Register as a Reviewer
నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing)

నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing)

22 Oct 2026
Overall Rating
5.5/10
10 Reviews

Na Wife Missing : వరుణ్ సందేశ్ - శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన "కొత్తబంగారులోకం" సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అయితే దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు జంటగా "నా వైఫ్ మిస్సింగ్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో అక్టోబర్ 22న స్ట్రీమింగ్‌ కు వచ్చింది. ఇక ఆడియన్స్ నుండి ఈ వెబ్ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది.

Director: Swathi Prakash Mantripragada
Cast: Varun Sandesh | Shweta Basu

Available in:

Reviews

What critics and the public are saying about నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing)

Media Reviews

8 Avg: 5.8/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
5

Average

Na wife missing movie review

"నా వైఫ్ మిస్సింగ్". Just one hour 40 minutes run time తో ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వరుణ్ సందేశ్ గారు, శ్వేతా వర్మ ప్రసాద్ గారు మెయిన్ లీడ్స్ అన్నమాట. కొత్తబంగారు లోకం తర్వాత మళ్ళీ నటించారు. హైప్ కోసం కూడా కావచ్చు వీళ్ళ సెలక్షన్. అండ్ సినిమా చూసిన తర్వాత నాకైతే ప్రిటీ ఆర్డినరీ గానే అనిపించిందండ...

"నా వైఫ్ మిస్సింగ్". Just one hour 40 minutes run time తో ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వరుణ్ సందేశ్ గారు, శ్వేతా వర్మ ప్రసాద్ గారు మెయిన్ లీడ్స్ అన్నమాట. కొత్తబంగారు లోకం తర్వాత మళ్ళీ నటించారు. హైప్ కోసం కూడా కావచ్చు వీళ్ళ సెలక్షన్. అండ్ సినిమా చూసిన తర్వాత నాకైతే ప్రిటీ ఆర్డినరీ గానే అనిపించిందండి. స్టోరీ, స్క్రీన్ ప్లే ట్విస్ట్స్ ఇవన్నీ కూడా పేపర్ మీద బాగానే ఉన్నాయి. కానీ వాటిని చాలా కన్వీనియంట్ గా, అనుకూలంగా రాసుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా కొన్ని పాత సినిమాలు గుర్తొచ్చాయి. కొన్ని ట్విస్ట్ లు బాగున్నా ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయిన నేనైతే. 


ఇక One hour 40 minutes లోపే సినిమా అయిపోతుంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే చూడండి. కానీ నాకు మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేంతగా ఏమీ అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా, మరీ ఆర్డినరీగా అనిపించింది. వరుణ్ సందేశ్ గారు అండ్ శ్వేతా వర్మ ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్ ఇద్దరివి పర్వాలేదు బాగున్నాయి. సినిమాలో అయితే అస్సలు ఎమోషనల్ కనెక్ట్ లేదండి. ముఖ్యంగా హీరోయిన్ ఒక్కసారిగా పాజిటివ్ గా మారే విధానం అసలు కన్విన్సింగ్ గా అనిపించలేదు. సినిమా అయితే వీక్ క్లైమాక్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండి. థ్రిల్లర్ లో ఉండాల్సిన ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేదు మూవీలో. సో దీని రేటింగ్ వచ్చేసి అయితే నా ఒపీనియన్ 2.5/5. 

Oct 23, 2026 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Na wife missing movie review

జీవితం పట్ల సరైన అవగాహన లేని సమయంలో యువతి యువకులు ప్రేమించుకోవడం సహజం. ఒక్కోసారి వీరు హద్దులు మీరుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథను నడిపి, చేసిన తప్పును సరిచేసుకునే యువతిగా స్వప్న పాత్రను మలిచారు కథా రచయత్రి అనురాధ ఉమర్జీ. దానిని అంతే అర్థవంతంగా తెరకెక్కించారు దర్శకురాలి స్వాతి ప్రకాశ్‌...

జీవితం పట్ల సరైన అవగాహన లేని సమయంలో యువతి యువకులు ప్రేమించుకోవడం సహజం. ఒక్కోసారి వీరు హద్దులు మీరుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథను నడిపి, చేసిన తప్పును సరిచేసుకునే యువతిగా స్వప్న పాత్రను మలిచారు కథా రచయత్రి అనురాధ ఉమర్జీ. దానిని అంతే అర్థవంతంగా తెరకెక్కించారు దర్శకురాలి స్వాతి ప్రకాశ్‌. స్వప్న మిస్‌ అయిన విషయాన్ని రెండు మూడు వర్షన్స్ గా చూపించడంతో తొలుత వ్యూవర్స్ ఏది నిజం? ఏది అబద్దం అనే విషయంలో కన్ ఫ్యూజన్‌ కు గురౌతారు. 


అయితే ద్వితీయార్థంలో విడమర్చి చూపించి అలరించేలా చేశారు. ఇక కథ ఊహించని మలుపులు తిరగడం కుతూహలాన్ని కలిగించేదే అయినా... స్లో నెరేషన్ తో అక్కడక్కడ బోర్‌ కొడుతుంది. ఇక కొత్తబంగారులోకం తర్వాత వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించడం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడేవారు ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు!

Oct 23, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Na wife missing movie review

'కొత్తబంగారులోకం'తో ట్రెండ్ సెట్ చేసిన లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ ఏర్పడింది.movie story విషయానిక...

'కొత్తబంగారులోకం'తో ట్రెండ్ సెట్ చేసిన లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ ఏర్పడింది.


movie story విషయానికి వస్తే.. స్వప్న (శ్వేతా బసు) మిస్ కావడంతో ఆమె భర్త బాలు (వరుణ్ సందేశ్) వెతకడం మొదలుపెడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో మోహిత్ పెద్దాడ ఎంట్రీ ఇవ్వడం, స్వప్న గతం, అబాన్ ఎవరు అనే మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుంది.


దర్శకురాలు స్వాతి ప్రకాష్ తీసుకున్న ప్లాట్ సింపుల్ అయినప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా వచ్చే రెండు మేజర్ ట్విస్టులు మాత్రం మైండ్ బ్లాక్ చేస్తాయి! హీరో హీరోయిన్లతో పాటు ప్రతి ఒక్కరిపై అనుమానం కలిగేలా నడిపించిన స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. వరుణ్, శ్వేతా బసు తమ మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకోగా, సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఇస్తుంది.


అయితే, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఉండాల్సిన స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఇక్కడ కొంచెం మిస్ అయింది. రన్‌టైమ్ షార్ట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కీ సీన్స్‌ని చాలా రొటీన్‌గా, సింపుల్‌గా ముగించేయడం మైనస్. క్లైమాక్స్ కూడా ఇంకాస్త గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటే బాగుండేది.

Oct 26, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Na wife Missing movie review

థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా కీలకం. ఈ విషయంలో డైరెక్టర్ నాన్-లీనియర్ పద్ధతిని (ముందుకూ వెనకకూ వెళ్లే విధానం) ఫాలో అవుతూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు 'నా వైఫ్ మిస్సింగ్' సినిమాకు బాగా వర్కవుట్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరి మీదా ప్రేక్షకుడికి ఒక రకమైన అనుమానం కలిగేలా...

థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా కీలకం. ఈ విషయంలో డైరెక్టర్ నాన్-లీనియర్ పద్ధతిని (ముందుకూ వెనకకూ వెళ్లే విధానం) ఫాలో అవుతూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు 'నా వైఫ్ మిస్సింగ్' సినిమాకు బాగా వర్కవుట్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరి మీదా ప్రేక్షకుడికి ఒక రకమైన అనుమానం కలిగేలా సీన్స్ రాసుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా కథలో వచ్చే రెండు మెయిన్ ట్విస్టులు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా స్లో అయినట్లు అనిపించినా కూడా ఆడియన్స్ పక్కకు వెళ్లకుండా ఆపగలిగే స్క్రీన్ ప్లేతోనే వచ్చింది. 


ఒక కీలకమైన క్యారెక్టర్ నిజాలు తెలుసుకుని సడెన్‌గా తన మనసు మార్చుకునే సీన్ చూస్తే ఆడియన్స్‌కు మోస్తరుగా కనెక్ట్ అవుతుంది. అలాగే సినిమా నిడివిని వీలైనంత తక్కువగా ఉంచాలనే తొందరలో దర్శకురాలు చాలా సీన్స్‌ను డీటెయిల్డ్‌గా చూపించకుండా పైపైన టచ్ చేస్తూ వెళ్లిపోయారు. సస్పెన్స్ రివీల్ చేసే విధానం ఇంకాస్త ఉత్కంఠభరితంగా ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకాస్త బాగుండేది. ఇక క్లైమాక్స్ కూడా బాగానే డీల్ చేసారు. కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఈ స్క్రీన్ ప్లే రుచిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్‌గా రాసుకుని ఉండుంటే ఇది చాలా మంచి సినిమా అయ్యుండేది. అయినా కూడా ఈ వీకెండ్‌కు డీసెంట్‌గా ఇంట్లో కూర్చుని చూడ్డానికి నా వైఫ్ మిస్సింగ్ బెస్ట్ ఆప్షన్. ఓవరాల్‌గా నా వైఫ్ మిస్సింగ్.. ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా..!

Oct 23, 2026 Read Review
6

Above Average

Na Wife Missing movie review

మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలకు ప్రధాన బలం కథలోని అనుమానాలు, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు, చివర్లో వచ్చే ఊహించని మలుపులు. ‘నా వైఫ్ మిస్సింగ్‌’ కూడా ఇదే ఫార్ములాలో సాగుతుంది. భార్య కనిపించకుండా పోయిన ఘటనను కేంద్రంగా తీసుకుని, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను, గత ప్రేమ వ్యవహారాన్ని, పోలీసుల ద...

మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలకు ప్రధాన బలం కథలోని అనుమానాలు, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు, చివర్లో వచ్చే ఊహించని మలుపులు. ‘నా వైఫ్ మిస్సింగ్‌’ కూడా ఇదే ఫార్ములాలో సాగుతుంది. భార్య కనిపించకుండా పోయిన ఘటనను కేంద్రంగా తీసుకుని, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను, గత ప్రేమ వ్యవహారాన్ని, పోలీసుల దర్యాప్తును మేళవింపుగా ఈ కథ నడుస్తుంది. ఫస్టాఫ్‌ లో బాలు, స్వప్నల వైవాహిక జీవితాన్ని పరిచయం చేస్తూ వారి మధ్య ఉన్న విభేదాలను చూపించారు. స్వప్న కనిపించకుండా పోయిన తర్వాత కథలో అసలు ఉత్కంఠ మొదలవుతుంది. కొన్ని సందేహాలను ప్రేక్షకుల్లో కలిగించడంలో కొన్ని సన్నివేశాలు పనిచేస్తాయి.  


సెకండాఫ్‌లో స్వప్న ఆచూకీ కోసం జరిగే ప్రయత్నాలు, పోలీసుల విచారణ, అనుమానితుల చుట్టూ తిరిగే కథనం ఇంట్రెస్టింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథలోని రెండు కీలక ట్విస్టులు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే, వాటిని ప్రేక్షకులకు మరింత ప్రభావవంతంగా అందించడంలో దర్శకురాలు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు. క్లైమాక్స్‌ వేగంగా ముగియడంతో సస్పెన్స్‌ అంశాల్లోని కిక్‌ మిస్‌ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ, తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తితో సినిమాను చివరి వరకు చూడవచ్చు. ఫైనల్ గా ‘నా వైఫ్ మిస్సింగ్‌’లో ఆసక్తికరమైన కథా పాయింట్‌, రెండు కీలక మలుపులు, వరుణ్ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ నటన ప్రధాన బలాలు. అంచనాలు లేకుండా ఓటీటీలో ఒక మోస్తరు మిస్టరీ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

Oct 23, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Na Wife missing movie review

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కొత్తబంగారులోకం' తర్వాత దాదాపు దశాబ్దం పైగా గ్యాప్ ఇచ్చి ఈ హిట్ జోడీ మళ్లీ కలిసి నటించడంతో ఆడియన్స్‌ లో మంచి హైప్ ఏర్పడింది. కథ విషయానికి వస్తే.. స్వప్న (శ్...

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కొత్తబంగారులోకం' తర్వాత దాదాపు దశాబ్దం పైగా గ్యాప్ ఇచ్చి ఈ హిట్ జోడీ మళ్లీ కలిసి నటించడంతో ఆడియన్స్‌ లో మంచి హైప్ ఏర్పడింది. కథ విషయానికి వస్తే.. స్వప్న (శ్వేతా బసు) కనిపించకుండా పోవడంతో బాలు (వరుణ్ సందేశ్) ఆమె కోసం వెతకడం, ఈ క్రమంలో మోహిత్ పెద్దాడ పాత్ర ఎంట్రీ ఇవ్వడం, అసలు స్వప్న ఎవరు, ఆమె గతం ఏంటి, ఆ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటనేదే ఈ సినిమా ప్లాట్.


దర్శకురాలు స్వాతి ప్రకాష్ ఒక సింపుల్ పాయింట్ తీసుకున్నప్పటికీ, కొన్ని ట్విస్టులతో స్క్రీన్‌ప్లేను నడిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రెండు మేజర్ ట్విస్టులు ఎక్స్‌పెక్ట్ చేయలేం. వరుణ్ సందేశ్, శ్వేతా బసు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయగా, ప్రవీణ్, మోహిత్ సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. అయితే, ఇలాంటి థ్రిల్లర్స్‌లో ఉండే హై-ఎండ్ ఎమోషనల్ డెప్త్ ఈ మూవీలో కొంచెం మిస్ అయింది. రొటీన్ ఫార్మాట్, రన్‌టైమ్ తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని కీలక సన్నివేశాలను పైపైన ముగించేయడం మైనస్‌గా మారింది. క్లైమాక్స్ కూడా ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది.

Oct 23, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Na Wife Missing movie review

‘కొత్త బంగారు లోకం’ జోడీ వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే థ్రిల్లర్ చిత్రం కోసం మళ్లీ కలిసి పనిచేశారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ చిత్రానికి స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఇక సినిమా విషయానికి...

‘కొత్త బంగారు లోకం’ జోడీ వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే థ్రిల్లర్ చిత్రం కోసం మళ్లీ కలిసి పనిచేశారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ చిత్రానికి స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రెండు కీలకమైన ట్విస్ట్లు ఉన్నాయి, వాటిని బాగా రాసుకున్నారు. ప్రారంభ సన్నివేశాలు హీరో, హీరోయిన్ ఇద్దరిపై అనుమానం కలిగించేలా ఉంటాయి, ఆ క్షణాలు బాగా వర్కౌట్ అయ్యాయి. వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు ప్రసాద్ ఇద్దరూ తమ పాత్రల్లో చక్కగా నటించారు. తమ పాత్రలపై అనుమానం కలిగించడంలో వారు విజయవంతమయ్యారు. 


ఈ చిత్రంలో ట్విస్ట్లు బాగా పండాలంటే బలమైన ఎమోషన్స్ అవసరం. ఒక పాత్ర మరొక కీలక పాత్ర అసలు ఉద్దేశాలను తెలుసుకుని హఠాత్తుగా మారిపోతుంది, దాంతో ఆ సన్నివేశం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు. మొత్తంగా చూస్తే, ‘నా వైఫ్ మిస్సింగ్’ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ కారణంగా కొంతమేర మాత్రమే ఆకట్టుకుంటుంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే రెండు ట్విస్ట్లు బాగున్నాయి. అయితే, సినిమాకి మరింత ఎమోషనల్ డెప్త్‌ అవసరమైంది. రన్ టైమ్ తగ్గించాలన్న ఆలోచన వల్ల చిత్రం తాలుకు పూర్తి ప్రభావం ప్రేక్షకుడిపై పడలేదు. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్ట పడేవారికి ఈ సినిమా కొంతవరకే కనెక్ట్ అవుతుంది.


Oct 22, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Na wife missing movie review

పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం లాంటి అంశాలతో ఫ్యామిలీ డ్రామాగా డిజైన్ చేసిన దర్శకురాలు స్వాతి ప్రకాశ్.. ఈ కథలోకి క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాంటి అంశాలను తీసుకొచ్చిన విధానం కొత్తగా ఉంటుంది. కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టి ఈ సినిమాను అనేక మలుపు తిప్పిన విధానం ఈ మూవీలో ప్లస్ పాయింట్....

పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం లాంటి అంశాలతో ఫ్యామిలీ డ్రామాగా డిజైన్ చేసిన దర్శకురాలు స్వాతి ప్రకాశ్.. ఈ కథలోకి క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాంటి అంశాలను తీసుకొచ్చిన విధానం కొత్తగా ఉంటుంది. కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టి ఈ సినిమాను అనేక మలుపు తిప్పిన విధానం ఈ మూవీలో ప్లస్ పాయింట్. కానీ రొటీన్, రెగ్యులర్ తరహాలో స్క్రీన్ ప్లే ఉండటం వల్ల మంచి పాయింట్‌ తో తీసిన సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా సన్నివేశాలు, పక్కాగా స్క్రీన్ ప్లేతో ఈ కథను చెప్పి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. 


తెలుగు ప్రేక్షకులు మెచ్చిన బాలు, స్వప్న క్యారెక్టర్లను కథలోకి తెచ్చిన విధానం, అలాగే కమెడియన్ ప్రవీణ్‌ ను కొత్తగా చూపించిన తీరు విషయంలో డైరెక్టర్ విజన్‌ ను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కోసం సాంకేతిక విభాగాలను వాడుకొన్న తీరు దర్శకురాలి ప్రతిభకు అద్దం పట్టిందనే చెప్పాలి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు ఫర్వాలేదు. అయితే కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండే.. బెస్ట్ కిడ్నాప్, బ్లాక్ మ్యాజిక్ థ్రిల్లర్‌ డ్రామాగా మారి ఉండేది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తగినంత సమయాన్ని కేటాయించి ఒకేసారి చూసేయండి.. మంచి ఫీల్ కలిగే అవకాశం ఉంది.


Oct 22, 2026 Read Review

Public Reviews

2 Avg: 4.5/10
T
Tharuni Small Business Owner
4

Below Average

Na Wife Missing movie Review

just ippude 'Na Wife Missing' movie chusa! Varun Sandesh and Shwetha Basu Prasad 'Kotha Bangaru Lokam' tharvatha malli vacharu ante chala expect chesa, kani movie chusaka so disappointing anipinchindi!Movie run time just 1 hour 40 minutes ye, so fast ga aipoddi. Kani story and screenplay engejing ga...

just ippude 'Na Wife Missing' movie chusa! Varun Sandesh and Shwetha Basu Prasad 'Kotha Bangaru Lokam' tharvatha malli vacharu ante chala expect chesa, kani movie chusaka so disappointing anipinchindi!


Movie run time just 1 hour 40 minutes ye, so fast ga aipoddi. Kani story and screenplay engejing ga levu. and Enni twist lu unna, movie lo asalu emotional connect eh ledu.. emotions eh lekapothe cinema inkem conncet avutundi.


Oka thriller movie ki kavalsina strong investigation, high suspense assalu ledu. Lead pair acting parvaledu anipinchina, weak investigation and routine execution valla peddha ga ekkaledu.

Oct 26, 2026
P
Patwari Sinduja Homemaker / Housewives
5

Average

Na Wife missing movie review

వీకెండ్ లో బోర్ కొడుతుందని, థియేటర్లో అన్ని రొటీన్ సినిమాలే ఉన్నాయని... ఆహాలో " నా వైఫ్ మిస్సింగ్" అని ఎదో సస్పెన్స్ డ్రామా రిలీజ్ అయితే చూసాను. అండ్ 'కొత్తబంగారులోకం' ఫేమ్ వరుణ్ సందేశ్ - శ్వేతా బసు ప్రసాద్ చాలా ఇయర్స్ కి చేసారని ఎక్సయిటింగ్ గా చూసా... బట్ సినిమా అయితే నా expectations కి అస్సలు రీచ్...

వీకెండ్ లో బోర్ కొడుతుందని, థియేటర్లో అన్ని రొటీన్ సినిమాలే ఉన్నాయని... ఆహాలో " నా వైఫ్ మిస్సింగ్" అని ఎదో సస్పెన్స్ డ్రామా రిలీజ్ అయితే చూసాను. అండ్ 'కొత్తబంగారులోకం' ఫేమ్ వరుణ్ సందేశ్ - శ్వేతా బసు ప్రసాద్ చాలా ఇయర్స్ కి చేసారని ఎక్సయిటింగ్ గా చూసా... బట్ సినిమా అయితే నా expectations కి అస్సలు రీచ్ అవలేదు. నేను చాలా ఫ్రెష్ నెస్ ఎక్ష్పెక్ట్ చేశా కానీ అందులో సగం కూడా లేదు.


overall ప్రిటీ ఆర్డినరీ ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తుంది మూవీ. అండ్ సినిమా చూస్తుంటే నాకు కొన్ని పాత సినిమాలు గుర్తొచ్చాయి. అండ్ రెండు ట్విస్టులు వర్కౌట్ అయినా ఎమోషనల్ కనెక్ట్ మాత్రం బిగ్ జీరో! క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా, ఆర్డినరీగా ఎండ్ చేశారు. టైమ్‌పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు కానీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఐతే అస్సలు దక్కదు!

Oct 24, 2026

About This Movie

Story : 

 

కథ విషయానికి వస్తే... బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ అయిన బాలసుబ్రహ్మణ్యం (వరుణ్ సందేశ్) పెద్దలు కుదిర్చిన పెళ్ళికి ఒప్పుకుని స్వప్న (శ్వేతాబసు ప్రసాద్) ని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇష్టం లేకుండానే బాలుని పెళ్లి చేసుకున్న స్వప్న తాను వర్జిన్ కాదని పెళ్లి తర్వాత చెప్తుంది. అందుకే పెళ్లి అయినా ఇద్దరూ సంతోషంగా ఉండలేకపోతారు. ఈ క్రమంలో ఓరోజు స్వప్న కనిపించకపోవడంతో బాలు తన వైఫ్ మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులు బాలుని అనుమానించి అరెస్ట్ చేస్తారు. కానీ అబాన్ (మోహిత్ పెద్దాడ) అనే యువకుడు బాలుని బెయిల్ పై బైటికి తీసుకొస్తాడు. అసలు అబాన్ ఎవరు? స్వప్నకి అబాన్ కి మధ్య రిలేషన్ ఏంటి? స్వప్న గతం ఏంటి? స్వప్న కోసం బాలు ఏం చేసాడు? ఇంతకీ మిస్ అయిన స్వప్న దొరికిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus Points :

 

అయితే కథ పరంగా సింపుల్ కథని తీసుకున్నా దాని చుట్టూ మంచి ట్విస్ట్ లతో కూడిన స్క్రీన్ ప్లే రాసుకున్నారు దర్శకురాలు స్వాతి. ఓ రెండు ట్విస్ట్ లు అయితే గెస్ చేయలేము. వాటిని చాలా బాగా రాసుకున్నారు. ఇక ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరో హీరోయిన్ అని చూడకుండా ప్రతి క్యారెక్టర్ పై అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకుంటారు. అలాగే ఇందులో కూడా స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ల ఇద్దరి మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇక సినిమాలో వరుణ్, శ్వేతా బసు ఇద్దరూ తమ రోల్స్ కి న్యాయం చేసారు. అలాగే కీ రోల్స్ లో నటించిన ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా పెర్ఫార్మ్ చేసారు. 

 

Minus Points :

 

అయితే ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు తక్కువే. అయితే కథ పరంగా బాగానే రాసుకున్న దర్శకురాలు... ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా పూర్తి స్థాయిలో తెరకెక్కించలేదు. ఎందుకంటే ఓ రెండు ట్విస్ట్ లు మినహా మిగతా సినిమా అంతా ఊహించినట్టే ఉంటుంది. రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమా సాగుతూనే ఉంటుంది. ఇక సినిమాలో కొన్ని కీ సీన్స్ ని లోతుగా చూపించాల్సి ఉండాల్సింది. బహుశా రన్ టైం తగ్గించాలని అలా చేసి ఉండొచ్చు. పైగా మూవీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా బలంగా చూపించకుండా ఏదో అలా మాములుగా ముగించేశారు.

 

Technical Values : 


 
టెక్నికల్ పరంగా సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ రచయితగా బాగానే చేసినా, దర్శకురాలిగా అక్కడక్కడా ఇంకా బాగా తీయాల్సింది. సినిమాలో మెయిన్ గా బలమైన ఎమోషన్ మిస్ అయింది. ఇక సినిమాకి బిగ్ ప్లస్ గా నిలిచింది సాయి కార్తీక్ అందించిన బీజీఎమ్. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది.

 

Final Review :

 

ఇక ఓవరాల్ గా "నా వైఫ్ మిస్సింగ్" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా కొన్ని ట్విస్ట్ లు ఎంగేజింగ్ సీన్స్ తో కొంతవరకు మెప్పిస్తుంది. కానీ బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ మిస్ అవడం వల్ల రొటీన్ రెగ్యులర్ డ్రామాలా అనిపిస్తుంది. అయితే వరుణ్ - శ్వేతా బసు కాంబో కోసం, వాళ్ళ పెర్ఫార్మన్స్ కోసం, ఇలానే సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ ఒకసారి ట్రై చేయోచ్చు. 

Review Statistics

5.5
Overall Rating
Avg. of all reviews
10
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.8/10
Public
4.5/10
Why MRO?