవసర ప్రచారాలు జోడించకుండా కేవలం బాబా వ్యక్తిత్వం, ఆయన నిస్వార్థ కరుణపైనే దృష్టి సారిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. బాబాగా నటుడు శోభినవ్ సత్య నటన హుందాగా, సహజంగా సాగింది. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో ఓపిక ఒకింత తక్కువే ఉంటుంది. అయితే ఆ ఓపికకి పరీక్ష పెట్టేలా కొన్ని మూమెంట్స్ ఈ సినిమాలో చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. వీటితో కొంచెం చూసే ఆడియెన్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకాస్త స్లోగా సాగదీతగా వెళుతుంది. ఇక మొత్తంగా చూస్తే, ‘హనుమాన్ అంశ్’ బలమైన భావోద్వేగాలతో కూడిన నిజాయితీగల ఆధ్యాత్మిక చిత్రం. అద్భుతమైన నేపథ్య సంగీతం, బాబా విషయంలో కొన్ని అబ్దుతమైన సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం కొంత సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ, నీమ్ కరోలీ బాబా భక్తులకే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక దైవికతను నింపి ఆడియెన్స్ ని బయటకి పంపిస్తుంది.
Public Reviews
3 Avg: 6.0/10Average
Hanuman Ansh movie review
chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...Theater loki velli kurchogane ardam aipoyindi, idi movie la ledu, oka roju motham office lo kurchoni boring m...
chala mandi hanuman ansh movie chala bagundi ante... naaku hindi raadu kabatti.. telugulo vacchaka vella.. Asalu ee 'Hanuman Ansh' movie chusaka nakaithe chala nidrocchesindi.. enduko mari...
Theater loki velli kurchogane ardam aipoyindi, idi movie la ledu, oka roju motham office lo kurchoni boring meeting lo unna feel ichindi.
Asalu story slow ga, pedda drama la konchem kuda entertainment lekunda saagindi. Eppudo 20 years back vachina old emotional melo drama serials la unnai scenes.
Commercial elements assalu levu... but story lo message chala bagunnai.. ilanti movie chuse audiance vere untaru.. nakaithe theater ki velthe kasepu navvukunnama... intiki vachesama annattu undali... may be ilanti movies chuse audiance vere vallu chalamandi undocchu.. but nenaithe kadu... overall konni manchi messages humans ki chepparu kabatti.. maree boring kakunda avarage ga undani cheppocchu.
Above Average
Hanuman Ansh movie review
Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.movie might feel it's a bit slow. But for someone like me looking to unplug, it genuinely delivers a deeply moving, serene experience.The way they portrayed Neem Karoli Baba...
Just finished watched Hanuman Ansh Movie. and honestly, after a stressful week at work, this was exact peaceful reset I needed.
movie might feel it's a bit slow. But for someone like me looking to unplug, it genuinely delivers a deeply moving, serene experience.
The way they portrayed Neem Karoli Baba’s life - leaving home at twelve, moving through life like a flowing river without getting tied down -really hit home. It doesn't really on cinematic tricks; it just focuses on pure human connection and spiritual depth.
I'm walking out of the hall feeling completely calm and recharged. If you have a devotional side or just need a soul-soothing break after a chaotic workweek, i think this is definitely worth catching on the big screen!
Hit
Hanuman Ansh movie review
Hanuman ansh.. chala rojula nundi ee cinema chuddamani anukunna.. hindi lo chuddam vacchu.. but telugulone neem karoli baba gurinchi telusukovalani.. and na favorate god Hanuman gurinchi cheppe vishayalu telugulo inka baga ardham avutayani telugu version vacchaka vella. ika cinema chusaaka one word...
Hanuman ansh.. chala rojula nundi ee cinema chuddamani anukunna.. hindi lo chuddam vacchu.. but telugulone neem karoli baba gurinchi telusukovalani.. and na favorate god Hanuman gurinchi cheppe vishayalu telugulo inka baga ardham avutayani telugu version vacchaka vella.
ika cinema chusaaka one word lo cheppalante jai hanuman... life journey ela undalo ee cinema chuste chala mandiki telustundi. i mean spiritual movies istapade vallake ee cinema ekkuva connect ayye chance undi. because cinema commerial movies laga ee cinema chuste chala mandiki bore kottestundi.
hanuman bhaktulaki matram baga connect avtundi.. and ee cinemalo peddaga gods gurinchi gani.. history and religion gurinchi chepparu... oka manishi manishiga ela batakalo... neat ga chepparu.. adokkati matram movielo nerchukovacchu.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... 19వ శతాబ్దం ఆరంభంలో భారత్ కు స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ పాలన సమయంలో ఈ కథ నేపథ్యం నడుస్తుంది. ఆ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం చేస్తున్న వాళ్లలో డాక్టర్ రాం నందన్ భోంస్లే ( చందన్ కే ఆనంద్) కూడా ఒకరు. అయితే ఈ పోరాటంలో ఓ నాడు రాం నందన్ ఓ ఆశ్రమంలో తలదాచుకొంటాడు. అక్కడ జరిగిన కొన్ని అనూహ్య సంఘటనల వల్ల హనుమాన్ భక్తుడు లక్ష్మీ నారాయణ్ శర్మ (శోభినవ్ సత్య) తో పరిచయం అవుతుంది. ఆయన పరిచయంతో నాస్తికుడైన రాం నందన్ ఆస్తికుడిగా మారతాడు. ఆ లక్ష్మీ నారాయణ్ శర్మే "హనుమాన్ భక్తుడి"గా 'నీమ్ కరోలి బాబా' పేరుతో ప్రఖ్యాతి గాంచి తన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఎంతో మందికి జీవిత సారాన్ని, కనువిప్పును కలిగించి మార్గదర్శిగా నిలుస్తాడు. అసలు ఎవరు ఈ లక్ష్మీ నారాయణ్ శర్మ? రాజ్ కోట్ లోని వైష్ణవ ఆలయంలో జరిగిన సంఘటన లక్ష్మీ నారాయణ్ శర్మ జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లి, ఆయన హనుమాన్ భక్తుడిగా మారేలా చేసింది ఏంటి? తన జీవితంలో నీమ్ కరోలి బాబా చేసిన అద్భుతాలు ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
మాములుగా భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కే చిత్రాలకు ఈ కాలంలో ఆదరణ తగ్గిపోగా, ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల ద్వారా మళ్ళీ డివోషనల్, ఆధ్యాత్మిక అంశాలతో సినిమాలు తీస్తున్నారు దర్శకులు. ఇక రెండు నెలల కింద హిందీలో విడుదలై అశేష జనాదరణ పొందిన హనుమాన్ అంశ్ సినిమా పలు వాయిదాల తర్వాత ఇప్పుడు తెలుగులోనూ అలరించడానికి వచ్చేసింది. కొంతమంది ఈ చిత్రం తెలుగులో ఆదరణకి నోచుకోదు అని ప్రచారం చేసినా, థియేటర్లోకి వచ్చిన తర్వాత అనుమానాలన్నీ పటాపంచలు చేసింది. ఒక సగటు హనుమాన్ భక్తుడితో థియేటర్లో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ తెచ్చేసింది హనుమాన్ అంశ్ సినిమా. సినిమా మొత్తం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉన్నట్టు, సినిమాలో పాత్రలతో బాబాతో ప్రయాణం అవుతున్న భావన వస్తుంది. ఇక టైటిల్ రోల్ లో బాబా గా నటించిన శోభినవ్ సత్య అత్యంత సహజంగా, అద్భుతంగా నటించాడు. మిగతా నటీనటులు కూడా ఆయా పాత్రలకు చక్కగా కుదిరారు. ఇక సినిమాలో సాంగ్స్ అండ్ బీజీఎమ్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకుడ్ని ఊహించని ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతాయి.
Minus Points :
అయితే ఇలాంటి సినిమాలు చూడాలంటే ప్రేక్షకులకు కాస్త ఓపిక ఎక్కువే కావాలి. ఎందుకంటే సినిమా కంటెంట్ చాలా బాగా ఉన్నా, రన్ టైం అండ్, మూవీ ఫ్లో చాలా నెమ్మదిగా సాగుతుంది. పైగా ఆడియన్స్ ఓపికకి పరీక్ష పెట్టేలాగే సన్నివేశాలుంటాయి. అందులోనూ సెకండ్ హాఫ్ మరింత స్లోగా మారిపోతుంది. కానీ ఒక్కసారి ఆ సీన్స్ కి కనెక్ట్ అయితే అన్ని సీన్స్ ని చూడగలిగేలా సన్నివేశాలు ఉంటాయి.
ఆధ్యాత్మిక చింతన ఉన్న తక్కువ మంది ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కమర్షియల్ ప్రేక్షకులు చాలా వరకు ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవచ్చు. పైగా ఉత్తరాదికి చెందిన నీమ్ కరోలీ బాబా చరిత్రపై అవగాహన ఇక్కడి వారికి పెద్దగా లేనందున తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఏమాత్రం ఎక్కకపోవచ్చు. కానీ హనుమాన్ భక్తులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఈ సినిమాలో ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. అందువల్ల రెగ్యులర్ ఆడియన్స్ కి తక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
Technical Values :
టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాకి డీసెంట్ గా కేవలం 2 కోట్లలోపే ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందువల్ల VFX వంటివి పెద్దగా ఆశించడానికి వీల్లేదు. కానీ ఉన్నంతలోనే బెస్ట్ వర్క్ చూపించారు మేకర్స్. ఆనాటి వాతావరణాన్ని వీలైనంత బాగా తక్కువ బడ్జెట్ లోనే సహజంగా చూపించారు. ముఖ్యంగా కెమెరా వర్క్ చాల బాగుంది. ఇక నలుగురు సంగీత దర్శకులు ఇచ్చిన సంగీతం, అండ్ బీజీఎమ్ సినిమాకి మంచి ఇంపాక్ట్ చూపించాయి. అయితే ఎడిటింగ్ విషయంలో కాస్త ట్రిమ్ చేస్తే కథ స్పీడ్ గా ముందుకు వెళ్లి బోర్ కొట్టకుండా ఉండేది. ఇక డైరెక్టర్ విశాల్ చతుర్వేది తన ప్రొడక్షన్ టీమ్ తో ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత కలిగిన సినిమాని ప్రేక్షకులకి అందించడంలో ఎంతో కృషి చేసాడు. సినిమాకోసం అతడు పడ్డ కష్టం తెరపై ప్రేక్షకుడికి తెలుస్తుంది.
Final Review :
ఓవరాల్ గా హనుమాన్ అంశ్ హిందీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుందో తెలుగులో కూడా అలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందనడంలో సందేహం లేదు. బలమైన భావోద్వేగాలతో ఆధ్యాత్మిక అంశాలతో, సహజంగా చిత్రీకరించిన సినిమా, అంతే సహజంగా నటించిన శోభినవ్ సత్య, సహా మిగతా నటీనటుల ప్రతిభకి తోడు, విశాల్ చతుర్వేది అద్భుతమైన దర్శకత్వం, చక్కటి నేపథ్య సంగీతం, నీమ్ కరోలి బాబా చరిత్ర, హనుమాన్ భక్తులకు విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే ఆడియన్స్ కి కాస్త నిగ్రహం ఉండాలి. అయితే ఈ సినిమాని ఇప్పటికే హిందీ వెర్షన్ చాలా మంది చూసారు. అలాగే విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తుండడంతో తెలుగులో థియేటర్లో ఎంతవరకు ఆదరిస్తారో తెలియాలి.