Register as a Reviewer
మరీచిక (Mareechika)

మరీచిక (Mareechika)

Upcoming Expected Release: 29 May 2026

Mareechika Trailer : ఎవరీ మరీచిక... ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్!

Director: Satish Kasetty
Cast: Viraj Ashwin, Regina Cassandra, Anupama Parameswaran, Ajay ghosh others

Available in:

About This Movie

 

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ "మరీచిక". అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసాండ్ర, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక ట్రైలర్ ని బట్టి గమనిస్తే... కథా నేపథ్యం ఈ విధంగా ఉండబోతుందనిపిస్తుంది. ఓ పల్లెటూరి అమ్మాయి అయిన  వెంకటలక్ష్మి ఉద్యోగం కోసం సిటీకి వచ్చి సంజు అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. కానీ తన ప్రేమ విషయం చెప్పే లోపే అతని లైఫ్ లోకి మరీచిక అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. కొన్ని నాటకీయపరిణామాల అనంతరం మరీచిక తన లవర్ ని చంపేసిందంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది  వెంకటలక్ష్మి. 

అయితే ట్రైలర్ లో ఇక్కడే కొన్ని ట్విస్ట్ లతో కూడిన షాట్స్ ని చూపించి ట్రైలర్ ని ఎండ్ చేసారు. ట్రైలర్ లో సీన్స్ ముందుకెళ్ళేకొద్దీ, సంజు పాత్ర చనిపోయినట్టు, అతడ్ని ఎవరో చంపేసినట్టు చూపిస్తారు. కానీ అది ఎవరనేది సస్పెన్స్... పైగా మరీచిక దెయ్యం గా వచ్చి చంపినట్టు ట్రైలర్ లో చెప్తారు కానీ.. అదేంటి అన్నదే సినిమాలో సస్పెన్స్ గా ఉంచి మూవీ చూసి తెలుసుకోవాలి అన్నట్టు ట్రైలర్ ఎండ్ చేసారు. 

ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీని ఒక క్రైమ్ థ్రిల్లర్ గా, లేదా హర్రర్ర్ సస్పెన్స్ డ్రామాగా చూపించనున్నట్టు తెలుస్తుంది. ఇక కొన్నేళ్లుగా సరైన ఫామ్ లో లేని అనుపమ, రెజీనాలు ఈ మరీచిక మూవీతో కం బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఓవరాల్ గా స్టోరీ మెయిన్ పాయింట్ ఎక్కడా రివీల్ చేయకుండా మేకర్స్ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసారు. ఇక మరీచిక మూవీ కి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మ్యూజిక్ అందించడం విశేషం. చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీని ల‌క్ష్మి భూపాల‌ నిర్మించారు. ఇక మే 29న మరీచిక మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Why MRO?