నల్లజర్ల రోడ్డు (Nallajerla Road)
Nallajerla Road : ఈటీవీ విన్ ఓటిటి లో ఫేమస్ అయిన వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రం "నల్లజర్ల రోడ్డు". ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గిరిధర్, మహాదేవ శేఖర్, యశోరా కీ రోల్స్ లో నటించగా, వర ముళ్ళపూడి డైరెక్ట్ చేసారు. తాజాగా ఈటివి విన్ ఓటిటిలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Available in:
Reviews
What critics and the public are saying about నల్లజర్ల రోడ్డు (Nallajerla Road)
Media Reviews
1 Avg: 6.0/10Above Average
Nallajarla Road movie review
ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ గారు రచించిన ‘నల్లజర్ల రోడ్డు’ అనే పుస్తకం నుంచి దర్శకుడు వర ముళ్ళపూడి అందులోని ఎమోషన్ ని సర...
ఈ వారం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘నల్లజర్ల రోడ్డు’. ప్రముఖ రచయిత బాల గంగాధర్ తిలక్ రచన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలగంగాధర్ తిలక్ గారు రచించిన ‘నల్లజర్ల రోడ్డు’ అనే పుస్తకం నుంచి దర్శకుడు వర ముళ్ళపూడి అందులోని ఎమోషన్ ని సరిగ్గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకం కోసం కానీ అందులోని కథ కోసం కానీ మినిమమ్ ఐడియా లేకుండా చూసేవారికి ఈ లఘు చిత్రం మంచి థ్రిల్స్ తో పాటుగా మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది.
ఆల్రెడీ సక్సెస్ అయ్యిన పుస్తకం నుంచి ఈ లఘు చిత్రం అడాప్ట్ చేసుకున్నప్పటికీ మొదట్లో పరిస్థితులు కొంచెం నెమ్మదిగా సాగాయి. సో కథనం కొంచెం ఓపికగా ఆగి చూస్తే మిమ్మల్ని లీనం చేస్తుంది. చిన్న లాజికల్ ఎర్రర్స్ కనిపిస్తాయి అంతే. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘నల్లజర్ల రోడ్డు’ అనే లఘు చిత్రం ఆకట్టుకునే అడాప్షన్ గా నిలుస్తుంది. బాలగంగాధర్ తిలక్ గారి అద్భుత రచన నుంచి లఘు చిత్రంగా దర్శకుడు వర ముళ్ళపూడి మంచి అవుట్ పుట్ అందించారు. అందులోని థ్రిల్ మూడ్ ని మైంటైన్ చేస్తూ, అందులోని సందేశాన్ని కూడా బాగా చేరవేశారు. కాకపోతే ప్రారంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఈ లఘు చిత్రం తప్పకుండా చూడాల్సినదే.
Public Reviews
1 Avg: 6.0/10Above Average
NallaJarla Road movie review
Just ippude ETV win app lo Nallajarla Road short film chusa. genral ga nenu short film chudanu kaani... youtube lo trailer chusaka intrest occhindi. and subcription lekapothe konukkuni mari chusa..but movie chala intresting ga anipinchindi. dennenduku long length movie ga teesi theaterlo enduku rele...
Just ippude ETV win app lo Nallajarla Road short film chusa. genral ga nenu short film chudanu kaani... youtube lo trailer chusaka intrest occhindi. and subcription lekapothe konukkuni mari chusa..
but movie chala intresting ga anipinchindi. dennenduku long length movie ga teesi theaterlo enduku release cheyaledani feel occhindi.
but short ga unnanduke bore kottakunda thrill feel icchindi. 2 hours length unna movie ga marchithe chala bore kottedani tarvatha realize ayya.
twist lu, thrills bagunnayi nakaithe... mari evarikaina intrest unte low hype tho chudandi thriller movies like chesevallakaithe definatley try cheyocchu.
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... 1970స్ బ్యాక్ డ్రాప్ లో నల్లజర్ల అటవీ ప్రాంతంలో నడుస్తుంది. 1965 సంవత్సరంలో రామం (మహాదేవ శేఖర్) తన మావయ్య భూషణం (రాజీవ్ కనకాల) తో కలిసి పెళ్లి చూపులకి వెళ్తాడు. కానీ అక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే సమయంలో తానొక హంతకుణ్ణి అంటూ ఆమెకు చెప్తాడు. కానీ అతను నిజానికి హంతకుడు కాడు. కానీ ఎందుకు ఆమెకు తాను అమ్మాయితో అలా చెప్పాడు. ఇంతకీ రామం కి నల్లజర్ల అడవిలో ఎదురైన సంఘటనలేంటి? రామంను ఆ ఘటనలు ఎందుకు వేధిస్తాయి. దీంట్లో మావయ్య, బాబాయ్ చంద్రం (గిరిధర్) ల పాత్రేంటి? ఇంతకీ ఆ పెళ్లి కూతురు రామంను అంగీకరిస్తుందా లేదా? అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.
Plus Points :
నిడివి చాలా తక్కువ ఉండడం ఈ లఘు చిత్రాలకు కలిసొచ్చే అంశం. కేవలం 45 నిమిషాల నిడివి ఉన్న ఈ ‘నల్లజర్ల రోడ్డు’ మూవీ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా సాగుతుంది. ఓ పుస్తకం ఆధారంగా దర్శకుడు వర ముళ్ళపూడి ఈ సినిమాను తెరకెక్కించగా, అందులోని స్టోరీ పాయింట్ ని, ఎమోషన్ ని సరిగ్గా తెరకెక్కించగలిగారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఆ పుస్తకం చదివిన వాళ్లకు కొంత థ్రిల్ మిస్ అవుతుందేమో కానీ, కొత్త వాళ్లకు కథలో థ్రిల్స్ తో పాటు ఆలోచింపచేస్తుంది. ఇక కథలో కొద్దిసేపటికే ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయిపోతారు. సమాజం గురించి చాలా మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఇక సినిమాలో నటించిన రాజీవ్ కనకాల, గిరిబాబు, సమ్మెట గాంధీలతో పాటు యంగ్ నటీనటులు మహాదేవ్ శేఖర్, యశోరాలు షైన్ చక్కగా నటించి మెప్పించారు. అలాగే అడవికి సంబంధించిన VFX షాట్స్ సహజంగా తెరకెక్కించారు.
Minus Points :
అయితే ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లోనే ఎక్కువ ఆసక్తి చూపుతారు జనాలు. ఓటిటిలో అయితే ఆ ఓటిటి సబ్క్రిప్షన్ లేని వాళ్లకు కష్టం. పైగా ఈ లఘు చిత్రం తక్కువ నిడివితోనే ఉండగా, ఇంత తక్కువ నిడివి ఉన్న చిత్రాలు కూడా చూసే ఆడియన్స్, ఓటిటి సబ్క్రిప్షన్ తీసుకోవడం తక్కువ. ఏది ఏమైనా ఆల్రెడీ సక్సెస్ అయ్యిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రం చూద్దామని స్టార్ట్ చేస్తే... స్టార్టింగ్ లో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అది కనెక్ట్ అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కనెక్ట్ అవకపోతే అస్సలు ఎక్కదు. ఇక కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది.
Technical Values :
ఇక ఈ సినిమాకు టెక్నికల్ వాల్యూస్ చూస్కుంటే ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కి మంచి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్. వాటిని బాగా చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక సినిమాలో VFX తో చూపించిన పులి సన్నివేశం సహజంగా ఉండి ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడు వర ముళ్ళపూడి డైరెక్షన్ బాగుంది.
Final Review :
ఇక ఓవరాల్ గా చూసుకుంటే...‘నల్లజర్ల రోడ్డు’ అంటూ ఓటిటిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. వర ముళ్ళపూడి డీసెంట్ డైరెక్షన్, నటీనటుల పెర్ఫార్మన్స్ కి తోడు, మంచి రైటింగ్ స్క్రీన్ ప్లే తో ఓటిటి ప్రియులకు ఈ వారం మంచి ఆప్షన్ గా నిలుస్తుంది ఈ లఘు చిత్రం. కాకపోతే కాస్త ఓపికతో చూడాలి.
Review Statistics
Review Average
You Might Also Like
హైకూ (Haiku)
2026
418 (#418)
2026