Register as a Reviewer
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

19 Jun 2026
Overall Rating
6.8/10
17 Reviews

ఓటిటిలో ఫేమస్ అయిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ నుండి ఫైనల్ గా మూడో సిరీస్ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే తెరకెక్కింది.

Director: Sriraam Eragam
Cast: Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Jordar Sujata, Pavani Gangireddy, Deviyani Sharma, Rohini, Vennela kishore

Available in:

Reviews

What critics and the public are saying about సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save The Tigers Season 3)

Media Reviews

11 Avg: 6.6/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

Save The Tigers 3 review

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫి...

సేవ్ ది టైగర్స్ సీజన్ 3... ఈ సిరీస్ మూడో భాగం గురించి చెప్పుకుంటే... పాయింట్ కొస్తే... ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా వెళ్లాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఫన్ ఎపిసోడ్స్ తో బాగున్నాయి. సీజన్ 3 లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో మరింత ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎన్ని సీజన్స్ అయినా తీయొచ్చనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 


ఈ మూడు సీజన్లలో బెటర్ గా అనిపించింది ఈ మూడో సీజనే. 

సో ఓవరాల్ గా లీడ్ యాక్టర్స్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయొచ్చు.  

Jun 21, 2026 Watch
Tupaki
Tupaki Website
7

Hit

Save The Tigers 3 review

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్...

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివేశాలను నడిపిస్తూ.. అక్కడక్కడా కొంచెం ఎమోషన్ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏమంటుంది అనిపిస్తుంది కానీ.. ఈ టీం మాత్రం సీజన్-2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే.. వర్కవుట్ చేయడం కష్టమే అని.. ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈ సారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. మరోసారి ఎంగేజ్ చేసింది టీం.


కథ పరంగా వైవిధ్యం తోడవడం.. స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం.. జోకులు ఎప్పట్లాగే పేలడంతో మరోసారి ‘సేవ్ ద టైగర్స్’తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. ఇక రైటర్లతో పాటు దర్శకుడి పనితనానికి ప్రశంసలు దక్కుతాయి. వెంకటస్వామి మ్యూజిక్.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. గత రెండు సీజన్లలాగే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే. చివరగా ఈ టైగర్స్ మళ్లీ గర్జించారు


Jun 19, 2026 Read Review
One India
One India Website
7

Hit

Save The Tigers Season 3 Review

సేవ్ ది టైగర్స్ 3వ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిరీస్‌ను వన్-మ్యాన్ షోలా నడిపించారు. క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందించిన ఈ కాన్సెప్ట్‌...

సేవ్ ది టైగర్స్ 3వ సీజన్‌లో నటీనటులందరికీ రెండు విభిన్నమైన షేడ్స్ చూపించే అవకాశం దక్కడంతో అందరూ అద్భుతంగా నటించారు. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ఈ ముగ్గురూ తమ కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సిరీస్‌ను వన్-మ్యాన్ షోలా నడిపించారు. క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం అందించిన ఈ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం ఎక్కడా పట్టు తప్పకుండా తెరకెక్కించారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు పాత్రల పరిచయం, లోకాల మార్పిడితో సరదాగా సాగిపోతాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. మహిళా సాధికారత, భార్య అంటే భర్తకు బానిస కాదు అనే పాయింట్స్‌ను, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అండర్ స్టాండింగ్‌ను చాలా హుందాగా చూపించారు.


సరికొత్త 'వరల్డ్ స్వాపింగ్' కాన్సెప్ట్ ను తీసుకుని అభిమానులను అలరించారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్యల నటన అద్భుతంగా ఉంది. నవ్విస్తూనే భార్యాభర్తల బంధంపై ఇచ్చిన సందేశం చాలా బాగుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్ కు మేజర్ ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్ చూస్తే.. అక్కడక్కడా కాస్త హద్దులు దాటిన కొన్ని డైలాగ్స్ రియాలిటీ కంటే ఫిక్షన్ ఎక్కువగా ఉండటం.. ఫైనల్‌ గా మొదటి రెండు సీజన్ల క్రేజ్‌ను నిలబెడుతూ 'సేవ్ ది టైగర్స్ 3' హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌ లో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూడదగ్గ పర్‌ఫెక్ట్ సిరీస్ ఇది.


Jun 19, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
7

Hit

Save The Tigers 3 Review

భార్య – భర్తల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య గొడవలతో ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. దీంతో సీజన్ 3 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. రెండో వెబ్ సిరీస్ లో మూడు జంటల మధ్య ఏదో ఒక సమస్య పెట్టి ఎండ్ చేసారు. అక్కడ నుంచే ఈ సీజన్ కథ మొ...

భార్య – భర్తల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య గొడవలతో ముగ్గురు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సిరీస్ గా సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించింది. దీంతో సీజన్ 3 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. రెండో వెబ్ సిరీస్ లో మూడు జంటల మధ్య ఏదో ఒక సమస్య పెట్టి ఎండ్ చేసారు. అక్కడ నుంచే ఈ సీజన్ కథ మొదలవుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ సింపుల్ బ్యాంగ్ తో తెరకెక్కించారు.


ఎప్పట్లాగే భార్య – భర్తల రిలేషన్ మీద చివర్లో కాస్త ఎమోషనల్ గా వర్కౌట్ చేయాలని ప్రయత్నించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడా నవ్వుతూ చూడొచ్చు. ఓపెనింగ్ లోనే గంట రవి, రాహుల్, విక్రమ్.. ఒకేలా ఉన్న ఇద్దరు ఇద్దర్ని చూపించి ఆశ్చర్యపరిచి అసలు కథలోకి తీసుకెళ్లారు. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కాస్త సాగదీశారు. చివరకు పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఎవరు ఏం చేయలేరు అనే రొటీన్ ఎండ్ మాములే. మొత్తంగా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ వెబ్ సిరీస్ కూడా మొదటి రెండు సీజన్స్ లాగే నవ్విస్తుంది, కానీ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. హ్యాపీగా చూసేయచ్చు. ఈ సిరీస్ కి 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.


Jun 19, 2026 Read Review
6

Above Average

Save The Tigers Season 3 Review

మూడో సీజన్‌ సిరీస్‌.. ప్రియదర్శి, అభినవ్‌, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడంతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫన్‌ మొదటి సీన్‌ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గురు కనిపించే ట్విస్ట్ అదిరిపోయింది. అది ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌లో అస్సలు ఊహించరు. అదే పెద్ద ట్విస్ట్...

మూడో సీజన్‌ సిరీస్‌.. ప్రియదర్శి, అభినవ్‌, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడంతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఫన్‌ మొదటి సీన్‌ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గురు కనిపించే ట్విస్ట్ అదిరిపోయింది. అది ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌లో అస్సలు ఊహించరు. అదే పెద్ద ట్విస్ట్ గా చెప్పొచ్చు. మూడు ఎపిసోడ్ల వరకు కొంత ఫన్‌, కొంత కన్‌ఫ్యూజన్‌ అనేలా వెళ్తుంది. ఇక నాల్గో సీజన్‌ నుంచి కథ మారిపోతుంది. 


ఈ సీజన్లో ఫన్‌ డోస్‌ పెరిగింది. ట్విస్ట్ లు రివీల్‌ అవ్వడం, పాత్రల్లో రియలైజేషన్‌ రావడం, ఒక ప్రపంచంలో ఈ ముగ్గురు చేసిన తప్పులను కొత్తగా వచ్చిన వారు సరిచేసే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రైటింగ్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. డైలాగ్‌ నవ్వించడంతోపాటు ఆలోచింప చేస్తాయి. దర్శకత్వం సినిమాకి మరో ప్లస్‌ అని చెప్పొచ్చు. ట్విస్ట్ లతో, కామెడీతో, ఎమోషన్స్ తో ఇలా అన్ని మిక్స్ చేసి దీన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారని చెప్పొచ్చు. ఫైనల్‌గా భార్యాభర్తలు చూడాల్సిన సిరీస్‌. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇదొక మంచి టైమ్‌ పాస్‌ ఎంటర్‌టైనింగ్‌ సిరీస్‌ అవుతుంది.

Jun 21, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Save The Tiger Season 3 series review

ఈ మూడో సీజన్‌కు శ్రీరామ్ ఎరగం కొత్తగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మొదటి రెండు సీజన్లను సూపర్ హిట్ చేసిన కామెడీ ఫార్ములాను ఆయన ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఈసారి కథకు కొద్దిగా ఫాంటసీ (దేవుళ్లు భూమి మీదకు రావడం) టచ్ ఇవ్వడం వల్ల సిరీస్‌కి మంచి కొత్తదనం వచ్చింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి నవ...

ఈ మూడో సీజన్‌కు శ్రీరామ్ ఎరగం కొత్తగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మొదటి రెండు సీజన్లను సూపర్ హిట్ చేసిన కామెడీ ఫార్ములాను ఆయన ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఈసారి కథకు కొద్దిగా ఫాంటసీ (దేవుళ్లు భూమి మీదకు రావడం) టచ్ ఇవ్వడం వల్ల సిరీస్‌కి మంచి కొత్తదనం వచ్చింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి నవ్వులు పంచుతుంది.


అయితే కథనంలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఒకటి రెండు ఎపిసోడ్లు బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. సీన్స్ కాస్త నెమ్మదిగా బోర్ కొట్టేలా సాగుతాయి. స్క్రీన్‌ప్లే ఇంకాస్త క్రిస్పీగా, వేగంగా ఉంటే బాగుండేది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఇందులో బూతు పదాలు మితిమీరి వాడారు. మధ్యలో కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి ఉంటే సిరీస్ మరింత స్పీడ్‌ గా ఉండేది. కొత్త దర్శకుడు శ్రీరామ్ కొన్ని చిన్న చిన్న ల్యాగ్ సమస్యలను పక్కన పెడితే ఫ్రాంచైజీకి ఉన్న పేరును నిలబెట్టి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఓవరాల్ గా సేవ్ ద టైగర్స్ 3.. కొంచెం ఫాంటసీ, కొంచెం ఫ్రస్ట్రేషన్, బోలెడంత ఫన్..!

Jun 19, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
7

Hit

Save The Tigers Season 3 review

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ ఎలిమెంట్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా తీర్చిదిద్దారు. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్, డ్యూయల్ రోల్స్‌తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణతో పాటు వారి జోడీలు రెండు భిన్నమైన షేడ్స్‌లో ఆకట్టుకున్నారు. మొదటి కొన్ని ఎపిసోడ్...

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ ఎలిమెంట్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా తీర్చిదిద్దారు. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్, డ్యూయల్ రోల్స్‌తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణతో పాటు వారి జోడీలు రెండు భిన్నమైన షేడ్స్‌లో ఆకట్టుకున్నారు. మొదటి కొన్ని ఎపిసోడ్లలో కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా, కథ ముందుకు సాగేకొద్దీ ట్విస్టులు, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్‌లో మంచి నవ్వులు పంచుతూ సీజన్‌ను ముగించారు. 


టెక్నికల్ విషయానికి వస్తే... క్రియేటివ్ మహి.వి.రాఘవ్ మరోసారి అదరగొట్టారు. ప్రదీప్ అద్వైతం తో కలిసి మళ్ళీ హిట్ కొట్టారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. తొలి రెండు సీజన్లు నచ్చిన వారికి ఈ సీజన్ కూడా నిరాశ కలిగించదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఎంటర్‌టైనర్ ఇది. 

Jun 21, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Save The Tigers Season 3 web series review

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ టచ్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా ప్రజెంట్ చేశారు. డ్యూయల్ రోల్స్, ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌ తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా... క్లైమాక్స్‌ కి వచ్చే సరికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. మొదటి రెండు సీజన్...

భార్యాభర్తల రిలేషన్‌షిప్ కామెడీకి ఈసారి ఫాంటసీ టచ్ జోడించి 'సేవ్ ద టైగర్స్ 3'ను కొత్తగా ప్రజెంట్ చేశారు. డ్యూయల్ రోల్స్, ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌ తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట కామెడీ కాస్త తగ్గినట్టు అనిపించినా... క్లైమాక్స్‌ కి వచ్చే సరికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. మొదటి రెండు సీజన్లు నచ్చిన వారికి ఇది కూడా పక్కా బింజ్-వాచ్. భార్య భర్తల రిలేషన్షిప్ గురించి చిన్న మెసేజ్ కూడా ఈ సిరీస్ లో ఇచ్చారు. ఫైనల్లీ ఈ వీకెండ్ లో హ్యాపీగా నవ్వుకోవడానికి సేవ్ ది టైగర్స్ బెస్ట్ ఆప్షన్. 

Jun 21, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Save The Tigers Season 3 review

'సేవ్ ద టైగర్స్' మొదటి రెండు సీజన్లలో భార్యాభర్తల మధ్య కథ నడిపిన క్రియేటర్లు మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం... ఈసారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. తరహాలో హీరోలను ఓ లోకం నుంచి మరో లోకానికి పంపారు. ఒకరి స్థానంలో అచ్చంగా అటువంటి మనిషి మరొకరిని దింపారు. దాంతో కథకు ఫ్రెష్‌నెస్ యాడ్ అయ్యింది.'సేవ్ ద టై...

'సేవ్ ద టైగర్స్' మొదటి రెండు సీజన్లలో భార్యాభర్తల మధ్య కథ నడిపిన క్రియేటర్లు మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం... ఈసారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. తరహాలో హీరోలను ఓ లోకం నుంచి మరో లోకానికి పంపారు. ఒకరి స్థానంలో అచ్చంగా అటువంటి మనిషి మరొకరిని దింపారు. దాంతో కథకు ఫ్రెష్‌నెస్ యాడ్ అయ్యింది.

'సేవ్ ద టైగర్స్ 2' స్పెషాలిటీ ఏమిటంటే... మెయిన్ లీడ్స్ ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవియాని శర్మకు డ్యూయల్ రోల్ చేసే అవకాశం లభించింది. ఓ లోకంలో పాత్రలు మరొక లోకంలోకి వెళ్లిన తర్వాత... సిరీస్ చూసే వీక్షకులకు ఎవరేమిటి? అనే క్లారిటీ ఉంటుంది. కానీ, తెరపై పాత్రలకు మాత్రం తెలియదు. అందువల్ల ఏం జరుగుతుందో అనే కుతూహలం ఉంటుంది. దాన్ని క్రియేటర్లు మహి వి రాఘవ్ & ప్రదీప్ అద్వైతం, దర్శకుడు శ్రీరామ్ ఎర‌గం బాగా వాడుకున్నారు.


భార్యలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ఆశించే భర్తల ఈగోను శాటిస్‌ఫై చేసే సిరీస్ 'సేవ్ ద టైగర్స్ 3'. ఈసారి మెయిన్ కాన్సెప్ట్ అదొక్కటే కాదు... ఫాంటసీ అంశాలతో కథను కొత్త మలుపు తిప్పారు క్రియేటర్స్. అందువల్ల, మొదట కామెడీ కాస్త బ్యాక్ సీటు తీసుకుందని అనిపించినా... ఎండింగ్ వచ్చేసరికి బాగా నవ్వించారు. ఆరు ఎపిసోడ్స్ రన్ టైమ్ చూస్తే... మూడు గంటల సినిమా చూసినంత. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంజాయ్ చేయవచ్చు. మొదటి రెండు సీజన్లు నచ్చిన వీక్షకులకు మూడో సీజన్ కూడా తప్పకుండా నచ్చుతుంది.

Jun 21, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Save The Tigers Season 3 Review

గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకు...

గతంలో రెండు సీజన్లు ఆడియెన్స్ ఆదరణతో మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈ సిరీస్ మూడో సీజన్‌పై పెరిగిన అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు శ్రీరామ్ తన కంటెంట్‌ను బాగా డిజైన్ చేసుకొన్నారనేది ఆయన సృష్టించిన డ్రామాతో స్పష్టమైంది. చాలా సీన్లు ఫ్రెష్‌గా, ఫన్‌తో సాగాయి. ఎక్కువ మంది టాలెంటెడ్ ఆర్టిస్టుల నుంచి దర్శకుడు టాలెంట్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంత స్లోగా నడుస్తాయనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి ఎపిసోడ్స్‌ను హిలేరియస్‌గా అందించారు.


ఇక డిఫరెంట్ షేడ్స్ ఉన్న హైదరాబాదీగా ప్రియదర్శి తన పాత్రలో ఎప్పటిలానే ఒదిగిపోయాడు. అమాయక భర్త, లవర్ బాయ్‌గా చైతన్య కృష్ణ మరోసారి మంచి నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్గుగా హావభావాలు, ఎమోషన్స్ చక్కగా పండించాడు. ఇక అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ వల్ల షో ఫన్ రైడ్‌గా మారింది. తన సహజ శైలికి తగినట్టుగా ఆయన వేసిన పంచులు నవ్వులు పువ్వులు పూయించాయి. ఓటీటీలోనే కాబట్టి.. తగినంత సమయాన్ని కేటాయించుకొని చూడండి.. మంచి అనుభూతి కలుగుతుంది.

Jun 27, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Save The Tigers Season 3 Web Series Review

ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి మరియు కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జోడీలు మరోసారి తమద...

ప్రముఖ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ సీజన్ 3 ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం – పావని గంగిరెడ్డి మరియు కృష్ణ చైతన్య – దేవియాని శర్మ జోడీలు మరోసారి తమదైన గందరగోళం, ఎమోషన్స్ మరియు హిలేరియస్ కామెడీతో అలరించడానికి సిద్ధమయ్యారు.


కొత్త దర్శకుడు శ్రీరామ్ ఎరగం వచ్చినప్పటికీ ‘సేవ్ ది టైగర్స్ 3’లో ఆ మార్పు ఎక్కడా కనిపించదు. మొదటి రెండు సీజన్లను పాపులర్ చేసిన అదే వినోదాన్ని ఈ సీజన్ కూడా కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే.. ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ ఈ సిరీస్ యొక్క విన్నింగ్ ఫార్ములాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య మరోసారి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. అయితే, కొన్ని పోర్షన్స్ మాత్రం సాగదీతగా ఉండటం, బూతులు ఎక్కువగా వాడటం కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టాయి. కృష్ణ చైతన్యకు సంబంధించి కొన్ని కామెడీ సీన్స్ కూడా అందరినీ మెప్పించవు. గత రెండు సీజన్‌లను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ వీకెండ్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ని ట్రై చేయవచ్చు.


Jun 19, 2026 Read Review

Public Reviews

6 Avg: 7.0/10
S
Shiva Teachers and Educators
7

Hit

Save The Tigers Season 3 review

The winning formula continues in Save The Tigers Season 3.


Strong performances, hilarious comedy, and a fresh fantasy angle make it entertaining.


Despite some pacing issues and over-the-top adult jokes, it's an enjoyable watch for movie lovers and familys

Jun 25, 2026
T
Talari Snehalatha IT Employee
6

Above Average

Save The Tigers Season 3 Review

Save the Tigers Season 3 is a decent watch with a few entertaining moments.The fantasy angle adds some freshness, but the comedy doesn't hit as consistently as the earlier seasons. Priyadarshi, Abhinav Gomatam, and Rohini deliver good performances and keep the show engaging. While the story has a f...

Save the Tigers Season 3 is a decent watch with a few entertaining moments.

The fantasy angle adds some freshness, but the comedy doesn't hit as consistently as the earlier seasons.

Priyadarshi, Abhinav Gomatam, and Rohini deliver good performances and keep the show engaging. While the story has a few slow patches, the final episodes are better. Overall, it's an average family entertainer that fans of the series can watch once.

Jun 21, 2026
A
Arige Srikanth Private Employee
7

Hit

Save The Tigers Season 3 review

Finally watched Save The Tigers Season 3 after waiting for so long. I heard mixed opinions, but I didn't mind them. If a series keeps me entertained, that's enough for me. Priyadarshi, Abhinav Gomatam, and Rohini steal the show with their hilarious performances. A fun entertainer with plenty of...

Finally watched Save The Tigers Season 3 after waiting for so long. I heard mixed opinions, but I didn't mind them. If a series keeps me entertained, that's enough for me. 


Priyadarshi, Abhinav Gomatam, and Rohini steal the show with their hilarious performances. A fun entertainer with plenty of laughs and solid repeat-watch value!

Jun 22, 2026
V
Velugubantla Ramadurga Private Employee
7

Hit

Save The Tigers Season 3 review

I was waiting for Save the Tigers Season 3 for a long time, and finally watched it on OTT yesterday. Before watching, I heard mixed reviews saying it wasn't as good as the previous seasons. But for me, if a show entertains, I don't overthink the logic.And yes, I had a great time! Priyadarshi, Abhina...

I was waiting for Save the Tigers Season 3 for a long time, and finally watched it on OTT yesterday. Before watching, I heard mixed reviews saying it wasn't as good as the previous seasons. But for me, if a show entertains, I don't overthink the logic.


And yes, I had a great time! Priyadarshi, Abhinav Gomatam, and Rohini absolutely nailed the comedy and delivered some hilarious moments. It's a fun, feel-good series with excellent repeat value. Definitely worth watching if you're looking for pure entertainment.

Jun 21, 2026
A
8

Super Hit

Save The Tigers Season 3 review

save the tigers.. third season kosam chala rojula nundi wait chesa... finally ott lo ninne chusa... dani kante mundu konthamandi antha ledu.. ade sodi undi annaru kani... naku entertainment unte chalu logiclu thokka pattinchukonu...ippudu kooda edo timepass kosam chusa.. and nenu baga entertain...

save the tigers.. third season kosam chala rojula nundi wait chesa... finally ott lo ninne chusa... dani kante mundu konthamandi antha ledu.. ade sodi undi annaru kani... naku entertainment unte chalu logiclu thokka pattinchukonu...


ippudu kooda edo timepass kosam chusa.. 

and nenu baga entertain ayya kooda. priyadarshi, abhinav gomatam... and rohini ultimate fun genrate chesaru. and repeat value series idi 

Jun 20, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
7

Hit

Save The Tigers Season 3 review

థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్...

థియేటర్ కి సినిమాకెళ్లే టైం లేక ఇంట్లో ఏం చూద్దామా అని think చేస్తున్న టైం లో హాట్స్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కూడా వచ్చిందని తెలిసి.. మొబైల్ లో చూసేసా.. బేసిగ్గా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా కాబట్టి... ఈ సిరీస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 సీజన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ హోప్ తోనే ఈ సిరీస్ కూడా చూసేసా... అండ్ ఈ సీజన్ ఫస్ట్, రెండు సీజన్ల కంటే బాగా నచ్చింది కూడా... 


ప్రియదర్శి, అభినవ్ గోమఠం బానే నవ్వించారు. బట్ చైతన్య కృష్ణ పెర్ఫార్మన్స్ అల్టిమేట్ అసలు.. అండ్ రోహిణి కూడా.. కాకపోతే ఇంట్లో ఫ్యామిలీతో చేసేటపుడు.. కొన్ని బూతు డైలాగ్స్ ఇబ్బంది పెట్టినయి.. ఓవరాల్ గా బానే ఎంజాయ్ చేశా.. 


Jun 21, 2026

About This Movie

Story : కథ విషయానికి వస్తే... రెండో సీజన్ కి కొనసాగింపుగా... హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) తో గొడవ తర్వాత, భార్య హైమా (జోర్దార్ సుజాత)తో కలిసి గంటా రవి (ప్రియదర్శి) గేటెడ్ కమ్యూనిటీకి షిష్ట్ అవుతాడు. ఇటు భార్య రేఖ (దేవయాని)తో విడాకులు తీసుకునేందుకు విక్రమ్ (చైతన్య కృష్ణ)సిద్దమవుతాడు. మరో సైడ్ భార్య మాధురి (పావని గంగిరెడ్డి) పోరుపడలేక ఇష్టం లేని జాబ్ చేయడానికి రాహుల్ (అభినవ్ గోమటం) రెడీ అవుతాడు. ఇలా వీళ్ళ లైఫ్ లో అశాంతి, అసహనం కొనసాగుతూనే ఉంటుండగా, ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఛేంజ్ అవుతుంది. దాని వల్ల ఈ ముగ్గురి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోస్తూ చేసుకున్నాయనేది కథ. 

 

Plus Points :

సేవ్ ది టైగర్స్ ఫస్ట్ 2 పార్ట్స్  ఆడియన్స్ ని ఎంతలా ఎంటర్టైన్ చేశాయో తెలిసిందే.  ఈ మూడో సీజన్ పై బజ్ క్రియేట్ అవడానికి మొదటి రెండు సీజన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇక ఈ మూడో సీజన్ ని కొత్త డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేసినా, ముందు సీజన్స్ కి ఈ మూడో పార్ట్ కి డిఫరెన్స్ కనిపించదు. అంటే ముందు సీజన్స్ లో ఎంటర్టైన్మెంట్ ని ఈ సీజన్లో కూడా అందించారు. అదే దీనికి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇక ఎప్పట్లాగే ప్రియదర్శి, అభినవ్ గోమఠం తమ కామెడీ టైమింగ్ తో  ఆకట్టుకోగా, ఈసారి కృష్ణ చైతన్య తన పెర్ఫార్మన్స్ తో అందర్నీ మించిపోయాడు. ఈ సీజన్లో కృష్ణ చైతన్య క్యారక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. అలాగే జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో పాటు, రోహిణి కామెడీ టైమింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. అన్నిటికి మించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా ఈ మూడో సీజన్ కూడా వచ్చేయగా, అందులో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

 

Minus Points :

ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా వచ్చిన ఈ సీజన్ 3 అందులో సక్సెస్ అయింది కానీ, కథ పరంగా కొత్తదనం లేకపోవడం వల్ల ఫ్రెష్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. అలాగే ఫ్యామిలీస్ ఇష్టపడిన ఈ సిరీస్ లో ఈ మూడో సీజన్ లో అక్కడక్కడా కొన్ని బూతు పదాల వాడకం, మరి కొన్ని ఎఫైర్స్ వంటి ప్రస్తావనలు రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోయే  అవకాశం ఉంది. అలాగే కొన్ని సీన్స్ మరీ సాగదీస్తూ ఉండడం వల్ల ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త టైట్‌ గా ఉంటే బాగుంటుందన్న ఫీల్ వస్తుంది. ఇక వెన్నెల కిషోర్‌ లాంటి స్టార్ కమెడియన్ ని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్ కి ఎంతగా ఎక్కేలా లేవు.

 

Technical values :

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... దర్శకుడు శ్రీరామ్ ఎరగం ఈ మూడో సీజన్ ని మొదటి రెండు సీజన్లకి ఏమాత్రం తగ్గకుండా, తన డైరెక్షన్ తో ఎంటర్టైన్ చేసేలా మెప్పించాడు. రైటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. అజయ్ అరసాడ మ్యూజిక్ ప్లస్ అయింది. 

FinalReview :

ఇక ఓవరాల్ గా... సేవ్ ది టైగర్స్ సీజన్ 3 మూడోసారి కూడా ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య మళ్ళీ తమ స్టయిల్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగా, వెన్నెల కిషోర్, రోహిణి కామెడీ టైమింగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. కాకపోతే ఈ సీజన్లో కాస్త బూతు డైలాగ్స్ ని తగ్గించి ఉంటే, మరింత బాగుండేది. ఓవరాల్ గా సేవ్ ది టైగర్స్ రెగ్యులర్ మూవీ లివర్స్ మొహమాటం లేకుండా ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Review Statistics

6.8
Overall Rating
Avg. of all reviews
17
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
6.6/10
Public
7.0/10
Why MRO?