పెద్ది (Peddi Movie)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ "పెద్ది" ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని బుచ్చిబాబు డైరెక్ట్ చేయగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.
Available in:
Reviews
What critics and the public are saying about పెద్ది (Peddi Movie)
Media Reviews
3 Avg: 7.0/10Hit
Peddi Movie Review
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అ...
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. సినిమాలో రామ్ చరణ్ నటనతో పాటు బుచ్చిబాబు టేకింగ్, ఎఆర్ రహ్మన్ అదిరిపోయే మ్యూజిక్ తో సినిమాని నిలబెట్టారు.
కథ పరంగా రొటీన్ స్టోరీయే అయినా, తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో బుచ్చిబాబు మ్యానేజ్ చేసాడు. ఇక ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి ఔట్ పుటే ఇచ్చాడు. స్పెషల్లీ బీజీఎం అదిరిపోయింది. రత్నవేలు విజువల్స్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చరణ్ తో పాటు జగపతిబాబు, శివరాజ్ కుమార్ రోల్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేసిన విధానానికి.. రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే.
Hit
Peddi Movie Review
సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్...
సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం. సంక్రాంతి తర్వాత గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన పెద్ది సినిమా ఆడియన్స్ నుండి యానానిమస్ గా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు. అయితే ఎప్పుడో అరిగిపోయిన టెంప్లెట్, ఫార్మాట్ ను వాడారు బుచ్చిబాబు. అదొక్కటి సినిమాకి మైనస్ గా నిలిచింది.
ఇక స్పెషల్ సాంగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఆపై హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్స్ కోసమే ఉన్నట్టు అయిపొయింది. ఫస్ట్ హాఫ్ లో చాలావరకు మరీ ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి కాస్త కథ బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో కుస్తీ సీన్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ ని మెప్పించడంలో మాత్రం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. ఇక ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఓవరాల్ గా సినిమా రామ్ చరణ్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
Hit
Peddi Movie Review
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంద...
టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా "పెద్ది" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు డైరెక్ట్ చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే... 90స్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ కథగా తెరకెక్కిన పెద్ది సినిమా ఫ్యాన్స్ ని అమితంగా మెప్పిస్తుంది. ఊరి గుర్తింపు కోసం ఆటగాడైన పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ.
ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘పెద్ది’... ఆడియన్స్ మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లలో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది. అన్నిటికి మించి రొటీన్ కథే అయినా బుచ్చిబాబు తన టేకింగ్ తో మెప్పించాడు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మంచి ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
Story : కథ విషయానికి వస్తే... 90స్ మధ్య కాలంలో భారత్ కి చెందిన "మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్" అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన ఆఫీసర్ అయిన పైస్వాల్ (బొమన్ ఇరానీ) కి తన విజయనగర ప్రయాణంలో "పెద్ది" (రామ్ చరణ్) అనే మల్టీ స్పోర్ట్స్ ఆటగాడి గురించి తెలుస్తుంది. అసలు ఊరి పేరే లేని కొండప్రాంతం నుండి పొట్టకూటి కోసం రోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళ కుటుంబం నుండి వచ్చిన పెద్ది ఆట కూలీగా గుర్తింపు తెచ్చుకుంటాడు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఇలా అన్నింట్లోనూ ఎదురులేని పెద్ది, ఒకానొక సమయంలో ఊరి గుర్తింపు కోసం ఏం చేసాడు? తమ ఊరి వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళాడు.? ఈ మధ్యలో అప్పలసూరి (జగపతిబాబు), గౌర్నాయుడు (శివరాజ్ కుమార్) పెద్ది జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాడు..? స్పోర్ట్స్ అకాడమీ ఆఫీసర్ పైస్వాల్ పెద్ది గురించి ఏం తెలుసుకున్నాడు.? చివరికి తన ఆటతో పెద్ది ఏం సాధించాడనేది చిత్ర కథ.
Plus Points :
పెద్ది గురించి చెప్పాలంటే... ఊరి గుర్తింపు కోసం పెద్ది అనే యువకుడు చేసిన పోరాటమే ఈ కథ... ముందుగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచి సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా నడిపించిన రామ్ చరణ్ ని అభినందించి తీరాలి. అలాగే కథ పరంగా చిన్నదైనా, దాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్డ్ గా డీల్ చేసిన బుచ్చిబాబుని మెచ్చుకోవాలి. సినిమా మొత్తం మూడు దశల్లో ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథను ఎంచుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కోర్ పాయింటే సినిమాని నిలబెట్టిందని చెప్పాలి. దానికి దర్శకుడు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అందరూ వాళ్ళ సైడ్ నుంచి బెస్ట్ ఇచ్చారు.
ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి మరో బెస్ట్ రోల్ పడిందని చెప్పొచ్చు. సినిమాలో తన ఎనర్జిటిక్ యాక్షన్ పెర్ఫార్మన్స్ తో పాటు ఎమోషనల్ గా బరువైన భావోద్వేగాలతో ఆడియన్స్ ని కదిలిస్తాడు. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ ని చరణ్ ఒప్పుకోవడం కూడా గ్రేట్. ఇక ఆ తర్వాత ఆడియన్స్ కి గుర్తుండిపోయే రోల్ అప్పలసూరి పాత్ర. జగపతిబాబు తన వెర్సటైల్ నటనతో ది బెస్ట్ అనిపించాడు. కనిపించేది కాసేపే అయినా జగ్గూభాయ్ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. అలాగే శివరాజ్ కుమార్ కూడా తన పాత్రలో వైవిధ్యతని చూపించారు. ఇక జాన్వీ కపూర్, దివ్యెందు శర్మ, బొమర్ ఇరానీ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
Minus Points :
ఇక పెద్ది సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో భారీ అంచనాలుండేవి. మేకర్స్ ఇచ్చిన ఆ భారీ హైప్ ని ఇమేజిన్ చేసుకుని మూవీ చూస్తే డిస్సపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కథ పరంగా ఆడియన్స్ కి చాలా తెలిసిన రొటీన్ కథనే బుచ్చిబాబు తన స్టైల్లో డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేసాడు. స్క్రీన్ ప్లే కూడా ఊహించినట్టే అనిపిస్తుంది. పైగా కొన్ని సీన్స్ లో సహజత్వం లోపించింది. రియల్ గా తీయాల్సిన కొన్ని సీన్స్ ని గ్రీన్ మ్యాట్ వేసి తీసినట్టు తెలిసిపోతుంది. పైగా చాలా సీన్స్ లో పర భాషనటులకి లిప్ సింక్ కూడా కుదరలేదు. VFX ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నా, మరి కొన్ని చోట్ల తేలిపోయింది.
Technical values :
ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. ఎఆర్ రహ్మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ట్రైలర్, సాంగ్స్ చూసాక రహ్మన్ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ రహ్మన్ సినిమాలోనే అదిరిపోయే బీజీఎమ్ తో తన పనితనం ఏంటో చూపించాడు. కొన్ని బిట్ సాంగ్స్ సినిమాకి హైలెట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ మేకింగ్ క్వాలిటీ విషయంలో కేరింగ్ గా ఉండాల్సింది. రత్నవేలు కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కి కొద్దిగా పని చెప్పాల్సింది.
Final Review :
ఇక ఫైనల్ గా పెద్ది గురించి చెప్పాలంటే ఊరి గుర్తింపు కోసం పెద్ది చేసిన పోరాటమే ఈ కథ. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మనసుల్ని కదిలించే వన్ అఫ్ ది బెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. రామ్ చరణ్ అద్భుతమైన నటనతో పాటు, ఎఆర్ రహ్మాన్ అదిరిపోయే మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్ అన్ని కలగలిపి పెద్ది ని మనసుల్ని కదిలించే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దారు. కథ పరంగానూ ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ది ఆట, పోరాటం రెండూ మెప్పిస్తాయి.