Register as a Reviewer
శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)

శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)

30 Jul 2026
Overall Rating
4.7/10
15 Reviews

Srinivasa Mangapuram : ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను అందంగా మిళితం చేసిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. జయకృష్ణ తన సహజ నటనతో ఆకట్టుకోగా, ఎమోషనల్ సన్నివేశాలు కథకు మంచి బలం చేకూరుస్తాయి. ఆహ్లాదకరమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి సినీ అనుభూతిని అందిస్తుంది.

Director: Ajay Bhupathy
Cast: Jai Krishna Ghattamaneni, Rasha Thadani, Mohan Babu, Naresh, Brahmaji, Ajay and Others

Available in:

Reviews

What critics and the public are saying about శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)

Media Reviews

15 Avg: 4.7/10
4

Below Average

Srinivasa Mangapuram movie review

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. ప్రతి సీన్ ముందే ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. కథైనా, స్క్రీన్‌ప్లే అయినా ఎక్కడా సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా మొత్తం చాలా ఫ్లాట్‌గా అనిపించింది. 'ఆ...

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. ప్రతి సీన్ ముందే ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. కథైనా, స్క్రీన్‌ప్లే అయినా ఎక్కడా సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా మొత్తం చాలా ఫ్లాట్‌గా అనిపించింది. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి రొటీన్ సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇంకా ఎక్కువ నిరాశ కలిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలనే ప్రయత్నం కనిపించినా, అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. పాటలు, ఫైట్లు, లవ్ ట్రాక్ అన్నీ వచ్చినా ఎక్కడా ఎమోషన్ మాత్రం ఫీల్ కాలేదు. సినిమా చూస్తున్నంతసేపు "ఇంకా ఏమైనా కొత్తగా చూపిస్తారా?" అని ఎదురుచూశాను కానీ అలాంటి మూమెంట్ ఒక్కటి కూడా రాలేదు. హీరో జైకృష్ణ తన వంతు ప్రయత్నం చేశాడు, కానీ బలమైన కథ లేకపోవడంతో అతని కష్టం కూడా పూర్తిగా కనిపించలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా చాలా పెద్ద డిసప్పాయింట్. అజయ్ భూపతి గారి నుంచి నేను ఊహించిన సినిమా ఇది మాత్రం కాదు గైస్.

Aug 01, 2026 Watch
4

Below Average

Srinivasa Mangapuram Review

ఈ సినిమా భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం ఆ హైప్‌కు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. పెద్దిరెడ్డి, వెంకటప్ప నాయుడు మధ్య జరిగే గొడవల నేపథ్యంలో హీరో, హీరోయిన్ ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ల ప్రేమ గెలిచిందా..? ఇద్దరూ ఒక్కటయ్యారా..? అనేదే సినిమా కథ. క...

ఈ సినిమా భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం ఆ హైప్‌కు తగ్గ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. పెద్దిరెడ్డి, వెంకటప్ప నాయుడు మధ్య జరిగే గొడవల నేపథ్యంలో హీరో, హీరోయిన్ ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ల ప్రేమ గెలిచిందా..? ఇద్దరూ ఒక్కటయ్యారా..? అనేదే సినిమా కథ. కానీ సినిమా చూస్తుంటే కథ కంటే పాటలు, ఫైట్లు ఎక్కువగా కనిపిస్తాయి. హీరో హీరోయిన్ కనిపిస్తే ఒక పాట... వెంటనే ఒక ఫైట్... మళ్లీ ఇంకో పాట అన్నట్టే సినిమా ముందుకు సాగుతుంది. ఎక్కడా కూడా బలమైన ఎమోషన్ కానీ, కథలో గ్రిప్ కానీ కనిపించదు. జైకృష్ణ మాత్రం తన వంతు ప్రయత్నం చేశాడు. నటనలో కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించాడు. లుక్స్ కూడా హీరోకి బాగానే సెట్ అయ్యాయి. కానీ దర్శకుడు కథను బలంగా చెప్పడం కంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపించింది. అదే ఫోకస్ కథ, స్క్రీన్‌ప్లేపై పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్‌గా వచ్చేదేమో. మొత్తానికి సినిమాలో చెప్పుకోదగ్గ కొత్త కథ ఏమీ లేదు. అయితే టైమ్‌పాస్ కోసం ఒకసారి చూడాలనుకునేవాళ్లు ట్రై చేయొచ్చు గైస్. నాకు మాత్రం ఆశించినంతగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు.

Aug 01, 2026 Watch

Srinivasa Mangapuram Movie Review

అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఒక్కటే... "ఎందుకురా బాబు ఈ సినిమా తీశారు?" అని. నిజంగా చెప్పాలంటే అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. 'మంగళవారం' తీసిన దర్శకుడు ఇదేనా అనిపించింది. ఆ సినిమా ఎక్కడ... ఈ 'శ్రీనివాస మంగాపురం' ఎక్కడ... రెండింటికీ అస్సలు పోలి...

అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఫీలింగ్ ఒక్కటే... "ఎందుకురా బాబు ఈ సినిమా తీశారు?" అని. నిజంగా చెప్పాలంటే అజయ్ భూపతి గారి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని అస్సలు ఊహించలేదు. 'మంగళవారం' తీసిన దర్శకుడు ఇదేనా అనిపించింది. ఆ సినిమా ఎక్కడ... ఈ 'శ్రీనివాస మంగాపురం' ఎక్కడ... రెండింటికీ అస్సలు పోలికే లేదు. టైమ్ మొత్తం వేస్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చింది. వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ ఇలాంటి కథను ఎందుకు ఓకే చేసిందో కూడా అర్థం కాలేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టే అనిపించింది. సినిమాలో ఎవరైనా నిజంగా కష్టపడ్డారు అంటే అది జీవీ ప్రకాశ్ గారేనేమో అనిపించింది. రెండు పాటలు బాగున్నాయి, మిగతావి కూడా ఓకే అనిపిస్తాయి. కానీ అవి కూడా సినిమాను పైకి లేపే స్థాయిలో లేవు. సినిమాలో అవసరానికి మించి అల్ట్రా వైడ్ షాట్లు కనిపిస్తాయి. అవి ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఫైట్లు చూస్తుంటే ఎక్కడా థ్రిల్ అనిపించలేదు. నటన విషయానికి వస్తే కూడా చాలా పాత్రలు తేలిపోయాయి. నాకు మాత్రం మోహన్ బాబు గారి పాత్ర ఒక్కటే కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ ఆ పాత్రను కూడా బలంగా రాయకపోవడంతో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా ఉపయోగపడలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా ఏమాత్రం నచ్చలేదు గైస్.


Aug 01, 2026 Watch
5

Average

Srinivasa Mangapuram Movie Review

సినిమా చూసాక నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత రొటీన్‌గా, ఇంత ఫ్లాట్‌గా సినిమా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి కథలు ఇప్పటికే చాలానే చూశాం. కానీ ఈ సినిమాను అజయ్ భూపతి గారు తీశారంటే మాత్రం ఇంకా నమ్మలేకపోతున్నా. "ఎందుకురా బాబు ఇలా తీశారు?" అనిపించింది....

సినిమా చూసాక నాకు అయితే అస్సలు నచ్చలేదు గైస్. నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత రొటీన్‌గా, ఇంత ఫ్లాట్‌గా సినిమా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి కథలు ఇప్పటికే చాలానే చూశాం. కానీ ఈ సినిమాను అజయ్ భూపతి గారు తీశారంటే మాత్రం ఇంకా నమ్మలేకపోతున్నా. "ఎందుకురా బాబు ఇలా తీశారు?" అనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా వీక్‌గా ఉంది. నిజంగా చెప్పాలంటే సగం సినిమా తీసేసినా పెద్దగా తేడా ఉండేదేమో అనిపిస్తుంది. పాటల సంగతి అయితే చెప్పక్కర్లేదు... యూట్యూబ్‌లో మధ్య మధ్యలో యాడ్స్ వచ్చినట్టు సంబంధం లేకుండా వస్తూనే ఉంటాయి. అసలు కథ ఫ్లోనే డిస్టర్బ్ చేస్తాయి. ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన మాత్రమే. ఆయన వచ్చిన కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాకు కాస్త ఊపిరి పోస్తాయి. ఇంకొన్ని సీన్లు బాగున్నా, చాలా వరకు మాత్రం మామూలుగానే అనిపిస్తాయి. కథలో కొత్తదనం అనే మాటే లేదు. 'మంగళవారం' తర్వాత అజయ్ భూపతి గారి నుంచి ఇంకో మంచి సినిమా వస్తుందని చాలా ఆశించాను. కానీ ఈ సినిమా మాత్రం నా ఎక్స్‌పెక్టేషన్స్‌కు అస్సలు మ్యాచ్ కాలేదు. ఇలాంటి రొటీన్ కథను ఎందుకు ఎంచుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు గైస్. ఇదంతా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.



Aug 01, 2026 Watch
5

Average

Srinivasa Mangapuram Review

సినిమా గురించి చెప్పాలంటే గైస్.. మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అని అందరూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ నాకు మాత్రం ఈ సినిమా అస్సలు కనెక్ట్ కాలేదు. చాలా రోజుల తర్వాత "ఎందుకు ఈ సినిమాకి వచ్చానురా బాబు" అనిపించింది. కథ పూర్తిగా పాత కమర్షియల్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. స్క్...

సినిమా గురించి చెప్పాలంటే గైస్.. మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అని అందరూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ నాకు మాత్రం ఈ సినిమా అస్సలు కనెక్ట్ కాలేదు. చాలా రోజుల తర్వాత "ఎందుకు ఈ సినిమాకి వచ్చానురా బాబు" అనిపించింది. కథ పూర్తిగా పాత కమర్షియల్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. స్క్రీన్‌ప్లేలో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇరవై ఏళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేదేమో కానీ ఇప్పటి ఆడియన్స్‌కు మాత్రం చాలా అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. కథ కూడా తిరుపతికి వచ్చిన శ్రీను (జైకృష్ణ) మంగ (రషా తడానీ)ని ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ల ప్రేమకి వచ్చిన అడ్డంకులు ఏంటి..? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా..? అనే రొటీన్ లైన్‌పైనే నడుస్తుంది. జైకృష్ణ మాత్రం తన వంతు ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల బాగానే నటించాడు కానీ ఇంకా యాక్టింగ్‌లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సినిమాలో వరుసగా వచ్చే పాటలు మాత్రం విపరీతంగా బోర్ కొట్టిస్తాయి. ప్రేమకథలో కూడా ఎక్కడా ఎమోషన్ ఫీల్ అవ్వదు. హీరోయిన్ ఒకసారి ఇలా, ఇంకోసారి అలా ప్రవర్తించడం వల్ల వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మోహన్ బాబు గారి పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు సినిమా గేర్ మారుతుందేమో అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే మళ్లీ అదే రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. మొత్తానికి నాకు అయితే ఈ సినిమా అస్సలు నచ్చలేదు గైస్. అయితే కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు.

Aug 01, 2026 Watch
5

Average

Srinivasa Mangapuram Movie Review

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి, బళ్లారి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. కథ మొదట్లో హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథతో ముందుకు వెళ్లినా, ఇంటర్వెల్ తర్వాత కొన్ని...

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి, బళ్లారి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. కథ మొదట్లో హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథతో ముందుకు వెళ్లినా, ఇంటర్వెల్ తర్వాత కొన్ని కీలక మలుపులతో అసలు కథ బయటపడుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సంఘటనలు, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే ఎమోషన్స్ కథకు కొంత బలం చేకూరుస్తాయి. అయితే మొత్తం కథనం మాత్రం చాలా వరకు ముందే ఊహించగలిగేలా సాగుతుంది. దర్శకుడు అజయ్ భూపతి ఈసారి తన మార్క్‌కు భిన్నంగా పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్‌ను ఎంచుకోవడంతో కొత్తదనం పెద్దగా కనిపించదు. జైకృష్ణ తొలి సినిమాకే మంచి కష్టపడినట్లు ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లలో తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఇంకా అనుభవం అవసరమైనా, భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు అందుకునే సామర్థ్యం కనిపిస్తుంది. రషా తడానీ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచారు. బ్రహ్మాజీ, నరేష్ అక్కడక్కడా నవ్వులు పంచగా, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బలపరిచినా, పాటలు మాత్రం పెద్దగా గుర్తుండేలా లేవు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా ‘శ్రీనివాస మంగాపురం’ రొటీన్ కమర్షియల్ కథతో సాగినా, జైకృష్ణకు ఓ గౌరవప్రదమైన ఆరంగేట్రంగా నిలిచే యాక్షన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.

Aug 01, 2026 Read Review
5

Average

Srinivasa Mangapuram Review

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో మిళితం చేసే ప్రయత్నం చేశారు. కథ మొదలైన కొద్దిసేపటికే ఇది పూర్తిగా రొటీన్ ట్రాక్‌లోనే సాగుతుందనే భావన కలుగుతుంది. ఫస్ట్ హా...

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలను కమర్షియల్ శైలిలో మిళితం చేసే ప్రయత్నం చేశారు. కథ మొదలైన కొద్దిసేపటికే ఇది పూర్తిగా రొటీన్ ట్రాక్‌లోనే సాగుతుందనే భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌, మోహన్ బాబు పాత్ర కథకు కొంత బలం చేకూరుస్తాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో దర్శకుడు ప్రయత్నించినా అవి పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. జైకృష్ణ తొలి సినిమాకే మంచి కష్టపడ్డాడు. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్‌లలో తన ఎనర్జీని చూపించాడు. నటన పరంగా ఇంకా అనుభవం అవసరమైనా భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకునే సామర్థ్యం కనిపిస్తుంది. రషా తడానీ అందంగా కనిపించినా, పాత్రలో మరింత మెచ్యూరిటీ ఉండాల్సింది. మోహన్ బాబు కనిపించిన ప్రతి సన్నివేశంలో తన అనుభవంతో ప్రత్యేకంగా నిలిచారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా, పాటలు మాత్రం గుర్తుండే స్థాయికి చేరలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగుండగా, ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే సినిమా మరింత వేగంగా అనిపించేది. మొత్తం మీద ‘శ్రీనివాస మంగాపురం’ కొత్త హీరోను పరిచయం చేసే సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. బలమైన కథ, కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఇది పూర్తిగా సంతృప్తినివ్వకపోయినా, జైకృష్ణ తొలి ప్రయత్నంగా మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

Aug 01, 2026 Read Review
6

Above Average

Srinivasa Mangapuram Movie review

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీను, మంగ మధ్య ప్రేమకథతో పాటు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలను దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. మొదటి భాగం మొత్తం రొటీన్ లవ్ ట్రాక్‌తో సాగినా, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని...

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జైకృష్ణ నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీను, మంగ మధ్య ప్రేమకథతో పాటు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలను దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. మొదటి భాగం మొత్తం రొటీన్ లవ్ ట్రాక్‌తో సాగినా, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని మలుపులు కథపై ఆసక్తిని పెంచుతాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, చాలావరకు ముందే ఊహించగలిగే సన్నివేశాలు సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. హీరో జైకృష్ణ తన తొలి సినిమాకు తగినంత కష్టపడి నటించినట్లు కనిపించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఎనర్జీ చూపించినా, భావోద్వేగ సన్నివేశాల్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రషా తడానీ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు కనిపించిన ప్రతి సన్నివేశంలో తన అనుభవాన్ని మరోసారి నిరూపించారు. కిక్ శ్యామ్, నరేష్, వాసుకి తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగానే అనిపించినా, పాటలు మాత్రం పెద్దగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు కమర్షియల్ టచ్ ఇవ్వాలని ప్రయత్నించినా, కథనం మరింత బలంగా ఉండాల్సింది. మొత్తంగా ‘శ్రీనివాస మంగాపురం’ పూర్తిగా మెప్పించకపోయినా, జైకృష్ణలో ఉన్న సామర్థ్యాన్ని పరిచయం చేసిన సాధారణ కమర్షియల్ ప్రేమకథగా నిలుస్తుంది.

Aug 01, 2026 Read Review
4

Below Average

Srinivasa Mangapuram Movie Review

తిరుపతికి వచ్చిన శ్రీను తొలి చూపులోనే మంగను ప్రేమిస్తాడు. అయితే ఆమె అతని ప్రేమను అంగీకరించదు. ఇదే సమయంలో బళ్లారి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీనుపై దాడి చేయడంతో కథ అసలు మలుపు తిరుగుతుంది. శ్రీను అసలు వెంకటప్ప నాయుడు మనవడు వాసు అని బయటపడటంతో కథ ముందుకు సాగుతుంది. ఆ తర్వాత వాసు గతం, మంగతో ఉన్న అను...

తిరుపతికి వచ్చిన శ్రీను తొలి చూపులోనే మంగను ప్రేమిస్తాడు. అయితే ఆమె అతని ప్రేమను అంగీకరించదు. ఇదే సమయంలో బళ్లారి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీనుపై దాడి చేయడంతో కథ అసలు మలుపు తిరుగుతుంది. శ్రీను అసలు వెంకటప్ప నాయుడు మనవడు వాసు అని బయటపడటంతో కథ ముందుకు సాగుతుంది. ఆ తర్వాత వాసు గతం, మంగతో ఉన్న అనుబంధం, కుటుంబాల మధ్య ఉన్న విభేదాల చుట్టూ కథ తిరుగుతుంది.

కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం దాదాపు కనిపించదు. ప్రారంభం నుంచి ముగింపు వరకు తర్వాత ఏం జరగబోతుందో సులభంగా ఊహించవచ్చు. ప్రేమ, యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు అన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. అజయ్ భూపతి నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయి కథనం మాత్రం ఇందులో కనిపించదు. హీరో జైకృష్ణ తన తొలి సినిమాకు తగినంత కష్టపడినట్లు కనిపించినా, బలమైన పాత్ర లేకపోవడంతో పూర్తిగా మెప్పించలేకపోయాడు. రషా తడానీ కూడా అందంగా కనిపించినా నటనలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబు తన అనుభవంతో ఆకట్టుకున్నప్పటికీ, ఆయన పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోగా, నేపథ్య సంగీతం మాత్రమే కొన్ని చోట్ల ఫర్వాలేదనిపిస్తుంది. సాంకేతికంగా కూడా సినిమా పెద్దగా ఆకట్టుకోదు. మొత్తంగా 'శ్రీనివాస మంగాపురం' పాత తరహా కథతో సాగిన సాధారణ కమర్షియల్ చిత్రం. ఘట్టమనేని జైకృష్ణకు ఇది ఆశించిన స్థాయి అరంగేట్రం కాలేదనే చెప్పాలి.

Aug 01, 2026 Read Review
6

Above Average

Srinivasa Mangapuram Review

Story:Srinivasa Mangapuram revolves around Sreenu (Jai Krishna Ghattamaneni), who arrives in Tirupati and unexpectedly crosses paths with Manga (Rasha Thadani), the daughter of a powerful local leader, Peddi Reddy (Kick Shyam). Sreenu falls in love with her instantly, but Manga doesn't share the sam...

Story:

Srinivasa Mangapuram revolves around Sreenu (Jai Krishna Ghattamaneni), who arrives in Tirupati and unexpectedly crosses paths with Manga (Rasha Thadani), the daughter of a powerful local leader, Peddi Reddy (Kick Shyam). Sreenu falls in love with her instantly, but Manga doesn't share the same feelings. As their journey unfolds, hidden secrets from Sreenu's past and his bond with Venkatappayya Naidu (Mohan Babu) gradually come to light. How these revelations change their lives and whether Sreenu succeeds in winning Manga's heart forms the core of the film.

What Works:

The biggest strength of Srinivasa Mangapuram is undoubtedly its debut lead pair. Jai Krishna Ghattamaneni delivers a confident first performance and handles both the romantic and action-packed portions with ease. His screen presence is promising, and he shows good potential for a newcomer.

Rasha Thadani also makes a pleasant debut. She looks comfortable on screen, performs emotional scenes convincingly, and shares decent chemistry with Jai Krishna. Her effort in delivering Telugu dialogues is noticeable. Veteran actors Mohan Babu, Vasuki, Brahmaji, and the supporting cast contribute effectively within their limited roles.

What Doesn't Work:

Despite the sincere performances, the film struggles because of its familiar screenplay. The story follows a routine commercial formula and rarely offers anything surprising. The second half relies on predictable twists that lack emotional impact, making several scenes feel repetitive.

The first half takes time to establish the narrative but misses opportunities to create stronger emotional connections. With more engaging writing and memorable conflict, the film could have delivered a much better experience.

Technical Aspects:

GV Prakash Kumar's music blends well with the narrative, while the background score supports a few important sequences. One of the visual highlights is the beautiful presentation of Tirupati, with cinematographer Jayakrishna Gummadi capturing the city's atmosphere impressively.

The production values are good, the action sequences are neatly choreographed, and the editing keeps the film reasonably paced. However, director Ajay Bhupathi's signature storytelling style is largely absent. Instead of delivering an emotionally gripping drama, the film settles for a conventional commercial approach.

Final Verdict:

Overall, Srinivasa Mangapuram is an average commercial entertainer that is elevated mainly by the performances of its debut actors. Jai Krishna Ghattamaneni makes a confident start to his career, while Rasha Thadani leaves a positive impression with her natural performance. However, the routine storyline, predictable twists, and lack of fresh storytelling prevent the film from reaching its full potential. It's a decent one-time watch for those interested in seeing the newcomers' performances.


Rating : 2.75/5

Aug 01, 2026 Read Review
4

Below Average

Srinivasa Mangapuram Movie review

About the MovieSrinivasa Mangapuram introduces Ghattamaneni Jai Krishna, son of the late Ramesh Babu and nephew of Superstar Mahesh Babu, in his first lead role. The film also marks the acting debut of Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon. Directed by Ajay Bhupathi, the film a...

About the Movie

Srinivasa Mangapuram introduces Ghattamaneni Jai Krishna, son of the late Ramesh Babu and nephew of Superstar Mahesh Babu, in his first lead role. The film also marks the acting debut of Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon. Directed by Ajay Bhupathi, the film arrives with decent expectations but struggles to deliver a memorable cinematic experience.

Story

The story revolves around Manga, the daughter of a powerful family in Tirupati, and Srinivas, who belongs to an influential household in Bellary led by Venkatapayya Naidu. Another youngster, Vasu, relentlessly pursues Manga in the name of love, even though she repeatedly rejects him. As the narrative progresses, hidden incidents from the past reveal why Vasu is so determined. The rest of the film explores these relationships, the emotional conflicts, and the events that shape their destiny.

Performances

Jai Krishna shows sincerity in his first outing and puts noticeable effort into the action sequences and dance numbers. While his screen presence is decent, he still needs more confidence and emotional depth to carry demanding scenes.

Rasha Thadani looks charming on screen, but her performance lacks polish. Her expressions feel inconsistent at times, and her dialogue delivery does not always appear natural.

Mohan Babu has an important role and brings his trademark dialogue delivery and screen presence. However, the writing does not provide him with enough powerful moments to leave a lasting impression.

Pedda Naresh appears in a different look, though his comedy track feels forced. Kick Shyam performs adequately within a familiar father role, while Vasuki makes a decent impact in a supporting character. Brahmaji, Ajay, and the remaining cast perform according to the limited scope offered by the script.

Technical Aspects

Director Ajay Bhupathi, known for his earlier successful films, surprisingly chooses a routine commercial storyline that lacks freshness. The screenplay follows a predictable path from beginning to end, making it difficult for the film to generate excitement.

GV Prakash Kumar's soundtrack fails to create much impact, and the background score works only in a few sequences. The cinematography captures the Bellary landscapes well, giving the film some visual appeal. Editing could have been tighter, especially during the lengthy second half, while the production values remain respectable throughout.

What Works

  • A few visually appealing locations
  • Jai Krishna's sincere effort
  • Decent production quality

What Doesn't Work

  • Outdated commercial formula
  • Highly predictable screenplay
  • Weak emotional impact
  • Forgettable songs
  • Uneven pacing
  • Lack of engaging high points

Review

The film follows a familiar commercial template filled with songs, action sequences, romantic moments, and elevation scenes that were once popular but now feel outdated. Instead of presenting a fresh launch for a newcomer, the story depends heavily on clichés that audiences have already seen countless times.

The first half mainly focuses on the hero trying to win over the heroine through routine situations, interrupted by songs and action blocks that add little value to the narrative. Since the scenes rarely offer surprises, the entertainment factor remains limited.

The second half shifts towards a flashback that attempts to explain the central conflict. Unfortunately, the reveal itself is predictable, and the emotional payoff never reaches the desired level. The climax also follows an expected route, making the overall experience feel stretched and repetitive. Several songs and fight sequences appear more like mandatory commercial additions than story-driven moments.

Verdict

Srinivasa Mangapuram turns out to be a conventional commercial drama that lacks originality. Jai Krishna displays commitment in his debut and shows potential, but the weak script does not give him enough opportunities to shine. With a stronger story and better screenplay choices, he could leave a much bigger impact in his future projects.


Rating: 2/5

Aug 01, 2026 Read Review
6

Above Average

Srinivasa Mangapuram Review

ఘట్టమనేని కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు కుమారుడైన జై కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ, 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ 'శ్రీనివాస మంగాపురం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో, రవీనా టాండన్ కూతురు రాషా థడాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, ప్రమోషన్స్ బాగుండటంతో దీనిపై ఇండస్ట్రీలో మంచి హైప్...

ఘట్టమనేని కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు కుమారుడైన జై కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ, 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ 'శ్రీనివాస మంగాపురం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో, రవీనా టాండన్ కూతురు రాషా థడాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, ప్రమోషన్స్ బాగుండటంతో దీనిపై ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ అయింది.

​కథ విషయానికొస్తే.. తిరుపతిలో పవర్‌ఫుల్ లీడర్ అయిన పెద్దరెడ్డి (కిక్ శ్యామ్) కుమార్తె మంగ (రాషా) ప్రేమిస్తూ ఆమె వెంటపడుతుంటాడు ఇప్పుడే సిటీకి వచ్చిన శ్రీను (జై కృష్ణ). ఈ క్రమంలో అనుకోకుండా పెద్దరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) పై ఓ గ్యాంగ్ దాడి చేయగా, శ్రీను అతడిని కాపాడి పెద్దరెడ్డి ఇంట్లోనే అడుగుపెడతాడు. అసలు శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు, మంగను ఎందుకు ఫాలో అవుతున్నాడు, ఈ కథలోకి బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) ఎలా వచ్చాడనేదే మిగతా సినిమా.

​దర్శకుడు అజయ్ భూపతి పాత రివెంజ్ లవ్ స్టోరీనే ఎంచుకున్నప్పటికీ, కమర్షియల్ హంగులతో ఫస్టాఫ్‌ను చాలా ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు స్క్రీన్‌ప్లే బాగుంది. అయితే సెకండాఫ్ మొదలయ్యాక కథ కాస్త ఊహాజనితంగా మారి పాత రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ లో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకుండా సింపుల్ గా ముగించడం కాస్త నిరాశపరుస్తుంది.

​నటీనటుల విషయానికొస్తే.. తొలి చిత్రమైనా జై కృష్ణ డాన్సులు, ఫైట్స్, ఎమోషన్స్‌తో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. రాషా తన గ్లామర్, నటనతో మెప్పించగా.. మోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయింది. నరేష్ కామెడీతో నవ్వించారు. సాంకేతికంగా జీవీ ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ, వైవిధ్యమైన విజువల్స్ బాగున్నాయి. డైలాగ్స్ లో ఇంకొంత కొత్తదనం ఉండి, ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా.. పాత కథే అయినా మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి 'శ్రీనివాస మంగాపురం' ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా.

Aug 01, 2026 Read Review
5

Average

Srinivasa Mangapuram Review

​సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా జై కృష్ణ వెండితెరకు పరిచయమవుతూ, రవీనా టాండన్ కూతురు రాషా థడాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అశ్వినీ దత్ సమర్పణలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాపై ఘట్టమనేని అభిమానుల్లో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.​కథ విషయ...

​సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా జై కృష్ణ వెండితెరకు పరిచయమవుతూ, రవీనా టాండన్ కూతురు రాషా థడాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అశ్వినీ దత్ సమర్పణలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాపై ఘట్టమనేని అభిమానుల్లో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

​కథ విషయానికొస్తే, కాలేజీ గొడవల కారణంగా తిరుపతికి వచ్చే శ్రీను (జై కృష్ణ), అక్కడ స్థానిక ఫ్యాక్షనిస్ట్ పెద్దరెడ్డి (కిక్ శ్యామ్) కుమార్తె మంగ (రాషా) తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గరవుతున్న తరుణంలోనే, మంగ తన నిశ్చితార్థపు కార్డును శ్రీను చేతిలో పెట్టి షాక్ ఇస్తుంది. అసలు శ్రీను తిరుపతికి రావడం వెనుక ఉన్న రహస్యం ఏంటి, పెద్దరెడ్డి కుటుంబంతో అతనికి ఉన్న పాత పగలేంటి అనే అంశాల చుట్టూ మిగతా సినిమా నడుస్తుంది.

​హీరోయిన్ పాత గతాన్ని మర్చిపోవడం అనే పాత కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, దర్శకుడు అజయ్ భూపతి తనదైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా నడిపించారు. హీరో ఇంట్రడక్షన్ సీన్, పోకిరిని గుర్తుచేసే యాక్షన్ బ్లాక్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. హీరో తాతయ్యగా మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించినప్పటికీ, కథలో ఆయన పాత్రకు సరైన బలమైన కారణాలు చూపించలేదు.

​తొలి చిత్రమే అయినా జై కృష్ణ ఫైట్స్, డైలాగ్ డెలివరీలో ఆకట్టుకుని యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేయగా, రాషా తన నటనతో మెప్పించింది. జీవీ ప్రకాశ్‌ కుమార్ అందించిన సంగీతం, నిర్మాణ విలువలు చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. కొన్ని రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే ఈ పాత తరం కమర్షియల్ డ్రామాను ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.

Aug 01, 2026 Read Review
4

Below Average

Srinivasa Mangapuram Movie Review

మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కూతురు రాషా తదాని జంటగా వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ సమర్పణలో, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఇద్దరు స్టార్ వారసులు వెండితెరకు పరిచయం కావడం, 'కల్కి' లాంటి భారీ చిత్రం తీసిన లైనప్ నుండి రావడం వల్ల దీనిపై మొదటి నుంచి...

మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కూతురు రాషా తదాని జంటగా వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ సమర్పణలో, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఇద్దరు స్టార్ వారసులు వెండితెరకు పరిచయం కావడం, 'కల్కి' లాంటి భారీ చిత్రం తీసిన లైనప్ నుండి రావడం వల్ల దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

​కథ విషయానికి వస్తే... తిరుపతికి వచ్చిన శ్రీను (జై కృష్ణ), అక్కడ పెద్దరెడ్డి కూతురైన మంగ (రాషా తదాని) తో పరిచయం పెంచుకుని స్నేహంగా మారతాడు. ఆమెకు అప్పటికే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినా తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఇంతలో బళ్లారి నుంచి వచ్చిన మంగ మేనత్త వాసుకి.. వీరిద్దరినీ దూరం పెట్టాలని హెచ్చరించినా, శ్రీను మాత్రం తాను బళ్లారి నుంచే మంగ కోసమే వచ్చానని చెప్తాడు. అసలు శ్రీను నేపథ్యం ఏంటి, వారి మధ్య ఉన్న అసలు బంధం ఏంటనేదే మిగతా సినిమా.

​90ల కాలం నాటి పాత ఫ్యాక్షన్ ప్రేమకథకు ఎలాంటి కొత్తదనం జోడించకుండా, రొటీన్ ఫార్మాట్‌లో డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రీసైక్లింగ్ చేయడం తప్పు కాదు కానీ, కనీస కన్విన్సింగ్ స్క్రీన్‌ప్లే, బలమైన డైలాగులు లేకపోవడంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. డెబ్యూ హీరోగా జై కృష్ణ తన నటనతో పర్వాలేదనిపించినా, భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే వైవిధ్యమైన కథల ఎంపికపై మరింత శ్రద్ధ పెట్టాలి. హీరోయిన్ రాషా తదాని పాత్ర పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. సీనియర్ నటులు మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ పాత్రలు కథకు ఎలాంటి బలాన్ని ఇవ్వలేకపోయాయి. సాంకేతికంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, జయకృష్ణ గుమ్మడి ఫోటోగ్రఫీ విజువల్స్ పరంగా బాగున్నా, కథనంలో బలం లేకపోవడంతో అవి వృథా అయ్యాయి. ఫస్టాఫ్ ఎడిటింగ్ లోపాలు, ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అనే నిరసన తెప్పిస్తాయి. లవ్ ట్రాక్, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని డైలాగులు చాలా బలహీనంగా, ట్రోల్ మెటీరియల్‌లా అనిపిస్తాయి. సినిమాలోని ఎమోషనల్ పాయింట్ 'పడి పడి లేచే మనసు' సినిమాను తలపిస్తుంది. వైజయంతీ మూవీస్ లాంటి ఒక పెద్ద బ్యానర్ దొరికినా, ఒక ఘట్టమనేని వారసుడిని లాంచ్ చేయడానికి సరైన కథను ఎంచుకోవడంలో, ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.

Aug 01, 2026 Read Review
5

Average

Srinivasa Mangapuram Review

'శ్రీనివాస మంగాపురం' ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను కలిపి తెరకెక్కించిన చిత్రం. హీరో జయకృష్ణ తన సహజ నటనతో పాత్రకు మంచి న్యాయం చేయగా, హీరోయిన్‌తో వచ్చే లవ్ ట్రాక్ కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది. మొదటి భాగం పాత్రల పరిచయం, ప్రేమకథతో నెమ్మదిగా సాగినా, రెండో భాగంలో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో కథ వ...

'శ్రీనివాస మంగాపురం' ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను కలిపి తెరకెక్కించిన చిత్రం. హీరో జయకృష్ణ తన సహజ నటనతో పాత్రకు మంచి న్యాయం చేయగా, హీరోయిన్‌తో వచ్చే లవ్ ట్రాక్ కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది. మొదటి భాగం పాత్రల పరిచయం, ప్రేమకథతో నెమ్మదిగా సాగినా, రెండో భాగంలో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో కథ వేగం అందుకుంటుంది. కొన్ని ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. దర్శకుడు ప్రేమ, కుటుంబ విలువలు, భావోద్వేగాలను సమతుల్యంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు మంచి బలం చేకూర్చగా, నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కథనం కాస్త ఊహించదగ్గలా అనిపించినా, క్లైమాక్స్ భావోద్వేగంగా ముగుస్తుంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కలిసిన సినిమాలను ఇష్టపడే వారికి 'శ్రీనివాస మంగాపురం' ఒకసారి చూసేలా అనిపించే చిత్రంగా నిలుస్తుంది.


Jul 31, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

About the Movie

Story:
తిరుపతి పరిసర ప్రాంతంలో అందరి అభిమానాన్ని సంపాదించిన యువకుడు జయకృష్ణ జీవితం ఒక అనుకోని సంఘటనతో పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత అతని జీవితంలో ప్రేమ, కుటుంబ విభేదాలు, శత్రుత్వాలు ఒకేసారి ఎదురవుతాయి. ముఖ్యంగా పెదిరెడ్డి కుటుంబంతో ఏర్పడిన గొడవలు అతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి. గతంలోని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండగా జయకృష్ణ తన ప్రేమను, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? చివరికి తన జీవితానికి ఎలాంటి ముగింపు దక్కింది? అనేదే ఈ సినిమా కథ.

Pluspoints:
హీరో జయకృష్ణ ఘట్టమనేని తొలి సినిమాతోనే మంచి ఆత్మవిశ్వాసంతో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రాషా తడాని తన పాత్రలో సహజమైన నటనతో మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయింది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలకు మంచి బలం ఇచ్చింది.పాటలు కథకు తగ్గట్టుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ తిరుపతి పరిసర ప్రాంతాల అందాలను అందంగా చూపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కొన్ని చోట్ల బాగానే ఎలివేట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలను స్టైలిష్‌గా తెరకెక్కించారు. గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించడంలో చిత్రబృందం సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు బాగుండటంతో సినిమా విజువల్‌గా మంచి అనుభూతిని ఇస్తుంది. 

Minus Points:
కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడంతో చాలా సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. సెకండ్ హాఫ్‌లో డ్రామా ఎక్కువై కథ బలహీనంగా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ వంటి అనుభవజ్ఞుల పాత్రలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. క్లైమాక్స్ భావోద్వేగపరంగా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది.

Technical Values:
సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి విజువల్స్‌ను ఎంతో అందంగా తెరకెక్కించారు. జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే సినిమా వేగంగా అనిపించేది. నిర్మాణ విలువలు కథ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు అజయ్ భూపతి కథను చెప్పిన విధానంలో కొత్తదనం కనిపించలేదు. సాంకేతికంగా కొన్ని విభాగాలు మెప్పించినా, బలహీనమైన రచన సినిమా ప్రభావాన్ని తగ్గించింది.

Final Review:
శ్రీనివాస మంగాపురం కొత్త నటీనటులతో రూపొందిన ఒక సాధారణ ప్రేమకథా చిత్రం. నటీనటుల ప్రయత్నం, సంగీతం, విజువల్స్ సినిమాకు కొంత బలం చేకూర్చినా, రొటీన్ కథనం మరియు ఊహించదగిన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టి కథను బలంగా రాసి ఉంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేది. మొత్తం మీద ఇది కొత్తదనం ఆశించకుండా ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒక్కసారి చూడదగిన సినిమా.

Review Statistics

4.7
Overall Rating
Avg. of all reviews
15
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
4.7/10
Public
N/A
Why MRO?