సర్దార్ 2 (Sardar 2)
పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా డబుల్ బొనాంజా ఇవ్వనున్న సర్దార్ 2... సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు..
About This Movie
కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన సర్దార్ మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. నాలుగేళ్ళ కిందట విడుదలైన ఈ మూవీ కార్తీ కెరీర్లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా సర్దార్ 2 రాబోతుంది. దాదాపు రెండేళ్ల కిందటే మొదలైన ఈ మూవీ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడి ఇప్పుడు మొత్తం ఫినిష్ చేసుకుని తొందర్లోనే ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. తాజాగా మేకర్స్ సర్దార్ 2 టీజర్ ని రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ టీజర్ చూసాక ఫస్ట్ పార్ట్ ని మించి డబల్ డోస్ తో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా సర్దార్ 2 తెరకెక్కిందని తెలుస్తుంది. టీజర్ లో ఎస్.జె. సూర్య నెరేట్ చేసిన తీరు దానికి తగ్గట్టు కార్తీ యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజన్స్, విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. సామ్ CS ఇచ్చిన బీజీఎమ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇందులో కూడా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని చూపించగా, ఇద్దర్ని గూఢచారులుగానే సినిమాలో చూపించారు. బహుశా ఈసారి ఇద్దరూ కలిసి ఆర్మీ ఇచ్చే మిషన్ లో పాల్గొంటారని తెలుస్తుంది.
అయితే ఫస్ట్ పార్ట్ లో రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, రెండో పార్ట్ లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఎస్.జె. సూర్య ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ ని మించే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి జార్జి సి. విలియమ్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రిన్స్ పిక్చర్స్ & ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ చేస్తున్నారు.
You Might Also Like
మకుటం (Makutam)
2026
డీసీ (DC)
2026