కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన "కొరియన్ కనకరాజు" ఫైనల్ గా థియేటర్లలో విడుదలైంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. కొరియన్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Available in:
Reviews
What critics and the public are saying about కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)
Media Reviews
19 Avg: 6.5/10Hit
Korean kanakaraju movie review
హలో గైస్. ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసాం అనమాట. అయితే ఈ సినిమాలో కొరియా ఉంది, కనకరాజు ఉన్నాడు. బట్ ఈ సినిమాలో సత్య ని తీసేస్తే ఇంకేం ఉండదు అనమాట. సినిమాలో అద్భుతమైన సీన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఇంకేమి అంతగా లేవు గాని, కామెడీ మాత్రం ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే ఎదో కొన్ని కామెడీ సీన్స్, సాం...
హలో గైస్. ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసాం అనమాట. అయితే ఈ సినిమాలో కొరియా ఉంది, కనకరాజు ఉన్నాడు. బట్ ఈ సినిమాలో సత్య ని తీసేస్తే ఇంకేం ఉండదు అనమాట. సినిమాలో అద్భుతమైన సీన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఇంకేమి అంతగా లేవు గాని, కామెడీ మాత్రం ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే ఎదో కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్ ఫైట్స్ తో అలా రొటీన్ గా సాగుతూ, ఇంటర్వెల్ కి మాత్రం మంచి సీన్స్ ని కొరియన్ వాడికోసం ఎస్టాబ్లిష్ చేసారు.
ఇంక కొరియా ఎపిసోడ్లు అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా లేవు. ఇక సెకండ్ హాఫ్ లో సత్య కామెడీయే స్పెషల్ గా ఉంది కానీ, ఆ ట్విస్ట్ లు మాత్రం ఎక్కలేదు. అండ్ క్లైమాక్స్ లో AI ఫైట్స్ మాత్రం బాలేవు. ఇక వరుణ్ తేజ్ సినిమాలో చాలా బాగున్నాడు. బట్ సినిమాలో వరుణ్ తేజ్ కి మంచి ఎంటర్టైనింగ్ రోల్ గా తన రోల్ ని డిజైన్ చేసే ఛాన్స్ ఉన్నా, పెద్దగా వాడుకోలేదు. ఇక సత్య అయితే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా తన షోల్డర్ తో లాక్కొచ్చాడు. ఇక థమన్ మ్యూజిక్ అయితే బాగున్నా, ఒక గ్రేట్ అన్నట్టు మాత్రం లేదు. హీరోయిన్ కూడా ఉందా లేదా అన్నట్టుంటుంది. ఓవరాల్ గా నాకైతే హిలేరియస్ ఫీల్ అయితే రాలేదు.
Hit
Korean kanakaraju movie
కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే... చాలా బాగుంది సినిమా, కాకపోతే క్లైమాక్స్ చెడగొట్టింది. ఫస్ట్ అయితే సినిమా చాలా ఫన్ గా ఉంది. నిజానికి సినిమా మల్టీస్టారర్ అని చెప్పాలి. వరుణ్ తేజ్ ఒకరు, సత్య మరొకరు అని చెప్పాలి. అండ్ సినిమాలో బేసిగ్గా సత్య లేకపోతే సినిమా లేదన్నట్టు అనిపించింది. సో ఒక రకంగా...
కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే... చాలా బాగుంది సినిమా, కాకపోతే క్లైమాక్స్ చెడగొట్టింది. ఫస్ట్ అయితే సినిమా చాలా ఫన్ గా ఉంది. నిజానికి సినిమా మల్టీస్టారర్ అని చెప్పాలి. వరుణ్ తేజ్ ఒకరు, సత్య మరొకరు అని చెప్పాలి. అండ్ సినిమాలో బేసిగ్గా సత్య లేకపోతే సినిమా లేదన్నట్టు అనిపించింది. సో ఒక రకంగా సేవియర్ సత్య అన్నట్టుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెడగొట్టారు.
సో అట్లాగ క్లైమాక్స్ ఏంటో ఈ vfx కూడా బాలేదు. అండ్ ఎండింగ్ ఎదో చేసారంటే చేసాం అన్నట్టుంది. అండ్ పార్ట్ టు కూడా ప్లాన్ చేశారు. ఈసారి కెన్యా కనకరాజు అంటా. ఏమో మరి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే పర్టికులర్ గా ఒకటనిపించింది, వరుణ్ తేజ్ ఇంత మంచి కటౌట్ పెట్టుకుని, ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారో తెలీట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే వరుణ్ తేజ్ ని 100% అయితే ఇందులో వాడలేదు. అంటే ఆయన కటౌట్ కి తగ్గ సినిమా అయితే కాదు.
అండ్ పార్ట్ టు కూడా అనౌన్స్ చేసారు. తీయొచ్చు. ఈ రేంజ్ ఫ్రెష్ కామెడీ అయితే తీయొచ్చు. బట్ అక్కడైతే ఆపేస్తే బెటర్. ఫైనల్ గా క్లైమాక్స్ తప్ప నాకంతా బాగుంది.
Above Average
Korean Kanakaraju movie review
సో మల్టి స్టారర్ మూవీ అయిన కొరియన్ కనకరాజు మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. అదేంటి మల్టి స్టారర్ సినిమా అంటున్నారేంటి అనుకోవచ్చు. ఈ సినిమా సత్య లేకపోతే హుష్ ఫటక్ అనుకోవచ్చు. సీరియస్లి ఈ సినిమాలో సత్య, వరుణ్ తేజ్ అక్కడక్కడా ఇద్దరు ముగ్గురి క్యారెక్టర్స్ సీన్స్ తప్ప ఏం అట్రాక్ట్ కాలేదు. రెండున్నర గంటలైతే...
సో మల్టి స్టారర్ మూవీ అయిన కొరియన్ కనకరాజు మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. అదేంటి మల్టి స్టారర్ సినిమా అంటున్నారేంటి అనుకోవచ్చు. ఈ సినిమా సత్య లేకపోతే హుష్ ఫటక్ అనుకోవచ్చు. సీరియస్లి ఈ సినిమాలో సత్య, వరుణ్ తేజ్ అక్కడక్కడా ఇద్దరు ముగ్గురి క్యారెక్టర్స్ సీన్స్ తప్ప ఏం అట్రాక్ట్ కాలేదు. రెండున్నర గంటలైతే బాగా నవ్వుకున్నా. అండ్ సినిమాలో లిటిరల్లి సినిమాలో మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరిష్ గా ఉందని meme ఫేమస్ అయింది. అది అదిరిపోయింది సినిమాలో.
బట్ నాకు సినిమాలో ఎక్కడ కోపమొచ్చిందంటే... AI ఫైట్ సీన్ పెడతారు అది అస్సలు నచ్చలేదు. ఎదో మీ మొహాలకు ఇదొక్కటి చాలు అన్నట్టు తీశారనిపించింది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి పదినిమిషాలకొకసారి నవ్విస్తారు. ఏదైతే చెప్పుకోవాలి. బట్ హీరో ఇంట్రడక్షన్ ఏమో అలా గడిచిపోయింది. సినిమాలో హీరో కంటే కమెడియన్ సత్య కామెడీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. సత్య ఎంట్రీకైతే అరుపులే. అండ్ సినిమాలో కొరియన్ ఆత్మ ఇండియాకి వచ్చే సీన్ రైటింగ్ మాత్రం వరెస్ట్. అండ్ సినిమాలో పెద్దగా లవ్ స్టోరీ కూడా లేదు. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే... రొట్ట రొటీన్ సినిమాలో కామెడీ వర్కౌట్ అయింది. వర్తా అంటే మాత్రం నాకైతే నవ్వుకుంటాం కానీ అంత అనిపించలేదు. మ్యూజిక్ అయితే మాత్రం థమన్ సగం పార్ట్ లెనిన్, ఇంకో సగం ఓజి నుండి లేపేసి ఇందులో పెట్టినట్టు అనిపించింది.
Above Average
Korean kanakaraju movie review
సినిమా కొత్త కాన్సెప్ట్ బాగుంటుందనుకుని... ఎదో చించేద్దాం అనుకునెల్లా... బట్ వెళ్ళిన తర్వాత... లెక్క మారిపోయింది. సినిమా రొటీన్ టెంప్లేట్ లో ఉన్నా, పర్ఫెక్ట్ గా తీయాలి. ఈ సినిమాకి మాత్రం ఎం లేదు. సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. అండ్ వరుణ్ తేజ్ గెటప్ ఈ సారి పేలలేదు. బేసిగ్గా వరుణ్ మూవీ సెలక్షన్...
సినిమా కొత్త కాన్సెప్ట్ బాగుంటుందనుకుని... ఎదో చించేద్దాం అనుకునెల్లా... బట్ వెళ్ళిన తర్వాత... లెక్క మారిపోయింది. సినిమా రొటీన్ టెంప్లేట్ లో ఉన్నా, పర్ఫెక్ట్ గా తీయాలి. ఈ సినిమాకి మాత్రం ఎం లేదు. సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. అండ్ వరుణ్ తేజ్ గెటప్ ఈ సారి పేలలేదు. బేసిగ్గా వరుణ్ మూవీ సెలక్షన్ కూడా బాగుంటది కానీ. ఈ సినిమా రాంగ్ సెలక్షన్ అనిపించింది నాకు.
అండ్ సినిమాని సూపర్ మ్యాన్ లెవెల్లో తీద్దామని ట్రై చేసినట్టు అనిపిస్తుంది. చాలా సీన్లు లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. అండ్ సినిమాలో హీరోను ఎస్టాబ్లిష్ చేసే సీన్లు అస్సలు బాలేవు. అండ్ ఈ సినిమాలో కొరియా లో చాలామంది గన్స్ పట్టుకుని ఉండడం షాకింగ్ అనిపిస్తది. ఎందుకంటే నిజానికి కొరియా లో గన్స్ బ్యాన్డ్. అండ్ సినిమాలో అమ్యేచ్యురీష్ డైలాగ్ మాత్రం పేలింది. ఇక మ్యూజిక్ సాంగ్స్ అయితే చేతులెత్తేశారు. బట్ మ్యూజిక్ బాగుంది. బీజీఎమ్ చాలా సీన్స్ లో బాగుంది. ఫైనల్ గా నాకైతే మూవీ చాలా కష్టమండి. మీకెలా ఉంది చూసి చెప్పండి.
Hit
Korean kanakaraju movie review
కొరియన్ కనకరాజు.... 2 hours 45 minutes తో రిలీజ్ అయింది. సినిమా అయితే అలా కామెడీ సీన్స్ తో గడిచిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో టైంపాస్ అయిపొయింది. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే... ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎలా అయితే సెకండ్ హాఫ్ డౌన్ అయిపోతుందో... ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. ఏం చే...
కొరియన్ కనకరాజు.... 2 hours 45 minutes తో రిలీజ్ అయింది. సినిమా అయితే అలా కామెడీ సీన్స్ తో గడిచిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో టైంపాస్ అయిపొయింది. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే... ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎలా అయితే సెకండ్ హాఫ్ డౌన్ అయిపోతుందో... ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. ఏం చేయాలో తెలియక కామెడీ ఆక్టర్స్ ని పెట్టి కామెడీతో అలా అలా లాగించేసినట్టుంది.
ఇక ఫ్యామిలీ తో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఎం లేదు చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ లో పార్ట్ టు అని అనౌన్స్ చేసారు... ఏ ధైర్యంతో అలా చేసారో ఏమో. ఇక వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ బాగుంది. నెగిటివ్ షేడ్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాలో మేజర్ హైలెట్స్ సత్య కామెడీనే. బాగా నవ్వుకోవచ్చు. ఇక హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. థమన్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ ఏంటంటే రొటీన్ స్టోరీ, కాన్సెప్ట్ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. ఫైనల్ గా మూవీని కామెడీ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. ఇక రేటింగ్ ఇవ్వాలంటే నా రేటింగ్ 2.75/5
Above Average
Korean Kanakaraju Movie Review
కొరియన్ కనకరాజు.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కొరియన్ కనకరాజు ఈజ్ ఒకే టు వాచ్. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ మోర్ పాజిటివ్ గా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లూజ్ అవ్వడం, క్లైమాక్స్ వీక్ అవడం వల్ల ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించింది. అయితే నేను అనుకున్న దాంట్లో సత్య కామెడీ మాత్రం అల్టిమేట్ గా సా...
కొరియన్ కనకరాజు.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కొరియన్ కనకరాజు ఈజ్ ఒకే టు వాచ్. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద నా ఒపీనియన్ మోర్ పాజిటివ్ గా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లూజ్ అవ్వడం, క్లైమాక్స్ వీక్ అవడం వల్ల ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించింది. అయితే నేను అనుకున్న దాంట్లో సత్య కామెడీ మాత్రం అల్టిమేట్ గా సాటిస్ఫైచేస్తుంది.
అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. ఇండియా నుండి కొరియ కి సినిమా స్టోరీ షిఫ్ట్ అవడం కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. అండ్ సినిమాలో చాలా వరకు క్లారిటీ మిస్ అయింది. లాజిక్ లెస్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ కూడా అదిరింది. అలాగే రితిక నాయక్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. బట్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయింది. సినిమాకి హైలెట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం సత్యనే. ఓవరాల్ గా లైట్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని చూస్ చేసుకోవచ్చు.
Above Average
Korean Kanakaraju movie Review
వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతద...
వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతదే. కానీ దానికి పెనుగొండ, కొరియా బ్యాక్ డ్రాప్ తీసుకొని కొత్తగా రాసుకున్నారు.
సత్య కామెడీ ట్రాక్స్ కి మాత్రం ఫుల్ గా నవ్వుకుంటాం. కొరియాకు సంబంధించిన సీన్స్, హీరోయిన్ పాత్ర సెటప్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ సినిమాకు పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫుల్ గా నవ్వుకోడానికి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని. మొత్తంగా ‘కొరియన్ కనకరాజు’ ఓ కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ పెనుగొండలో ఉండే కనకరాజు అనే వ్యక్తి శరీరంలోకి వస్తే ఏం జరిగింది అని కామెడీ యాక్షన్ తో తెరకెక్కిన సినిమా.
Above Average
Korean kanakaraju movie review
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్ తో స్క్రీనింగ్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కొత్త ల...
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్ తో స్క్రీనింగ్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కొత్త లుక్,డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.హీరోయిన్ రితిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమాకు అసలు బలం మాత్రం సత్య (కిష్టప్ప) కామెడీనే.తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే మొదటి భాగం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో గ్రిప్ లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హారర్ కామెడీకి అవసరమైన ఊహించని ట్విస్టులు లేకపోవడం, భయపెట్టాల్సిన సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపకపోవడం నిరాశ కలిగిస్తాయి. మొత్తంగా 'కొరియన్ కనకరాజు' కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన వినోదాత్మక హారర్ కామెడీ కథనం మరింత బిగుతుగా ఉండి,ట్విస్టులు బలంగా ఉంటే ఫలితం మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ సత్య కామెడీ, తమన్ BGM, ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.
Above Average
Korean kanakaraju movie review
దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. అయి...
దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. అయితే ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలయ్యే సమయంలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సినిమా స్వరూపాన్నే మార్చేస్తుంది. ఎప్పుడైతే హీరో శరీరంలోకి ఆత్మ వస్తుందో అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది.
లాజిక్ లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అడుగులు వేశాడు. ముఖ్యంగా స్నేహితుడి పాత్రలో సత్య చేసే హడావిడి, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అంతా ఇంతా కాదు. అయితే వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత కథా గమనానికి ఇవ్వకపోవడం కొంత లోపం. కథలో బలమైన ఫ్లో ఉండదు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కార్టూన్ నెట్వర్క్ తరహాలో సాగడం కొంచెం నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ లో ఉన్న సాగతీతను తగ్గించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. లాజిక్స్ వెతక్కుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్లే వారికి ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు.. లాజిక్స్ తో పనిలేకుండా కాసేపు హాయిగా నవ్వుకునేలా ఉంది.
Above Average
Korean kanakaraju movie review
వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్ కనకరాజు` ఫైనల్ గా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ రొటీన్ సబ్జెక్టు పట్టుకుని దాని చుట్టూ కామెడీ ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే దాన్ని ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా కథ...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్ కనకరాజు` ఫైనల్ గా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ రొటీన్ సబ్జెక్టు పట్టుకుని దాని చుట్టూ కామెడీ ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే దాన్ని ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా కథ బలంగా లేదు. లాజిక్ లెస్ సీన్లు కూడా బాగా ఉన్నాయి.
ఇటు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించే సినిమా కోసమని ఈ కొరియన్ కనకరాజుకి వెళ్తే కాసేపే నవ్వించాడని తెలుస్తుంది. పైగా సినిమాకి క్లైమాక్స్ లో కెన్యా కనకరాజు అంటూ సీక్వెల్ ప్రకటించడం కూడా అంతగా నచ్చలేదు. ఫైనల్ గా కొరియన్ కనకరాజు సగమే మెప్పించాడు.
Hit
Korean kanakaraju movie review
హర్రర్ ని బేస్ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. తాజాగా `కొరియన్ కనకరాజు` ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ హర్రర్ కామెడీ చిత్రం. ఇందులో కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్ చేయడం...
హర్రర్ ని బేస్ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. తాజాగా `కొరియన్ కనకరాజు` ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ హర్రర్ కామెడీ చిత్రం. ఇందులో కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలావ్వాల్సిందే. ఇక క్లైమాక్స్ లో ఫైట్ అదిరిపోయింది.
అయితే సినిమా కథ బలంగా లేదు. దర్శకుడు తనకు అనుకూలంగా ప్లెక్సీబుల్‌గా మార్చుకున్నారు. లాజిక్ లను పట్టించుకోకుండా సినిమా తీశాడు. వరుణ్ తేజ్‌ని పక్కన పెట్టి దర్శకుడు సత్యతో సినిమాని నడిపించడం విశేషం. అతను కూడా అదే స్థాయిలో ఇరగదీశాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తంగా ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. యాక్షన్ ప్రధానంగా సాగే హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ `కొరియన్ కనకరాజు`. సరదాగా నవ్వుకోవడానికి మంచి ఆప్షన్.
Hit
Korean kanakaraju movie review
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. సత్య కామెడీ సినిమాకే హైలెట్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. థమన్ మ్యూజి...
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. సత్య కామెడీ సినిమాకే హైలెట్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. థమన్ మ్యూజిక్ చాలా బలమైంది.
ఇక ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ హిలేరియస్ గా నవ్విస్తుంది. కాకపోతే క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు ఆడియన్స్ ని మెప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే వాళ్లకు, లాజిక్ లు వెతికేవాళ్లకు ఈ సినిమా కొంతవరకు నిరాశపరచవచ్చు.
Above Average
Korean kanakaraju Movie Review
Mega Prince Varun Tej is going through a lean phase for quite sometime. He decided to keep experiments aside for a while and try entertainment genre. He teamed up with director Merlapaka Gandhi for a Horror comedy film, Korean Kanakaraju.Positives:Satya’s ComedyVarun Tej’s PerformanceNegatives:Predi...
Mega Prince Varun Tej is going through a lean phase for quite sometime. He decided to keep experiments aside for a while and try entertainment genre. He teamed up with director Merlapaka Gandhi for a Horror comedy film, Korean Kanakaraju.
Positives:
Satya’s Comedy
Varun Tej’s Performance
Negatives:
Predictability in the Story
Convenient Writing
Climax
Finally, Korean Kanakaraju is a mixed bag while it scores in the comedy department, it falters in the writing department. Try it but have your expectations in check.
Bottomline: High on laughs, Weak on script
Rating: 2.5/5
Above Average
Korean kanakaraju Movie Review
సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంల...
సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.
కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శకుడు మేర్లపాక గాంధీ రాత, తీత ఆశ్చర్యపరిచింది. హారర్ కామెడీలకు లాజిక్కులతో పని లేదు. స్క్రీన్ మీద మేజిక్ జరిగితే చాలు. ఈ 'కొరియన్ కనకరాజు'లో కామెడీ మేజిక్ జరిగింది. నవ్వులకు లోటు లేదు. నవ్వుల మేజిక్ కోసం అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళండి.
Hit
Korean kanakaraju movie review
కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. స...
కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను దర్శకుడు రక్తికట్టించాడు.
నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ చాలా ఈజ్ తో ఈ పాత్రను చేశాడు. ఆత్మ ఆవహించిన తర్వాత నటన కాస్తంత శ్రమతో కూడుకున్నదే అయినా... బాగానే కష్టపడ్డాడు. అయితే తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నటించి, ఈ సినిమానునిలబెట్టింది మాత్రం సత్యనే! నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. క్లయిమాక్స్ లో వి.ఎఫ్.ఎక్స్ కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ హారర్ కామెడీతో ఇటు వరుణ్ తేజ్, అటు మేర్లపాక గాంధీ ఖాతాలో హిట్ మూవీ పడిందనుకోవచ్చు.
Hit
Korean Kanakaraju Movie Review
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున...
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.
తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున్న ఈ సినిమా, దయ్యం ప్రధాన పాత్రలోకి ప్రవేశించి జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కథనం, స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు కనిపించినప్పటికీ, సినిమా మొత్తంగా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాగుతుంది.
మేర్లపాక గాంధీ తన తొలి రెండు చిత్రాల స్థాయిని అందుకోకపోయినా, ఈసారి ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను అందించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్.
Above Average
Korean Kanakaraju Movie Review
ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా.. కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చాలా త్వ...
ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. దర్శకుడు మేర్లపాక గాంధీది కూడా అదే పరిస్థితి. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా.. కొరియన్ కనకరాజు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చాలా త్వరగా ప్రేక్షకులకు మొనాటనీ తెప్పించేసిన జానర్లలో ‘హార్రర్ కామెడీ’ ఒకటి. లీడ్ క్యారెక్టర్లోకి దయ్యం దూరి.. అందరినీ ఒక ఆటాడుకునే కథలకు తెలుగులో లెక్కే లేదు. ‘కొరియన్ కనకరాజు’ కూడా ఇలాంటి సగటు హార్రర్ స్టోరీనే. అయితే దీన్ని జనరంజకంగా మలచడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ సక్సెస్ అయ్యాడు.
అయితే తన తొలి రెండు చిత్రాల స్థాయిలో కాకపోయినా మంచి ఎంటర్టైనరే తీశాడు దర్శకుడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కొన్ని కామెడీ ఎపిసోడ్లను భలేగా తీశాడు. ఉదాహరణకి SR ఎన్టీఆర్ ‘అమెచ్యూరిష్ పంచ్’ డైలాగ్ మీదా పంచ్ పేల్చడం తన సెన్సాఫ్ హ్యూమర్ కు నిదర్శనం. తన రాతలో-తీతలో కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక కంప్లీట్ ఫిల్మ్ తీయకపోయినప్పటికీ.. గత రెండు సినిమాల్లా ఈసారి బోర్ అయితే కొట్టించలేదు. చివరగా కొరియన్ కనకరాజు.. నవ్వించే ఫారిన్ దయ్యం.
Hit
Korean kanakaraju Movie Review
కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య ఆగస్ట్ 7న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్లు వేయడంతో ఒక రోజు ముందుగానే సందడి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం హవా మొదలైంది. సత్య కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కొరియన్ కనకరాజు సినిమాలోని కథ కొ...
కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య ఆగస్ట్ 7న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్లు వేయడంతో ఒక రోజు ముందుగానే సందడి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం హవా మొదలైంది. సత్య కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక కొరియన్ కనకరాజు సినిమాలోని కథ కొత్తదేమీ కాదు. మనం ఎన్నో సార్లు చూసిన కథకే.. కొత్తగా కొరియన్ టచ్ ఇచ్చి.. ఫుల్ ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ సారి కూడా తన కామెడీ ఫార్మాట్‌ను నమ్ముకుని కామెడీ, యాక్షన్ మూవీని తీశాడు.
ఓవరాల్‌గా ‘కొరియన్ కనకరాజు’ నవ్విస్తాడు. లాజిక్స్‌తో చూస్తే మాత్రం కొన్ని చోట్ల నిరాశపర్చే అవకాశం ఉంటుంది. రొటీన్, రెగ్యులర్, ప్రెడిక్టబుల్ స్టోరీనే అయినా కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. పాటలు, ఫైట్స్, కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ ఉంటే చాలు అని అనుకునే వారికి మాత్రం ‘కొరియన్ కనకరాజు’ బెస్ట్ ఆప్షన్. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Hit
Korean Kanakaraju movie Review
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో, ఫుల్ ఫన్ అండ్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. వరుణ్ తేజ్, సత్యల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. అలాగే రితికా నాయక్ కూ...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, హారర్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో, ఫుల్ ఫన్ అండ్ ఆక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. వరుణ్ తేజ్, సత్యల నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. అలాగే రితికా నాయక్ కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది.
ఐతే, స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, కొన్ని చోట్ల ప్లే స్లో కావడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీతో వరుణ్ తేజ్ కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.
Public Reviews
8 Avg: 6.8/10Above Average
Korean kanakaraju movie review
Watched Korean Kanakaraju and honestly, it was better than I expected. The story is routine, but the comedy works well. Varun Tej gives a decent performance, while Satya is the real highlight especially the Sr NTR “amateurish” scene. The climax could’ve been better, and some visuals felt like AI-gen...
Watched Korean Kanakaraju and honestly, it was better than I expected. The story is routine, but the comedy works well.
Varun Tej gives a decent performance, while Satya is the real highlight especially the Sr NTR “amateurish” scene.
The climax could’ve been better, and some visuals felt like AI-generated content.
Overall, nothing great, but a decent one-time entertainer.
Hit
Korean Kanakaraju movie review
When I watched the trailer of Korean Kanakaraju, I honestly felt like this movie was going to be a disaster too. I thought Varun Tej’s flop streak was going to continue.But after watching the movie.. this is not your usual entertainment! My friends and I literally laughed throughout the entire movie...
When I watched the trailer of Korean Kanakaraju, I honestly felt like this movie was going to be a disaster too. I thought Varun Tej’s flop streak was going to continue.
But after watching the movie.. this is not your usual entertainment!
My friends and I literally laughed throughout the entire movie. A lot of people said the movie has no story and that it’s just another routine film. But honestly, I enjoyed it, bro.
The story is definitely routine, but there’s a lot of fun in it. Varun Tej gives a decent performance, and his negative shades were also handled well. But I feel the director didn’t utilize that side of his character properly. Satya’s comedy is the biggest highlight, though!
Overall, the story may be routine, but if you go in just wanting to have fun, the movie definitely works. I enjoyed it !
Hit
Korean kanakaraju movie review
కొరియన్ కనకరాజు... సినిమా ట్రైలర్ చూసినపుడు ఈ సినిమా కూడా దొబ్బేటట్టు ఉందని అనిపించింది. వరుణ్ ప్లాప్స్ కంటిన్యూ అవుతాయి అనుకున్న. బట్ సినిమా చూసిన తర్వాత మామూలు ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు ఇది... మా ఫ్రెండ్స్ నేను సినిమా మొత్తం నవ్వుకున్నాం. చాలా మంది అన్నారు సినిమాల కథేం లేదు. అంతా రొట్ట సినిమా అన్...
కొరియన్ కనకరాజు... సినిమా ట్రైలర్ చూసినపుడు ఈ సినిమా కూడా దొబ్బేటట్టు ఉందని అనిపించింది. వరుణ్ ప్లాప్స్ కంటిన్యూ అవుతాయి అనుకున్న. బట్ సినిమా చూసిన తర్వాత మామూలు ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు ఇది... మా ఫ్రెండ్స్ నేను సినిమా మొత్తం నవ్వుకున్నాం. చాలా మంది అన్నారు సినిమాల కథేం లేదు. అంతా రొట్ట సినిమా అన్నారు కానీ, నాకైతే సినిమా నచ్చింది భాయ్.
సినిమా కథైతే రొటీన్ గానే ఉంది కానీ, మంచి ఫన్ ఉంది. వరుణ్ తేజ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ బాగుంది. నెగిటివ్ షేడ్స్ కూడా బాగున్నాయి. బట్ డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకోలేదు. కానీ సత్య కామెడీ హైలెట్ అసలు. స్పెషల్లీ memes లో వైరల్ అయిన ఆ sr ఎన్టీఆర్ ది ammeturish సూపర్ అసలు. కాకపోతే క్లైమాక్స్ నచ్చలేదు అంత. మొత్తం AI విజువల్స్ లెక్క అనిపించింది.
Hit
Korean kanakaraju movie review
weekend lo edo bore kodutundani edo oka cinemaki veldam ani korean kanakaraju movieki vellam family tho. first title chuste idedo action movie ayyundecchu... antha nachchademo anukunnam kani.. its a faktu comedy movie... chala rojula tarvatha maa familytho oka movie chala navvukuni enjoy chesam.. an...
weekend lo edo bore kodutundani edo oka cinemaki veldam ani korean kanakaraju movieki vellam family tho. first title chuste idedo action movie ayyundecchu... antha nachchademo anukunnam kani.. its a faktu comedy movie... chala rojula tarvatha maa familytho oka movie chala navvukuni enjoy chesam..
and cinema lo cast evarunnaro kooda first naku telidu.. because posters lo varun tej getup ni chusi kottha hero anukunna.. kani cinemalo baga entertain chesadu. and action kooda.. special ga comedian sathya comedy masthundi. heroin ayithe naku antha kanipinchaledu. climax baledu. familytho evaraina weekend movieki veldam ante nenu ee cinemane suggest chesta.
Above Average
Korean kanakaraju movie
day mottham bonala pandaga chesi relax ayyam. intlo edaina movie ki veldam ani ante korean kanakaraju cinemaki vellam familitho kalisi.. edo intlo force chesarani vellanu kaani nakaithe intrest lekunde ee cinema meeda. but cinema choostoo mottham theaterlo chala sepu navvukunnam. genral ga familytho...
day mottham bonala pandaga chesi relax ayyam. intlo edaina movie ki veldam ani ante korean kanakaraju cinemaki vellam familitho kalisi.. edo intlo force chesarani vellanu kaani nakaithe intrest lekunde ee cinema meeda.
but cinema choostoo mottham theaterlo chala sepu navvukunnam. genral ga familytho cinemaki velthe entertainment unte chalu anukuntam. ee cinemalo adi mastundi. varun tej decent ga act chesaru kani.. satya ayithe altimate asalu... kanipiste chalu konchem verity ga act chesinaa full fun asalu...
but story peddaga em ledu.. no logics, only fun.. anthe.. kani climax ayithe nachaledu.
Above Average
Korean kanakaraju movie review
వీకెండ్ లో బోర్ కొడుతోంది కదా అని సినిమాకెళ్దాం అని ఫ్రెండ్స్ అంటుంటే... అందరూ DC కి వెళ్దాం అన్నారు. నేను మాత్రం korean kanakaraju మూవీకి తీసుకెళ్ళాను. ముందు మా వాళ్ళు బావుండదురా... బాడ్ టాక్ ఒచ్చింది. రొట్ట కామెడీ ఏం లేదు. అన్నారు. బట్ ఫ్రెండ్స్ తో సరదాగా నవ్వుకునే సినిమాకెళ్దాం అంటాను నేను. అందుక...
వీకెండ్ లో బోర్ కొడుతోంది కదా అని సినిమాకెళ్దాం అని ఫ్రెండ్స్ అంటుంటే... అందరూ DC కి వెళ్దాం అన్నారు. నేను మాత్రం korean kanakaraju మూవీకి తీసుకెళ్ళాను. ముందు మా వాళ్ళు బావుండదురా... బాడ్ టాక్ ఒచ్చింది. రొట్ట కామెడీ ఏం లేదు. అన్నారు. బట్ ఫ్రెండ్స్ తో సరదాగా నవ్వుకునే సినిమాకెళ్దాం అంటాను నేను. అందుకే దీనికి తీసుకెళ్లాను. ముందు మా వాళ్ళు తిట్టుకున్నంత పని చేసారు. బట్ మూవీ అయిపోయాక మంచి పనిచేసావ్ రా ఈ సినిమాకి తీసుకొచ్చి అన్నారు. ఎందుకంటే మూవీ అయిపోయేదాకా నవ్వుతూనే ఉన్నారు. అంత హిలేరియస్ గా ఉంది సినిమా.
అండ్ సినిమా story మాత్రం రొటీన్ గానే ఉంది. బట్ కామెడీ అయితే ఫుల్ గా ఉంది. స్పెషల్లీ సత్య కనిపించిన ప్రతి frame కూడా అదిరిపోయింది. వరుణ్ తేజ్ did డీసెంట్ పెర్ఫార్మన్స్. సినిమాలో ఏముందిరా అంత అంటే ఏం లేదు. కాని నవ్వులు మాత్రం గ్యారెంటీ.
Hit
Korean kanakaraju movie review
weekend lo korean kanakaraju movie ki vellanu. movie chala bagundi. but only comedy ne undi cinema mottham. routeen story, routeen screenplay. but movie comedy was very nice. konthamandi cringe comedy antunnaru. kani konni movies ila untene andariki nachchutayi. vere valla sangathi naku telidu. naka...
weekend lo korean kanakaraju movie ki vellanu. movie chala bagundi. but only comedy ne undi cinema mottham. routeen story, routeen screenplay. but movie comedy was very nice.
konthamandi cringe comedy antunnaru. kani konni movies ila untene andariki nachchutayi. vere valla sangathi naku telidu. nakaithe nacchindi cinema. and varun tej did decent performed. but sathya was rocked in every frame.
Super Hit
Korean kanakaraju movie review
finally korean kanakaraju cinema ayithe chusocchanu.. friends tho ala weekend lo timepass ki cinema chuddam ani deside ayi vellam, and cinema ayithe naaku chala baga nacchindi. but social medialo chala negitivity chusanu.. edo rotta story ani, controvercy sences unnayani, and sathyani kooda sr ntr n...
finally korean kanakaraju cinema ayithe chusocchanu.. friends tho ala weekend lo timepass ki cinema chuddam ani deside ayi vellam, and cinema ayithe naaku chala baga nacchindi.
but social medialo chala negitivity chusanu.. edo rotta story ani, controvercy sences unnayani, and sathyani kooda sr ntr ni troll chesadani baga fire ayyaru valla fans.
but cinemalo nakaithe antha negitive ga em anipinchaledu. comedy super ga undi. routeen story undi ok. but nenaithe entertain ayyanu. ika sathya kooda eppatlage manchi meme comedy chesadu anthe gani, evarni troll cheyaledu. ento ee social media. overall ga nakaithe ee cinema worth watchable. finally varun tej ki manchi success ayithe vacchindi.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే.. పెనుగొండలో కనకరాజు (వరుణ్ తేజ్) ఓ భజన బృందాన్ని నడుపుతూ, తన స్నేహితుడైన కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే తన భజన బృందంతో కలిసి ఉంటాడు. మరోవైపు అక్కడే లోకల్ లో కియా కంపెనీలో వర్క్ చేసే చైత్ర (రితికా నాయక్) తో ప్రేమలో ఉంటాడు. తను కూడా కనకరాజుని ప్రేమిస్తుంది. అయితే మాములుగా కాస్త కోపిష్టి అయిన కనకరాజు, తన తండ్రి చేసిన అప్పు వల్ల చెంగారెడ్డి (సునీల్) మనుషులతో గొడవపడుతూ ఉంటాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం, కొరియా నుండి అనుకోకుండా ఇండియాకి ఓ కుక్ ద్వారా వచ్చిన ఓ కొరియన్ డాన్ అస్థికల వల్ల, కనకరాజు ఒంట్లోకి ఆ డాన్ ఆత్మ ప్రవేశిస్తుంది. దాంతో కథ మొత్తం మారిపోతుంది. ఈ క్రమంలో కనకరాజు ఒంట్లోకి ఆ ఆత్మ వచ్చాక కథ ఎలాంటి మలుపులు తీసుకుంది. అసలు ఆ డాన్ గతమేంటి? కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియా వచ్చాక ఏం జరిగింది. తిరిగి కనకరాజు ఇండియా ఎలా వచ్చాడు అనేది కథ.
Plus Points :
ఒక ఆత్మ మరో మనిషి (హీరో) శరీరంలో చేరే కాన్సెప్ట్ తో చాలా హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఈ కొరియన్ కనకరాజు కాన్సెప్ట్ కూడా అదే. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా తెరకెక్కిన ఈ మూవీ, అందులో దాదాపు సక్సెస్ అయింది. ఈ ‘‘కొరియన్ కనకరాజు’’ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్ర, దానికి రిలేటెడ్ గా ఆత్మ ట్రాక్ తో పాటు, సత్య కిష్టప్ప పాత్ర కూడా హిలేరియస్ గా ఉండి ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో వరుణ్ తేజ్ తన కామెడీ టైమింగ్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు. హీరోయిన్ రితికా నాయక్ కూడా తన గ్లామర్ పెర్ఫార్మన్స్ తోనే కాకుండా, నటన పరంగాను మెప్పించింది. ఇక కీ రోల్ లో నటించిన సత్య తన కామెడీతో సినిమాకి వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాడు. ఇక డైరెక్టర్ మేర్లపాక గాంధీ పాత కథనే తీసుకున్నా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
Minus Points :
అయితే హారర్ కామెడీ నేపథ్యంలో కొన్ని వందల చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అందువల్ల ప్యూర్ హారర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. పైగా లాజిక్స్ మాట్లాడితే ఈ సినిమా చూడలేం. అలాగే కథ వరకు చాలా రొటీన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ తో దాన్ని మేనేజ్ చేసేసాడు. కాకపోతే కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి.
Technical values :
ఇక కథకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ చిన్న కథనే తీసుకున్నా, దాన్ని ఆడియన్స్ కి నచ్చేటట్టు ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే ఇంకా రేసి గా ఉండాల్సింది. ఇక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ బాగానే డ్యూటీ చేసాడు. పాటలు యావరేజ్ గా ఉన్నా, బీజీఎమ్ అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా చేయాల్సింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
Final Review :
ఓవరాల్ గా "కొరియన్ కనకరాజు" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ డ్రామా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ అంతగా ఎక్కవు. అలాగని లాజిక్స్ ఆలోచిస్తూ సినిమా చూస్తే సినిమాని చూడలేం. రెగ్యులర్ స్టోరీయే అయినా, మంచి కామెడీని థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే ఆడియన్స్ కి ఈ వారం కొరియన్ కనకరాజు బెస్ట్ చాయిస్. మరి థియేటర్లో ఈ మూవీ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
Review Statistics
Review Average
You Might Also Like
మకుటం (Makutam)
2026
డీసీ (DC)
2026