Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

469 Reviews
Showing 1–12 of 469 reviews
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స...

"డెకాయిట్" సినిమా గురించి మాట్లాడితే… ఇది ఓ స్టైలిష్ యాక్షన్ లవ్ స్టోరీగా మంచి ఎఫర్ట్ అని చెప్పాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ పార్ట్ గురించే. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌కి మంచి ఎలివేషన్ ఇస్తుంది. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపిస్తుంది. ఈ విషయంలో టీమ్ మంచి వర్క్ చేసింది.


అడివి శేషు మరోసారి తన స్టైల్‌లోనే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. మృణాల్ ఠాకూర్ కూడా స్క్రీన్‌పై మంచి ప్రెజెన్స్ చూపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతుంది. సినిమాలో కొన్ని ట్విస్టులు, ఎమోషనల్ మోమెంట్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. స్టోరీ రొటీన్ లైన్‌లో ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ వల్ల సినిమా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. అయినా కూడా ఓవరాల్‌గా సినిమా ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

7.0
out of 9
3 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్,...

"డెకాయిట్" గురించి మాట్లాడితే… ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ప్యాకేజ్ చేసిన సినిమా. కానీ ఆ ప్యాకేజింగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అంతగా ఎగ్జైట్ చేయదు. సినిమా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మేకింగ్ అన్ని ఇంప్రెస్ చేస్తాయి. బట్ ఏదో తక్కువైంది అన్న ఫీల్ వస్తుంది. కంటెంట్, రైటింగ్, స్క్రీన్‌ ప్లే కూడా అంతే ముఖ్యమైనవి. అక్కడికే ఈ సినిమా కొంచెం తగ్గిపోతుంది. స్క్రీన్‌ ప్లే లో కొన్ని ఆసక్తికరమైన ఐడియాస్ ఉన్నప్పటికీ, అవి పూర్తిగా ఎఫెక్టివ్‌ గా ఎగ్జిక్యూట్ కాలేదు. 


పైగా ట్విస్టులు ఉన్నా, అవి మనల్ని సర్ప్రైజ్ చేయవు. బట్ పెర్ఫార్మన్స్ వైస్ గా అడివి శేష్ తన పాత్రలో బెస్ట్ అండ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ అతను ఎంచుకునే కథల మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌ ను ఈ సినిమా పూర్తిగా మీట్ చేయలేదు. మృణాల్ ఠాకూర్ కూడా తన రోల్ కి సరిపడేలా నటించింది కానీ ఆమె పాత్రలో మరింత డెప్త్ ఉండాల్సింది. క్లైమాక్స్ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. కానీ ముందు వచ్చిన నరేషన్ దానికి సరైన బిల్డ్ ఇవ్వలేదు. అందుకే ఆ ఎమోషన్ కూడా పూర్తిగా హిట్ అవ్వదు. మొత్తానికి “డెకాయిట్” ఒక మిడ్-లెవల్ ఎఫర్ట్. ఐడియా ఉంది, టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉంది… కానీ వాటిని కలిపే రైటింగ్ లోపించడం వల్ల సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది. 

5.0
out of 9
3 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

డెకాయిట్” మూవీ గురించి షార్ట్ గా రివ్యూ చెప్పాలంటే... మనమే డైరెక్టర్ అన్న లెక్కలో మాట్లాడుకుంటే.. “సర్… మనం ఓ యాక్షన్ లవ్ స్టోరీ తీస్తాం… కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఉండదు… పర్లేదు కదా?” “పర్లేదు… టెక్...

డెకాయిట్” మూవీ గురించి షార్ట్ గా రివ్యూ చెప్పాలంటే... మనమే డైరెక్టర్ అన్న లెక్కలో మాట్లాడుకుంటే.. “సర్… మనం ఓ యాక్షన్ లవ్ స్టోరీ తీస్తాం… కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఉండదు… పర్లేదు కదా?” “పర్లేదు… టెక్నికల్‌ గా స్ట్రాంగ్‌గా చేస్తే చాలు!” అన్నట్టుగా ఉంది ఈ సినిమా. మూవీ స్టార్ట్ అవుతూనే మీరనుకుంటారు “ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుందని.. కానీ కొంచెం టైమ్ తర్వాతే అర్థమవుతుంది—“అరే ఇది ఎక్కడో చూసినట్టే ఉందే!” అని. 


అలాగే మూవీ లో ట్విస్టులు ఉంటాయి… కానీ అవి “వావ్” అనిపించవు. “ఓకే… ఇది కూడా ఊహించాం” అనిపించే రేంజ్‌ లోనే ఉంటాయి. స్క్రీన్‌ ప్లే మాత్రం “సర్… కొంచెం స్లోగా తీసుకెళ్దామా?” అన్నట్టుగా సాగుతుంది. మధ్యలో కొంత యాక్షన్, కొంత లవ్… కానీ ఏదీ పూర్తిగా ఎంగేజ్ చేయదు. ఇక క్లైమాక్స్ వస్తుంది… “ఇప్పుడు పెద్ద ట్విస్ట్ వస్తుంది!” అనిపిస్తుంది. ట్విస్ట్ వస్తుంది కూడా… కానీ అది చూసాక “ఇదేనా?” అనే ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. కొంచెం ఓవర్ ది టాప్‌గా కూడా అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే… “డెకాయిట్” అంటే టెక్నికల్‌గా బాగున్న, కానీ కంటెంట్ పరంగా చాలా సాధారణమైన సినిమా. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే డెఫినిట్‌గా డిసప్పాయింట్. అంచనాలు చాలా తగ్గించుకుంటే… “సరే చూసాం” అనిపించేంత మాత్రమే.


5.0
out of 9
4 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

“డెకాయిట్” గురించి సింపుల్‌గా చెప్పాలంటే… ఇది ఒక ఎబోవ్ యావరేజ్ డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అడవి శేష్ సినిమాల మీద ఇంతకు ముందు ఉండే నమ్మకంతోనే డెకాయిట్ కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్...

“డెకాయిట్” గురించి సింపుల్‌గా చెప్పాలంటే… ఇది ఒక ఎబోవ్ యావరేజ్ డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అడవి శేష్ సినిమాల మీద ఇంతకు ముందు ఉండే నమ్మకంతోనే డెకాయిట్ కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మూవీ సూపర్ హైప్ తో రిలీజ్ కాగా, ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేస్తుందని టాక్ ని బట్టి తెలుస్తుంది. ప్లస్ పాయింట్స్ గురించి చెప్తే.. సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ ఇస్తుంది, మేకింగ్ కూడా రిచ్‌ గా కనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం ఎక్కడా కంప్లైంట్ పెట్టాల్సిన పని లేదు. 


కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… స్క్రీన్‌ప్లే.. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా గ్రిప్‌ లో పెట్టేలా ఉండదు. కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కానీ మధ్య మధ్యలో సినిమా డ్రాప్ అవుతుంది. ట్విస్టులు, టర్నింగ్స్ పెట్టారు కానీ అవి మనకు “వావ్” అనిపించేలా ఉండవు.

అయితే పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తన పాత్రలకు న్యాయం చేసారు. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఒక్క ముక్కలో డెకాయిట్ మూవీ గురించి చెప్పాలంటే... అందరి హృదయాల్ని డెకాయిట్ దోచుకుంటాడో లేదో తెలీదు గాని, అతని హృదయాన్ని మాత్రం ఆవిడ (హీరోయిన్) దోచుకుంది. ఈ ముక్కకి కంక్లూజన్ తెలియాలంటే మూవీ చూసాకే అర్ధమవుద్ది.

6.0
out of 9
4 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

అడివి శేష్ మెయిన్ లీడ్ గా నటించిన "డెకాయిట్" ఒక యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా నిలిచింది. టెక్నికల్‌గా బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే మాత్రం కొన్ని చోట్ల మాత్రమే పనిచేసింది. అలాగే సినిమా టెక్నికల్‌ గ...

అడివి శేష్ మెయిన్ లీడ్ గా నటించిన "డెకాయిట్" ఒక యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా నిలిచింది. టెక్నికల్‌గా బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే మాత్రం కొన్ని చోట్ల మాత్రమే పనిచేసింది. అలాగే సినిమా టెక్నికల్‌ గా సౌండ్‌గా ఉండటం దాని ప్రధాన బలం. విజువల్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, మేకింగ్ పరంగా అన్ని బాగున్నాయి. కానీ స్క్రీన్‌ప్లే, రైటింగ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ట్విస్టులు, టర్నింగ్స్ ఉన్నప్పటికీ అవి పూర్తిగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. 


కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయినా, చాలా చోట్ల Kshanam, Goodachari సినిమాలను గుర్తు చేసేలా ఉండటం వల్ల స్క్రీన్‌ప్లే రిపిటేటివ్, ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కొంచెం ఓవర్ ది టాప్‌గా అనిపిస్తుంది. Adivi Sesh తన పాత్రకు తగ్గట్టు నటించాడు. కానీ రాయలసీమ యాస మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. Mrunal Thakur పెర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. మొత్తానికి డెకాయిట్ అంచనాలు తగ్గించుకుని చూస్తే ఒకసారి చూడదగిన సినిమా.

5.0
out of 9
4 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

జనరల్ గా అడివి శేష్ మూవీస్ అంటే ఎలాంటి వంక పెట్టకుండా స్క్రీన్స్ కి ఆడియన్స్ అతుక్కుపోయి చూసే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే వరుస హిట్స్ సొంతమయ్యాయ్. ఇప్పుడు ఆడియన...

జనరల్ గా అడివి శేష్ మూవీస్ అంటే ఎలాంటి వంక పెట్టకుండా స్క్రీన్స్ కి ఆడియన్స్ అతుక్కుపోయి చూసే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే వరుస హిట్స్ సొంతమయ్యాయ్. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇవే అంచనాలతో డెకాయిట్ ని చూడగా, ఫైనల్ గా మూవీ మొత్తం అయ్యాక అడవి శేష్ ముందు మూవీస్ రేంజ్ లో డెకాయిట్ ఇంపాక్ట్ ని అయితే చూపించలేకపోయింది. కానీ అదే నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె.. డీసెంట్ లవ్ స్టోరీ నుండి రివేంజ్ గా మారే డెకాయిట్ తర్వాత కొన్ని మంచి సీన్స్ తో టెంపో ని అలానే మెయిన్ టైన్ చేసి క్లైమాక్స్ 20 నిమిషాల బాగానే కూర్చోబెట్టి ఓ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ను ఆడియన్స్ కి కలిగేలా చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. 


అయితే అడివి శేష్ రాయలసీమ యాస అంత సూట్ అవ్వలేదు కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా మరోసారి కుమ్మేశాడు. ఇటు మృణాల్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేసి మెప్పించింది. ఇద్దరి పెయిర్ బాగుంది కానీ ఎందుకో కొన్ని చోట్ల లీడ్ పెయిర్ డబ్బింగ్ క్లియర్ గా వినిపించలేదు. సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో బాగానే ఉన్నా, సెకెండ్ హాఫ్ లో రిపీటివ్ సీన్స్ తో డ్రాగ్ అయ్యి ఫ్లాట్ గా మారిపోయింది. తిరిగి క్లైమాక్స్ ఆకట్టుకోవడంతో పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా అడవి శేష్ మూవీ లవర్స్ కి సినిమా డిస్సపాయింట్ చేస్తుంది. కానీ నార్మల్ ఆడియన్స్ కి మాత్రం ఒక డీసెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది.

6.0
out of 9
5 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

Gulte

By Gulte

డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా స్టోరీ పరంగా రొటీన్ అనిపించుకోగా, ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాలో కథ అంతగా లేకున్నా, ట్విస...

డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా స్టోరీ పరంగా రొటీన్ అనిపించుకోగా, ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాలో కథ అంతగా లేకున్నా, ట్విస్టులు బాగా వస్తాయి, కానీ స్క్రీన్‌పై ఎగ్జిక్యూషన్ కారణంగా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

మళ్లీ ఎపిసోడ్స్ రిపీట్ అవుతూ సినిమా స్లోగా మారుతుంది. నరేషన్ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. ఎమోషనల్ కోర్ ఉన్నప్పటికీ, దానికి తగిన డెప్త్ లేకపోవడం, స్లో ట్రీట్‌మెంట్ కారణంగా అది పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది. 


ఓవరాల్‌గా కథ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా అనిపిస్తాయి. మోడర్న్ టచ్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ బాగున్నా... గ్రిప్పింగ్ మోమెంట్స్, ఇంటెన్సిటీ లోపించడం సినిమా మీద ప్రభావం చూపించింది. క్లైమాక్స్ విషయానికి వస్తే, ముందే ఊహించగలిగేలా ఉన్నా ఎమోషనల్‌ గా మాత్రం కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అయితే ముందుగా వచ్చిన స్లో నరేషన్ వల్ల ఆ ఇంపాక్ట్ అంత బలంగా అనిపించదు. యాక్షన్ ఎపిసోడ్స్ మరింత రా, నేచురల్‌గా ఉండి, లవ్ స్టోరీకి ఇంకా డెప్త్ ఇచ్చి ఉంటే సినిమా మరింత బెటర్‌గా ఉండేదనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా అడివి శేష్ సినిమాలపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ దృష్ట్యా “డెకాయిట్” కథ, ట్రీట్‌మెంట్ మిడ్‌గా, రొటీన్‌గా అనిపించడం మెయిన్ మైనస్. ఫైనల్ గా అంచనాలు తగ్గించుకుంటే ఒకసారి చూడొచ్చు. 

5.0
out of 9
5 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి డెకాయిట్ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమాలో అడవి శేష...

అడివి శేష్ సినిమాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రేక్షకులందరికీ ఒక అంచనా ఉంది. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి డెకాయిట్ అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమాలో అడవి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో సినిమాని భుజాలపై నిలబెట్టారు. ముఖ్యంగా మృణాల్ సినిమా అంతా తన ఎమోషనల్ నటనతో అదరగొట్టేసింది. ఇక అనురాగ్ కశ్యప్ అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునయన.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.


ఇక టెక్నికల్ గా చూస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చాలా ప్లస్ అయ్యాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కట్ మాత్రం అదిరిపోయింది. గ్యాని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరింత ఎలివేట్ చేసింది. భీమ్స్ ఇచ్చిన పాటలు బాగున్నాయి. ప్రేమకథకు యాక్షన్ జోడించి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో బాగా రాసుకున్నారు. డైలాగ్స్ కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో దర్శకుడిగా మారి మొదటి సినిమా బాగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘డెకాయిట్’ సినిమా ఎమోషనల్ ప్రేమ కథతో పాటు ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. 

6.0
out of 9
5 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

అడివి శేష్ అంటేనే విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఈయన ట్రాక్ రికార్డ్ పీక్స్ లో ఉంది. మూడేళ్ల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డెకాయిట్: ఒక ప్రేమ కథ. తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన...

అడివి శేష్ అంటేనే విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఈయన ట్రాక్ రికార్డ్ పీక్స్ లో ఉంది. మూడేళ్ల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డెకాయిట్: ఒక ప్రేమ కథ. తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా. సినిమా గురించి మరియు మేకర్స్ టీం గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, ముందుగా అడివి శేష్ గురించి చెప్పుకోవాలి. తన మార్క్ నటనతో ఈ సినిమాను భుజాన వేసుకున్నాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తన పాత్రకు ప్రాణం పోశాడు. అలాగే మృణాల్ ఠాకూర్ తన నటనతో ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. అలాగే అనురాగ్ కశ్యప్ నటన చాలా రియలిస్టిక్ గా ఉండి సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే మిగతా ఆర్టిస్టులకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు దక్కలేదు. 


అయితే టెక్నికల్ గా భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. దనుష్ భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా, కథలోని మూడ్ కి తగ్గట్టుగా సాగింది. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ల నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా డెకాయిట్ ఒక డిఫరెంట్ యాక్షన్ లవ్ స్టోరీ గా ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. 

6.0
out of 9
5 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

అడవి శేష్ మెయిన్ లీడ్ లో నటించిన డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటుల పరంగా అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు క...

అడవి శేష్ మెయిన్ లీడ్ లో నటించిన డెకాయిట్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటుల పరంగా అడవి శేష్, మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు కొట్టేసారు. సినిమా మొత్తం ఒక రకంగా వీళ్ళే నడిపిస్తారు. ఆ తర్వాత ఇతర కీ రోల్స్ ప్లే చేసిన కామాక్షి భాస్కర్ల, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, జయన్ మారియా ఖాన్, సునీల్, అతుల్ కులకర్ణి వీళ్ళందరూ తమ రోల్స్ లో బాగానే మెప్పించినా, ఆ రోల్స్ ని స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. 


ఇక అడివి శేష్ అంటేనే థ్రిల్లర్ సినిమాలకు స్పెషలిస్ట్. ఆయన సినిమాల్లో ట్విస్టులు బావుంటాయనే పేరుంది. 'డెకాయిట్'లోనూ ట్విస్టులు ఉన్నాయి. అవి బావున్నాయి. కానీ ఇది థ్రిల్లర్ మూవీ కాదు... ప్రేమ కథ. అయితే ఆ ప్రేమకు అవసరమైన ఎమోషనే సినిమాలో మిస్ అయ్యింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లైమాక్స్‌ తప్ప 'హార్ట్' టచింగ్ మూమెంట్స్‌ లేవు. ఇక టెక్నికల్ పరంగా సాలిడ్ ఇంపాక్ట్ ఉన్న సినిమా ఇది. బీజీఎమ్ కూడా అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. అయితే ప్రేక్షకుల మనసు దోచుకోవడంలోనే డెకాయిట్ సినిమా విఫలమైంది. అయితే టెక్నికల్ స్టాండర్డ్స్, క్లైమాక్స్ కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.


5.0
out of 9
5 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit movie Review

అడవి శేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ తెలుగు ఆడియన్స్ ఇచ్చేసారు. అదే స్థాయి అంచనాలతో మినిమం కాకుండా భారీ అంచనాలతో విడుదలైంది డెకాయిట్ మూవి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అడవి శేష్ స్వయంగా అందించి...

అడవి శేష్ అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ తెలుగు ఆడియన్స్ ఇచ్చేసారు. అదే స్థాయి అంచనాలతో మినిమం కాకుండా భారీ అంచనాలతో విడుదలైంది డెకాయిట్ మూవి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అడవి శేష్ స్వయంగా అందించిన ఈ కథకు స్క్రీన్ ప్లే కూడా తానే ఇవ్వగా, షానియల్ డియో డైరెక్ట్ చేసాడు. దీనికి తోడు అబ్బూరి రవి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక షానియల్ డియో డైరెక్షన్ బాగానే చేసినా, దాన్ని అంతే ఇంట్రెస్టింగ్‌ గా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. 


స్క్రీన్‌ప్లే పరంగా లోపలున్నాయి. అయితే సెకండాఫ్‌ ని బాగా డీల్‌ చేశారు. అదే సినిమాని నిలబెడుతుంది. టెక్నీకల్‌గా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. విజువల్స్ గానూ ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం అదిరిపోయింది. భీమ్స్ మెప్పించారు. గ్యానీ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. మేజర్‌గా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పరంగా లోపాలు కనిపించాయి. అవన్నీ పక్కన పెడితే ఓవరాల్‌గా ఎంగేజ్‌ చేస్తూ డెకాయిట్ ఆకట్టుకునే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ, యాక్షన్‌ పరంగా ఆకట్టుకునే మూవీ డెకాయిట్‌. అడివి శేష్‌ చేసిన భిన్నమైన ప్రయత్నమని చెప్పొచ్చు.


6.0
out of 9
6 hours ago
Apr 10, 2026 Telugu
Dacoit (డెకాయిట్)

Dacoit Movie Review

అడివి శేష్, మృణాల్ థాకూర్ నటించిన డెకాయిట్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, సినిమాలో వీళ్ళ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. స్టోరీ పరంగా రొటీన్ గా ఉన్నా, టేకింగ్ పరంగా యాక్షన...

అడివి శేష్, మృణాల్ థాకూర్ నటించిన డెకాయిట్ తాజాగా థియేటర్లలో విడుదల కాగా, సినిమాలో వీళ్ళ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. స్టోరీ పరంగా రొటీన్ గా ఉన్నా, టేకింగ్ పరంగా యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ఐ ఫీస్ట్ వస్తుంది. పైగా దర్శకుడు షానియల్ డియో రాసుకొన్న క్లైమాక్స్, డిజైన్ చేసిన సీన్లు హైలెట్‌ గా మారాయి. దాంతో సినిమాకి హిట్ కావాల్సిన హంగులను జోడించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అలాగే హరిగా అడివి శేష్, జూలియట్‌గా మృణాల్ థాకూర్ తమ పాత్రల్లో జీవించారు. మరోసారి ఇద్దరూ కూడా డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, జేయ్ మేరీ ఖాన్ తమ నటనతో సినిమాకు బలంగా మారారు. 


ఇక డెకాయిట్ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫి, నాగేంద్ర ఆర్ట్ వర్క్ సినిమాకు హైలెట్‌ గా మారింది. భీమ్స్ సిసిరోలియో పాటలు, బీజీఎం సినిమాకు అల్టిమేట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డెకాయిట్ మూవి యాక్షన్ లవర్స్ తో పాటు లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్లకు కూడానచ్చుతుంది. కాకపోతే కొత్తదనం ఆశిస్తే, కాస్త డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది. 

6.0
out of 9
6 hours ago
Apr 10, 2026 Telugu