ఇరుముడి (Irumudi)
Irumudi : బలహీనతనే బలాలుగా మార్చుకుని ఇరుముడితో వస్తున్న రవన్న స్వామి!.. స్వామి శరణం..!
About This Movie
Upcoming Movie :
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా "ఇరుముడి" అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా డివోషనల్ టచ్ తో తెరకెక్కుతుంది ఈ మూవీ. ఇప్పటికే ఈ సినిమానుండి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా, ఫైనల్ గా ట్రైలర్ కూడా విడుదలైంది, కాసేపటికిందే విడుదలైన ఈ ట్రైలర్ నెట్టింట ట్రెండ్ అవుతూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్ చూసాక యనానిమస్ గా ఇరుముడి బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు ఇన్నాళ్లు రవన్నలో ఏం మిస్ అయ్యారో ఈ సినిమాలో మొత్తం చూపించేస్తున్నామని ట్రైలర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చేసారు. ముఖ్యంగా ట్రైలర్ లో కూతురుతో తెరకెక్కించిన కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ చాలా బాగున్నాయి. సినిమాలో చూపిస్తున్న గ్రామీణ వాతావరణం సినిమాకి బాగా ప్లస్ అయ్యేలా ఉంది. డైరెక్టర్ శివ నిర్వాణ పల్లెటూరి సీన్లను గాని, అయ్యప్ప మాల వేసే సన్నివేశాలను గాని అద్భుతంగా తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
ఊళ్ళో ప్రతి అమ్మాయిలోనూ తన కూతుర్ని చూసుకునే త్రినాథ్, అనుకోకుండా ఊళ్ళో జరిగే కొన్ని సంఘటనల వల్ల కొందరు రౌడీలు, రాజకీయనాయకులకు పగవాడవుతారు. వాళ్ళ నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది కథ నేపథ్యం గా ఉండేవి అవకాశం ఉందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో జీవి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ చాలా అద్భుతంగా ఉంది. గత కొంతకాలంగా ప్లాప్స్ లో ఉన్న రవన్న ఈ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇవ్వడం పక్కా అని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే లాస్ట్ టైం ఖుషి తో యావరేజ్ మూవీ ఇచ్చిన శివ నిర్వాణ ఈసారి ఇరుముడితో కెరీర్ బెస్ట్ మూవీ ఇస్తారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
You Might Also Like
మకుటం (Makutam)
2026
డీసీ (DC)
2026