418 (#418)
#418 Movie : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ మూవీ "418 The Movie". కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించగా లేటెస్ట్ గా అక్టోబర్ 23న విడుదలై థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
Reviews
What critics and the public are saying about 418 (#418)
Media Reviews
15 Avg: 5.1/10Not Good
418 Movie review
418 మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. అమ్మ బాబోయ్ దీన్ని మామూలుగా లేపలేదు బ్రో. సీరియస్లీ చెప్తున్నా ట్రైలర్ రియాక్షన్ కూడా చేయలేదు నేను. సినిమా చూసాక నాకైతే నచ్చలేదు. జెనరల్ గా నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. చిన్నగా తక్కువ హారర్ ఉన్న నన్ను భయపెట్టు అని వెయిట్ చేసేటట్టు చేసిందన్నమాట. అండ్ ఇది కన్నడ...
418 మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. అమ్మ బాబోయ్ దీన్ని మామూలుగా లేపలేదు బ్రో. సీరియస్లీ చెప్తున్నా ట్రైలర్ రియాక్షన్ కూడా చేయలేదు నేను. సినిమా చూసాక నాకైతే నచ్చలేదు. జెనరల్ గా నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. చిన్నగా తక్కువ హారర్ ఉన్న నన్ను భయపెట్టు అని వెయిట్ చేసేటట్టు చేసిందన్నమాట. అండ్ ఇది కన్నడ ఫిలిమో తెలుగు ఫిలిమో కూడా అర్థం కావట్లేదు బ్రో. సినిమా అంతా అట్లే ఉంటది. అండ్ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉండాలి అసలు ఏం జరిగింది నువ్వు ఇంతసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన దానికి మెయిన్ స్టోరీ ఏంటని చెప్పడానికి వాడు వెళ్తా అన్నట్టు ఉంటది. ఆ స్టోరీ చాలా ఎమోషనల్ గా చూపెట్టొచ్చు కామెడీ అయిపోయింది.
సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంతా అసలు దేనికి వర్కౌట్ కాలేదు. పర్ఫార్మెన్స్ బాగున్నాయి అనుకునే లోపే ఎడిట్ చేసి పాడు చేస్తారు. కట్ చేస్తే టోటల్ హారర్ ఎలిమెంట్ పెట్టినట్టు క్లైమాక్స్ పీక్ క్లైమాక్స్ అంతా పెడతాడు. దీనికన్నా బ్రో షార్ట్ ఫిలిమ్స్ బెటర్. ఇదంతా పక్కన అయితే మాత్రం ఇంత లేపుడు అంత లేపుడు రా అసలు ఏ నాకు హారర్ మూవీస్ అంటే భయం అట్లా అయినా గాని పోదాం రా అని వెళ్తే ఎలాగెలాగో ఉంది. ఫైనల్ గా నాకైతే నచ్చలేదు. ఇక ఈరోజు ఫౌజి అప్డేట్ వస్తది నేనెళ్తున్నా.. ఫైనల్ గా 418 నాకైతే నచ్చలేదు. మీకెలా అనిపించిందో ఏమో మరి.
Above Average
418 Movie Review
Movie review of the film 480. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్స్ అనే ఒక టైటిల్ కార్డు అండ్ దానితో పాటు ఈ సినిమా చుట్టూ వస్తున్న ఆ హైప్ అనేది మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసాయి. ఈ సినిమా నుంచి నేను రెండే రెండు ఎక్స్పెక్ట్ చేశాను. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ టెర్రిఫింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనుకున్నా. మంచి...
Movie review of the film 480. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్స్ అనే ఒక టైటిల్ కార్డు అండ్ దానితో పాటు ఈ సినిమా చుట్టూ వస్తున్న ఆ హైప్ అనేది మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసాయి. ఈ సినిమా నుంచి నేను రెండే రెండు ఎక్స్పెక్ట్ చేశాను. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ టెర్రిఫింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనుకున్నా. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఏ ఉంది, కొంచెం యూనిక్ గానే ఉంటది. కానీ హారర్ మాత్రం అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. మనం ఈ హారర్ సినిమాలు ఇవన్నీ చూసి చూసి పెద్దగా ఇంపాక్ట్ లేదో ఏమో గాని అంతగా ఏం భయం అనిపించలేదు. అంటే భయం అనగానే ఏదో దారుణంగా ఉండాలి, దయ్యం పెద్దగా గాలిలో ఎగురుతూ తిరగాలి అని ఇలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక మంచి సీన్. అలా చూసుకుంటే పెద్దగా వర్క్ అవుట్ అయినట్టు అనిపించలేదు.
480 అనే రూమ్ చుట్టూ చూపించినంత ఇంపాక్ట్ సినిమాలో స్టోరీ రివీల్ అయిన తర్వాత పెద్దగా అనిపించదు. ఆ స్టోరీ పార్ట్ ఏదైతే ఉందో అది అయితే యూనిక్ గా బాగానే డిజైన్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, బాగుంది. మూవీలో సౌండ్ డిజైన్ అండ్ కొన్ని చోట్ల జంప్ స్కేర్స్ బాగా వర్క్ అవుట్ అయినాయి. వాటి వల్లనే కొత్త కొత్త ఇంపాక్ట్ ఉంది. యాక్టింగ్ వైస్ గా అందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా చెప్పింది ఏంటంటే ఒక మంచి ఇంటెన్సిటీని క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. పర్లేదు ఒక లెవెల్ వరకు బాగానే చేయగలిగారు. ఈ వీకెండ్ అట్లా సరదాగా మంచి సౌండ్ ఎఫెక్ట్స్, ఒక యూనిక్ స్టోరీ లైన్ తో చూడాలనుకుంటే ఈ సినిమాని మీరు కచ్చితంగా ట్రై చేయొచ్చు.
Above Average
418 movie review
వెళ్లొద్దు వెళ్లొద్దు అనుకుంటూనే 418 మూవీ సెకండ్ షో కి వెళ్లాం. ఒక్కో జంప్ స్కేర్ కి భయమేసింది. నైటే రివ్యూ చెప్తున్నా, పడుకుంటానో లేదో అని భయంగా ఉంది. ఇవన్నీ కాదు, మూవీ ఎలా అనిపించిందంటే నచ్చింది. భయమేసింది. ఇంకా సినిమాలో ఫస్ట్ సీనే దారుణం. ఫస్ట్ ఫస్ట్ ఏ ఎక్కువ భయపెట్టేశారు. పొరపాటున కూడా సెటప్స్ ఫ...
వెళ్లొద్దు వెళ్లొద్దు అనుకుంటూనే 418 మూవీ సెకండ్ షో కి వెళ్లాం. ఒక్కో జంప్ స్కేర్ కి భయమేసింది. నైటే రివ్యూ చెప్తున్నా, పడుకుంటానో లేదో అని భయంగా ఉంది. ఇవన్నీ కాదు, మూవీ ఎలా అనిపించిందంటే నచ్చింది. భయమేసింది. ఇంకా సినిమాలో ఫస్ట్ సీనే దారుణం. ఫస్ట్ ఫస్ట్ ఏ ఎక్కువ భయపెట్టేశారు. పొరపాటున కూడా సెటప్స్ ఫస్ట్ హాఫ్ లో ప్లాన్ చేస్తారు. చాలా హింట్స్ డ్రాప్ చేస్తారు. ఇవన్నీ నోటీస్ చేసినా మర్చిపోయేంత భయం ప్రతి సీన్ లోనూ ఉంటది. యాక్చువల్లీ ఒకటే రూల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏం చేస్తే దయ్యం వస్తది అనే పాయింట్. అది ఎస్టాబ్లిష్ అయ్యాక స్టోరీ మూడ్ లోకి మారుతది.
సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ. యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ తో స్టార్ట్ అవుతుంది. అయితే హారర్ జానర్ రాయడం, తీయడం రెండు టూ సెపరేట్ జాబ్స్. అండ్ పేపర్ మీద ఉన్నదాన్ని కన్వర్ట్ చేయడం అనేది రేర్ స్కిల్ అండ్ పర్ఫెక్ట్ గా చేశారు. సౌండ్ డిజైన్ ఎక్సలెంట్ ఉంది. జంప్ స్కేర్స్ అన్నీ సౌండ్ నుంచి వచ్చాయి అండ్ కొన్ని విజువల్స్ భయపెడతాయి. ఇక సినిమాలో సూర్య బిహేవియర్ చూసి మనం భయపడతాం. ప్రీతి క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూస్ చేశారు అండ్ మెయిన్ రోల్ చైత్ర ఇస్ ఎక్సలెంట్. భయపెట్టారు అంతే చెప్పగలను. వెంకీ జేజే మ్యూజిక్ ఒకటి ఉంటుంది. సెటప్స్, పే ఆఫ్స్, జంప్ స్కేర్స్, ట్విస్ట్ ఇది భలే హ్యాండిల్ చేశారు. క్లీషెస్ ఎక్కువ రిపీట్ చేయకుండా ఉండుంటే బాగుండు. బట్ మూవీ వర్క్ ఫర్ మీ.
Above Average
418 Movie Review
418 సినిమా గురించి చెప్పాలంటే హర్రర్ ఉండి భయపెట్టని సినిమా. అంటే సింపుల్ గా చెప్పాలంటే హర్రర్ ఉంటది కానీ మోస్ట్లీ భయపెట్టదు సినిమా. జంప్ స్కేర్ సీన్స్ లేం పెద్దగా లేవు. ఒక హర్రర్ ఫిల్మ్ చూసామన్న ఒక భయమైతే ఉంటది కానీ మోస్ట్లీ బోర్ కొట్టదు. బోర్ కొట్టించే సినిమా అయితే కాదు. తర్వాత రెండో విషయం ఏంటి అంట...
418 సినిమా గురించి చెప్పాలంటే హర్రర్ ఉండి భయపెట్టని సినిమా. అంటే సింపుల్ గా చెప్పాలంటే హర్రర్ ఉంటది కానీ మోస్ట్లీ భయపెట్టదు సినిమా. జంప్ స్కేర్ సీన్స్ లేం పెద్దగా లేవు. ఒక హర్రర్ ఫిల్మ్ చూసామన్న ఒక భయమైతే ఉంటది కానీ మోస్ట్లీ బోర్ కొట్టదు. బోర్ కొట్టించే సినిమా అయితే కాదు. తర్వాత రెండో విషయం ఏంటి అంటే కొన్ని ఉన్నాయి అబ్బా ఇప్పుడు నేను అది చెప్తే స్పాయిలర్ అవుతాయి మోస్ట్లీ అని ఆలోచిస్తున్నాను కానీ నాకు కూడా అర్థం కాలేదు అన్నమాట.
ట్రైలర్ అయితే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ సినిమా కంటే ట్రైలర్ బెటర్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అదన్నమాట పాయింట్. బట్ స్టోరీ పరంగా అయితే బాగుంది. ఓవరాల్ గా కథలో అన్నీ కలిపి బిర్యానీతో కిచిడీ చేశారు లాస్ట్ లో లాస్ట్ కి వచ్చేసరికి. ఇంకా ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఇదే జరిగింది. ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో 418 సినిమా గురించి చెప్పాలంటే 418 కలిపితే 13 వస్తుంది కదా. 13 ని అన్ లక్కీ నెంబర్ అని చెప్పి నమ్ముతారు అని చెప్పి సినిమాలో కూడా చెప్పారు కదా. ఎస్ సినిమాకి కూడా అదే జరిగింది. ఆ దరిద్రం సినిమాకి కూడా అంటుకుంది. ఆ 13 దరిద్రం అన్నమాట అంతే. నేను అన్నది అదే జరిగింది ఆల్మోస్ట్. ఇక ఈ మూవీకి జెనరల్ మూవీస్ రేటింగ్స్ పరంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.9\ 5.
Average
418 movie Review
2 hours 30 minutes runtime తో సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ గా విడుదలైన సినిమా "418". సినిమా చూసిన తర్వాత నాకు యావరేజ్ గా అనిపించింది. అక్కడ ఏదో దెయ్యం ఉంది, ఏదో జరుగుతుందనే ఫీలింగ్ తప్ప కథలో పెద్దగా ప్రోగ్రెస్ ఉండదు. తిప్పి తిప్పి చూస్తే ఏం చెప్పారని చూస్తే ఫస్ట్ హాఫ్ అదే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో...
2 hours 30 minutes runtime తో సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ గా విడుదలైన సినిమా "418". సినిమా చూసిన తర్వాత నాకు యావరేజ్ గా అనిపించింది. అక్కడ ఏదో దెయ్యం ఉంది, ఏదో జరుగుతుందనే ఫీలింగ్ తప్ప కథలో పెద్దగా ప్రోగ్రెస్ ఉండదు. తిప్పి తిప్పి చూస్తే ఏం చెప్పారని చూస్తే ఫస్ట్ హాఫ్ అదే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే లాస్ట్ పార్ట్ మాత్రం నాకు నచ్చింది. ముఖ్యంగా చైతన్య జె ఆచార్ గారు వచ్చే ఆ పోర్షన్స్ బాగున్నాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కథ చాలా సేపు సాగుతుంది. అప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేసినంత సాటిస్ఫ్యాక్షన్ అయితే రాలేదండి. మొత్తానికి సినిమా అయితే కొన్ని హారర్ సీన్స్ బాగున్నా సినిమా మొత్తం చూస్తే నాకు యావరేజ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇచ్చింది.
కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. కొన్ని హారర్ సీన్స్ లో సడన్ గా హారర్ షాట్స్ రావడం వల్ల నేను కూడా ఉలిక్కిపడ్డాను. ఆ సీన్స్ కి ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కూడా బాగుంది. హారర్ షాట్స్ ని ఎక్కువ ప్రెసెంట్ చేశారు. అండ్ లాజిక్ ఇష్యూస్. డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ ని ఫాలో అయ్యారు. కొన్ని చోట్ల లాజిక్, ప్రాక్టికల్ లిమిటేషన్స్ గురించి చాలా డౌట్స్ వస్తాయి. ఆ విషయాలు ఇంకాస్త క్లియర్ గా క్లారిటీగా చూపించి ఉంటే ఇంకా బాగుండు. సో ఫైనల్ గా మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే ఈ 418 అనే మూవీ నాకైతే యావరేజ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇచ్చిందండి. కానీ ఓవరాల్ మూవీ మాత్రం బిలో యావరేజ్ నుండి యావరేజ్ మధ్యలోనే అనిపించింది. ఎఫెక్టివ్ జంప్ స్కేర్స్ అండ్ రిఫ్రెషింగ్ ఫ్లాష్ బ్యాక్ బట్ ఫ్లాట్ నరేషన్ అండ్ వీక్ ఎంగేజ్మెంట్ హోల్డ్ బ్యాక్ ది హారర్ థ్రిల్లర్. క్రియేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5.
Average
418 movie review
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418'. ఈ సినిమా విషయానికి వస్తే... కరోనా లాక్‌డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 418 చుట్టూ తిరిగే మిస్టరీ, ఆ రాత్రుళ్లు వినిపించే గజ్జల శబ్దాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. రెగ్యులర్ హారర్ టెంప్లేటే...
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418'. ఈ సినిమా విషయానికి వస్తే... కరోనా లాక్‌డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 418 చుట్టూ తిరిగే మిస్టరీ, ఆ రాత్రుళ్లు వినిపించే గజ్జల శబ్దాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. రెగ్యులర్ హారర్ టెంప్లేటే అయినప్పటికీ, ఆడియన్స్‌లో ఆ భయాన్ని క్రియేట్ చేయడంలో దర్శకుడు కీర్తన్ నడగౌడ చాలావరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా డార్క్ నైట్ విజువల్స్, దానికి తోడు వెంకీ జిజి ఇచ్చిన గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ బ్లాక్స్ థియేటర్‌లో మంచి థ్రిల్‌ని ఇస్తాయి.
నటీనటుల్లో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు నాచురల్ గా చేయగా, చైత్ర జే ఆచార్ తన ఇన్నోసెంట్ లుక్స్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. అయితే కథనంలో కొత్తదనం లేకపోవడం, సెకండాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా సాగడం కాస్త మైనస్ అనే చెప్పాలి. సినిమాని ముగించిన విధానం కూడా అంతగా లేదు. అయినప్పటికీ ఎక్కువ ఆశించకుండా తక్కువ అంచనాలతో వెళ్తే, హారర్ లవర్స్ కి కొంతవరకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
Average
418 movie Review
విమ్స్ మెడికల్ కాలేజ్‌లో పాడుబడ్డ ఓ హాస్టల్ అది. 15 ఏళ్ల తర్వాత దాన్ని తెరవడం.. అందులోని ఓ గదిలో ఆత్మ.. దానికో కథ ఇది సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఆరుగురు మరణంతో మొదలైన కథ దానికి ముందు ఏం జరిగిందనే ఆసక్తి కలగజేస్తుంది. అక్కడి నుంచి కథ ఆ హాస్టల్‌కి వచ్చిన నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. 417 గ...
విమ్స్ మెడికల్ కాలేజ్‌లో పాడుబడ్డ ఓ హాస్టల్ అది. 15 ఏళ్ల తర్వాత దాన్ని తెరవడం.. అందులోని ఓ గదిలో ఆత్మ.. దానికో కథ ఇది సింపుల్‌గా ఈ సినిమా స్టోరీ. ఆరుగురు మరణంతో మొదలైన కథ దానికి ముందు ఏం జరిగిందనే ఆసక్తి కలగజేస్తుంది. అక్కడి నుంచి కథ ఆ హాస్టల్‌కి వచ్చిన నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. 417 గదిలో వివేక్ కు ఎదురైన సంఘటనలు మరింత ఉత్కంఠకు గురిచేస్తాయి. విరామం తర్వాత యక్షగాన కళాకారిణి దేవిక తెరపైకి వస్తుంది. ఆమె కళను వదిలి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనాలనుకోవడం వంటి సన్నివేశాలను హృద్యంగా తెరకెక్కించారు.
సినిమాలో హారర్ ఎలిమెంట్స్‌ను బాగా రాసుకున్నారు. కానీ.. మిగతా కథను తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి విరామం తర్వాత 20 నిమిషాల వరకూ ఒక ఫ్లోలో నడిచిన కథ.. 418 గది ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేసే సమయానికి గజిబిజి అయిపోయింది. సీన్‌కి సీన్‌కి పొంతన లేకుండా పోయింది. ఏవేవో సీన్స్ వస్తాయి... కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. అయితే హారర్ సినిమాల కథలు దాదాపుగా ఇదే యాంగిల్‌లో ఉంటాయి. దానిని తెరపై ఎంత ఉత్కంఠగా చూపించాం అన్నది ముఖ్యం. దర్శకుడు కీర్తన్ నాదగౌడ ప్రతి సీన్‌లోనూ ఉత్కంఠ క్రియేట్ చేశాడు. కానీ.. చెప్పాలనుకున్నది మాత్రం స్ట్రెయిట్‌గా చెప్పలేకపోయాడు. కన్‌ప్యూజ్ చేశాడు. మొత్తం మీద హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఓ మాదిరి నచ్చే ఆస్కారం ఉంది.
ట్యాగ్‌లైన్: వణుకు పుట్టించే గది!
Average
418 Movie Review
ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. కరోనా లాక్ డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నెం. 418 చుట్టూ తిరిగే ఒక వింత రహస్యం, గజ్జల శబ్దాల నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. రొటీన్ హారర్ టెంప్లేటే అయినా, ఆడియ...
ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '#418' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. కరోనా లాక్ డౌన్ తర్వాత వేదగిరి మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నెం. 418 చుట్టూ తిరిగే ఒక వింత రహస్యం, గజ్జల శబ్దాల నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. రొటీన్ హారర్ టెంప్లేటే అయినా, ఆడియన్స్‌ని భయపెట్టడంలో డైరెక్టర్ కీర్తన్ నడగౌడ చాలావరకు సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా నైట్ విజ్యువల్స్, వెంకీ జిజి ఇచ్చే గూస్‌బంప్స్ బీజీఎమ్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి! నటీనటుల్లో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు బాగున్నా, చైత్ర జే ఆచార్ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అసలు సిసలైన 'షో స్టాపర్'గా నిలిచింది. స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ఉన్నా, సెకండాఫ్‌లో సాగదీత అనిపించినా.. తక్కువ అంచనాలతో వెళ్తే హారర్ ప్రియులకు ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్! ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయ్.
Average
418 Movie Review
Mythri Movie Makers ventures into Kannada cinema with the horror thriller 418, presented by Prashanth Neel. The film generated curiosity through its unusual social media promotions.HighlightsDevika’s flashback episodeChaitra Achar’s performanceBackground score and sound designDrawbacksAn unconvinci...
Mythri Movie Makers ventures into Kannada cinema with the horror thriller 418, presented by Prashanth Neel. The film generated curiosity through its unusual social media promotions.
Highlights
Devika’s flashback episode
Chaitra Achar’s performance
Background score and sound design
Drawbacks
An unconvincing climax
Familiar horror-film tropes
Repetitive scares
418 begins on a familiar note, taking nearly 50 minutes to establish its horror premise and deliver its first effective scare. The initial college portions move slowly, with episodes involving ragging, student interactions and Saiesha’s illness doing little to advance the central mystery.
Despite these shortcomings, 418 works to an extent. Its effective flashback, Chaitra Achar’s performance and sound design make parts of the film engaging. However, repetitive scares and a weak climax prevent this horror thriller from realising its full potential. It is a mixed bag that delivers a few effective scares but falters at the finish.
Average
418 Movie Review
తెలుగులో మాత్రమే కాదు... ఇతర భాషల్లోనూ ఇప్పుడు హారర్ సినిమాలు అరుదుగా వస్తున్నాయి. కామెడీతో హారర్ మిక్స్ చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ భయపడుతున్న దర్శక రచయితలు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో పక్కా హారర్ సినిమాగా '418' వచ్చింది. మేకర్స్ అయితే ఇంతలా భయపెట్టే సినిమా ఇటీవల కాలంలో రాలేదని హైప్ ఇచ్చారు. కానీ హారర...
తెలుగులో మాత్రమే కాదు... ఇతర భాషల్లోనూ ఇప్పుడు హారర్ సినిమాలు అరుదుగా వస్తున్నాయి. కామెడీతో హారర్ మిక్స్ చేసి, ప్రేక్షకులను నవ్విస్తూ భయపడుతున్న దర్శక రచయితలు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో పక్కా హారర్ సినిమాగా '418' వచ్చింది. మేకర్స్ అయితే ఇంతలా భయపెట్టే సినిమా ఇటీవల కాలంలో రాలేదని హైప్ ఇచ్చారు. కానీ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే జంప్ స్కెర్స్, భయపెట్టడంలో కనిపించే రొటీన్ ట్రిక్స్ '418'లో లేవు. సిట్యువేషనల్ హారర్ కోసం దర్శకుడు కీర్తన నాడగౌడ ప్రయత్నించారు. అయితే... అది వర్కవుట్ కాలేదు.
సినిమాలో చైత్ర జె ఆచార్ పాత్ర బావుంది. ఆ పాత్ర లక్ష్యాన్ని బలంగా రాసిన దర్శకుడు... ఆమె వెళ్లే దారిని బలంగా రాలేదు. ఇక చివరకు వచ్చేసరికి 418 రూమ్ సీక్రెట్ కూడా సోసోగా అనిపిస్తుంది. అందువల్ల కథ పరంగా బలం లోపించింది. హారర్ కామెడీల మధ్య కేవలం ప్రేక్షకులను భయపెట్టే ఉద్దేశంతో వచ్చిన ప్యూర్ హారర్ సినిమా '418'. ఇందులో హారర్ ఎలిమెంట్స్, థ్రిల్స్ తక్కువ. కథ పరంగా ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ. కొంత మేరకు మాత్రమే భయపెట్టింది. చైత్ర జె ఆచార్ కనిపించినది తక్కువ సేపే అయినా ఆమె నటన తప్పకుండా ఆకట్టుకుంది.
Average
418 Movie Review
418 Movie ReviewPositives :1. Background Score2. Initial Few MinutesNegatives :1. Unexciting Screenplay2. Lack of Scary Moments3. Runtime4. Lack of Emotional Depth418 movie is Another drawback of the film is the excessive Kannada flavour. It is a film which is made by a Kannada director,...
418 Movie Review
Positives :
1. Background Score
2. Initial Few Minutes
Negatives :
1. Unexciting Screenplay
2. Lack of Scary Moments
3. Runtime
4. Lack of Emotional Depth
418 movie is Another drawback of the film is the excessive Kannada flavour. It is a film which is made by a Kannada director, presented by a Kannada filmmaker, and acted by many Kannada actors, set in Karnataka, has a backdrop of Yakshagana, a traditional folk dance form popular in Coastal Karnataka districts and has two Kannada songs.
Overall, 418, has an interesting core point, a good takeoff and a couple of mildly scary moments but other than that, the film offers nothing interesting. An unexciting first half followed by an equally unexciting second half, made it a tiresome watch.
Bottom Line – Empty Vessels Make The Most Noise
Rating: 2.25/5
Average
418 Movie Review
ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు ఒక మూసలా మారి.. ఆ జానరే కంగాళీగా తయారైంది. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ ఫక్తు హార్రర్ సినిమాలు కొన్న...
ఒకప్పుడు హార్రర్ సినిమా అంటే హార్రర్ సినిమానే. జనాలను భయపెట్టడమే లక్ష్యంగా సాగేవీ సినిమాలు. కానీ తర్వాత భయానికి నవ్వును కూడా జోడించి ఈ జానర్ రీచ్ పెంచారు కొందరు ఫిలిం మేకర్స్. దీంతో క్రమంగా ఆ సినిమాలు ఒక మూసలా మారి.. ఆ జానరే కంగాళీగా తయారైంది. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడూ ఫక్తు హార్రర్ సినిమాలు కొన్ని వస్తుంటాయి. ‘418’ కొంచెం సిన్సియర్ గానే ఆ పని చేసింది. ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే సెటప్ కు కొంచెం భిన్నంగానే ఈ కథ నడుస్తుంది. ఐతే ఎంత కసరత్తు చేసినా.. కథను అర్థమయ్యేలా.. కన్విన్సింగ్ గా చెప్పడం.. లాజిక్కులు సరిగ్గా ఉండడం.. జెన్యూన్ హార్రర్ మూమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడం కీలకం. ఈ విషయాల్లో ‘418’ ఒకింత నిరాశకే గురి చేస్తుంది.
ఇది కంటెంట్ ఉన్న సినిమానే కానీ.. కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఒక మోస్తరు స్థాయిని మించలేకపోయింది. కథా నేపథ్యం బాగున్నా.. లీడ్ క్యారెక్టర్-అందులో ఛైత్ర అచర్ పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. సాంకేతిక అంశాల్లో మెరుపులున్నా.. 418 ‘జస్ట్ ఓకే’ స్థాయిని మించలేకపోయింది. రైటర్ కమ్ డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ.. ఒక డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ కు అవసరమైన సెటప్ బాగానే చేసుకున్నాడు. తన టేకింగ్ బాగుంది. కానీ కథను ఇంకా క్లారిటీతో చెప్పాల్సింది. హార్రర్ ఎలిమెంట్స్ ను ఇంకా బాగా డీల్ చేయాల్సింది. తనలో మంచి టెక్నీషియన్ ఉన్న సంగతి తెలుస్తుంది కానీ.. ఔట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. చివరగా: 418.. కంటెంట్ ఉంది కడుపు నిండదు.
Average
418 Movie Review
‘418’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కీర్తన్ నడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయింది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ మనం రెగ్యులర్‌గా చూసే పాతకాలపు హారర్ సినిమాల ఫార్ములాలోకి వెళ్లిపోతు...
‘418’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కీర్తన్ నడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయింది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ మనం రెగ్యులర్‌గా చూసే పాతకాలపు హారర్ సినిమాల ఫార్ములాలోకి వెళ్లిపోతుంది. పాడుబడిన భవనం, పగతో రగిలిపోయే దయ్యం, ఊహకు అందే భయానక సీన్స్.. ఇవే మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త కొత్తదనం ఉండుంటే అదిరిపోయేది. ఆడియన్స్‌ను నిజంగా భయపెట్టే సీన్స్ కంటే, కేవలం భారీ సౌండ్స్ పెట్టి ఉలిక్కిపడేలా చేసే సీన్స్‌పైనే డైరెక్టర్ ఎక్కువగా ఆధారపడ్డాడు.
ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా మొదలైంది.. కానీ దాన్ని బాగా ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా చివరి అరగంట ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది. మెయిన్ ప్లాట్ అంతా అక్కడే ఉంది. లాజిక్ లేని సీన్స్‌తో ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా.. అది ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పర్లేదనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి ఈ తరహా రొటీన్ కథకు చాలా ఎక్కువైంది. ఒక అద్భుతమైన హారర్ సినిమా చూస్తామనుకుని థియేటర్‌కు వెళ్లిన వాళ్ళకు ఈ సింపుల్ స్క్రీన్‌ప్లే రొటీన్‌గానే అనిపిస్తుంది. కథలో లేని బలాన్ని నేపథ్య సంగీతంతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అకుల్ అవినాష్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిడివి బాగా ఎక్కువవడం, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ని ట్రిమ్ చేయకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి.
Average
418 movie Review
సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ పాయింట్ అల్లుకొన్న హారర్, థ్రిల్లర్ 418. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసి పోతుంది. కథలో వేగం లోపించడం, అక్కడక్కడే తిరుగుతూ సాగదీసి సాగదీసినట్టు ఉండటంతో ఆడియెన...
సింపుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ పాయింట్ అల్లుకొన్న హారర్, థ్రిల్లర్ 418. ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా కథనం, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసి పోతుంది. కథలో వేగం లోపించడం, అక్కడక్కడే తిరుగుతూ సాగదీసి సాగదీసినట్టు ఉండటంతో ఆడియెన్స్‌లో ఉండే క్యూరియాసిటీపై క్రమంగా ప్రభావం పడిందనే చెప్పాలి. అయితే లాగించి చెప్పే ప్రయత్నం చేయడం వల్ల కొన్నిసార్లు విసుగు కూడా పడుతుంది. ఇక హారర్ ఎలిమింట్స్ కొన్ని సార్లు నిజంగానే భయపెట్టాయి. కానీ ఎక్కువ సార్లు చాలా ఆర్టిఫిషియల్‌గాను ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మాత్రమే ఓకే అనిపించేలా ఉంటాయి.
ఇక ఈ సినిమా సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. ఇక ఎప్పటిలానే ప్రశాంత్ నీల్ తరహా కలర్ ప్యాటర్న్‌తో సాగుతుంది. కొన్నిసార్లు చీకట్లో ఏం జరుగుతుందో తీక్షణంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కథ, కథనాలను ఇంకాస్త పట్టించుకొంటే.. అందరూ హైప్ చేసినట్టు మంచి థ్రిల్లర్ అయి ఉండేది. అంచనాలు పెంచుకొని వెళ్తే కొంత నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకొని వెళ్తే మంచి అనుభూతితో బయటకు రావొచ్చు.
Above Average
418 Movie Review
చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్ లో ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ "418" తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచీ హైప్ చేసిన సౌండ్ డిజైన్ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కొన్ని టెన్స్ సీన్స్ ఒకటీ రెండు అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఇంటర్...
చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్ లో ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ "418" తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో మొదటి నుంచీ హైప్ చేసిన సౌండ్ డిజైన్ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. కొన్ని టెన్స్ సీన్స్ ఒకటీ రెండు అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో మరియు క్లైమాక్స్ పోర్షన్ లో థ్రిల్ మూమెంట్స్ ఈ తరహా సినిమాలు ఇష్ట పడేవారికి, జెనరల్ ఆడియెన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించేలా అనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా ఈ సినిమాపై సెట్ చేసిన హైప్ ఆధారంగా ఏదో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అనుకోని ఆడియెన్స్ ట్రై చేస్తే మాత్రం డిజప్పాయింట్ అవ్వక తప్పదు.
కేవలం కొన్ని చోట్ల మినహా మిగతా కథనం అంతా చాలా స్లోగా చప్పగా సాగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘418’ అనే హారర్ సినిమా కేవలం కొన్ని చోట్ల మాత్రమే థ్రిల్స్ ని పంచగలుగుతుంది. యువ నటీనటులు అలాగే నటి చైత్ర జే ఆచార్ మంచి పెర్ఫామెన్స్ లను అందించారు. అలాగే కొన్ని చోట్ల సౌండింగ్, థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. కానీ ఓ రేంజ్ లో భయపెట్టేసే సినిమా అయితే ఇది కాదు. ముందు సెట్ చేసిన హైప్ తో వెళితే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే బెటర్.
Public Reviews
2 Avg: 4.5/10Below Average
418 Movie Review
జెనరల్ గా ఈ మధ్య హారర్ మూవీస్ చూడ్డం బాగా తగ్గించాను. ఎప్పుడో 3 ఏళ్ళ కింద వచ్చిన విరూపాక్ష తర్వాత మళ్ళీ థియేటర్లలో హారర్ మూవీ చూడలేదు. ఈ 418 మూవీ ట్రైలర్ చూసి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సినిమా కెళ్ళాం. సినిమా పర్లేదన్నట్టు ఉంది గాని... మరీ ఫ్రెష్ కంటెంట్ ఏం కాదు.. హారర్ ఎలిమెంట్స్ ఉన్న చాలా సినిమ...
జెనరల్ గా ఈ మధ్య హారర్ మూవీస్ చూడ్డం బాగా తగ్గించాను. ఎప్పుడో 3 ఏళ్ళ కింద వచ్చిన విరూపాక్ష తర్వాత మళ్ళీ థియేటర్లలో హారర్ మూవీ చూడలేదు. ఈ 418 మూవీ ట్రైలర్ చూసి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సినిమా కెళ్ళాం.
సినిమా పర్లేదన్నట్టు ఉంది గాని... మరీ ఫ్రెష్ కంటెంట్ ఏం కాదు.. హారర్ ఎలిమెంట్స్ ఉన్న చాలా సినిమాల్లో ఉన్న కాన్సెప్ట్ నే మళ్ళీ దించారు.
ఓవరాల్ ఒకే ఒకే అన్నటుంది. సినిమాలో యాక్టర్స్ అందరూ బాగా చేసారు. బట్ వాళ్ళ పేర్లేమీ తెలీదు. bucause తెలుగోళ్లు ఎవ్వరూ సినిమాలో లేరు కదా. అయినా లో expectations తో, హారర్ ఎలిమెంట్స్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు.
Average
418 Movie Review
just ippude 418 movie chusoccha... cinema ayithe naku below avarage anipinchindi... genral ga naku horror movies ante chala istam. but ee cinema kooda naku inthaku mundu chusina best cinemallo laga manchi sences tho undi. konni sences scare ga untayi... but makers over hype lepadam valla nenu inkedo...
just ippude 418 movie chusoccha... cinema ayithe naku below avarage anipinchindi... genral ga naku horror movies ante chala istam.
but ee cinema kooda naku inthaku mundu chusina best cinemallo laga manchi sences tho undi. konni sences scare ga untayi...
but makers over hype lepadam valla nenu inkedo expect chesi velthe andulo sagam kooda ledu. but actress chaitra performance peaks lo untadi.
and cinema lo vfx shots bagunnayi. ika story ayithe chala cinemallo unnattu ade ruddudu.. ade utukudu...
overall ga low expectations tho logics pattinchukokunda evaraina movie ki velte vallaki better anipinchocchu mari...
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత టైం లో నడుస్తుంది. వివేక్ శంకర్ (సూర్య రాజ్) అనే యువకుడు డాక్టర్ అవ్వాలనే గోల్ తో కోస్టల్ కర్ణాటక దగ్గర ఉన్న వేదగిరి మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అయితే అక్కడే ఉన్న బాయ్స్ హాస్టల్ లో రూమ్ నెం.. 418 కి పక్కనే ఉన్న 417 లో ఉండాల్సి వస్తుంది. అయితే ఆ 418 రూమ్ వైపు ఎవ్వరూ వెళ్లరు.. దీంతో.. అక్కడ ఏముంది.. అసలేం జరిగింది అని కూడా తెలీని వివేక్ తన రూమ్ మేట్స్ రోహిత్ (చరణ్ లక్కరాజు) సహా కొంతమందితో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ కి రాత్రుళ్ళు ఓ అమ్మాయి గజ్జల శబ్దం చేస్తూ హాస్టల్ లోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వివేక్ ని ఎవరూ నమ్మరు? ఈ పరిస్థితుల్లో వివేక్ ఇంకా ఫ్రెండ్స్ ఆ 418 రూమ్ ని తెరిచే ప్రయత్నం చేస్తారు? మరి ఆ రూమ్ లో ఏముంది? అసలు అక్కడేం జరిగింది? చాలా రోజులు మూతబడ్డ ఆ హాస్టల్ ని ఎందుకు తెరిచారు? ఈ కథ మధ్యలో దేవిక (చైత్ర జే ఆచార్) ఎవరు? వివేక్ ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
రీసెంట్ గా హారర్ నేపథ్యంలో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్క రాకాస తప్ప మిగతావి పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 418 ట్రైలర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా విషయానికి వస్తే... సింపుల్ గా ఒక పెద్ద బిల్డింగ్.. ఆ భవనంలో వింత వింత శబ్దాలు... అదేంటో కనిపెట్టే భయంభయంతో ఉన్న గ్యాంగ్... చాలా హారర్ సినిమాల్లో ఉన్న రొటీన్ టెంప్లేటే... దాన్ని కొంతమంది ప్యూర్ హారర్ ఎలిమెంట్స్ తో, మరికొందరు డైరెక్టర్లు కామెడీని యాడ్ చేసి వదులుతుంటారు. ఇక ఈ సినిమా మాంచి హారర్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కగా, ఆడియన్స్ ని భయపెట్టడంలో దాదాపు సక్సెస్ అయ్యారు మేకర్స్. ముఖ్యంగా సినిమాలో ఆ నైట్ విజువల్స్ దానికి తగ్గ బీజీఎమ్ సౌండ్స్ అదిరిపోయాయి.
ఇక ఇంటర్వెల్ సీన్, అండ్ క్లైమాక్స్ మంచి థ్రిల్ ఫీల్ ఇస్తాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అవడం ఖాయం. అలాగే నటీనటులు సూర్య రాజ్, చరణ్ లక్కరాజు తో పాటు, నటి ప్రీతీ పగడాల, అద్భుతంగా సహజంగా నటించారు. అయితే వీళ్ళని మించి ఇంప్రెస్ చేసి హైలెట్ గా చేసింది మాత్రం చైత్ర జే ఆచార్. ఇన్నోసెంట్ గా కనిపిస్తూనే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని కనబరిచింది. అలాగే సినిమాకి హారర్ మ్యూజిక్ హైలెట్ అయింది.
Minus Points :
అయితే ఈ సినిమా ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేయడంతో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్లే ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా నిరాశపరచవచ్చు. కథ సింపుల్ గా ఉంటే, కథనం ఇంకా సింపుల్ గా ఉంటుంది. దర్శకుడు ఆడియన్స్ ని భయపెట్టడమే టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి, కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈజీగా కనెక్ట్ ఆయే ఛాన్స్ ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటివి బాగానే ఉన్నా, మిగతా స్క్రీన్ ప్లే అంతా స్లో గా సాగుతుంది. ట్రైలర్ లో ఉన్నట్టు సినిమా మొత్తం హారర్ ఎలిమెంట్స్ ఉండవు.. అందువల్ల థ్రిల్లర్ ప్రియులకు కొంత బోర్ కొట్టొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మరీ స్లో అయినట్టుంటుంది. కాన్సెప్ట్ కూడా చాలా సినిమాల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఫ్రెష్ నెస్ కోరుకునే వాళ్లకు కూడా అంతగా కనెక్ట్ అవకపోవచ్చు. పైగా పేరున్న నటీనటులు పెద్దగా కనిపించరు.
Technical values :
ఇక ఈ సినిమాలో పెడుక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. పెద్దగా సెట్ వర్క్ లేదు గాని, దినేష్ దివాకరన్ కెమెరా వర్క్ సాలిడ్ గా ఉంది. అయితే ఎడిటింగ్ వర్క్ బ్యాలన్స్ ఉంది. కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ కీర్తన్ నడగౌడ కాన్సెప్ట్ బాగానే తీసుకున్నా, మరింత స్ట్రాంగ్ గా స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది. సినిమా మొత్తం థ్రిల్ ని మెయింటైన్ చేయలేకపోయారు. వెంకీ జిజి ఇచ్చిన బీజీఎమ్ సూపర్ గా ఉండి థ్రిల్ ఇస్తుంది.
Final Review :
ఓవరాల్ గా "418" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హార్రర్ సినిమా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించేలా ఉంది. అయితే హారర్ మూవీ లవర్స్ కి బాగానే కనెక్ట్ అవొచ్చు. సింపుల్ కథే ఉన్నా, చైత్ర జే ఆచార్ పెర్ఫార్మన్స్ కి తోడు మంచి బీజీఎమ్, థ్రిల్ మూమెంట్స్ తో కొంతవరకు భయపెడుతుంది. కాస్త తక్కువ అంచనాలతో వెళ్తే ఆడియన్స్ ని బాగానే మెప్పిస్తుంది. అయితే థియేటర్లో ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.