Register as a Reviewer
రణబాలి (RanaBaali)

రణబాలి (RanaBaali)

16 Oct 2026
Overall Rating
5.6/10
27 Reviews

RANABAALI : యంగ్ స్టార్ రౌడీ బాయ్ "విజయ్ దేవరకొండ" హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "రణబాలి". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Rahul Sankrityan
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo and others

Reviews

What critics and the public are saying about రణబాలి (RanaBaali)

Media Reviews

21 Avg: 5.4/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Ranabaali movie review

రణబాలి సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ రాహుల్ అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రణబాలి అనే క్యారెక్టర్ ని కూడా ఫెంటాస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ ని కానీ చాలా బాగా లేఅవుట్ చేసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇస్ ఏ లెట్ డౌన్ అని...

రణబాలి సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ రాహుల్ అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని సూపర్బ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రణబాలి అనే క్యారెక్టర్ ని కూడా ఫెంటాస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ ని కానీ చాలా బాగా లేఅవుట్ చేసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ ఇస్ ఏ లెట్ డౌన్ అని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కి హైలైట్ ఇస్ ద ఇంటర్వెల్. అక్కడ మన అజయ్ అతుల్ కొట్టిన ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆల్సో అక్కడ ఉన్న ఆ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపించలేదు. అసలు లేవు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు ఎపిసోడ్లు పెట్టుకున్నారు కానీ ఫీలయ్యాను. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన అంత పవర్ఫుల్ విలన్ మనకు తగలలేదు. 


మరి నేను చెప్పాను కదా ఇందాక అలాగే కాకుండా వేరేలాగా తీసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ తో నేను థియేటర్ లో నుంచి ఇదేంట్రా బాబు సినిమా అంతా ఒకలాగా చూపించి లాస్ట్ లో ఇలా ఎండ్ చేశారు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో నేను బయటికి వచ్చాను. లాస్ట్ క్లైమాక్స్ గురించి నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అజయ్ అతుల్ మ్యూజిక్ అయితే ఇరక్కొట్టారు. రాహుల్ ఏ పాయింట్ తో అయితే ఈ సినిమాని ఎస్టాబ్లిష్ చేస్తాడో ఒక ఫెయిరీ టేల్ లాగా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఈ సినిమాని మరి ఫెయిరీ టేల్ లాగా ఎండ్ చేస్తున్నామా లేకపోతే మనం ఎలా చేద్దాము అన్న కైండ్ ఆఫ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఈ మూవీని ఇలా ఎండ్ చేయాల్సి వచ్చిందేమో అనేది నా ఫీలింగ్. సో ఓవరాల్ గా మీరు గనుక ఈ సినిమా చూడాలి అనుకుంటే మీ ఎక్స్పెటేషన్స్ ని డెఫినెట్ గా కొంచెం తక్కువగా పెట్టుకోండి. నాకైతే నేను ఫస్ట్ హాఫ్ ఇస్ గ్రేట్, సెకండ్ హాఫ్ నాకైతే లెట్ డౌన్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంక రణబాలి గురించి ఇంకా మనం ఇంతకన్నా మాట్లాడుకునేది ఏమీ లేదన్నమాట. 

Oct 16, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
3

Not Good

Ranabaali movie review

రణబాలి ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఎలా ఉందిరా, ఎలా జరిగింది ఎగ్జామ్ అంటే చెప్పాలా స్పెషల్ గా చెప్పాలా అన్నట్టు గుర్రం అయితే చచ్చింది. నా లాజిక్ ఏందంటే ఏరా నువ్వు ముందు ఎందుకు ఇలా చెప్తున్నావ్ అంటే నాకైతే అసలు మూడు ఉత్సాహం లేదు ఎప్పుడూ లేదు. ఏంట్రా అంటే ఎమోషన్ ఫీల్ కమాన్ ఇప్పుడు ఎలా చెప్పాలి దేశభక్తి సిన...

రణబాలి ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఎలా ఉందిరా, ఎలా జరిగింది ఎగ్జామ్ అంటే చెప్పాలా స్పెషల్ గా చెప్పాలా అన్నట్టు గుర్రం అయితే చచ్చింది. నా లాజిక్ ఏందంటే ఏరా నువ్వు ముందు ఎందుకు ఇలా చెప్తున్నావ్ అంటే నాకైతే అసలు మూడు ఉత్సాహం లేదు ఎప్పుడూ లేదు. ఏంట్రా అంటే ఎమోషన్ ఫీల్ కమాన్ ఇప్పుడు ఎలా చెప్పాలి దేశభక్తి సినిమాలో గాని వేరే సినిమాలో గాని అది చూస్తే మనకు ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ అనేది ఎమోషన్ ద్వారా నో సీన్ల ద్వారా నో నాచురల్ గానో అది ఏదో యాక్టింగ్ కుదురో ఏదో ఒకటి బాగా రావాలి అవుట్పుట్. ఇక్కడ ఎలా ఉంటది అంటే అడ్డంగా నరుకుతా నిలువుగా నరుకుతా అన్నట్టుంది. సినిమాలో ఎమోషన్ పండితే యాక్షన్ పండిద్ది అంతేగాని యాక్షన్ లో 10 మందిని ఒకేసారి నరికితే పండిద్దా? 


రొట్టె కొట్టుడు సినిమాని తీస్తారు మళ్ళీ జనాలు మూడు లేదు అంటే ఆ దిగి దిగి అంటారు. ఫస్ట్ మన మెయిన్ టాపిక్ కొండన్న. కొండన్న గారి యాక్టింగ్ ఆ మ్యాండరిజమ్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించినాయి ఆయనే అన్ కంఫర్టబుల్ గా ఉన్నారు అన్నట్టు అనిపించింది. అంటే అది యాక్టింగ్ చాలా అన్ ఆర్టిఫిషియల్ గా ఉంది. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు వెళ్ళండి. నాది ఇది మాత్రం ఇంకోటి లేదండి. తెలిసిందేగా అస్సలు నచ్చలేదు. 

Oct 16, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
4

Below Average

Ranabaali movie Review

ఇప్పుడే రణబాలి సినిమా చూసొస్తున్నా.. ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక సీరియల్ వచ్చేసి కాపాడుతది తప్ప మనోళ్ళకి చివరి వరకు రాలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు సినిమా నచ్చలేదు. బట్ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది మంచి సీన్స్ పడ్డాయి. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్ అయితే మాత...

ఇప్పుడే రణబాలి సినిమా చూసొస్తున్నా.. ప్రతిదాన్ని తీసుకొచ్చి ఒక సీరియల్ వచ్చేసి కాపాడుతది తప్ప మనోళ్ళకి చివరి వరకు రాలేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు సినిమా నచ్చలేదు. బట్ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది మంచి సీన్స్ పడ్డాయి. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం పర్ఫామెన్సెస్ అని చెప్తా ఫస్ట్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన చాలా చాలా బాగా వర్కౌట్ చేశారు. నాకు ముఖ్యంగా ఈ విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం ఆయన పర్ఫామెన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్స్ ఎలక్షన్ అంటే నాకు అసలు నచ్చదు. జయమ్మ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి.


కానీ వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో 1876 టు 78 ఈ టైంలో ఒకటి ఇస్ ది గ్రేట్ ఫామిన్ వచ్చింది మనకి ఆ కరువుని డిపిక్ట్ అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ కొన్ని కొన్ని ఏరియాస్ లో చాలా బాగుందనిపించింది బట్ స్టిల్ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇంకా చాలా వాడాలి టచ్ ఉంటది ప్రతి తెలుగు సినిమాలో ప్రతి ఇండియన్ సినిమాలో బ్రిటిష్ ఏ రకంగా బిహేవ్ చేస్తారో ఈ సినిమాలో కూడా అదే రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారు. అండ్ నాకు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ ఏది లేదు 5 లక్షల టన్నులు బియ్యం దాన్ని తీసుకుపోవాలి ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాడు తప్ప ఎందుకు ఎందుకు వీళ్ళని అణగదొక్కుతున్నారు ఏముంది న్యూన్స్ ఏమీ లేదు కొంచెం చూపెట్టు.. అనంటే ఎం చూపించలేదు. ఫస్ట్ హాఫ్ సెట్ అప్ అవ్వలేదు. సూపర్ ఓకే అని చెప్పలేను. ఇట్స్ ఆన్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. సేమ్ అదే కమర్షియల్ డ్రాప్ వెళ్ళిపోయినా బానే ఉంది అని ఫీలింగ్ వస్తుంది కొన్ని ఏరియాలో. బట్ స్టిల్ సో ఇది సిచువేషన్. నాకైతే నచ్చలేదు. 

Oct 16, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
7

Hit

Ranabaali movie review

రణబాలి సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే బానే ఉంది అనిపిస్తది కానీ, చాలా చోట్ల ఆ రైటింగ్ పరంగా కావచ్చు లేదంటే ఎగ్జిక్యూషన్ పరంగా కావచ్చు కొంచెం బాగాలేదు అనిపిస్తూ ఉంటది. సో బట్ ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో బిజిఎంలు దెబ్బేశారు. సాంగ్స్ బానే ఉంటాయి. కొన్ని సీన...

రణబాలి సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైక్ 50-50. అంటే బానే ఉంది అనిపిస్తది కానీ, చాలా చోట్ల ఆ రైటింగ్ పరంగా కావచ్చు లేదంటే ఎగ్జిక్యూషన్ పరంగా కావచ్చు కొంచెం బాగాలేదు అనిపిస్తూ ఉంటది. సో బట్ ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో బిజిఎంలు దెబ్బేశారు. సాంగ్స్ బానే ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తది. లిటరల్లీ చెప్తున్నా రక్తం మరుగుతది నిజంగా. అండ్ ఎందుకంటే నేను నేను బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో ఒక గంటన్నర అనుకుందాం పోనీ రెండుగంటల కిందట తిన్నా. ఆ ఆకలే బేసిక్ గా నాకు చాలా చాలా అంటే లైక్ ఆ కడుపులో లాగేస్తుంది, కానీ అప్పటివాళ్ళు ఏడు రోజులు వారం నెల రోజులు ఎన్నో ఎన్నో రోజులు తిండి లేకుండా ఉన్నారే అసలు ఎలా రా నాయనా అని చెప్పి అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ట్రూ. నిజంగా జరిగింది.


ఓకే కాకపోతే లాస్ట్ లో అక్కడ చాలా కన్వీనియెంట్ రైటింగ్ లాస్ట్ లో ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ని మటుకు చాలా బాగా చూపించారు ఓవరాల్ గా పర్లేదు బానే ఉంది అన్న ఒక ఫీల్ వస్తది. అండ్ ఆక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ లో చేశాడు. అట్లా అంటే ఈ క్యారెక్టర్ ని యాక్సెస్ చేసి ఆ లెవెల్ లో చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ హి డిడ్ వెరీ వెల్. సో అది గైస్ సిచువేషన్ సో ఓవరాల్ గా మూవీ అయితే మటుకు బానే ఉంది పర్లేదు. ఇక ఈ మూవీకి జెనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నా రేటింగ్ 3.25\5. 

Oct 16, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Ranabaali movie review

రణబాలి టు అవర్స్ 50 మినిట్స్ రన్ టైం తో థియేటర్ లో రిలీజ్ అయింది. 1870స్ బ్రిటిష్ పీరియడ్ వాళ్ళకి ఎదురు తిరగడం, ఫైట్స్ చేయడం ఇదే ప్లాట్ తీసుకోండి అది కూడా నేను చెప్తున్నాను.. సినిమాలో ఎక్స్ట్రార్డినరీ హై మూమెంట్స్ చాలా తక్కువ కనిపించాయి. నాకు 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీ చాలా ఇష్టం. ఆ సిని...

రణబాలి టు అవర్స్ 50 మినిట్స్ రన్ టైం తో థియేటర్ లో రిలీజ్ అయింది. 1870స్ బ్రిటిష్ పీరియడ్ వాళ్ళకి ఎదురు తిరగడం, ఫైట్స్ చేయడం ఇదే ప్లాట్ తీసుకోండి అది కూడా నేను చెప్తున్నాను.. సినిమాలో ఎక్స్ట్రార్డినరీ హై మూమెంట్స్ చాలా తక్కువ కనిపించాయి. నాకు 2019 లో వచ్చిన సైరా నరసింహారెడ్డి మూవీ చాలా ఇష్టం. ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్, హీరో జర్నీ, సాక్రిఫైస్ చేసే ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ రణబాలిలో ఆ రేంజ్ లో ఎమోషన్ క్యారీ అవ్వలేదని నాకు అనిపించిందండి. అలా అని రణబాలి బ్యాడ్ అటెంప్ట్ అని చెప్పను. ఇంప్రెసివ్ పార్ట్స్ అని చెప్పొచ్చు. 


విజయ్ దేవరకొండ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ 25 మినిట్స్ కొంచెం స్ట్రెచ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కంటెంట్ వైస్ ఫ్యామిలీతో చూడొచ్చు. అయితే సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్స్ లో ఇదొకటి. 1876 78 పీరియడ్ లో గ్రేట్ మద్రాస్ ఫెమిన్ వల్ల దక్షిణ భారతదేశంలో లక్షల మంది ప్రజలు ఆకలి, పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. చనిపోయారు చాలా మంది. ఆ టైం ని రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసారు. కొన్ని ప్లేసెస్ లో స్టోరీ సింపుల్ యాక్షన్ రివర్స్ ఫ్యాక్టర్ లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎమోషనల్ కనెక్షన్ కూడా తక్కువ. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ని సెకండ్ హాఫ్ మొత్తం మెయింటైన్ చేయలేకపోయింది. స్టోరీలో ఇంకా స్ట్రాంగ్ డ్రామా, ఎమోషనల్ క్యారెక్టర్, మెమరబుల్ హై మూమెంట్స్ ఉండుంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేది. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఇది నా ఒపీనియన్ 2.75\5.

Oct 16, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
5

Average

Ranabaali Movie Review

రణబాలి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అందుకు ఫ్రస్ట్రేషన్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రణబాలి అనే వీరుడు కథ, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు, ఫామిలీ జరుగుతున్న టైం లో పుట్టాడు అండ్ తన బర్త్ చుట్టూ...

రణబాలి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అందుకు ఫ్రస్ట్రేషన్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే రణబాలి అనే వీరుడు కథ, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు, ఫామిలీ జరుగుతున్న టైం లో పుట్టాడు అండ్ తన బర్త్ చుట్టూ కూడా ఒక సర్టెన్ మిత్ ఉంటది. అది రివీల్ చేసి నేను మీకు స్పాయిల్ చేయదలుచుకోలేదు. రాహుల్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పర్సనల్ రిలేషన్స్ బాగా రాస్తాడు తను. సో విజయ్ రష్మిక వీళ్ళిద్దరి పోర్షన్ బాగుంది. 


అండ్ రాహుల్ కరెక్ట్ థాట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి డిజైన్ చేసిన సీన్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వకపోవడం అండ్ ఈ డ్రామాకి ఎప్పుడైనా పే ఆఫ్ ఇచ్చేది త్రూ యాక్షనే కదా. ఈ సింక్ ని తెప్పియలేదు యాక్షన్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. బట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ సౌండ్ అండి. అది నాకు థియేటర్ ప్రాబ్లమో లేకపోతే ఏంటో తెలియదు కానీ అంటే స్క్రీన్ మీద ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టు ఏముంది కానీ బట్ ఫిల్మ్ రాహుల్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది నాకు క్లారిటీ వస్తుంది, కొన్ని ఐడియాస్ ఏమో ప్రాపర్ బిల్డ్ అప్ లేకుండా వచ్చేస్తాయి. విజయ్ దేవరకొండ ఇస్ ఫినోమినల్ అండి. చాలా బాగా చేసాడు. ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి.. బట్ ఈ యాక్షన్ బిల్డ్ చేయడము అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ తను నాకు చెప్పడం వల్ల గాని ఏదన్నా గాని సో ఆ కాన్వర్సేషన్ బిల్డ్ చేయడంలో హి సక్సీడెడ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఓకే ఒకే. 

Oct 16, 2026 Watch
10TV Telugu
10TV Telugu News Channel
7

Hit

Ranabaali movie review

చారిత్రక నేపథ్యానికి కల్పిత కథ, జానపద విశ్వాసాలు, యాక్షన్ అంశాలను జోడించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ రణబాలి చిత్రాన్ని పూర్తిగా చారిత్రక సినిమా గా కాకుండా, చరిత్ర నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా చూడాలి. ‘రణబాలి’లో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రధాన అంశం కరువు నేపథ్యం. వర్షాలు లేక పంటలు పండకపోవడం, గ్ర...

చారిత్రక నేపథ్యానికి కల్పిత కథ, జానపద విశ్వాసాలు, యాక్షన్ అంశాలను జోడించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ రణబాలి చిత్రాన్ని పూర్తిగా చారిత్రక సినిమా గా కాకుండా, చరిత్ర నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా చూడాలి. ‘రణబాలి’లో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రధాన అంశం కరువు నేపథ్యం. వర్షాలు లేక పంటలు పండకపోవడం, గ్రామాల్లో ఆహార కొరత ఏర్పడటం వంటి పరిస్థితులు ప్రజల జీవితాలను ఎలా కుదేలు చేస్తాయో కథ వివరిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఆయన తన మాస్ ఇమేజ్‌కు భిన్నమైన పీరియాడికల్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. జయమ్మ పాత్రలో రష్మిక కథకు భావోద్వేగ కోణాన్ని అందిస్తారు. రణబాలి వ్యక్తిగత జీవితానికి, అతడి పోరాటానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.



అయితే దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం వల్ల ఉత్కంఠ తగ్గుతుంది. కొన్ని సన్నివేశాల్లో సంగీతం మరింత సమతూకంగా ఉంటే భావోద్వేగ ప్రభావం పెరిగేది. ఫైనల్ గా ‘రణబాలి’ ఒక విభిన్నమైన చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా. కొన్ని చోట్ల నిడివి, కథనం విషయంలో మెరుగుదలకు అవకాశం ఉన్నప్పటికీ, చారిత్రక అంశాలను కమర్షియల్ కథనంతో కలపాలనే ప్రయత్నం ప్రశంసనీయం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాను పరిశీలించవచ్చు.



Oct 16, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Ranabaali movie review

అసలు ‘రణబాలి’ చూశాక అర్థమైంది ఏంటంటే.. సినిమాలో విషయం ఉంది, టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి మాత్రం గట్టి రోప్‌వాక్ టెస్ట్ పెట్టేశారు! 1900ల నాటి కరవు కథ అని చెప్పారు కానీ, ఆ సీన్ల కన్నా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటేనే మనకి ఆకలి, నిద్ర ఎక్కువైపోతాయి. రాజమౌళి రేం...

అసలు ‘రణబాలి’ చూశాక అర్థమైంది ఏంటంటే.. సినిమాలో విషయం ఉంది, టీమ్ పడ్డ కష్టం కనిపిస్తోంది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల సహనానికి మాత్రం గట్టి రోప్‌వాక్ టెస్ట్ పెట్టేశారు! 1900ల నాటి కరవు కథ అని చెప్పారు కానీ, ఆ సీన్ల కన్నా స్క్రీన్ ప్లే చూస్తూ ఉంటేనే మనకి ఆకలి, నిద్ర ఎక్కువైపోతాయి. రాజమౌళి రేంజ్‌లో రచ్చ లేపాల్సిన 'బ్రిటిషర్ల ప్యాంట్లు విప్పి కారం కూరే సీన్' ని కూడా ఏదో సీరియల్‌లో ఊరగాయ నూరినంత కూల్‌గా లాగించేశారు రాహుల్ సంకృత్యన్ సర్!


ఇక విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో రణరంగం సృష్టిస్తే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సైలెంట్‌గా మెడిటేషన్ చేయిస్తుంది.రష్మిక లుక్స్, గుహ యాక్షన్ సీన్, క్లైమాక్స్ బాగున్నా.. ఆ స్లో నరేషన్ దెబ్బకి క్లైమాక్స్ వచ్చేసరికి ఆడియెన్స్ ఆల్రెడీ మైండ్ బ్లాంక్ అయిపోతారు. మొత్తానికి 'రణబాలి' ఒక మంచి ఆర్ట్ ఫిలిం విత్ ఆస్కార్ రేంజ్ ఓపిక పరీక్ష! ఫైనల్ గా తెరమీద చేసిన వాళ్ళ కష్టం పనబడింది కానీ, కూర్చోడానికి కూడా కష్టం గానే ఉంది.

Oct 16, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Ranabaali Movie Review

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘రణబాలి’ 1900ల నాటి బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామా. మరుగున పడిన ఒక అద్భుతమైన చారిత్రక కథను శోధించి రాయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.రణబాలిగా విజయ్ తన మాస్ ఆవేశం, రాయలసీమ యాసతో ప్రాణం పోయగా, జయ...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ‘రణబాలి’ 1900ల నాటి బ్రిటిష్ పాలన, కరవు నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామా. మరుగున పడిన ఒక అద్భుతమైన చారిత్రక కథను శోధించి రాయడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది.


రణబాలిగా విజయ్ తన మాస్ ఆవేశం, రాయలసీమ యాసతో ప్రాణం పోయగా, జయమ్మగా రష్మిక నటన, మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే, ఒక రాజమౌళి రేంజ్ కమర్షియల్ ఎలివేషన్లు పడాల్సిన సీన్లను కూడా ఆర్ట్ ఫిలిం తరహాలో చాలా సింపుల్‌గా తీయడం, స్లో నరేషన్ మరియు ఇంపాక్ట్ లేని బిజీఎమ్ (BGM) ప్రేక్షకుల అనుభూతిని బాగా దెబ్బతీశాయి.


అయితే గుహ యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ బాగున్నప్పటికీ, సుదీర్ఘ నిడివి వల్ల సినిమా గ్రాఫ్ పడిపోతుంది. మొత్తానికి ‘రణబాలి’ మంచి కంటెంట్ ఉన్న చిత్రమే కానీ, కానీ తక్కువ అంచనాలతో చుస్తే సినిమా నచ్చవచ్చు.

Oct 16, 2026 Read Review
One India
One India Website
6

Above Average

Ranabaali Movie Review

రణబాలి సినిమాలో ఫస్టాఫ్‌ లో దర్శకుడు కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశాడు. రణబాలి ఎవరు, అతడి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే సినిమా కాస్త నెమ్మదిస్తుంది. విజయ్, రష్మిక సన...

రణబాలి సినిమాలో ఫస్టాఫ్‌ లో దర్శకుడు కథకు అవసరమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేశాడు. రణబాలి ఎవరు, అతడి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడే సినిమా కాస్త నెమ్మదిస్తుంది. విజయ్, రష్మిక సన్నివేశాలు, పీరియడ్ బ్యాక్‌డ్రాప్ ఆసక్తిని నిలబెట్టినా.. ఫస్టాఫ్‌ను ఇంకాస్త క్రిస్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. సెకండాఫ్‌లో రణబాలి పోరాటం మరింత తీవ్రంగా మారుతుంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్ కారణంగా కొన్ని చోట్ల సినిమా సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ కథలో వేగం పెరుగుతుంది. విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ కలిసి సినిమాను మంచి స్థాయిలో ముగిస్తాయి.

 


ఇక సినిమాలో 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యాన్ని తెరపై చూపించిన విధానం, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, వార్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్‌ గా నిలిచాయి. కథలో పెద్దగా అవసరం లేని కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. స్క్రీన్‌ప్లే కూడా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ఫైనల్‌ గా.. భారీ అంచనాలతో వచ్చే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కంటే రణబాలి ఒక నెమ్మదిగా సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, విజువల్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు.

Oct 16, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Ranabaali Movie Review

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల క...

ఎంతో మంది ఆకలి తీర్చినది భారతదేశం. అన్నపూర్ణ లాంటి దేశంలో కరువుకు కారణమైన బ్రిటీషర్ల మీద రణబాలి ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అయితే... ఆ యుద్ధం, బ్రిటీషర్లపై రణబాలి చేసిన పోరాటం, సినిమా ముందుకు వెళ్ళిన విధానం కొత్తగా అనిపించవు. అందుకు కారణం బ్రిటీషర్లపై పోరాటం చేసిన భారతీయ యోధుల కథను గతంలో తెరపై చూడటమే. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో 'సైరా నరసింహారెడ్డి' రావడం కూడా 'రణబాలి'కి కొంత మైనస్ అని చెప్పాలి. కథ పరంగా 'సైరా', 'రణబాలి' మధ్య వ్యత్యాసం ఉంది. ఈ సినిమాలో కరువుపై ఎక్కువ ఫోకస్ చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. కానీ పోరాటం చేసినది మాత్రం బ్రిటీషర్లపైనే.


'రణబాలి'గా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక పాత్రలను... వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చాలా బాగా రాశారు. క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ అంటే జస్ట్ సీన్లు, డైలాగులు మాత్రమే కాదు... ఎక్స్‌ప్రెషన్స్ నుంచి బిహేవియర్ వరకు ఎలా ఉండాలో డిసైడ్ చేయడంలో రాహుల్ సాంకృత్యాన్ తన ట్యాలెంట్ చూపించారు. అయితే... నిడివి విషయంలో కాస్త తప్పటడుగు వేశారు. ఫస్టాఫ్ డీసెంట్ అనిపించినా... సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం పేలవంగా సాగింది. అజయ్ - అతుల్ సంగీతంలో పాటలు బావున్నాయి. కానీ, ఆర్ఆర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని 'రణబాలి'లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీతో పాటు వాళ్ళిద్దరి సన్నివేశాలూ బావున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథలో కొత్తదనం లేదు. కానీ, కథనంలో కొన్ని 'హై' మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను మరీ తీసిపారేయలేం. అంచనాలు తక్కువ పెట్టుకుని వెళితే విజయ్ దేవరకొండ నటన నచ్చుతుంది.


Oct 16, 2026 Read Review
6

Above Average

RanaBaali Movie Review

1870-80 ప్రాంతంలో మద్రాస్‌, రాయలసీమ, కర్నూల్‌.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్‌ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్‌ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక్షల) మంది ప్రజలు తిండిలేకచనిపోతారు. మరోవైపు బ్రిటీష్‌ వారిచేత చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో సింగనమ...

1870-80 ప్రాంతంలో మద్రాస్‌, రాయలసీమ, కర్నూల్‌.. వంటి ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఓ వైపు, బ్రిటీష్‌ వాళ్లు ధాన్యాన్ని దోచుకొని వెళ్లి క్రియేట్‌ చేసిన కృత్రిమ కరువు మరోవైపు. ఇలా కొన్ని లక్షల(సుమారు 80 లక్షల) మంది ప్రజలు తిండిలేకచనిపోతారు. మరోవైపు బ్రిటీష్‌ వారిచేత చంపబడతారు. అలాంటి పరిస్థితుల్లో సింగనమల ప్రాంతంలో బ్రిటీష్‌ వారిపై రణబాలి చేసిన పోరాటమే ఈ చిత్రం అని చెప్పొచ్చు. ఇక రణబాలిగా విజయ్‌ దేవరకొండ చేసే ఫస్ట్ యాక్షన్‌ బాగుంది. విజయ్‌ పాత్ర చేసే యాక్షన్‌ కొత్తగా ఉంటుంది. అది కొంత ఓవర్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. క్యాంప్‌లో బ్రిటీష్‌ వారిపై రణబాలి చేసే పోరాటం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.  


అయితే సెకండాఫ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్, కరువుతో ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి, కరువు రక్షసుడికి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోవడం వంటి సీన్లు హృదయాన్ని కదిలిస్తాయి. జయమ్మ పాత్రకి సంబంధించిన సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు సినిమా మరో స్థాయికి వెళ్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది. అక్కడ పూనకాలు తెప్పిస్తుంది. బీజీఎం అదిరిపోయింది. విజయ్‌ దేవరకొండ విశ్వరూపం చూపించాడు. ఎండ్‌లో మాత్రం వాహ్‌ ఫీలింగ్‌ తెప్పిస్తాడు. కొంత కమర్షియాలిటీకి దూరంగా ఉన్నా, చివర్లో దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఫైనల్‌గా.. రణబాలి మూవీ థియేటర్‌లో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. నెగటివ్‌ టాక్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంచనాలు లేకుండా చూస్తే నచ్చుతుంది. విజయ్‌ ఆకట్టుకుంటాడు. ఓవరాల్‌గా ఒక పీరియాడికల్‌ ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా `రణబాలి`. అప్పటి కరువు పరిస్థితులు మాత్రం హార్ట్ ని టచ్‌ చేస్తాయని చెప్పొచ్చు.

Oct 16, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Ranabaali Movie Review

బ్రిటీష్‌ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో ప్రజలకు అండగా...

బ్రిటీష్‌ వారికి సింహస్వప్నంగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం పొందిన మూడు దశాబ్దాలకు శింగనమల బెబ్బులి రణబాలి ఆంగ్లేయులపై జరిగే అలుపెరుగని పోరాటం చేశాడు. రాయలసీమలో రణబాలి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో ప్రజలకు అండగా నిలిచాడని అక్కడి వారు నమ్ముతారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ వీర గాథను లార్టర్ దాన్‌ లైఫ్‌ తరహాలో వెండితెరపై ఆవిష్కరించాడు. బ్రిటిషర్స్... భారతీయులను బానిసలుగా చూసిన నిజాన్ని విస్మరించి, వారు ఈ దేశంలో రైలు మార్గాలు వేశారు, విద్యాబోధనలు చేశారు అని గొప్పలు చెప్పుకొనే వారికి ఈ సినిమా ఓ చెంపపెట్టు. 


1840 నుంచి 1880 మధ్య కాలంలో భారతదేశాన్ని కృత్రిమ కరువు రక్కసి నోట్లోకి నెట్టేసి, కోట్లాది మంది భారతీయుల అకాల మరణానికి కారణం అయిన వారు ఆంగ్లేయులనే కఠోర నిజాన్ని ఆధారాలతో దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాలో చూపించాడు. అయితే అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలను మనసు ద్రవించేలా చూపించడంలో రాహుల్ తడబడ్డాడు. దానికి తోడు కథనం చాలా నిదానంగా నడవడం కూడా కాస్తంత ఇబ్బందిని కలిగిస్తుంది. రొటీన్ ఫార్ములా జోలికి పోకుండా... ఈ దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల అకృత్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అయితే చిరంజీవి నటించిన స్వాతంత్ర సమరయోధుడు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితిలో అదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'రణబాలి' పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కానీ జయాపజయాలను బేరీజు వేసుకోకుండా మైత్రీ మూవీ మేకర్స్ చేసిన గొప్ప ప్రయత్నంగా 'రణబాలి'ని చూడాల్సి ఉంటుంది. మేకర్స్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది.

Oct 16, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Ranabaali Movie Review

1900ల నాటి తీవ్రమైన కరవు, బ్రిటిష్ వారి దోపిడీ నేపథ్యంలో ఆకలి తీర్చే యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ‘రణబాలి’ని తెరకెక్కించారు. రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రాయలసీమ స్లాంగ్‌తో ఆకట్టుకోగా, జయమ్మగా రష్మిక మందన్నా తన లుక్, యాక్టింగ్‌తో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్...

1900ల నాటి తీవ్రమైన కరవు, బ్రిటిష్ వారి దోపిడీ నేపథ్యంలో ఆకలి తీర్చే యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ‘రణబాలి’ని తెరకెక్కించారు. రణబాలిగా విజయ్ దేవరకొండ పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రాయలసీమ స్లాంగ్‌తో ఆకట్టుకోగా, జయమ్మగా రష్మిక మందన్నా తన లుక్, యాక్టింగ్‌తో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా ఉన్నాయి. ఇక సినిమాలో హీరోహీరోయిన్లు సహా ఆర్టిస్టుల నటన, చరిత్ర ఆధారిత బలమైన కథాంశం తో పాటు అద్భుతమైన ఆక్షన్ సీన్స్ ప్లస్ అయ్యాయి. 


అయితే డల్ అండ్ వెరీ స్లో నరేషన్, కనెక్ట్ అవ్వని ఎమోషన్స్, పేలవమైన BGM, వీఎఫెక్స్ లోపాలు, సుదీర్ఘ నిడివి వంటివి మైనస్ అయ్యాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన స్టఫ్ అంతా ఉన్నప్పటికీ, ఆర్ట్ ఫిలిం తరహా నెమ్మది నరేషన్ సినిమా ఇంపాక్ట్‌ను దెబ్బతీసింది. ఓవరాల్‌గా ‘రణబాలి’ విషయం ఉన్న చిత్రమే అయినా, స్లో పేసింగ్ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. కథ పరంగా ఎక్కడా వంకలు పెట్టడానికి లేకపోయినా, కథనంతో నడిపించిన తీరు కాస్త ఇబ్బందికరం అయ్యే పరిస్థితులున్నాయి. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఇక ఫైనల్లీ విజయ్ దేవరకొండ రణబాలి హానెస్ట్ అటెంప్ట్. 

Oct 16, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Ranabaali Movie Review

‘రణబాలి’ సినిమాలో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.. ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించని బీజీఎం వల్ల.. అనుభూతి దెబ్బతిని ‘రణబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్ట...

‘రణబాలి’ సినిమాలో ఒక మంచి కథ ఉంది. మరుగున పడిన చరిత్రను శోధించి చెప్పిన సంచలన విషయాలున్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా మారడానికి అవసరమైన ముడిసరుకు అంతా ఇందులో ఉంది. కానీ ఈ కథను చెప్పిన శైలిలో లోపం వల్ల.. ఏమాత్రం ఇంపాక్ట్ కలిగించని బీజీఎం వల్ల.. అనుభూతి దెబ్బతిని ‘రణబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా తయారైంది. కథలో కంటెంట్ ఉన్నా.. కొన్ని స్టాండౌట్ ఎపిసోడ్లు పడ్డా.. విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మురిపించినా.. స్లో నరేషన్ పెద్ద సమస్యగా మారి.. కీలక సన్నివేశాలు ఇంపాక్ట్ కలిగించక ‘రణబాలి’ ఇవ్వాాల్సిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.


చరిత్రను శోధించి ఇలాంటి కథను తయారు చేయడంలో రాహుల్ సంకృత్యన్ అభిరుచిని.. కష్టాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే ఇదే కథను రాజమౌళి లాంటి దర్శకుడి చేతికి అప్పగిస్తే.. ప్రేక్షకులను ఉర్రూతలూగించేసేవాడేమో అనిపిస్తుంది. కానీ బెంగాలీ సినిమాల ప్రభావం బాగా ఉన్న రాహుల్ సంకృత్యన్ దీన్నొక ఆర్ట్ సినిమాలా తీర్చిదిద్దడమే ‘రణబాలి’కి సమస్యగా మారింది. కొన్ని సన్నివేశాలను హృద్యంగా తీసినప్పటికీ.. కొన్నిచోట్ల ఎమోషన్ రాబట్టినప్పటికీ.. డల్ నరేషన్ తో అతను బాాగా పేలాల్సిన ఎపిసోడ్లలో కూడా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ఇక రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోవడానికి చాలానే కష్టపడ్డాడు. రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో చాాలా బాగా నటించింది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల వీఎఫెక్స్ మాత్రం సరిగా కుదరలేదు. కొన్ని చోట్ల తన అభిరుచిని చాటినా.. ఆసక్తి పెంచని స్క్రీన్ ప్లే.. డల్ నరేషన్ తో సినిమా ప్రభావాన్ని తగ్గించేశాడు. చివరగా రణబాలి.. ఎఫర్ట్ ఉంది.. ఎఫెక్ట్ తగ్గింది.


Oct 16, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Ranabaali Movie Review

రణబాలి సినిమా కథ గ్రామీణ ప్రాంతంలో చెప్పే బుర్రకథతో ఎమోషనల్‌గా మొదలవుతుంది. సినిమాలో భద్రమల్లన్న కాన్సెప్ట్ ఆసక్తిగా అనిపిస్తాయి. ఇక రాహుల్ సంకృత్యాన్ సన్నివేశాలు రాసుకొన్న తీరు, కథను నడిపించిన విధానంలో ఎక్కడా లోపాలు కనిపించవు. అయితే దర్శకుడిగా తాను నమ్ముకొన్న కథను అంతే నిజాయితీతో చెప్పే ప్రయత్నం చే...

రణబాలి సినిమా కథ గ్రామీణ ప్రాంతంలో చెప్పే బుర్రకథతో ఎమోషనల్‌గా మొదలవుతుంది. సినిమాలో భద్రమల్లన్న కాన్సెప్ట్ ఆసక్తిగా అనిపిస్తాయి. ఇక రాహుల్ సంకృత్యాన్ సన్నివేశాలు రాసుకొన్న తీరు, కథను నడిపించిన విధానంలో ఎక్కడా లోపాలు కనిపించవు. అయితే దర్శకుడిగా తాను నమ్ముకొన్న కథను అంతే నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఎక్కడా ఎలివేషన్స్, వాస్తవానికి దూరంగా వెళ్లకుండా రియలిస్టిక్‌గా స్టోరీని రన్ చేశాడని చెప్పాలి. అయితే కథలో డిటైలిటీ ఎక్కువ ఉండటం వల్ల నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడి విజన్, విజయ్, రష్మిక పెర్ఫార్మెన్స్ ఈ సినిమా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాయి.


రణబాలిగా విజయ్ దేవరకొండ నటుడిగా మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. ఇక రష్మిక మందన్న స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ.. తాను కనిపించిన సీన్లలో కేక పెట్టించారు. ఫైనల్‌ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. పిరియాడిక్ నేపథ్యంగా సాగే ఈ సినిమాను దర్శకుడు రాహుల్ నిజాయితీగా కథను చెప్పారు. అలాగే పాత్రలను నమ్మి విజయ్ దేవరకొండ, రష్మిక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫి తదితర అంశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. పిరియాడిక్, లవ్ స్టోరీ, సోషల్ ఇష్యూస్‌తో వచ్చే ఎమోషనల్ కంటెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఫీలింగ్ అందిస్తుంది. విజయ్, రష్మిక కోసం ఈ సినిమాను చూసేయొచ్చు.


Oct 16, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Ranabaali Movie Review

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన సినిమా రణబాలి. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో చరిత్రకు సంబంధించిన భయంకరమైన కరువు నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ స్ అండ్ భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలెట్...

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన సినిమా రణబాలి. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో చరిత్రకు సంబంధించిన భయంకరమైన కరువు నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ స్ అండ్ భావోద్వేగమైన ఎమోషన్స్, మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనతో తన పాత్రకు జీవం పోశారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. జయమ్మ పాత్రలో రష్మిక మందన్న తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. 


అయితే ‘రణబాలి’లో బరువైన ఎమోషన్స్ తో, భారీ యాక్షన్ ఉన్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక విజయ్ – రష్మిక పాత్రల మధ్య ఎమోషనల్ ట్రాక్ బాగున్నా.. వారి మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘రణబాలి’.. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ నటన, క్లైమాక్స్ లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. కానీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, రెగ్యులర్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ను కూడా కొన్ని చోట్ల అలరిస్తుంది.

Oct 16, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Ranabaali movie Review

రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా డాక్యుమెంటరీ అన్న ఫీలింగ్ కలిగించలేదు. చాలా వరకు లిబర్టీస్...

రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా డాక్యుమెంటరీ అన్న ఫీలింగ్ కలిగించలేదు. చాలా వరకు లిబర్టీస్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్తగా కథ ఏమీ కనిపించదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ కలగదు. ఊహకందేలా కథ సాగుతూ ఉంటుంది. 


ఒక చోట సినిమా అయిపోయిందేమో అని అనుకుంటారు. కానీ ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. చివరకు డివైన్ ఫీలింగ్ కలిగించాలని.. కాంతారాలో పెట్టినట్టుగా.. మొన్న ప్యారడైజ్‌లో ధూమావతి కాన్సెప్ట్ పెట్టినట్టుగా.. ఇందులో భద్ర మల్లన్న కాన్సెప్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక చివరకు పూనకంతో విజయ్ చేసే తాండవం ఆయన ఫ్యాన్స్‌కి నచ్చే అవకాశం ఉంది. విజయ్ తన గత సినిమాలతో పోలిస్తే అద్భుతంగా చేసేశాడు. కనిపించడంలోనూ, వినిపించడంలోనూ విజయ్ తనలోని భిన్నత్వాన్ని చూపించాడు.జయమ్మగా రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుంది. అసలు ఈ ఇద్దరినీ తెరపై చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుంది. చివరగా ‘రణబాలి’ టెక్నికల్లీ బ్రిల్లియంట్ మూవీ. కానీ కమర్షియల్‌గా ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. స్లో నెరేషన్, సెకండాఫ్ ల్యాగ్, నిడివి, ప్రెడిక్టిబుల్ స్టోరీ, మాస్‌కి కావాల్సిన హై మూమెంట్స్ కనిపించవు. కానీ రాహుల్ విజన్, మేకింగ్, విజయ్ చేసిన విధ్వంసం కోసమైనా థియేటర్లో చూడాల్సిన సినిమాగా నిలుస్తుంది.


Oct 16, 2026 Read Review
Devi Priya
Devi Priya Twitter Channel
5

Average

Ranabaali Movie Review

#RanaBaali #IdreamMediaRating 2.5/5దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన రాయల సీమ కరువు కథవలస పాలకుల పీడన ను ఎదిరించిన వీరుడి కథ ..కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి కొంచెం సమయం పడుతుంది ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు ఆకట్టుకుంటుంది విశ్రాంతి తరువాత హీరో పోరుబాట లోకి వెళ్ళాక కొంచెం బోర్ కొడుతుంది విజయ్...

#RanaBaali #IdreamMediaRating 2.5/5

దర్శకుడు రాహుల్ తెర పైకి తీసుకువచ్చిన

రాయల సీమ కరువు కథ

వలస పాలకుల పీడన ను

ఎదిరించిన వీరుడి కథ

..

కథలో ప్రేక్షకుడు లీనం

కావడానికి కొంచెం

సమయం పడుతుంది

ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు

ఆకట్టుకుంటుంది

విశ్రాంతి తరువాత

హీరో పోరుబాట లోకి వెళ్ళాక

కొంచెం బోర్ కొడుతుంది

విజయ్ దేవరకొండ రష్మిక

బాగా చేసారు

డై లాగ్ లు బాగున్నాయి

చిత్రీకరణ లో వీలయినంత

సహజత్వం తీసుకువచ్చారు

..

ఓ సీరియస్ బయోపిక్ లాంటి

సినిమా చూడబోతున్నాం

అనే భావన తో వెళ్తే చూడొచ్చు

ఎన్నో సార్లు చూసిన

బ్రిటిష్ పీడన అన్నది కాస్త బోరింగ్

సబ్జెక్ట్ అనుకుంటే వదలొచ్చు

..

పంచ్ లైన్..భయం లేదు ..చూడొచ్చు

Oct 16, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

Ranabaali Movie Review

రణబాలి సినిమా కథ 1875 కాలం నాటిది అవ్వడంతో నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా స్లోగానే సాగుతుంది. సినిమాలో మంచి ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నా కూడా చెప్పిన నేపధ్యం మాత్రం స్లోగా ఉండటం వలన తెరపై మంచి సీన్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ మాత్రం తన రోల్ వరకు ఎంత న్యాయం చేయగలడో అంతా చేయ...

రణబాలి సినిమా కథ 1875 కాలం నాటిది అవ్వడంతో నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా స్లోగానే సాగుతుంది. సినిమాలో మంచి ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నా కూడా చెప్పిన నేపధ్యం మాత్రం స్లోగా ఉండటం వలన తెరపై మంచి సీన్స్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ మాత్రం తన రోల్ వరకు ఎంత న్యాయం చేయగలడో అంతా చేయడానికి ట్రై చేశాడు. చాలా వరకు మెప్పించాడు కూడా. రష్మిక పర్వాలేదు అనిపించేలా నటించగా, మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో తమ తమ రోల్స్ వరకు ఆకట్టుకున్నారు. సంగీతం విషయంలో ఒక సాంగ్ బాగుండగా మిగిలిన పాటలు సో సో గానే ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా ఉండాల్సిన చోట పర్వాలేదు అనిపించేలా ఉంది. 



ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ముందు చెప్పినట్లు స్లోగా సాగుతుంది. ఇది ముందే గుర్తు పెట్టుకుని సినిమా చూడటం స్టార్ట్ చేస్తే మంచిది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గానే ఉన్నాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాని పెట్రియాటిక్ నేపధ్యానికి దైవభక్తిని కూడా జోడించి ఉన్నంతలో సీన్స్ వైజ్ బాగానే చెప్పే ప్రయత్నం హానెస్ట్ గా చేసినా కానీ లెంత్ ఎక్కువ అయ్యేలా చూసుకోవడం, రన్ టైం తగ్గించి స్క్రీన్ ప్లే కొంచం ఫాస్ట్ గా చేసుకుని ఉంటే బాగుండేది. అయినా కానీ ఉన్నంతలో కొంచం ఓపిక చేసుకుని చూస్తె బాగానే ఉంది అనిపిస్తుంది రణబాలి సినిమా. 

Oct 16, 2026 Read Review
Venky Reviews
Venky Reviews Twitter Channel
4

Below Average

Ranabaali Movie Review

#Ranabaali Honest Intentions, Patience Testing Execution!The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main hig...

#Ranabaali Honest Intentions, Patience Testing Execution!


The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main highlight, but the film lacks the emotional connect a subject like this needs and feels lifeless and tiring for long stretches.


Production values and set design stand out. VD’s effort is visible and he gives a sincere performance, though his characterization and histrionics feel odd at times. BGM is a huge letdown, and the film badly needs trimming. Sincere effort, but a strictly boring watch.


Rating: 2/5

Oct 16, 2026 Read Review

Public Reviews

6 Avg: 6.3/10
T
Talari Snehalatha IT Employee
7

Hit

Ranabaali movie review

‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు. అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యా...

‘Ranabaali’ బొమ్మ చూశాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది! థియేటర్‌లో ఇది కేవలం ఒక సినిమా లాగ అనిపించలేదు.1900ల నాటి భయంకరమైన కరవు పరిస్థితుల్ని, అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యాలను ఎదిరించే ఒక అన్‌టోల్డ్ హిస్టారికల్ మాస్టర్‌పీస్‌ ని డైరెక్టర్ మనకు బాగా చూపించారు.


అండ్ స్పెషల్ గా మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మా కల్చర్ కి దగ్గరగా చూపించినందుకు నాకు బాగా నచ్చిందేమో. అండ్ విజయ్ దేవరకొండ అన్న పర్ఫార్మెన్స్ సూపర్ అసలు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా హ్యాండిల్ చేసాడు. బట్ సీమ స్లాంగ్ అంత సెట్ అవ్వలేదనిపించింది. అండ్ సినిమాలో కొన్ని యాక్షన్స్ సీన్స్ కి పూనకాలు వచ్చేసేలా ఉన్నాయి.


బట్ కొంచెం న్యాచురాలిటీ తగ్గిందనిపిస్తుంది. అండ్ ఇది ఫిక్షనల్ స్టోరీ అని సినిమా చూసేదాకా తెలీదు. సో దాంట్లో చిన్న డిస్సపాయింట్మెంట్ అంతే. మిగతా అంతా సూపర్.


Oct 16, 2026
A
8

Super Hit

Ranabaali movie review

గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ...

గైస్, ‘Ranabaali’ ఇప్పుడే చూసొస్తున్నా... అసలు థియేటర్‌లో ప్యూర్ విజువల్ ఫీస్ట్ అండ్ మైండ్-బ్లోయింగ్ పీరియాడిక్ డ్రామా అంతే!


Vijay Deverakonda పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్! మన తెలంగాణోడు అయినా కూడా సీమ యాస, ఆ ఆవేశం సీన్లలో కంప్లీట్ రా ఫైర్ కనిపించింది. Rashmika యాక్టింగ్ నాకంత నచ్చదు కానీ.. ఈ సినిమాలో బాగా చేసింది. అండ్ రియల్ లైఫ్ జోడి కాబట్టి ఇద్దరి పెయిర్ కూడా మస్త్ ఉంది సినిమాలో కూడా.


అండ్ సినిమాలో అప్పటి కరువు బ్యాక్‌డ్రాప్‌ ల మరుగున పడిన మన రియల్ హిస్టరీని డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బాగా చూపించాడు. ఇదైతే మెయిన్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అయితే థియేటర్‌లో goosebumps తెప్పించేశాయి!


కథలో ఉన్న emotion అండ్ డిటైలింగ్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తది. మరీ క్లాసిక్ రేంజ్ లో కాదు గాని, మన తెలుగు సినిమా లవర్స్ కైతే బాగా నచ్చుతాది సినిమా. కొండన్న ఫ్యాన్స్ కైతే పిచ్చెక్కుద్దేమో.

Oct 16, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
6

Above Average

Ranabaali Movie Review

ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ‘రణబాలి’ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే చూడ్డానికి వెళ్ళిపోయా. బట్ సినిమా చూసాక తెలిసింది. దీని కాన్సెప్ట్ వేరే అని. బట్ ఒకే. సినిమా బాగానే తీశారు. బ్రిటిష్ వాళ్ళతోనే వార్ ఉంటుంది, కానీ అది వాళ్ళ ఊరి కోసం అంతే.. బట్ సినిమాలో ఆ టైం లో కరువు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో బా...

ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ‘రణబాలి’ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే చూడ్డానికి వెళ్ళిపోయా. బట్ సినిమా చూసాక తెలిసింది. దీని కాన్సెప్ట్ వేరే అని. బట్ ఒకే. సినిమా బాగానే తీశారు. బ్రిటిష్ వాళ్ళతోనే వార్ ఉంటుంది, కానీ అది వాళ్ళ ఊరి కోసం అంతే.. బట్ సినిమాలో ఆ టైం లో కరువు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో బాగా చూపించారు.


అండ్ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ సప్రైజ్ ఏంటంటే రష్మిక యాక్టింగ్ చాలా సినిమాల్లో క్రింజ్ లాగ అనిపిస్తది. బట్ ఇందులో చాలా బాగా చేసింది. బట్ సినిమాను డైరెక్టర్ ఒక ఆర్ట్ సినిమా టైపులో సీన్లను పిచ్చి ఫ్లాట్‌ గా లాగేశాడు. అండ్ నేటివిటీ మిస్ అయింది. చాలా మందికి సెట్స్ చూసి, విజువల్స్ చూసి తెలుగు సినిమాలాగే అనిపించొచ్చు. బట్ నాకైతే అంత అనిపించలేదు.


బట్ విజయ్ కష్టం సీన్లలో కనిపిస్తుంది కానీ.. ఆ డల్ నరేషన్, వల్ల బొమ్మ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. బట్ ఒకసారైతే చూసేలాగానే ఉంది.


Oct 16, 2026
G
Goshika Shreshta CA/Advocate
6

Above Average

Ranabaali movie Review

just ippude Ranabaali matnee show finish chesa.. movie lo content and potential aithe solid ga undi, kani execution matram total ga patience test chesindi! actually nenu idedo biopic anukunna.. but fictional story ani movie chusedaka telidu. anduke konchem dissapoint ayya.and 1890s backdrop lo Briti...

just ippude Ranabaali matnee show finish chesa.. movie lo content and potential aithe solid ga undi, kani execution matram total ga patience test chesindi! actually nenu idedo biopic anukunna.. but fictional story ani movie chusedaka telidu. anduke konchem dissapoint ayya.


and 1890s backdrop lo Britishers meeda fight chese story concept, and Vijay Deverakonda, Seema slang performance chaala bagunnai. Rashmika tho pair super.


Kani problem entante, super mass elevation undalsina places lo director oversized art-house movie la teesi flat ga laagessadu. Daaniki thodu sluggish narration, weak BGM, and lagging second half valla hype motham poyindi.


Intent and efforts super kani, slow pacing & limited high moments valla below-average feel ostundi.but vijay and rashmika performance kosam, makers kashtaniki okasari try cheyocchu.

Oct 16, 2026
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

Ranabaali Movie Review

just now finished Ranabaali movie first show.. the movie was decent. ranabaali had all the raw potential to be an absolute epic, but man, it turned out to be a total patience test!The core story about a hero fighting British exploitation during a devastating 1900s famine is solid. Rahul Sankrityan c...

just now finished Ranabaali movie first show.. the movie was decent. ranabaali had all the raw potential to be an absolute epic, but man, it turned out to be a total patience test!


The core story about a hero fighting British exploitation during a devastating 1900s famine is solid. Rahul Sankrityan clearly did his homework on history, Vijay Deverakonda gave it his all with intense Seema slang, and Rashmika looked stunning. Plus, that cave action sequence and the climax actually go hard!


flat BGM, and weak VFX to the mix, and the second half just drags down completely. overall Great intent, huge effort, and solid performances, but ruined by a slow-paced screenplay and zero theater hype. A strictly below-average affair that tests your endurance!

Oct 16, 2026
A
Arige Srikanth Private Employee
6

Above Average

Ranabaali movie review

జస్ట్ ఇప్పుడే రణబాలి (Ranabaali) మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా బాగుందా అంటే.. నాకయితే అబొవ్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బెంగాలీ సినిమాలు బాగా చూస్తాడో ఏమో.. తెలుగు నేటివిటీ తన సినిమాల్లో అంతగా కనిపించదు. సినిమా చూస్తుంటే నాకు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. బట్ అప్...

జస్ట్ ఇప్పుడే రణబాలి (Ranabaali) మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా బాగుందా అంటే.. నాకయితే అబొవ్ యావరేజ్ అనిపించింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ బెంగాలీ సినిమాలు బాగా చూస్తాడో ఏమో.. తెలుగు నేటివిటీ తన సినిమాల్లో అంతగా కనిపించదు. సినిమా చూస్తుంటే నాకు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు.


బట్ అప్పటి రాయలసీమ కరువు కష్టాలు, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేదో న్యాచురల్ గా చూపించాడు డైరెక్టర్. కొన్ని సార్లు ఎదో ఆర్ట్ ఫిలిం లాంటి ఫీల్ కూడా వచ్చింది. బట్ యాక్షన్ సీన్స్ లో మాత్రం మన తెలుగు సినిమానే అనిపిస్తది. అండ్ చాలా సార్లు సైరా సినిమా గుర్తొస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. ఏంటో మరి.. బట్ విజయ్ అండ్ రష్మిక పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్. వీళ్ళ కోసమైనా ఒకసారి చూడొచ్చు.

Oct 16, 2026

About This Movie

Story : 

కథ విషయానికి వస్తే... 1880 to 90స్ మధ్యకాలంలో రాయలసీమలో వచ్చిన కరువు కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అప్పట్లో బ్రిటిష్ పాలన సమయంలో మద్రాస్ కమిషనర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డో వోస్లో) ప్రజలపై వేసే అన్యాయంగా వేసే పన్నులకు తోడు వారి నుండి ధాన్యాన్ని కూడా లాక్కుని అనేక చిత్రహింసలకు గురి చేస్తారు. అదే కాలంలో భద్ర మల్లన్న తాత ఆశీర్వాదంతో రాజమ్మ (ఈశ్వరీరావు) కు జన్మించిన రణబాలి(విజయ్ దేవరకొండ) సింగనమల ప్రాంతానికి కాపుకాస్తుంటాడు. పాతికేళ్ళు కూడా నిండని రణబాలి బ్రిటిష్ దొరల్ని ఎదిరిస్తాడు. తిరుగుబాటుదారుడిగా మారిన రణబాలి బ్రిటిష్ పాలకుల దోపిడీ, ప్రజలపై అణచివేతను అడ్డుకుని పేదల ఆకలి ఎలా తీర్చాడు. ఈ మధ్యలో రణబాలి జీవితంలో తన భార్య జయమ్మ (రష్మిక) పాత్ర ఎలాంటిది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రణబాలి ఎలాంటి పోరాటం చేసాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

 

మాములుగా తెలుగు ఇండస్ట్రీలో స్వాతంత్రోద్యమ నేసథ్యంలో వచ్చిన సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయినవి చాలా తక్కువ. ఈ మధ్య అంటే 'సైరా' బాగా ఆడింది. అది కూడా తెలుగులో మాత్రమే. అంతా బాగున్నా ఏవో దిష్టి తగిలినట్టు ఇలాంటి సినిమాలకు ఏవో అడ్డొస్తుంటాయి. స్వాతంత్య్రం నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆడియన్స్ రియలిస్టిక్ గా ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయితే అంత బాగా ఆడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు థియేటర్లలో విడుదలైన రణబాలి సినిమా కూడా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఫిక్షనల్ స్టోరీని అల్లుకున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. 

 

ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ బాగానే రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఆనాటి కరువు నేపథ్యాన్ని చాలా బాగా చూపించారు. ఇక రణబాలిగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రకు తగ్గట్టు బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో భావోద్వేగమైన ఎమోషన్స్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న పరిపక్వతమైన నటన కనబరిచింది. తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే ఆర్నాల్డ్ వోస్లూ, ఈశ్వరీరావు, తదితరులు వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు. ఇక సినిమాలో కథ వరకు నార్మల్ గా కనిపించినా, ఆ నాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్లస్ అయింది.

 

Minus Points : 

 

అయితే “రణబాలి” కథ పరంగా బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. అంటే సినిమాలో బరువైన ఎమోషన్స్, అండ్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్నా, స్క్రీన్ ప్లే పరంగా ఏదో మిస్ అయిన ఫీల్ అనిపిస్తుంది. కథలో భద్ర మల్లన్న డివోషనల్ కాన్సెప్ట్ పక్కనబెడితే, మిగతా సినిమా అంతా చాలా సినిమాల్లో సీన్స్ ని ఇన్స్పైర్ అయినట్టు ఉంటాయి. పైగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ కాబట్టి, సైరా సినిమాతో పోల్చే అవకాశం ఉంది. పైగా సినిమా స్టార్టింగ్ లో వచ్చిన హైప్ ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక విజయ్ – రష్మిక పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగుంది. అలాగే ఎమోషనల్ ట్రాక్ కూడా బాగున్నా, మరిన్ని సీన్స్ ని రాసుకుని ఉండాల్సింది. అయినా వాళ్ళు రియల్ లైఫ్ జోడి కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక రణబాలి స్టోరీలో చెప్పాల్సిన మెయిన్ థీమ్ బాగానే డిజైన్ చేసుకున్నా, కథనం నెమ్మదించడం వల్ల కాస్త బోరింగ్ ఫీల్ అనిపిస్తుంది. చివర్లో హీరోకి పూనకం వచ్చే ఎపిసోడ్ పెట్టినా, రీసెంట్ గా చాలా సినిమాల్లో పెట్టడం వల్ల అంతగా ఎక్కకపోవచ్చు.

 

Technical Values : 

 

ఇక ఈ సినిమాకు టెక్నికల్ పరంగా చాలా పగడ్బందీగా ఖర్చు పెట్టారు మేకర్స్. డైరెక్టర్ రాహుల్ మేకింగ్ విషయంలో ఎక్కడా రాజి పడకుండా క్వాలిటీ టెక్నిషియన్స్ ని తీసుకున్నాడు. సినిమాటోగ్రఫి పరంగా జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా మంచి కెమెరా పనితనం చూపించారు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని విజువల్ గా సహజంగా చూపించారు. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది.  ఇక సంగీత దర్శకులు అజయ్ – అతుల్ మంచి సాంగ్స్ ఇచ్చారు.సినిమాకు వీళ్ళు ఇచ్చిన బీజీఎమ్ కూడా చాలా ప్లస్ అయింది. ఇక డైరెక్టర్ రాహుల్ రచయితగా సినిమాకి న్యాయం చేసాడు. డైరెక్టర్ గా కూడా బాగానే ఆకట్టుకున్నాడు. 

 

Final Review : 

 

“రణబాలి” అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ  పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఒక డిఫరెంట్ డివోషనల్ అండ్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ని కొంతవరకు నచ్చుతుంది. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని చెప్పినా ఇందులో దేశం కన్నా, గ్రామాల్లో కరువు కాటకాల గురించి ఎక్కువ చూపించడం జరిగింది. కథ బాగున్నా, రొటీన్ స్క్రీన్ ప్లే, అండ్ స్లో నెరేషన్, ట్రీట్మెంట్ వల్ల అంతగా కనెక్ట్ కాలేకపోవచ్చు. అయితే విజయ్ దేవరకొండ నటన, అండ్ రాహుల్ సంకృత్యాన్ చక్కటి డైరెక్షన్ కోసం ఫ్యాన్స్ ఓసారి చూసేలానే ఉంది. మరి ఈ విజయదశమికి సినిమా థియేటర్లో ఎలాంటి రన్ కొనసాగిస్తుందో, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
27
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.4/10
Public
6.3/10
Why MRO?