Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1045 Reviews
Showing 793–804 of 1045 reviews

Om Shanti Shanti Shantihi Movie Review

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్క‌ర్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ స...

కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్క‌ర్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. శాంతి పాత్రలో ఈషా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక బ్రహ్మాజీ, బ్రహ్మానందం తమ మార్కు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. సాంకేతికంగా, జె క్రిష్ సంగీతం, బీజీఎమ్ కంటెంట్ కి తగ్గట్టుగా ఉంది. గోదావరి అందాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అయితే ఒరిజినల్ చూడని వారికే ఇది బాగా నచ్చుతుంది. ఒరిజినల్ చూసి ఉన్నా కూడా మన నేటివిటీ కోసం ఒకసారి చూడొచ్చు.

5.0
out of 9
5 months ago
Feb 04, 2026 Telugu

Om Shanti Shanti Shantihi Movie Review

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమే...

ఓం శాంతి శాంతి శాంతిః అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమేజ్ మ్యాచ్ చేసే రోల్ కావడంతో ఆయా సన్నివేశాల్లో బాగా చేశారు. బ్రహ్మజీ, బ్రహ్మానందం పాత్రలు నవ్వించాయి. సురభి ప్రభావతి, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి తదితరులు ఓకే. పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్యలు ఏం కోరుకుంటున్నారు? సంసార జీవితం ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? అనేది చెప్పే సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. సందేశానికి సున్నితమైన హాస్యం మేళవించి చెప్పాలని ప్రయత్నించారు. అటు సందేశం, ఇటు వినోదం... రెండింటిలోనూ ప్రేక్షకులకు చేరాల్సినంత మోతాదు లేదు. చేపల పులుసు చప్పగా సాగింది. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు అసలు అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

5.0
out of 9
5 months ago
Feb 04, 2026 Telugu

Om shanti shanti shantihi movie review

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓం శాంతి శాంతి శాంతిః. ఎస్. ఆర్. రాజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక మూ...

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓం శాంతి శాంతి శాంతిః. ఎస్. ఆర్. రాజీవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే.. గోదావరి నేటివిటితో సాగే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా, గోదావరి యాస ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఒరిజినల్‌గా మలయాళం సినిమా అయినప్పటికీ.. తెలుగు నెటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేశారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాలకు నచ్చుతుంది. వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో భావోద్వేగాలు కూడా ఉన్నాయి. బీ, సీ ఆడియెన్స్‌తోపాటు మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చితే.. ఈ సినిమా విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. కానీ మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ చూసేసారు కాబట్టి, ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

5.0
out of 9
5 months ago
Feb 04, 2026 Telugu

Om Shanti shanti shantihi Movie Review

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా, ఒక రీమేక్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసా...

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా, ఒక రీమేక్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేసాడని చెప్పాలి. ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి బాగానే 'ఓం శాంతి శాంతి శాంతిః' నచ్చే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా నేటివిటీతో పాటు బీజీఎమ్, మ్యూజిక్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకి కనెక్ట్ కావడం కష్టం. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. సమరంతో సాధించలేనిది సరసంతో సాధించాలి, నేను అనవసరం అనుకున్న మనుషుల మధ్య నా అవసరం ఇక లేదు, ఒక భర్త దగ్గరి నుంచి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం.. ఇలాంటి కొన్ని డైలాగులు కథకి తగ్గట్లుగా బాగా రాసుకున్నారు. ఓవరాల్‌గా రీమేక్ అయినా కూడా తరుణ్-ఈషా నటనతో సినిమాని నడిపించారు. కానీ ఆడియన్స్ చేతిలోనే ఫలితం ఉంటుంది.

5.0
out of 9
5 months ago
Feb 04, 2026 Telugu

Om Shanti shanti shantihi Movie Review

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించడం లేదు. ఆల్రె...

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' ఒక ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించడం లేదు. ఆల్రెడీ తెలుగులో స్ట్రీమింగ్ లో ఉన్న సినిమాకి రీమేక్ కావడంతో మెజారిటీ ఆడియన్స్ ఒరిజినల్ నే ఇష్టపడి ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల పెర్ఫార్మన్స్ బాగున్నా, టెక్నికల్ గానూ ఇంప్రెస్ చేసినా, స్లో నేరేషన్ వల్ల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లేదు. అయితే తెలుగు నేటివిటీ ఇష్టపడే ఆడియన్స్ కి, రెగ్యులర్ సినిమాలు ఎక్కువగా చూసే ఆడియన్స్ ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు. కానీ ఒరిజినల్ ని చూసి ఈ సినిమాని చూస్తే అసలు నచ్చకపోవచ్చు.

5.0
out of 9
5 months ago
Feb 04, 2026 Telugu

Ayalaan movie Review

అయలాన్ (Ayalaan) 2025 Youtube Channel
“అయలాన్” సినిమా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను తీసుకుని, మానవత్వం మరియు ప్రకృతి సంరక్షణ వంటి అంశాలపై మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించింది. కథ పెద్దగా కొత్తదనం లేకపోయినా, ప్రెజెంటేషన్ పిల్లలకు అర్థమయ్యేలా ఉం...

“అయలాన్” సినిమా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను తీసుకుని, మానవత్వం మరియు ప్రకృతి సంరక్షణ వంటి అంశాలపై మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించింది. కథ పెద్దగా కొత్తదనం లేకపోయినా, ప్రెజెంటేషన్ పిల్లలకు అర్థమయ్యేలా ఉంటుంది. శివకార్తికేయన్ పాత్ర సాదాసీదాగా ఉండి, ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఏలియన్ మరియు మనుషుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా హృదయం. కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదిగా అనిపించినా, క్లైమాక్స్‌లో మెసేజ్ స్పష్టంగా చేరుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. టెక్నికల్ టీమ్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ సినిమా ద్వారా దర్శకుడు సమాజానికి ఒక పాజిటివ్ ఆలోచన ఇవ్వాలని ప్రయత్నించాడు. మొత్తం మీద “అయలాన్” మెసేజ్ ఉన్న ఎంటర్టైనర్‌గా ఒకసారి చూడదగ్గ సినిమా.

5.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan movie Review

అయలాన్ (Ayalaan) 2025 Youtube Channel
Thyview

By Thyview

“అయలాన్” సినిమా ప్రధానంగా పిల్లలు మరియు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించబడింది. సినిమా ప్రారంభం నుంచే పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. శివకార్తికేయన్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్ట...

“అయలాన్” సినిమా ప్రధానంగా పిల్లలు మరియు కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించబడింది. సినిమా ప్రారంభం నుంచే పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. శివకార్తికేయన్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఏలియన్ పాత్ర పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీ సీన్లు ఎక్కడా డబుల్ మీనింగ్ లేకుండా ఉండటం కుటుంబంతో చూసేందుకు ప్లస్ పాయింట్. కథ చాలా సింపుల్‌గా సాగినా, భావోద్వేగాలు బాగానే పండాయి. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల అద్భుతంగా ఉంటే, కొన్ని సీన్లలో ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం కనిపిస్తుంది. పాటలు సాధారణంగా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు బలం ఇస్తుంది. సినిమా చివర్లో ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది. మొత్తం మీద “అయలాన్” ఒక సేఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.

6.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan movie Review

K

By Koimoi.com

శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఫైనల్ గా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెండేళ్లయినా సరే ఈ సినిమాను ఫ్యామిలీస్ ప్లస్ కిడ్స్ ఎంజాయ్ చేస్తూ సినిమా చుడ్డొచ్చు. టెక్నికల్‌గా “అయలాన్”...

శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఫైనల్ గా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెండేళ్లయినా సరే ఈ సినిమాను ఫ్యామిలీస్ ప్లస్ కిడ్స్ ఎంజాయ్ చేస్తూ సినిమా చుడ్డొచ్చు. టెక్నికల్‌గా “అయలాన్” మంచి ప్రయత్నం. విజువల్ ఎఫెక్ట్స్ మీద భారీ శ్రమ కనిపిస్తుంది. ఏలియన్ క్యారెక్టర్ డిజైన్ మరియు యానిమేషన్ ప్రశంసనీయం. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సైన్స్ ఫిక్షన్ ఫీల్‌ను బాగా తీసుకొచ్చింది. ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలో ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ జానర్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సినిమా నిలుస్తుంది, టెక్నికల్ టీమ్‌కు మంచి మార్కులు వేయొచ్చు. ఓవరాల్ గా మరీ ఎక్కువ అంచనాలు లేకుండా చూస్తే బెస్ట్.

6.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan movie Review

T

By The Hindu

ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. అయితే శివకార్తికేయన్ అభిమానులకు “అయలాన్” ఒక ట్రీట్. ఆయన ఎనర్జీ, ఇన్నోసెన్స్, కామెడీ అన్నీ సినిమాకు హైలైట్. ఏలియన్‌తో...

ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. అయితే శివకార్తికేయన్ అభిమానులకు “అయలాన్” ఒక ట్రీట్. ఆయన ఎనర్జీ, ఇన్నోసెన్స్, కామెడీ అన్నీ సినిమాకు హైలైట్. ఏలియన్‌తో ఆయన చేసే సీన్లు చాలా క్యూట్‌గా ఉంటాయి. సినిమా మొత్తం పాజిటివ్ వైబ్‌తో సాగుతుంది. పిల్లలతో కలిసి చూసేలా క్లీనుగా తెరకెక్కించారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ డిజైన్ చాలా నచ్చుతుంది. మెసేజ్ కూడా బాగుంది. కథ సింపుల్ అయినా, ఎస్‌కే స్టైల్ వల్ల సినిమా ఎంజాయబుల్‌గా మారింది. ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. కాకపోతే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరదాగా సినిమా చూడ్డానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అవుతారు.

6.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan Movie Review

B

By BigTV

ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. సినిమా పూర్తిగా శివకార్తికేయన్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను ముందుకు నడిపిస్తుంది. కథ కొత్తదేమీ క...

ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. సినిమా పూర్తిగా శివకార్తికేయన్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను ముందుకు నడిపిస్తుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, పిల్లలు మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సరిపోతుంది. సీజీ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని సీన్లలో కృత్రిమంగా కనిపిస్తాయి. విలన్ పాత్రకు సరైన డెప్త్ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఇండియన్ స్థాయిలో బాగానే ఉన్నాయి. కొన్ని సీన్లు ఆకట్టుకుంటే, కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. పాటలు పెద్దగా గుర్తుండిపోవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చేస్తుంది. ఓసారి థియేటర్‌లో చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు.

5.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan movie Review

M

By M9News

తమిళ నాట ఎప్పుడో రిలీజ్ అయి తెలుగులో మాత్రం రెండేళ్ల విరామం తర్వాత ఎన్నో అవాంతరాలు దాటుకుని ఫైనల్ గా ఓటిటి లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన మూవీ అయలాన్. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించిన విషయం...

తమిళ నాట ఎప్పుడో రిలీజ్ అయి తెలుగులో మాత్రం రెండేళ్ల విరామం తర్వాత ఎన్నో అవాంతరాలు దాటుకుని ఫైనల్ గా ఓటిటి లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన మూవీ అయలాన్. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే “అయలాన్”లో కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. కథ చాలా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కొన్ని సీన్లు అవసరం లేనట్టు అనిపిస్తాయి. సీజీ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని సీన్లలో కృత్రిమంగా కనిపిస్తాయి. విలన్ పాత్రకు సరైన డెప్త్ లేదు. భావోద్వేగాలు పూర్తిగా కనెక్ట్ కావు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. శివకార్తికేయన్ ఫ్యాన్స్‌కి నచ్చొచ్చు కానీ, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది.

5.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu

Ayalaan movie Review

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా చాలా రోజులకు ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరద్ కెల్హర్, ఇషా కొప్పికర్, యోగిబాబు తదిత...

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా చాలా రోజులకు ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరద్ కెల్హర్, ఇషా కొప్పికర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఓటిటి లోకి అందుబాటులోకి రావడంతో, ఒరిజినల్ సబ్ టైటిల్స్ తో చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. కానీ ఇప్పటివరకు సినిమా చూడని వారికి ఇప్పుడు చూసినా అయలన్ కొత్తగానే ఉంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడదగ్గ అన్ని ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. కానీ, స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఏలియన్ జానర్ లో బెస్ట్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన చిత్రంగా తనదైన ముద్ర వేసి ఉండేది. మొత్తానికి జాలీ మోడ్ లో ఆకట్టుకునే 'అయలాన్' యాక్షన్ మోడ్ లో జారిపోయింది.

5.0
out of 9
5 months ago
Jan 29, 2026 Telugu
Why MRO?