Register as a Reviewer
తెల్ల కాగితం (Thellakaagitham)

తెల్ల కాగితం (Thellakaagitham)

02 Oct 2026
Overall Rating
4.4/10
14 Reviews

Thella Kaagitham : కోర్ట్ ఫేమ్ హర్ష్‌ రోషన్ (Harsh Roshan) హీరోగా నక్షత్ర హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "తెల్ల కాగితం" (Thellakaagitham). రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించగా తాజాగా థియేటర్లలో విడుదలై రన్ అవుతుంది.

Director: Ramesh Bandreddi
Cast: Harsh Roshan, Nakshatra, Deepak, Ajay and others

Available in:

Reviews

What critics and the public are saying about తెల్ల కాగితం (Thellakaagitham)

Media Reviews

11 Avg: 4.6/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Thella kaagitham movie review

తెల్ల కాగితం గురించి చెప్పాలంటే పర్లేదు నాట్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ఏం కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో లైక్ ఒక టిపికల్ లైక్ ఇట్లాంటి ఒక టిపికల్ ఒక స్టోరీ లైన్ ఉంటది చూశారా ఇది కథ ఇలా ఇలా వెళ్ళాలి లాస్ట్ కి ఒక కైండ్ ఆఫ్ ఎండింగ్ లో ఉండాలి అన్నట్టు ఉంటది చూశారా కొంచెం ఆ జోన్ లోనే ఉంటది. ఫస్ట్ హాఫ్...

తెల్ల కాగితం గురించి చెప్పాలంటే పర్లేదు నాట్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ఏం కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో లైక్ ఒక టిపికల్ లైక్ ఇట్లాంటి ఒక టిపికల్ ఒక స్టోరీ లైన్ ఉంటది చూశారా ఇది కథ ఇలా ఇలా వెళ్ళాలి లాస్ట్ కి ఒక కైండ్ ఆఫ్ ఎండింగ్ లో ఉండాలి అన్నట్టు ఉంటది చూశారా కొంచెం ఆ జోన్ లోనే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. అండ్ ఆ ట్రాక్ ఏదైతే ఉంటదో కొంచెం రొటీన్ గా అనిపించినా కూడా స్టోరీ అనేది అండ్ చాలా వరకు పాయింట్స్ ప్రిడిక్టబుల్ గా కూడా మార్చేస్తారు ముందే కొన్ని కొన్ని హింట్లు లాగా ఇచ్చి మనకి. అండ్ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది ఓవరాల్ గా సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఆ కథ బేసిక్ గా అక్కడక్కడే తిరుగుతా ఉంటది. 


ఒకటే పాయింట్ స్పెసిఫై చేశారు ఓవరాల్ గా యు నో నాకు ఏంటంటే బేబీ సినిమా లాగా ఒక పాయింట్ అనిపిస్తది. అంటే ఈ జనరేషన్ ఉన్న అమ్మాయిలు మెయిన్ ఎక్కువగా తెలుసుకోవాల్సిన మెసేజ్ అది. బట్ అదర్ దన్ దట్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ మిస్ అయిపోయింది. ఏందిరా బాబు సింగిల్ పాయింట్ మీద తిరుగుతా ఉంది సినిమా అన్న ఫీలింగ్ వస్తది. పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తది. సో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అందరూ బాగా చేశారు. సో ఆ తర్వాత మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే చేశారు. బట్ ఎక్కడో ఓకే బాగానే ఉన్నాయి కానీ మరి ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంటది. సో అది గాయ్స్ సిట్యుయేషన్. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.25\5.

Oct 03, 2026 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Thella Kaagitham movie Review

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిన్న ప్రేమకథ ఇది. యుక్త వయసులో ఉన్న ఓ జంట చేయకూడని తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులకు గురయింది...

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిన్న ప్రేమకథ ఇది. యుక్త వయసులో ఉన్న ఓ జంట చేయకూడని తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులకు గురయింది. ఫైనల్ గా ఏం తెలుసుకుందన్నదే ఈ సినిమా లైన్. అయితే సినిమా కథ, కథనాలు రెండూ ఊహించేలానే ఉండడం మైనస్ అయింది. ముఖ్యంగా సెకండాఫ్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ సీన్ టు సీన్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉండటం మైనస్ అయింది. 


చిన్న బడ్జెట్ చిత్రాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే విజయ్ బుల్గానిన్ తన ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు కెమెరా పనితనం ఎంతో ముఖ్యం. కె.వి. గుహన్ ఈ విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడనే చెప్పాలి.. ఈ మధ్య యువత టార్గెట్ గా వస్తున్న చాలా చిత్రాలు దాదాపు ఈ తరహా కథాంశంతోనే తెరకెక్కాయి. చెడు స్నేహాల వల్ల యువత ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. జీవితంలోని ఏం కోల్పోతున్నారు అన్న అంశాలను చూపిస్తూనే చివర్లో ఓ సందేశంతో ముగిస్తున్నారు. ‘తెల్ల కాగితం’ మూవీది ఇదే ఫార్మెట్. అందుకే ఈ తెల్లకాగితం తన స్వచ్ఛతను చాటుకోలేక పోయింది.

Oct 02, 2026 Read Review
Tupaki
Tupaki Website
4

Below Average

Thella Kaagitham movie Review

ఒక టీనేజీ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనడానికి.. గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమా ఉదాహరణగా నిలిచింది. యువతకు మాత్రమే కాక.. పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయిన కథ అది. కానీ అందులో లీడ్ రోల్ చేసిన హర్ష్ రోషన్ ను పెట్టి.. వేరే ఫిలిం మేకర్స్ మళ్లీ మళ్లీ టీనేజీ లవ్ స్టోరీలు తీస్తున్నారే కానీ.. అవి ‘కోర్ట్’ ద...

ఒక టీనేజీ లవ్ స్టోరీని ఎలా డీల్ చేయాలి అనడానికి.. గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమా ఉదాహరణగా నిలిచింది. యువతకు మాత్రమే కాక.. పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయిన కథ అది. కానీ అందులో లీడ్ రోల్ చేసిన హర్ష్ రోషన్ ను పెట్టి.. వేరే ఫిలిం మేకర్స్ మళ్లీ మళ్లీ టీనేజీ లవ్ స్టోరీలు తీస్తున్నారే కానీ.. అవి ‘కోర్ట్’ దరిదాపుల్లోకి కూడా వెళ్లట్లేదు. ఇప్పుడు ‘తెల్లకాగితం’తో కూడా దాదాపు అలాంటి అనుభూతినే కలిగించాాడు హర్ష్. ఎప్పుడో ‘చిత్రం’ సినిమాలో చూసిన పాయింటు పట్టుకుని.. ఇప్పుడు సొసైటీకి ఏదో సందేశం ఇచ్చేద్దామని చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆరంభం బాగున్నా.. అసలు కథలోకి అడుగుపెట్టాక విపరీతమైన సాగతీతతో.. సిల్లీ సీన్లతో విసిగించే ‘తెల్లకాగితం’ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. 


ఫైనల్ గా ఇంకోసారి హర్ష్ రోషన్ టీనేజీ లవ్ స్టోరీ చేశాడంటే భయపడిపోయే స్థాయిలో ఈ సినిమా అసహనాన్ని కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. తెల్లకాగితం ఒక సగటు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. మొదట్లో ఆశలు రేకెత్తించినా.. మెసేజ్ బాగున్నా.. ఈ కథను చెప్పిన పద్ధతి అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ఇంపాక్ట్ మిస్ అయింది. అసలు సినిమా స్క్రిప్టులో ఏమంత విశేషం లేదు. ఇందులో ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. కానీ దాన్ని చెప్పిన పద్ధతి అంత బాగాలేదు. వీక్ స్క్రిప్టును దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తన టేకింగ్ తోనూ మెరుగుపరచలేకపోయాడు. చివరగా తెల్ల కాగితం.. తేలిపోయింది.

Oct 02, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
5

Average

Thella Kaagitham movie Review

‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్‌ బండ్రెడ్డి తీసిన పల్లెటూరి టీనేజ్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ ప్రేమ, టీనేజ్‌లో చేసిన ఒక తప్పు, దానివల్ల సొసైటీలో వచ్చే సమస్యలు అనే పాయింట్‌తో వచ్చారు. హర్ష్ రోషన్, నక్షత్ర నాచురల్ యాక్టింగ్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సిని...

‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్‌ బండ్రెడ్డి తీసిన పల్లెటూరి టీనేజ్ లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ ప్రేమ, టీనేజ్‌లో చేసిన ఒక తప్పు, దానివల్ల సొసైటీలో వచ్చే సమస్యలు అనే పాయింట్‌తో వచ్చారు. హర్ష్ రోషన్, నక్షత్ర నాచురల్ యాక్టింగ్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సినిమాకు డీసెంట్ అసెట్స్. కానీ, మనం దశాబ్దాలుగా చూసి చూసి రొట్టైపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ ప్లాట్ ఇది! 


రియలిస్టిక్ పేరుతో పెట్టిన అడల్ట్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరంచేస్తే, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ సీన్స్‌తో దారుణమైన ల్యాగ్‌ని ఇస్తుంది. అయితే థియేటర్‌ లో కంటెంట్ చూస్తే మాత్రం బొమ్మలో ఏం లేదనాలి. ఖాళీ కాగితంపై ఎంత కలర్ఫుల్ పెయింటింగ్ వేసినా గ్రిప్పింగ్ స్టోరీ లేకపోతే దండగే బాస్! దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్ గా ఇదో డీసెంట్ మూవీగా లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. 

Oct 02, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Thella Kaagitham movie review

టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది....

టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి ఆ తర్వాత ఆ తప్పును ఎలా కప్పిపుచ్చాలో తెలియక ఇబ్బందులు పడే కథలు అప్పుడెప్పుడో చిత్రం సినిమా నుంచి వస్తున్నాయి.. తాజాగా తెల్ల కాగితం సినిమా కూడా అలాంటి కథే. స్కూల్‌లో మొదలైన ప్రేమ.. ఆ తర్వాత ముందుకెలా వెళ్లింది.. అనుకోకుండా వేసిన ఒక్క తప్పటడుగు కారణంగా అప్పటి వరకు ఉన్న జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనే మంచి పాయింట్‌తోనే ఈ సినిమాను తీసారు. 


అయితే సినిమా మొదట్లో బాగానే ఉన్నా.. రాను రాను ఎందుకో మరీ తేలిపోయే సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. కండోమ్ సీన్, అలాగే ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అప్పటి టీనేజ్ పిల్లలు ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారనే విషయం చూపించాడు. ఇంటర్వెల్‌లో వచ్చే ప్రగ్నెన్సీ టెస్ట్ నుంచే కథ ఊపందుకుంటుంది.. అక్కడ్నుంచి సెకండాఫ్ మళ్లీ కాస్త స్లో అవుతుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను నిలబెట్టింది. చివర్లో హార్డ్ హిట్టింగ్ ఫినిషింగ్ ఇవ్వాలని ఫిక్సైపోయిన తర్వాతే అలా రాసుకున్నారని అర్థమవుతుంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ టేకింగ్ పరంగా ఇంకాస్త మెరుగ్గు చేసుంటే నిజంగా మంచి సినిమా అయ్యుండేది తెల్ల కాగితం. ఓవరాల్‌ గా తెల్ల కాగితం.. ఒకట్రెండు మచ్చలు కనిపించినా.. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథే..!


Oct 02, 2026 Read Review
One India
One India Website
4

Below Average

Thella Kaagitham movie review

హర్ష రోషన్, నక్షత్ర నటించిన తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే... ఈ సినిమా ఫస్టాఫ్ మంచి వినోదంతో సాగుతుంది. యూత్‌ఫుల్ అంశాలు కొన్ని చోట్ల కాస్త డోస్ ఎక్కువైనా, ఎంటర్‌టైన్‌మెంట్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. దీపక్ మాలితో అతని కాంబినేషన్ సీన్లు బాగా వచ్...

హర్ష రోషన్, నక్షత్ర నటించిన తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే... ఈ సినిమా ఫస్టాఫ్ మంచి వినోదంతో సాగుతుంది. యూత్‌ఫుల్ అంశాలు కొన్ని చోట్ల కాస్త డోస్ ఎక్కువైనా, ఎంటర్‌టైన్‌మెంట్ దానిని బ్యాలెన్స్ చేస్తుంది. హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా.. దీపక్ మాలితో అతని కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి. డెబ్యూ హీరోయిన్ నక్షత్ర మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు.


అయితే ప్రస్తుతం వస్తున్న యూత్ ఫుల్ సినిమాల తరహాలోనే ఇది కూడా పాత ఫార్ములాకే పరిమితమైంది. చెడు సావాసాలు, యువత చేసే పొరపాట్ల చుట్టూ సాగే కథనం సెకండాఫ్‌లో చాలా ప్రిడిక్టబుల్‌గా మారుతుంది. స్టోరీలో వేగం తగ్గడం, సాగదీసినట్లు ఉండే సన్నివేశాలు ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తాయి. కొన్ని అనవసర సీన్లను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని సీన్లు ఫ్యామిలీ అభిమానులకు మింగుడుపడవు. సెకండాఫ్ ను ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్‌గా.. మొత్తంగా చెప్పాలంటే.. 'తెల్లకాగితం' అక్కడక్కడా మెప్పించే ఓ యావరేజ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారు ఎటువంటి భారీ అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు. 

Oct 02, 2026 Read Review
4

Below Average

Thella Kaagitham movie Review

టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ, అపరిపక్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అనే పాయింట్‌తో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు చాలా విషయాలపై స్పష్టత ఉండదు. ఏది సరైన నిర్ణయం, ఏది తప్పు అనే విషయంలో తడబడుతుంటారు. ఈ అంశాన్ని రాము, ఆశ పాత్రల ద్వారా చూపించే ప...

టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ, అపరిపక్వ నిర్ణయాలు, వాటి పర్యవసానాలు అనే పాయింట్‌తో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి కథను ఎంచుకున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకు చాలా విషయాలపై స్పష్టత ఉండదు. ఏది సరైన నిర్ణయం, ఏది తప్పు అనే విషయంలో తడబడుతుంటారు. ఈ అంశాన్ని రాము, ఆశ పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం బాగుంది. హీరో ఫ్రెండ్స్ చేసే పనులు, డైలాగ్‌లు నవ్విస్తాయి. మధ్య మధ్యలో టీనేజ్‌ లవ్‌కి సంబంధించిన సన్నివేశాలు అలరిస్తాయి. అయితే సినిమాలో హీరోయిన్ ప్రెగ్నెన్సీ తర్వాత సీన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండకుండా సాగదీతతో తీశారు. 



సినిమాలో డ్రామా పండలేదు. లవ్ సీన్లలోనూ డెప్త్ లేదు. చివరి 20 నిమిషాల్లో మాత్రం సినిమా బలంగా నిలబడుతుంది. చిన్న తప్పు జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఇచ్చిన భావోద్వేగ ముగింపు సినిమాకు ప్రధాన బలం. ముగింపు బాధ కలిగించినా ఆడియెన్స్ కి కిక్‌ ఇవ్వలేకపోయింది. రొటీన్‌ ఫీలింగ్‌ ని తెప్పిస్తుంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, టేకింగ్‌లో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉంటే సినిమా బాగుండేది. మొత్తంగా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడిందని చెప్పొచ్చు. టీనేజ్ ప్రేమలో చేసే తప్పులకు సంబంధించిన సందేశం బాగున్నా, దాన్ని అంతే బాగా తెరకెక్కించడంలో దర్శకుడు, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మూవీ తడబడింది.


Oct 02, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
4

Below Average

Thella Kaagitham movie review

Harsh Roshan recently gained popularity with teenage dramas such as Court. The young actor has now come up with Thella kaathitham in the same space. Thella Kaagitham deals with teenage confusion and the consequences of decisions made under peer influence. The film explores how teenagers, driven by o...

Harsh Roshan recently gained popularity with teenage dramas such as Court. The young actor has now come up with Thella kaathitham in the same space. Thella Kaagitham deals with teenage confusion and the consequences of decisions made under peer influence. The film explores how teenagers, driven by others’ opinions and lacking the maturity to understand the implications of their actions, struggle to deal with the consequences. Nandu has written the story, dialogues and screenplay, while Ramesh Bandreddi has directed the film. The biggest problem, however, is the writing. Nandu fails to create an engaging screenplay or enough genuinely humorous situations to sustain the narrative.


Highlights

The lead pair

The climax


Drawbacks

Old-school writing

Lame jokes

Lack of an engaging screenplay


overall Thella Kaagitham attempts to be a simple, message-oriented teenage drama and has a few entertaining portions, particularly in the first half. However, the outdated writing, forced humour and sluggish second half derail the film. The message is good, but the emotional punch the subject demands is not strong enough.

Oct 02, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Thella Kaagitham movie review

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పల్లెటూరి లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకున్న ఇద్దరు టీనేజర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ల కుటుంబాల్లో, సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే విలేజ్ నేటివిటీ కాన్...

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా, కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రమేశ్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పల్లెటూరి లవ్ డ్రామా ‘తెల్ల కాగితం’. స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకున్న ఇద్దరు టీనేజర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ల కుటుంబాల్లో, సొసైటీలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే విలేజ్ నేటివిటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లీడ్ పెయిర్ హర్ష్ రోషన్, నక్షత్ర తమ వయసుకు తగ్గ పాత్రల్లో నాచురల్ పర్ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకోగా, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, కేవీ గుహన్ రిచ్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 


అయితే, టాలీవుడ్‌లో ఇప్పటికే దశాబ్దాలుగా నలిగిపోయిన రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ లవ్ స్టోరీ కావడం, ప్రెజెంటేషన్ పరంగా కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్! ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్లతో పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ సీన్స్ మరియు ఓవర్ ల్యాగ్‌తో విపరీతంగా బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు రియలిస్టిక్ టచ్ కోసం వాడిన అడల్ట్ డైలాగ్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని వెండితెరపై ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా తడబడ్డారు. ఫైనల్లీ ఈ తెల్ల కాగితం ఆకట్టుకొని మెసేజ్ ఓరియెంటెడ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. 

Oct 02, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

Thella Kaagitham movie review

Harshroshan teamed up with debutant director Ramesh Bandreddy for a teenage romantic drama, Thella Kaagitham. Bogapathi Nakshatra, made her feature film debut role. Let’s figure it out with a detailed analysis. Positives:1.⁠ ⁠Passable Initial Thirty Minutes2.⁠ ⁠Lead Actress Screen PresenceNegat...

Harshroshan teamed up with debutant director Ramesh Bandreddy for a teenage romantic drama, Thella Kaagitham. Bogapathi Nakshatra, made her feature film debut role. Let’s figure it out with a detailed analysis. 


Positives:

1.⁠ ⁠Passable Initial Thirty Minutes

2.⁠ ⁠Lead Actress Screen Presence


Negatives:

1.⁠ ⁠Second Half

2.⁠ ⁠Excessive Melodrama

3.⁠ ⁠Repetitive Sequences

4.⁠ ⁠Poor Music

5.⁠ ⁠Overstretched Conflict Point


Overall, in an attempt to deliver a socially relevant message, the director of ‘Thella Kaagitham’, ended up making a two-and-a-half-hour film with excessive melodrama that tests your patience after a point. Apart from a passable initial thirty minutes, there’s nothing to talk about in the film.

Oct 02, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Thella kaagitham movie review

హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పా...

హర్ష్ రోహన్ హీరోగా నటించిన సినిమా తెల్ల కాగితం సినిమా గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. లీడ్ నటుల మధ్య డిజైన్ చేసిన ఫన్ సీన్స్ ఇందులో బాగున్నాయి. యూత్ ఫుల్ మూమెంట్స్ కొన్ని ఓవర్ గా అనిపించినా కొంచెం బ్యాలన్స్ అయ్యాయి. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకుని, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో యూత్ కోసం వస్తున్న సినిమాలు ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాయి. యువత జీవితంలోని నెగిటివ్ కోణాలను, చెడు స్నేహాల వల్ల వారు ఎలా ప్రభావితమవుతారు అనే విషయాలను చూపించి, చివరకు ఒక మెసేజ్ తో ముగించడం. ఇదే కనిపిస్తుంది. ఇక ఈ ఫార్మాట్ లోనే ‘తెల్ల కాగితం’ కూడా అనిపిస్తుంది. దీని స్క్రీన్ ప్లే కూడా అదే ఫార్ములా టెంప్లేట్ ను ఫాలో అవుతుంది.


దీనితో, సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో ముందే ఊహించే విధంగా ఉంటుంది. ఇలా కథనం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘తెల్ల కాగితం’ ఒక రొటీన్ యూత్ ఫుల్ డ్రామాగా నిలిచింది. ఫస్టాఫ్ లో కథనం ఓకే కానీ సెకాండాఫ్ లో మాత్రం కథనం నెమ్మదించింది. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ అంతే ఇబ్బంది పెట్టాయి. యువ జంట బాగానే పెర్ఫామ్ చేశారు. సెకండాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దీనితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.






Oct 02, 2026 Read Review

Public Reviews

3 Avg: 3.7/10
T
Tharuni Small Business Owner
4

Below Average

Thella Kaagitham movie review

విలేజ్ నేటివిటీ లవ్ స్టోరీ అని ఎక్స్‌పెక్ట్ చేసి తెల్ల కాగితం సినిమా కోసం థియేటర్ బెంచ్ ఎెక్కితే... రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ డ్రామాతో నా ఓపికకు గట్టి పరీక్షే పెట్టింది ఈ సినిమా. హర్ష్ రోషన్, నక్షత్ర నేచురల్ యాక్టింగ్‌ తో సీన్స్‌ ని లాక్కొచ్చే ట్రై చేసినా, డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి స్క్రీన్‌ ప్లే మ...

విలేజ్ నేటివిటీ లవ్ స్టోరీ అని ఎక్స్‌పెక్ట్ చేసి తెల్ల కాగితం సినిమా కోసం థియేటర్ బెంచ్ ఎెక్కితే... రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ డ్రామాతో నా ఓపికకు గట్టి పరీక్షే పెట్టింది ఈ సినిమా. హర్ష్ రోషన్, నక్షత్ర నేచురల్ యాక్టింగ్‌ తో సీన్స్‌ ని లాక్కొచ్చే ట్రై చేసినా, డైరెక్టర్ రమేశ్ బండ్రెడ్డి స్క్రీన్‌ ప్లే మ్యాచ్ చేయలేకపోయాడు. సీన్ సీన్‌ కి ముందే గెస్ చేసేయొచ్చు. 20 నిమిషాలు ఎడిటింగ్‌లో ఎగరేస్తే తప్ప సినిమా ఫ్లో కనిపించదు.


బట్ టెక్నికల్లి కొంచెం అప్డేటెడ్ గానే ఉంది. “విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, గుహన్ కెమెరా వర్క్ సూపర్. బట్ ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. కానీ మ్యాటర్ లేని ‘తెల్ల కాగితం’ మీద ఎంత రిచ్ పెయింటింగ్ వేస్తే ఏం లాభం? టైమ్ అండ్ మనీ సేవ్ చేసుకోవాలంటే ఈ సినిమాకు కొంచెం డిస్టెన్స్ మెయింటెన్ చేయడం బెటర్! 

Oct 03, 2026
V
Velugubantla Ramadurga Private Employee
3

Not Good

Thella Kaagitham movie review

Stepping into the theater expecting a fresh, high-stakes village romance? Thella Kaagitham delivers a slick technical package, but stumbles hard on core narrative execution.Harsh Roshan and Nakshathra bring raw, natural chemistry to their teenage roles, while K.V. Guhan’s vibrant camera work and Vij...

Stepping into the theater expecting a fresh, high-stakes village romance? Thella Kaagitham delivers a slick technical package, but stumbles hard on core narrative execution.


Harsh Roshan and Nakshathra bring raw, natural chemistry to their teenage roles, while K.V. Guhan’s vibrant camera work and Vijay Bulganin’s haunting score give the film a premium visual gloss. But underneath the aesthetics lies a completely rehashed, highly predictable "Nibba-Nibbi" trope.


The second half drags with forced drama and jarring adult dialogue that instantly disconnects family audiences.

finally.. Great wrapping, but empty inside. Skip the theater run unless you're just killing time!

Oct 03, 2026
A
Arige Srikanth Private Employee
4

Below Average

Thella Kaagitham movie Review

జస్ట్ ఇప్పుడే ‘తెల్ల కాగితం’ ఫస్ట్ షో చూసొస్తున్నా.. అసలు 'కోర్ట్' సినిమా చూసి హర్ష్ రోషన్ ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటాడన్న నమ్మకంతో థియేటర్‌కి వెళ్తే... ‘తెల్ల కాగితం’తో దారుణమైన షాక్ ఇచ్చాడు. పైగా రిలీజ్ కి ముందే సినిమాని లీక్ చేసారుగా.. దాన్నే పబ్లిసిటీగా వాడుకుని రిలీజ్ చేసారు. ముందే మ్యాట...

జస్ట్ ఇప్పుడే ‘తెల్ల కాగితం’ ఫస్ట్ షో చూసొస్తున్నా.. అసలు 'కోర్ట్' సినిమా చూసి హర్ష్ రోషన్ ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటాడన్న నమ్మకంతో థియేటర్‌కి వెళ్తే... ‘తెల్ల కాగితం’తో దారుణమైన షాక్ ఇచ్చాడు. పైగా రిలీజ్ కి ముందే సినిమాని లీక్ చేసారుగా.. దాన్నే పబ్లిసిటీగా వాడుకుని రిలీజ్ చేసారు. ముందే మ్యాటర్ వీక్ అని లీక్ అయినందుకేమో, థియేటర్‌ లో సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. అండ్ సినిమా అయితే స్కూల్ లవ్, టీనేజ్ మిస్టేక్స్ అని రొటీన్ ‘నిబ్బా-నిబ్బి’ కథనే మళ్లీ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ లో చూపించారు. 


కథలో అసలు సరుకే లేదు! రియలిస్టిక్ పేరుతో అడల్ట్ డైలాగ్స్ ఇరికించి ఫ్యామిలీ ఆడియన్స్‌ ని కూడా సైడ్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే “పేరులోనేమో ‘తెల్ల కాగితం’ అని ఉంది... కానీ తీరా థియేటర్‌ కెళ్తే ఆడియన్స్ మైండ్‌ ని బ్లాంక్ పేపర్‌ లా మార్చేసింది! నాకైతే ఒకసారి కూడా చూసేలా లేదు. మరి నిబ్బా నిబ్బి యూత్ కి ఏమైనా నచ్చుతుందేమో. 

Oct 03, 2026

About This Movie

Story :

 

కథ విషయానికి వస్తే.. టీనేజర్లయిన రాము (హర్ష్ రోషన్), ఆశా (నక్షత్ర) స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ టీనేజ్ లో చేసిన ఓ తప్పు వల్ల వీళ్ళ జీవితాలే మారిపోతాయి. ఆ తప్పు వల్ల ఇంట్లో పెద్దవాళ్ళతో, సొసైటీలోనూ కష్టాలు, అవమానాలు పడాల్సి వస్తుంది. మరి వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసాక ఏం జరిగింది? అసలు రాము, ఆశా వల్ల జరిగిన తప్పు ఏంటి? అప్పటి నుండి వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలేంటి? వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? రాము- ఆశా చేసిన తప్పుకు పరిష్కారం లభించిందా? చివరకు వీళ్లు ఒకటయ్యారా? లేక విడిపోయారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

 

టాలీవుడ్ లో ఇలాంటి కథలు వందలు వచ్చేసాయి. ఆ సినిమాల్లో కొన్ని అయినా ఈ సినిమా చూసేటపుడు గుర్తొస్తాయి. సింపుల్ గా ఒక నిబ్బా నిబ్బి స్టోరీనే పల్లెటూళ్ళో చూస్తాం అంతే. అయితే సినిమా విలేజి నేటివిటీలో ఉండడం ప్లస్ పాయింట్. కామెడీ సీన్స్ ని బాగా రాసుకున్నారు. లీడ్ రోల్ లో నటించిన వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగుంది. హర్ష్ రోషన్ మరోసారి తనకు సరిగ్గా సరిపోయే కథను ఎంచుకున్నాడు. అంటే తన వయసుకి తగ్గ పాత్ర తీసుకోగా, తన రోల్ లో కూడా బాగా నటించాడు. నక్షత్ర  కూడా  బాగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

 

Minus Points :

 

ఇక దర్శకుడు ఈ సినిమా కథని చాలా సింపుల్ గా తీసుకున్నాడు. విలేజ్ నేటివిటీ బాగానే ఎంచుకున్నాడు కానీ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేకపోయాడు. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయ్యేలా తీశామన్నదే అసలు విషయం. ఈ  డైరెక్టర్ విఫలమయ్యాడు. సినిమాను రియలిస్టిక్ గా చూపించాలని అడల్ట్ డైలాగ్స్ ని పెట్టాడు. కానీ దాని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం కావాల్సి వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ రొటీన్ అండ్ రెగ్యులర్ సీన్స్ తో బోర్ కొట్టించేస్తుంది. ఎంతలా అంటే జరగబోయే అన్ని సీన్స్ ముందే ఊహించేయగలం. పైగా అనవసరమైన సీన్లతో సాగదీస్తూ మరింత బోర్ కొట్టించారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్స్ తో పాటు ఫ్యామిలీ తో రిలేషన్షిప్ ని కూడా బాగా చూపించి ఉంటె ఇంపాక్ట్ ఉండేది.

 

Technical Values : 

 

అయితే ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ సినిమాకి మంచి మ్యూజిక్ అండ్ బీజీఎమ్ ఇచ్చారు. కానీ సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ పనితనానికి గుర్తింపు లేకుండా పోయింది. కె.వి. గుహన్ కెమెరా వర్క్ బాగుంది, అయితే ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. సినిమాలో దాదాపు 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటె మూవీ నీట్ గా అనిపించేది. ఇక డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి కథ కథనాల విషయంలో దెబ్బేసినా, మేకింగ్ విషయంలో క్వాలిటీ విషయంలో జాగ్రత్త పడ్డాడు. అయితే కంటెంట్ సరిగా లేకపోయినపుడు అవేమి ఉపయోగపడలేదు. 

 

Final Review : 

 

ఫైనల్ గా తెల్ల కాగితం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ కాగితం లాగానే సినిమాలో మ్యాటర్ లేకుండా ఆడియన్స్ ని మెప్పించలేకపోతుంది. రొటీన్ అండ్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. యూత్ కి నచ్చే సీన్స్ ఉన్నా, అవి అడల్ట్ కంటెంట్ తో కూడి ఉండడం వల్ల అన్ని  మెప్పించడం కష్టం. సినిమా ఎలా ఉన్నా థియేటర్లో టైంపాస్ కి చూసే ఒక వర్గం ఆడియన్స్ ఈ సినిమాని ఒకసారి ట్రై చేస్తే చేయొచ్చు.

Review Statistics

4.4
Overall Rating
Avg. of all reviews
14
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
4.6/10
Public
3.7/10
Why MRO?