Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
NagaBandham movie Review
By Thyview
సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే.
ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు.
NagaBandham movie Review
ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు.
ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు.
Naga Bandham movie Review
By Cinema Picha
ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా.
కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది.
Nagabandham movie Review
నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు.
ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.
Nagabandham movie Review
#Nagabandham An Outright Tedious Watch!
A film that starts with intrigue but progressively gets worse. The second half is even weaker, with outdated writing and scene staging that borders on parody. What should have been an engaging storyline turns into a tedious watch that’s hard to sit through and unbearable in many places.
Apart from the artwork, set design, and bits of the music, there’s very little to appreciate. There’s clearly effort behind the film, but when it fails to get the basics right, it leads to lifeless narration and a disappointing overall experience.
Outright Bad.
Rating: 1.75/5
NagaBandham Movie Review
By T2B Live
పేరుకు అప్ కమింగ్ యాక్టర్స్ తో తెరకేక్కినా కూడా బడ్జెట్ పరంగా మీడియం టు హై బడ్జెట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ బంధం(Naga Bandham Movie) మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఇప్పుడు రిలీజ్ అయింది. కాన్సెప్ట్ పరంగా అనేక లేయర్స్ తో తెరకెక్కిన కథ నాగ బంధం….సినిమా మొదలు అవ్వడం ఆసక్తిగానే స్టార్ట్ అయ్యి తర్వాత ట్రెజర్ హంట్ గా మారి అక్కడ నుండి అడ్వెంచర్ మోడ్ లోకి వెళ్లి తర్వాత హిస్టారికల్ గా మారి అక్కడ నుండి సనాతన ధర్మం కోసం సాదువులు ఏం చేశారు.? అక్కడ నుండి తిరిగి ప్రజెంట్ టైంకి వచ్చి క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది.
ఇక చాలా స్ట్రెంగ్త్ ఉన్న కథ ని చాలా బేసిక్ స్క్రీన్ ప్లే తో చెప్పడంతో సినిమా చాల స్లోగా సాగిపోయినట్లు అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రతీ చోట బడ్జెట్ బాగానే కనిపించింది. ఇక డైరెక్టర్ మంచి కథనే తీసుకున్నా కూడా చెప్పే క్రమంలో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో స్క్రీన్ ప్లే విషయంలో అంచనాలను అందుకోలేదు. కానీ కొన్ని సీన్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఓవరాల్ సినిమాలో కొన్ని ప్లస్ లు మైనస్ లు ఉండగా ఆడియన్స్ మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే నిరాశ కలుగుతుంది..తక్కువ ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం ఓపిక తెచ్చుకుని చూస్తె ఒకసారి సినిమా చూడొచ్చు అనిపించవచ్చు.
NagaBandham Movie Review
By 10TV Telugu
విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. నాగబంధం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. స్టార్ క్యాస్ట్ ఎవరూ లేకపోయినా భారీ బడ్జెట్, భారీ సెట్స్ వేసి, అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో డివోషనల్ థ్రిల్లర్ అని బాగా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.
కథ డివోషనల్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసారు కానీ అది ఫోకస్ గా నడిపించలేదు. హిందూ మతం, సనాతన ధర్మం గురించి ఓ రెండు మూడు సార్లు డైలాగ్స్ తో చెప్పించారు. సనాతన ధర్మం కథలో చూపించకుండా డైలాగ్స్ తో చెప్పడం విశేషం. ఇక నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్, అనంత పద్మనాభ స్వామి అని ప్రమోట్ చేయడంతో ఇదేదో ట్రెజర్ హంట్ అని ఓ రేంజ్ లో ఊహించుకొని వెళ్తాము. కానీ కథలో అంత స్కోప్ ఉన్నా అసలు కథ వదిలేసి అక్కర్లేని ట్రాక్స్, డైలాగ్స్ తో నడిపించారు. ఇక సినిమా అంతా నాగబంధం వెనక ఏముంటుంది అని నడిపించి అసలు అదేంటో ఎక్కడా చెప్పకుండానే సినిమా ముగించడం గమనార్హం. అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేదాకా ఎదురు చూడాల్సిందేనట. మొత్తంగా ‘నాగబంధం’ సినిమా బ్రహ్మ కమలం కోసం విలన్ చేసే ప్రయత్నం, దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అని సనాతన ధర్మం మెసేజ్ తో సాగుతుంది.
Naga Bandham movie Review
By Sakshi
నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే... నాగబంధం పుస్తకం, బ్రహ్మ కమలం, రంగనాథ స్వామి ఆలయం వంటి అంశాలతో మొదలయ్యే కథ ఫస్ట్ హాఫ్‌లో మంచి మిస్టరీ, అడ్వెంచర్ ఫీల్‌ను అందిస్తుంది. హీరో రుద్ర ప్రయాణం, విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ భాగానికి బలంగా నిలుస్తాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, పాట కథ వేగాన్ని కాస్త తగ్గిస్తాయి. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఆసక్తిని కొనసాగించడంలో సక్సెస్ అవుతుంది.
సెకండాఫ్‌లో మాత్రం సినిమా పూర్తిగా మరో దారిలో ప్రయాణిస్తుంది. హీరో తన గతం, నాగబంధం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే క్రమంలో కథ హిందూ పురాణాలు, సనాతన ధర్మం, ప్రాచీన రహస్యాల వైపు మళ్లుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించగా, ఎమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేవు. సినిమా అంతా నాగబంధం రహస్యాన్ని ఛేదించే ప్రయాణంగా చూపించినప్పటికీ, క్లైమాక్స్‌లో అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కథను నేరుగా పార్ట్-2 కోసం వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. దీంతో సినిమా పూర్తి అనుభూతిని ఇవ్వలేకపోతుంది. చివరగా మంచి కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, ఆసక్తికరమైన సెటప్ ఉన్నప్పటికీ, కథనం తడబడటం, నిడివి ఎక్కువ కావడం, క్లైమాక్స్‌ను పూర్తిగా సీక్వెల్‌పై ఆధారపడేలా ముగించడం వల్ల 'నాగబంధం' పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.
NagaBandham movie Review
By Great Andhra
మరణాన్ని జయించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నాగబంధం' ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ, అడ్వెంచర్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ అనూహ్యంగా మారడంతో ఆసక్తి తగ్గుతుంది. క్లైమాక్స్‌లో అసలు కథను పార్ట్-2 కోసం దాచేయడం నిరాశపరుస్తుంది. నిడివి కూడా సినిమాకు పెద్ద మైనస్. మొత్తంగా, భారీ ఆలోచనతో వచ్చిన 'నాగబంధం' కథ కంటే సెటప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సినిమాగా అనిపిస్తుంది.
సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో హింసాత్మకమైన సీన్లు, యాక్షన్ సీక్వెన్స్, భారీ హిందుత్వ డైలాగులు, అన్నిటికి మించి సాలిడ్ విజువల్స్ పై మేకర్స్ ఫోకస్ పెట్టారు గాని, అంతకంటే వాల్యుబుల్ అయిన కథ, కథనాలపై దృష్టి పెట్టలేదు. ప్రేక్షకుడ్ని సీట్లో కూర్చోబెట్టేవి ఇవే. కానీ మేకర్స్ అవే గాలికొదిలేశారు.
Nagabandham movie Review
By TV9 Telugu
పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాను అభిషేక్ నామా తెరకెక్కించారు.. అత్యంత భారీగా విజువల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా. తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కోసం తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.. దాన్ని విజువల్స్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు అభిషేక్ నామా.
అయితే ఈ మధ్య కాలంలో దేవుడి నేపథ్యం, సనాతన ధర్మం అనే అంశాలను వాడుకుంటూ వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. అదే ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చిన సినిమా నాగబంధం. ఇందులో కూడా మొదటి నుంచి హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాలు, వాటి సంరక్షణ చుట్టూనే కథ అల్లుకున్నారు. కథలో సహజంగా దైవభక్తి ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. నాగబంధంలో కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయితే.. మరికొన్ని మాత్రం అతికించినట్లు అనిపిస్తాయి. విరాట్ కర్ణ పర్లేదనిపించాడు. దర్శకుడు అభిషేక్ నామా కూడా తన వంతు బాధ్యత బాగానే పూర్తి చేసారు. కథపై ఇంకాస్త లోతుగా వెళ్లుంటే బాగుండేది. చివర్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చారు. ఓవరాల్ గా నాగబంధం.. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే పోరాటం..!
Nagabandham movie Review
By ABP Desam
హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇస్లాం చక్రవర్తులు దోచుకు వెళ్ళినట్టు చరిత్ర పుస్తకాల్లో చదివాం. అయితే ముస్లిం రాజుల అరాచకాలను తట్టుకుని మరీ అనంత పద్మనాభస్వామి వంటి ఆలయాల్లో నేలమాళిగలో బంగారు ఖజానాలు భద్రంగా ఉన్నట్టు వార్తల్లో చదివాం. అటువంటి నేపథ్యంలో నాగబంధం మహిమ, నాగ సాధువుల వీరోచిత పోరాటాన్ని చూపించిన సినిమా 'నాగబంధం'. అయితే దర్శకుడు అభిషేక్ నామా సరైన కథా, కథనాలు ఎంచుకోవడంలో విఫలమయ్యాడు.
ఇక సినిమా ప్రారంభం ఆసక్తి రేకెత్తిస్తుంది. హిమాలయాలు, రంగనాథ ఆలయం, బ్రహ్మ కమలం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా వెళుతుంది. ఎప్పుడైతే రుద్ర కుటుంబ కలహాలు కథలో ఫ్రంట్ సీట్ తీసుకున్నాయో... అప్పట్నుంచి అసలు కథ పక్కదారి పట్టింది. ఆసక్తి మాత్రం కించిత్ ఉండదు. 'నాగబంధం' సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ డిజైన్. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ లుక్ కనిపించడం వెనుక ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కోరాలాత్ పడిన కష్టం, ఆయన కృషి కనిపిస్తాయి. అభిషేక్ నామా కథలో విషయం ఉంది. మంచి సినిమా తీయాలనే ఆలోచన కనిపిస్తుంది. కానీ, ఆ కథ తెరపైకి వచ్చే క్రమంలో చాలా తప్పులు జరిగాయి. సన్నివేశాల నుంచి వీఎఫ్ఎక్స్ వరకు అడుగడుగునా కొన్ని లోపాలు కనిపిస్తాయి. ప్రేక్షకులలో ఆసక్తి పెంచేలా సినిమా ముందు సాగలేదు. డిజప్పాయింట్ చేసిందీ 'నాగబంధం'.
Naga Bandham Movie Review
విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్తి ఉన్న బ్రహ్మకమలం కోసం చేసే పోరాటమే ఈ సినిమా.
అయితే ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని,సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. బోల్తా పడుతున్నారు. అదే తేడా కొడుతుంది. సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మారుతున్నాయి. ఇప్పుడు వచ్చిన `నాగబంధం` పరిస్థితి కూడా ఇదే అని చెప్పొచ్చు. నాగబంధం ఇడిపించడం అనే పాయింట్ మీద ఈ మూవీ కథ సాగుతుంది. ఓవరాల్ గా దర్శకుడు అభిషేక్ నామా ఎంచుకున్న కథలో క్లారిటీ మిస్ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. స్క్రీన్ ప్లే పరంగానూ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సీన్ కి, మరో సీన్ కి సంబంధం లేదు, సింక్ అయ్యేలా లేవు. విజువల్స్ పరంగా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. బడ్జెట్ పరంగా రాజీ లేదు. కానీ మిగిలిన విషయంలో విఫలమయ్యారు. విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా, కథగా, సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమా. ఒక రకంగా ఇది ఆడియెన్స్ పై నాగబంధం ప్రయోగమని చెప్పొచ్చు.