డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)
Dont Trouble The Trouble : మలయాళ స్టార్ "ఫహద్ ఫాజిల్" లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్". ఫహద్ ఫస్ట్ టైం తెలుగులో మెయిన్ లీడ్ లో హీరోగా నటించిన ఈ మూవీని శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Reviews
What critics and the public are saying about డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble The Trouble)
Media Reviews
18 Avg: 4.9/10Above Average
Dont Trouble The Trouble movie review
Don't Trouble the Trouble.. 2 hours 36 minutes runtime తో ఉన్న ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఓకే లేదా న్యూట్రల్ గా ఉంటుంది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి బట్ అంత స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ చేయదు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి వచ్చేసర...
Don't Trouble the Trouble.. 2 hours 36 minutes runtime తో ఉన్న ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఓకే లేదా న్యూట్రల్ గా ఉంటుంది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి బట్ అంత స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ చేయదు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మూవీ స్పీడ్ అప్ అవుతుంది. మెయిన్ గా రివీల్ తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ గా అనిపిస్తుంది. అండ్ పార్త్ ఫజల్ గారు అండ్ లిటిల్ గర్ల్ జర్నీలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరి జర్నీని గుర్తు చేసుకున్నట్టే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఎమోషనల్ గా కూడా ఉంది. ఓవరాల్ గా రెగ్యులర్ గా హెవీ మూవీస్ చూసేవాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ అని అనిపించకపోవచ్చు బట్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి ఎస్పెషల్లీ వాళ్ళకైతే వన్ టైం థియేటర్ వాచ్ అని చేయొచ్చు.
ఇక మూవీలో సారా పాలేకార్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. కొన్ని సీన్స్ లో ఫహద్ ఫజల్ గారిని కూడా డామినేట్ చేసినట్టు చాలా ప్లెజెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఫహద్ ఫజల్ గారి బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ అండ్ సీన్ టు సీన్ వేరియేషన్ ఎక్సలెంట్ నో డౌట్ ఇందులో. ఇక వెంకటేష్ కాకుమాను గారి ఫ్రెండ్ రోల్ బాగుంది. మ్యూజిక్ అండ్ బిజిఎం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ గుడ్. హైదరాబాద్ లొకేషన్స్ అమీర్పేట్ మెట్రో, మియాపూర్ మెట్రో, చార్మినార్, వెస్టర్న్ మాల్ సరౌండింగ్స్ ఇవి హైదరాబాద్ లోకల్ ఆడియన్స్ కి బాగా గుర్తు తెప్పిస్తాయి. మైనస్ పాయింట్స్ లాజిక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఇంజ్యుర్డ్ పర్సన్ రోప్ తో కిందకి దిగడం, పోలీస్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వడం లాంటి సీన్స్ కన్విన్సింగ్ గా అనిపించవు. స్టోరీ స్ట్రక్చర్ కొన్ని ప్లేసెస్ లో దేవి పుత్రుడు, సుప్రీం, ఎందుకంటే ప్రేమ ఇలాంటి మూవీస్ గుర్తు చేస్తుంది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పిల్లలకి, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ మిగతా వాళ్ళకి అంటే రెగ్యులర్ గా లైక్ లాజికల్ ఫిలిమ్స్ చూసేవారికి, మనలా అంత హెవీగా ఫిలిమ్స్ చూసేవారికి అంత ఎంటర్టైనింగ్ ఫిలిం అనిపించకపోవచ్చు బట్ స్టిల్ నా వరకు అయితే వన్ టైం వాచబుల్ అని.
Below Average
Dont Trouble The Trouble Movie review
#DontTroubleTheTrouble A Troublesome Watch!A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading...
#DontTroubleTheTrouble A Troublesome Watch!
A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s writing and execution often feel amateurish and oddly childish.
Fahadh Faasil tries, but there’s only so much he can do with the material, while his dubbing feels out of place at times. Not a memorable Telugu lead debut for him. Boring!
Rating: 2/5
Below Average
Dont trouble the trouble movie review
#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ #IDreamMediaRating 2/5ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదుసింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్నకథ..ఏమిటి..ఎలా అన్నది విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటేసెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.…అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లిప్రీ క్లయిమాక్స్...
#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదు
సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న
కథ..ఏమిటి..ఎలా అన్నది
విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.
ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటే
సెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.
…
అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లి
ప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.
మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు
అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వదిలేసారు
..
ప్లస్ పాయింట్లు
నటీనటుల నటన
మేకింగ్..ఎగ్జిక్యూషన్
…
మైనస్ పాయింట్లు
సెకండాఫ్ స్క్రిప్ట్
…
పంచ్ లైన్
డోంట్ గెట్ ఇన్ ద ట్రబుల్
Above Average
Dont Trouble The Trouble movie review
ఇక డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. అసలు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని థాట్ గుడ్ అండి. Because let me tell you why. థియేటర్ లో ఒక 30 మంది ఉంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కామెడీస్ అండి. This film is made for kids. అంటే సినిమాలో మనకి డిస్టర్బింగ్ ఇమేజరీ గానీ, వైలెన్స్ గానీ, స్లీజీన...
ఇక డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. అసలు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని థాట్ గుడ్ అండి. Because let me tell you why. థియేటర్ లో ఒక 30 మంది ఉంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కామెడీస్ అండి. This film is made for kids. అంటే సినిమాలో మనకి డిస్టర్బింగ్ ఇమేజరీ గానీ, వైలెన్స్ గానీ, స్లీజీనెస్ గానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్ గా ప్రెసెంట్ చేశారు. సో ఇది కూడా పాజిటివ్ గానే చెప్తావా అంటే చెప్పాలి బికాజ్ ఇలాంటి సినిమాలు రావట్లేదు కాబట్టి.
And then my second one, సినిమా ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ ఎంగేజింగ్ అండి. అంటే పాప లాంటి ఒక కరిస్మాటిక్ యాక్టర్, ఓ చిన్న పాప who is cute and who performs really well, అండ్ దెన్ ఇంకొక కుక్కపిల్ల. సో ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్ కచ్చితంగా వర్క్ అవ్వాల్సిందే అండ్ ఫస్ట్ హాఫ్ లో అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. And now the biggest positive is the leads, ఫాఫా అండ్ బేబీ సారా. ఫహద్ గురించి నేను చెప్పేది ఏముంది, he is a proven actor. ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ ఎంగేజింగ్, లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అండ్ కాలభైరవస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
బట్ మూవీ లెంత్ గా ఎక్కువగా అనిపిస్తది. నాకు ఎప్పుడూ మూవీ లెంత్ తో ప్రాబ్లం ఉండదు until and unless it is not engaging. ప్రీ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటదండి. ఆ సీక్వెన్స్ ఆ సీన్ లో ఉన్న పొటెన్షియల్ కి మనకి గుండె పిండేసే సీక్వెన్స్ అన్నమాట. కానీ ఆ సీక్వెన్స్ మనకి ఈ సినిమాలో అంతగా వర్క్ కాలేదు. ఎందుకంటే ఆ సీక్వెన్స్ లో ఫహద్ క్యారెక్టర్ చేంజ్ అవుతది అన్నమాట. సో ఇలాంటివి అన్నమాట. ఆ క్యారెక్టర్స్ గనక కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే కొన్ని సీన్స్ బ్రిలియంట్ గా వర్క్ అయ్యేవి. To be honest చెప్పాలంటే ఓవరాల్ గా ఒక రెగ్యులర్ ఎండింగ్ కి వెళ్ళిపోవచ్చు అండి.
Above Average
Dont Trouble The Trouble Movie Review
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ గురించి చెప్పాలంటే ఓకే ఓకే పర్లేదు అన్నట్టు ఉందన్నమాట సినిమా. దానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ చెప్తున్నా చాలా బాగా అనిపిస్తది. చాలా సేపు ఏడ్చా. దానికి రీజన్ మే బి దానికి ముందు ఏదైతే సెటప్ అంతా పెట్టుకుంటూ వచ్చారో దానికి పే ఆఫ్ లాగా అయి ఉండొచ్చు కానీ...
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ గురించి చెప్పాలంటే ఓకే ఓకే పర్లేదు అన్నట్టు ఉందన్నమాట సినిమా. దానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ చెప్తున్నా చాలా బాగా అనిపిస్తది. చాలా సేపు ఏడ్చా. దానికి రీజన్ మే బి దానికి ముందు ఏదైతే సెటప్ అంతా పెట్టుకుంటూ వచ్చారో దానికి పే ఆఫ్ లాగా అయి ఉండొచ్చు కానీ దానికి ముందు అంతా ఏదైతే సెటప్ పెట్టారో అది చాలా ఫ్లాట్ ఉంటది అబ్బా. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా డల్లుగా వెళ్తుంటది సినిమా. ఏదో అక్కడక్కడ ఒక నాలుగు ఐదు డైలాగ్ ఓరియెంటెడ్ జోక్స్ అంటే మనలాంటివి ఉంటాయి కదా లైక్ ఫైవ్ సిక్స్ ప్లేసెస్ లో ఫైవ్ సిక్స్ డైలాగ్ వర్క్ అవుట్ అవుతాయి అంతే. ఇంకేమి కూడా అంత వర్క్ అవుట్ కాదు. లిటరల్లీ చాలా బ్యాడ్ అనిపిస్తది మనకి.
అంటే పిల్లలకు బాగుంటది ఓకే పిల్లలకు అది బాగా అనిపిస్తది బికాజ్ ఆ యానిమేషన్ కొంచెం లైక్ ఆ పాప అది కొంచెం సోపాస్ లాగా ఇవన్నీ కూడా మనకి ఏదో చూపించారు ఆ గోస్ట్లీ వైబ్స్ ఇదంతా కూడా. సో ఐ మే బి పిల్లలకు బాగా నచ్చుతాయి ఎందుకంటే నేను వెళ్లి ఆడిటోరియం వచ్చి ట్రిపుల్ ఏ స్క్రీన్ లో చూశాను. సో యాక్చువల్ గా మొన్నే కదా ఓపెన్ అయింది. సో దాంట్లోకే వెళ్ళాను అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే తెలుస్తోంది. లైక్ లైక్ అంటే ఇంకా చాలా బెటర్ గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతూ ఉంటది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మిస్ అయిన ఫీలింగ్ అన్నది.
సో అది ప్రాబ్లం. అంటే ఎప్పుడైనా సరే జనరల్ గా చెప్తాను చూడండి ఒక స్టోరీలో మే బి ఒక రెండు క్యారెక్టర్స్ చుట్టూ లేదా నాలుగు క్యారెక్టర్స్ చుట్టూ కథను తిప్పేటప్పుడు జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఉండే ప్రాబ్లం ఇదే అనిపిస్తుంటది. అంటే ఆ వెళ్ళే విధానం అనేది కొత్త కొత్త ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో యాడ్ అవ్వట్లేదు. వాడి చుట్టూ అక్కడికి పోతుంది సినిమా. అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ అంతా నీరసమే అసలు ఆబ్వియస్లీ. సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ లైట్ గా సో బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ ఆడియన్స్ కి ట్రబుల్ లాగే మిగిలింది. అది మేటర్ అన్నమాట. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ 2.95 అవుట్ ఆఫ్ ఫైవ్.
Dont Trouble The Trouble Movie Review
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి కథలు గతంలో బోలెడు సినిమాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఓ పాపకి కష్టం రావడం, ఒక్కతే ఉండి హీరో దగ్గరకు చేరడం, హీరో పాప కష్టాన్ని స...
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇక తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి కథలు గతంలో బోలెడు సినిమాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఓ పాపకి కష్టం రావడం, ఒక్కతే ఉండి హీరో దగ్గరకు చేరడం, హీరో పాప కష్టాన్ని సాల్వ్ చేయడం.. అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం నుంచి భజరంగి భాయ్ జాన్ వరకు బోలెడన్ని సినిమాలు వచ్చాయి ఈ కథతో.
ఇక సినిమాలో అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. ఎమోషన్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో రాసుకున్న పలు డైలాగ్స్ తో క్లైమాక్స్ ఇంకా కొనసాగింపు ఇచ్చి ఇంకో ముగింపు ఇచ్చుకునే అవకాశం ఉంది కానీ ఇలాంటి ముగింపు ఇచ్చాడేంటి అని ఆలోచించాల్సిందే. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. చిన్న పిల్లలకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరదాగా ఓ సారి అయితే చూడొచ్చు. మొత్తంగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ డబ్బు కోసం ఏ పనైనా చేసే హీరో దయ్యం అని తెలియాక ఓ పాప ఆత్మని కిడ్నాప్ చేస్తే ఏం జరిగింది అని కామెడీ ఎమోషన్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
Average
Dont Trouble The Trouble Movie Review
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మల మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుక...
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వినడానికి ఒక చందమామ కథలా ఉంటుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మల మారి ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నల కోసం వెతుక్కోవడమే ఈ సినిమా కథ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయిన విషయం తనకు తెలియదు. ఒక చిన్న లింకు పెట్టి ఆ అమ్మాయి కేవలం హీరోకి మాత్రమే కనిపించేలా దర్శకుడు ఒక లాజిక్ రాసుకున్నాడు. అదేంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.. అయితే సినిమాలో రాసుకునే సన్నివేశాలు ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది.
సెకండాఫ్ లో కూడా కథ కాస్త నెమ్మదిగానే వెళ్ళింది. అయితే చెప్పే ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా చెప్పాలని ముందుగానే ఫిక్స్ అయిపోయిన దర్శకుడు టైం బాగానే తీసుకున్నాడు. కథలో మెయిన్ ప్లాట్ రివిల్ అయిన తర్వాత.. హీరోకు, ఆ పాపకు మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా రాసుకోవడంలో తడబడినట్టు అనిపించింది. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండానే అప్పటివరకు ఆ పాప మీద ఎలాంటి ఫీలింగ్ లేని హీరో సడన్గా తనకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత బలంగా నిలబడతాడు. ఇలాంటి సన్నివేశాలు రాసుకునేటప్పుడు దానికి ముందు మరికొన్ని బలమైన ఎమోషనల్ సన్నివేశాలు రాసుకుంటే సినిమా మరింత పకడ్బందీగా వచ్చేది. ఓవరాల్ గా వీకెండ్ సరదాగా చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీతో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఇది మంచి ఆప్షనే.
Average
Dont Trouble The Trouble Movie Review
ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు ప్రధాన బలం ఫహద్ ఫాజిల్ నటన. పూర్తిస్థాయి ఫాంటసీ కామెడీ పాత్రలో ఆయన తన టైమింగ్, ముఖ కవళికలు, స్వయంగా చెప్పుకున్న తెలుగు డైలాగ్ డెలివరీతో సీన్లను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ తన తొలి తెలుగు చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరిచింది. వారితో ప...
ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు ప్రధాన బలం ఫహద్ ఫాజిల్ నటన. పూర్తిస్థాయి ఫాంటసీ కామెడీ పాత్రలో ఆయన తన టైమింగ్, ముఖ కవళికలు, స్వయంగా చెప్పుకున్న తెలుగు డైలాగ్ డెలివరీతో సీన్లను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ తన తొలి తెలుగు చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరిచింది. వారితో పాటు ఉండే బీగల్ కుక్క పిల్ల సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే కథ, కథనంలో సరైన భావోద్వేగాలు లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన బలహీనత. ట్రైలర్లోనే కథాంశం చాలా వరకు బయటపడటంతో స్క్రీన్‌పై కొత్తదనం లోపించింది.
ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు వర్కవుట్ అయినప్పటికీ.. సెకండాఫ్‌లో వచ్చే విచారణ ట్రాక్ కథనాన్ని బాగా నెమ్మదింపజేస్తుంది. కథలో బలమైన ఘర్షణ లేకపోవడం వల్ల క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా పండకపోవడం మైనస్ పాయింట్ గా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా అక్కడక్కడా మాత్రమే నవ్వించే ఓ సగం పండిన ఫాంటసీ డ్రామా. ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన, చిన్నారి సారా పాలేకర్ క్యూట్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.
Below Average
Dont Trouble The Trouble Movie Review
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. అయితే కథ విషయానికి వస్తే.. నిజం చెప్పాలంటే... దర్శకుడు శశాంక్ ఎంచుకున్న మెయిన్ ప్లాట్‌లోనే ఎలాంటి కొత్తదనం లేదు. పైగా స్క్రీన్‌ప్లే నడిపించిన తీరు అత్యంత నిమ్మకాయ రసం పిండినట్లు స్లోగా సాగుతుంది! సిని...
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. అయితే కథ విషయానికి వస్తే.. నిజం చెప్పాలంటే... దర్శకుడు శశాంక్ ఎంచుకున్న మెయిన్ ప్లాట్‌లోనే ఎలాంటి కొత్తదనం లేదు. పైగా స్క్రీన్‌ప్లే నడిపించిన తీరు అత్యంత నిమ్మకాయ రసం పిండినట్లు స్లోగా సాగుతుంది! సినిమాలో స్పీడ్ మిస్ అవ్వడం వల్ల ఆడియన్స్‌కి ఫస్ట్ హాఫ్‌లోనే విపరీతమైన బోర్ కొడుతుంది. అసలు కథనంలో గ్రిప్ లేకపోవడంతో ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేస్తున్నారు.
అయితే, సెకండ్ హాఫ్‌లో ఒక ఊహించని ట్విస్ట్ పడుతుంది! హీరో తాను కిడ్నాప్ చేసిన చైల్డ్ నిజానికి ఒక ‘పిల్ల దెయ్యం’ అని తెలుసుకుని భయంతో వణికిపోయే సన్నివేశంలో మాత్రం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూస్తాయి! ఆ ఒక్క బ్లాక్‌లో అద్భుతమైన వైబ్ క్రియేట్ అయింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే... ఆ ఒక్క సీన్ తప్ప దానికి ముందు కానీ, దాని తర్వాత కానీ అలాంటి కామెడీ గానీ, ఎమోషన్ గానీ ఎక్కడా రిపీట్ అవ్వలేదు! మెయిన్ ప్లాట్‌లో కంటెంట్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్షన్ అసలే దొరక్కపోవడంతో థియేటర్‌కి వెళ్లి భారీ అంచనాలతో కూర్చున్న సగటు మూవీ లవర్ పెదవి విరవాల్సిందే! ఓవరాల్ గా చూస్తే... ఇది పూర్తిగా చిన్న పిల్లలను మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసిన కాన్సెప్ట్! కాబట్టి వీకెండ్‌లో పేరెంట్స్ తమ కిడ్స్‌తో కలిసి సరదాగా టైమ్‌పాస్ చేయడానికి వెళ్తే కొంతలో కొంత సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ దక్కే ఛాన్స్ ఉంది. కానీ మాస్ అండ్ క్లాస్ మూవీ గోయర్స్ మాత్రం కాస్త ఆలోచించి వెళ్లడం బెటర్!
Below Average
Dont Trouble The Trouble Movie Review
`డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` మూవీ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచింది. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించడం, ట్రైలర్‌లో మ్యాజికల్ అంశాలు ఆకట్టుకోవడం, బిగ్ స్టార్స్ సినిమా బాగుందని ట్వీట్లు చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం వెనకబడిందని చెప్పొచ్చు. మెయిన్‌గా టైటిల్...
`డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` మూవీ టైటిల్‌తోనే ఆసక్తిని పెంచింది. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించడం, ట్రైలర్‌లో మ్యాజికల్ అంశాలు ఆకట్టుకోవడం, బిగ్ స్టార్స్ సినిమా బాగుందని ట్వీట్లు చేయడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం వెనకబడిందని చెప్పొచ్చు. మెయిన్‌గా టైటిల్ కి, కథకి ఏమాత్రం సంబంధం కనిపించలేదు. ఈ మూవీ చిన్నారి పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప ఎవరికీ కనిపించదు, మరి ఆత్మనా? దేవతా? అనే సస్పెన్స్ అంశాలతో సాగుతుంది.
అయితే సినిమా ద్వారా ఫన్ చూపించాలనుకున్నారా? ఎమోషనల్ గా చూపించాలనుకున్నారా? మ్యాజిక్ చుట్టూ తిప్పాలనుకున్నారా అనేది క్లారిటీ మిస్ అయ్యింది. సినిమా ప్రారంభంలో హీరో పాత్ర తాలూకు క్యారెక్టరైజేషన్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. అది సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఆ తర్వాత రొటీన్‌గా మారుతుంది. ఇక బేబీ దివ్య పాత్ర ఎంట్రీ తర్వాత మరికొంత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కానీ ఆ తర్వాత అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. లాజిక్ లెస్‌గానూ అనిపిస్తుంది. ఇక ఆ పాపకి సంబంధించిన ట్విస్ట్ ఆడియెన్స్ కి ముందే అర్థమవుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. అమ్మాయి పాత్ర తాలుకూ ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ కావడం ఎమోషనల్‌గా ఉంటుంది. ఎండింగ్ కూడా ఎమోషనల్‌గా ముగించారు. ఫైనల్ గా క్లైమాక్స్ కాసేపు తప్ప మిగిలినదంతా ట్రబులే. మ్యాజిక్ చేయలేకపోయిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్`.
Average
Don’t Trouble The Trouble Movie Review
Don’t Trouble The Trouble is a comedy-fantasy film that attempts to blend a whimsical Disney-Pixar-like feel with fantasy, adventure and emotion. It marks Fahadh Faasil’s first Telugu film in a leading role and carries its own curiosity with the names attached to it. Positives:Suri (Fahadh) and...
Don’t Trouble The Trouble is a comedy-fantasy film that attempts to blend a whimsical Disney-Pixar-like feel with fantasy, adventure and emotion. It marks Fahadh Faasil’s first Telugu film in a leading role and carries its own curiosity with the names attached to it.
Positives:
Suri (Fahadh) and Divya’s (Ssara) bond
Emotional portions towards the climax
Negatives:
Uneven Screenplay
Weak Antagonist Characterisation
Lack Of Emotional Connect
Don’t Trouble The Trouble clearly intends to be a whimsical fantasy adventure with a Disney-Pixar-like emotional touch. The deliberate attempt to give the two central characters, a touch of Disney animation character-like nuances, was clearly to be seen. The makers of the film used the two central characters and packaged it with fantasy, comedy and emotion. And, the result is a fairly engaging film which has its own bit of flaws.
An interesting premise, a very lovable performance by Ssara Palekar, a heart-touching performance by Fahadh Faasil during the pre-climax and a few funny moments around the fantasy element, made Don’t Trouble The Trouble, a fairly engaging film. A bit more care in writing, would have made the film much better.
Bottom Line: Some Trouble – But Not Troublesome
Rating – 2.5/5
Average
Dont Trouble the Trouble movie review
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశాక కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో స్పీడ్ లేకపోవడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద మైన్స్ పాయింట్. హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడే ఒక్క సీన్‌లో మాత్రమే థియేటర్‌లో కాస్త నవ్వులు పూస్తాయి. ఆ ఒక్క చోట ఊహించని మంచి వైబ్ క్రియేట్ అయినా, దాన...
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశాక కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో స్పీడ్ లేకపోవడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద మైన్స్ పాయింట్. హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడే ఒక్క సీన్‌లో మాత్రమే థియేటర్‌లో కాస్త నవ్వులు పూస్తాయి.
ఆ ఒక్క చోట ఊహించని మంచి వైబ్ క్రియేట్ అయినా, దానికి ముందు గానీ, తర్వాత గానీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు శశాంక్ పూర్తిగా విఫలమయ్యాడు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి ఇది కంప్లీట్ హెడేక్ లా అనిపిస్తుంది.
ఫైనల్ గా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్ కి కథకి లింకు సంగతి పక్కన పెడితే, ఆడియన్స్ ని మాత్రం ద్వితీయార్థం కొంత, ప్రీ క్లైమాక్స్ కొంత ట్రబుల్ కి గురి చేస్తుంది.
Average
Dont Trouble the trouble movie review
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. ఫహద్ ఫాజిల్ నటించిన కామెడీ హారర్ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా కథాంశంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో ఉండాల్సిన వేగం లోపించడమే ఈ చిత్రానికి ఎదురైన అతిపెద్ద ప్రతికూలాంశం. అయితే, హీరో తాను కిడ్నాప్ చేసినది ఒక పిల్ల దెయ్యాన్ని అన...
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. ఫహద్ ఫాజిల్ నటించిన కామెడీ హారర్ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా కథాంశంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, కథనంలో ఉండాల్సిన వేగం లోపించడమే ఈ చిత్రానికి ఎదురైన అతిపెద్ద ప్రతికూలాంశం. అయితే, హీరో తాను కిడ్నాప్ చేసినది ఒక పిల్ల దెయ్యాన్ని అని గ్రహించి భయాందోళనకు గురయ్యే సన్నివేశం థియేటర్లలో ఆకట్టుకునే నవ్వులను పూయించింది. ఆ ఒక్క సన్నివేశంలో చక్కటి వైబ్ క్రియేట్ అయినప్పటికీ, దానిని ముందుకు తీసుకెళ్లడంలో లేదా సినిమాలో ఎమోషన్స్ సరిగ్గా పండించడంలో దర్శకుడు శశాంక్ పూర్తిగా విఫలమయ్యారు.
బలమైన కథ, ఆకట్టుకునే కథనం లేకపోవడంతో ఈ చిత్రం సగటు సినిమా అభిమానులను నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. అయితే నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బాగుండేది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటె సినిమా రిసల్ట్ వేరేలా ఉండేది. ఫైనల్ గా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్... ట్రబుల్ చేయదు.
Average
Dont Trouble The Trouble Movie Review
ఓపెనింగ్స్ కోసమని సినిమాలకు ఓవర్ హైప్ క్రియేట్ చేస్తే అవి అసలుకే ఎసరు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుడికి, భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళే వారికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం అటూ ఇటూ ఉన్నా.. అంచనాలతో వెళ్ళే వారు పెదవి విరవడం ఖాయం. డోంట్ ట్రబుల్ ద ట్ర...
ఓపెనింగ్స్ కోసమని సినిమాలకు ఓవర్ హైప్ క్రియేట్ చేస్తే అవి అసలుకే ఎసరు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుడికి, భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళే వారికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం అటూ ఇటూ ఉన్నా.. అంచనాలతో వెళ్ళే వారు పెదవి విరవడం ఖాయం. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ స్టార్స్ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి. కానీ కథాంశంలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన లోటు.
హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడినప్పుడు థియేటర్ లో నవ్వుల జల్లలు కరుస్తాయి. ఓ ఊహించని వైబ్ క్రియేట్ అయ్యింది. కానీ దానికి ముందు లేదా తర్వాత అలాంటి స్పందన కనిపించలేదు. ముఖ్యంగా ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు శశాంక్ విఫలమయ్యాడు. సినిమాలో అసలు కథ, కథనాలలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది. ఓవరాల్ గా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాబట్టి పేరెంట్స్ కిడ్స్ తో కలిసి థియేటర్స్ కు వెళితే, కొంతలో కొంత ఫలితం దక్కొచ్చు!
Below Average
Dont Trouble The Trouble Movie Review
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు దర్శకుడు శశాంక్ యేలేటి చెప్పాలనుకొన్న బేసిక్ పాయింట్ చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఆయన రాసుకొన్న బ కథలో క్లారిటీ లేకపోవడం, చెప్పాలనుకొన్న స్టోరిని ఎమోషనల్‌గా చెప్పలేకోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పాలి. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను ప్రారంభంలో బాగా రాసుకొన...
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకు దర్శకుడు శశాంక్ యేలేటి చెప్పాలనుకొన్న బేసిక్ పాయింట్ చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఆయన రాసుకొన్న బ కథలో క్లారిటీ లేకపోవడం, చెప్పాలనుకొన్న స్టోరిని ఎమోషనల్‌గా చెప్పలేకోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పాలి. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను ప్రారంభంలో బాగా రాసుకొన్నాడు. కానీ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా గ్యాప్ తీసుకోవడంతో కథ అక్కడక్కడే తిరుగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది.
అయితే సెకండాఫ్‌లోనైనా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాడా? అని ఎదురు చూసిన వాళ్లకు నిరాశ మిగిలింది. అవసరం లేకున్నా సాగదీసినట్టు ఉండే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మూవీ డెస్టినీ ఏమిటో డిసైడ్ అయినట్టు అర్ధమవుతుంది. ఇక దివ్యకు సంబంధించిన స్టోరిని చివర్లో ఓపెన్ చేసినప్పటికీ.. చాలా పేలవంగా ఉండటంతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్ ఇంకా నాసిరకంగా ఉండటం, పాత చింతకాయ పచ్చడి తరహా ముగింపుతో ఈ సినిమా అతి సాధారణం అనే విషయానికి క్లారిటీ వచ్చింది. ఓవరాల్ ఓవరాల్ గా కథ, కథనాలపై దర్శకుడు ఇంకా బెటర్‌గా వర్కవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.
Average
Dont Trouble The Trouble Movie Review
ఫాంటసీ కథల్ని సరిగా డీల్ చేస్తే.. భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. లాజిక్ తో సంబంధం లేకుండా ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవాలి. ఎమోషన్ కూడా పండేలా చూసుకోవాలి. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో కొంతమేర ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని క్రేజీ సీన్లతో వినోదాన్ని పంచగలిగారు. లీడ్ క్యారెక్టర్లు...
ఫాంటసీ కథల్ని సరిగా డీల్ చేస్తే.. భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. లాజిక్ తో సంబంధం లేకుండా ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. ఆసక్తికర సన్నివేశాలు రాసుకోవాలి. ఎమోషన్ కూడా పండేలా చూసుకోవాలి. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో కొంతమేర ఆ ప్రయత్నం జరిగింది. కొన్ని క్రేజీ సీన్లతో వినోదాన్ని పంచగలిగారు. లీడ్ క్యారెక్టర్లు బాగున్నాయి.. వాటిని పోషించిన ఆర్టిస్టులూ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఎమోషన్ కూడా కొంత వర్కవుట్ అయింది. కానీ మరీ ప్రెడిక్టబుల్ గా ఉండే కథ.. కొన్ని ఇల్లాజికల్ సీన్లు.. సరిగ్గా కుదరని పేఆఫ్ వల్ల మ్యాజిక్ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు.
ద్వితీయార్ధంలో మాత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ నిరాశపరుస్తుంది. ప్రథమార్ధం ఉన్న ఫన్ అంతా ఉన్నట్లుండి మాయమైపోతుంది. కథలో పెద్దగా సర్ప్రైజులు లేకుండా.. చాలా సాధారణమైన సన్నివేశాలతో నడించే ద్వితీయార్ధం ఎంగేజింగ్ గా అనిపించదు. సుదీర్ఘంగా సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ బోర్ కొట్టిస్తుంది. ఆ సీన్ పర్పస్ ఏంటో అర్థం కాదు. హీరో-పాప మధ్య బలమైన బాండింగ్ ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎమోషన్ పండించడానికి అవకాశముండేది. పాప తల్లిదండ్రులకు సంబంధించి ఇందులో పెట్టిన ఒక ఎపిసోడ్ ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ కొంతమేర వినోదాన్ని పంచినా.. అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. చివరగా: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. కొంచెం ఫన్- ఎక్కువ ట్రబుల్.
Above Average
Dont Trouble The Trouble Movie review
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఏం తెలియని ఓ పాప ఆత్మ చుట్టూ డ్రామా సాగుతుంది. దీన...
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఏం తెలియని ఓ పాప ఆత్మ చుట్టూ డ్రామా సాగుతుంది. దీనికి తోడు, ఈ సినిమాలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే.. సినిమా మొదట్లో కాన్ ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ వచ్చిన ఈ హారర అండ్ ఎమోషనల్ డ్రామాలో.. హారర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఫాహద్ ఫాజిల్ నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. ఐతే, కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం కొన్ని చోట్లే ఆకట్టుకుంది.
Average
Dont Trouble The Trouble Movie Review
ఫాహద్ ఫాజిల్ ఓ తెలుగు కథకి ఓకే చెప్పి.. హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగా రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారంతా కూడా ప్రమోషన్స్‌లో తమ వంతు సాయం చేశారు. దీంతో సినిమా మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. అయితే సినిమా చూసాక కథ గురించి చెప్పుకుంటే... ఓ గమ్...
ఫాహద్ ఫాజిల్ ఓ తెలుగు కథకి ఓకే చెప్పి.. హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానికి తగ్గట్టుగా రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారంతా కూడా ప్రమోషన్స్‌లో తమ వంతు సాయం చేశారు. దీంతో సినిమా మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. అయితే సినిమా చూసాక కథ గురించి చెప్పుకుంటే... ఓ గమ్యం అంటూ లేకుండా డబ్బు కోసం ఏ పని అయినా చేసే ఓ వ్యక్తి.. అతడికి మాత్రమే కనిపించే ఓ ఆత్మ.. ఆ ఆత్మకి ఓ ఫ్లాష్ బ్యాక్.. ఆ ఆత్మ ఈ వ్యక్తికి సాయం చేయడం.. మళ్లీ ఈ వ్యక్తి ఆ ఆత్మకి సాయం చేయడం అనే పాయింట్‌తో ఈ సినిమాని శశాంక్ రాసుకున్నాడు. అయితే ఇలాంటి కథల్ని మనం ఇది వరకే చూశామే.. అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా ఒక్క చోట కూడా కొత్త సీన్ కనిపించదు.
లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి చూద్దామన్నా కూడా ఎమోషన్ కూడా క్యారీ కాదు. ఎక్కడా కూడా అరెరె పాపం.. అయ్యో.. అన్న ఫీలింగ్ కూడా కలగదు. అయితే చిన్న పిల్లలకు అంతో ఇంతో ఈ మ్యాజిక్ నచ్చడం, దివ్య పాత్ర కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫహాద్, సారా కాంబో సీన్స్ కొన్ని చోట్ల ఆడియెన్స్‌కి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కథ, కథనంలోనే చాలా వరకు సోల్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. లాజిక్స్ మిస్ అవ్వడం, ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. చివరగా.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనేది ఆడియెన్స్ కి చాలా వరకు ట్రబుల్ ఇచ్చేలానే ఉంటుంది. అయితే పిల్లలు మాత్రం కాస్త రిలీఫ్‌గా ఫీలై ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
Public Reviews
3 Avg: 4.3/10Below Average
Dont Trouble The Trouble Movie Review
just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi. but industry big stars promote chestunte ne...
just ippude Dont Trouble The Trouble movie first show chusostunna. movie ayithe chala dull ga anipinchindi. story line bane undi. but ilanti movie chinnappude chala chusesam kada.. and aa movies gurtu cheste kooda ee cinema story mottham reveal ayipotundi.
but industry big stars promote chestunte nenedo pedda storye undemo anukunte.. edo chandamama kathalaga.. chinna pillala cinema icchadu. pone idaina entertaining ga unda ante adi kooda ledu. but fahad and aa child artist baga perfarm chesaru.
and ee cinema evaraina chudalanukunte already other movies kooda release ayyi. vere movies kooda dissapoint chesela unte.. ee cinema one of the option ga tiskunte better. and takkuva expectations pettukuni chustene konchem ayina connect ayye chance undi.
Below Average
Dont Trouble The Trouble movie review
మూవీ గురించి అనవసరంగా అనుకున్నదానికన్నా ఎక్కువ హైప్ ఇస్తుంటే అప్పుడే అనుకున్నా.. ఎదో తేడా కొడుతుందని.. అయినా ఫహద్ ఫాజిల్ మూవీ సెలక్షన్ పై నమ్మకంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకెల్లా. ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే కథ చెప్పేసాడు. నాకైతే సినిమా సెకండ్ హాఫ్ లో నిద్రొచ్చేసింది.అసలు సినిమాలో షార్ట్ ఫిల్మ్ కథన...
మూవీ గురించి అనవసరంగా అనుకున్నదానికన్నా ఎక్కువ హైప్ ఇస్తుంటే అప్పుడే అనుకున్నా.. ఎదో తేడా కొడుతుందని.. అయినా ఫహద్ ఫాజిల్ మూవీ సెలక్షన్ పై నమ్మకంతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకెల్లా. ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే కథ చెప్పేసాడు. నాకైతే సినిమా సెకండ్ హాఫ్ లో నిద్రొచ్చేసింది.
అసలు సినిమాలో షార్ట్ ఫిల్మ్ కథని, సినిమాగా చేసి చూపించాడు. పోనీ అదేమైనా ఎంటర్టైనింగ్ గా ఉందా అంటే అది కూడా కాదు. చూడ్డానికి కామెడీ సీన్స్ వస్తున్నా... హార్ట్ ఫుల్ గా నవ్వురాదు. బట్ మూవీలో ఎలాంటి వల్గారిటీ, పెద్దా వైలెన్స్ లేవు. సో పిల్లల కోసమే ఈ సినిమా తీసినట్టుంది. వాళ్ళను తీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. బట్ ఎదో ఫ్రెష్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిస్సపాయింట్ అవుతారు.
Average
Dont Trouble The Trouble Review
జస్ట్ ఇప్పుడే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ షో చూసాను. నాకైతే సినిమా చాలా యావరేజ్ గా అనిపించింది. ట్రైలర్ డీసెంట్ గా ఉన్నా, మూవీ వాళ్ళు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. ఎదో కొత్తగా సినిమాలో ఎదో ఉందనుకున్నా కానీ.. పెద్దగా కథ కాదు కదా! కామెడీ కూడా ఏమి లేదు. అంటే ఫ్రెష్ కంటెంట్ ఏమి లేదు. ఎం...
జస్ట్ ఇప్పుడే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ షో చూసాను. నాకైతే సినిమా చాలా యావరేజ్ గా అనిపించింది. ట్రైలర్ డీసెంట్ గా ఉన్నా, మూవీ వాళ్ళు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. ఎదో కొత్తగా సినిమాలో ఎదో ఉందనుకున్నా కానీ.. పెద్దగా కథ కాదు కదా! కామెడీ కూడా ఏమి లేదు. అంటే ఫ్రెష్ కంటెంట్ ఏమి లేదు.
ఎంతో కొంత ఫహద్ అండ్ ఆ చిన్న పాప యాక్టింగ్ వాళ్ళ సీన్స్ బాగుంటాయి. అండ్ ఈ సినిమా పాయింట్ తెలుగులో ఆల్రెడీ వెంకటేష్ దేవిపుత్రుడు కాన్సెప్ట్ లాగే ఉంటుంది. చాలా మందికి అది చూస్తే తెలుస్తుంది. బట్ రీసెంట్ గా వచ్చిన కొన్ని వరెస్ట్ మూవీస్ కంటే ఇది చాలా బెటర్. పిల్లల్ని కూడా సినిమాకి తీసుకెళ్లొచ్చు. నరుక్కోవడాలు, చంపుకోవడాలు ఉండవు. బట్ డైరెక్టర్ స్టోరీ మీద కొంచెం ఫోకస్ పెట్టుంటే మంచి రిసల్ట్ ఒచ్చిండేదేమో.
About This Movie
Story :
ఒక అంబులెన్స్ డ్రైవర్ అయిన సూరి (ఫహాద్ ఫాజిల్) అతని ఫ్రెండ్ తో కలిసి మ్యాజిక్ షోలు చేస్తుంటాడు. డబ్బే లక్ష్యంగా కొన్ని వేరే పనులు కూడా చేస్తుంటాడు సూరి. అయితే మనుషులకంటే ఎక్కువగా డబ్బును ప్రేమించే సూరికి ఒకసారి తాను చేసిన ఓ తప్పు కారణంగా అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్) అనే వ్యక్తికి రెండే రోజుల్లో 25 లక్షలు సంపాదించి అస్లాం భాయ్ కి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి సమయంలోనే అనుకోకుండా దివ్య (సారా) అనే పాప సూరికి పరిచయం అవుతుంది. అయితే దివ్య దగ్గర పలు అతీంద్రియ శక్తులున్నాయని తెలిసిన సూరి ఆమె ద్వారా డబ్బు సంపాదించి తన ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ కొన్ని సంఘటనల తర్వాత సూరికి దివ్య గురించి నిజం తెలుస్తుంది. ఇంతకీ సూరికి తెలిసిన నిజం ఏంటి? దివ్యని వాడుకుని సూరి డబ్బు సంపాదించి తన సమస్యలు క్లియర్ చేసుకున్నాడా? అసలు దివ్య సూరి దగ్గరకే ఎందుకు వచ్చింది. ఫైనల్ గా వీళ్ళ జర్నీ ఎలా సాగింది? ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
ఈ సినిమా చూసాక చాలామందికి వెంకటేష్ ఓల్డ్ మూవీ దేవిపుత్రుడు గుర్తొచ్చే అవకాశం ఉంది. ఏమి తెలియని వయసులో చనిపోయిన ఓ పాప ఆత్మ తన తల్లిదండ్రులను కాపాడాలనుకుని, ఓ వ్యక్తి సాయంతో ఏం చేసింది అనే కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. ఒక ఎమోషనల్ సస్పెన్స్ అండ్ హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషన్స్ పరంగా అండ్ మెయిన్ స్టోరీ లైన్ బాగున్నాయి. అలాగే సినిమాలో మెయిన్ రోల్ అయిన సూరి పాత్ర, అలాగే దివ్య పాత్ర డిజైన్, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బాగా రాసుకున్నారు. వీళ్ళ మధ్య ట్రాక్ కామెడీగా, ఎమోషనల్ గా చాలా ఆకట్టుకుంటాయి. ఇక ఫాహద్ ఫాజిల్ ఎప్పట్లాగే తన న్యాచురల్ నటనతో, మంచి బాడీ లాంగ్వేజ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అద్భుతంగా నటించాడు. అలాగే దివ్య పాప పాత్రలో సారా ఫాలేకర్ తన చక్కగా నటించి మెప్పించింది. ఇక కీ రోల్స్ లో నటించిన మహేష్ మంజ్రేకర్, సౌరబ్ సచ్ దేవ్, సుబ్బరాజు సహా మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక డైరెక్టర్ శశాంక్ యేలేటి సింపుల్ కథను తీసుకున్నా, మూవీలో ఎమోషనల్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ని డీల్ చేసిన తీరు బాగుంది.
Minus Points :
అయితే కథ పరంగా రీసెంట్ గా వచ్చిన హారర్ అండ్ ఎమోషనల్ మూవీస్ తో కంపేర్ చేస్తే.. ఇది మంచి స్టోరీ లైన్. కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ తో ఒకప్పుడు రెగ్యులర్ గా తెలుగులో మూవీస్ వచ్చాయి. అయితే ఈ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాకి సరైన ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం డైరెక్టర్ విఫలమయ్యాడు. పైగా ఈ ఆత్మల కథలు టాలీవుడ్ కి కొత్తేమి కాదు. సినిమా మొత్తం ఆత్మ, అండ్ ఆత్మకు సాయం చేసే హీరో చుట్టూనే డ్రామా బిల్డ్ అయి ఉంటుంది. కానీ చాలా వరకు స్క్రీన్ ప్లే స్లో గా సాగడం, కొన్ని సీన్స్ ఊహాజనితంగా ఉండడం మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేసినప్పటికీ, సెకండ్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ వల్ల కథ డైవర్ట్ అయింది. పైగా ఎమోషనల్ సీన్స్ ని ఇంకాస్త డెప్త్ గా చుపించాల్సింది.
Technical Values :
టెక్నికల్ పరంగా చూసుకుంటే.. ఒక హారర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు VFX బాగా అవసరం. దాని పరంగా మంచి విజువల్ ఎఫెక్ట్స్ ని సినిమాలో చూపించారు. సినిమా నేపథ్యానికి అవి బాగా సెట్ అయ్యాయి. అయితే ఒక సినిమాలో కంటెంట్ లో హారర్ అండ్ ఎమోషన్స్ తక్కువయ్యాయి. కథకి తగ్గట్టు మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. కానీ దర్శకుడు శశాంక్ యేలేటి తనవరకు బానే ట్రై చేసాడు. ఇక కాల భైరవ సంగీతం డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ కొంత బాకీ ఉంది. అనవసరమైన సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Final Review :
ఫైనల్ గా "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్" అంటూ వచ్చిన కామెడీ హరర్ అండ్ ఎమోషనల్ డ్రామాలో ఎమోషన్స్, అండ్ కామెడీ బాగున్నాయి. కాకపోతే కొత్తదనం లేని కథనం వల్ల, అందర్నీ ఆకట్టుకోకపోవచ్చు. కొన్ని రకాల సాగదీత సీన్స్ వల్ల బోర్ గా అనిపిస్తుంది. అయితే ఫాహద్ ఫాజిల్, సారా నటన, అలాగే విజువల్స్, అండ్ ఎమోషన్స్ కోసం మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.