Register as a Reviewer
కాగితం పడవలు (Kaagitham Padavalu)

కాగితం పడవలు (Kaagitham Padavalu)

18 Sep 2026
Overall Rating
4.2/10
5 Reviews

Kaagitham Padavalu Movie : ఎంజీఆర్ తుకారాం డైరెక్షన్ లో వర్ధన్ గుర్రాల, కృష్ణ ప్రియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "కాగితం పడవలు". ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: MGR Thukaram
Cast: Vardhan, Krishna Priya, MGR Thukaram, Keerthana Naresh

Available in:

Reviews

What critics and the public are saying about కాగితం పడవలు (Kaagitham Padavalu)

Media Reviews

2 Avg: 5.0/10
123telugu
123telugu Website
5

Average

Kaagitham padavalu movie review

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో వచ్చిన ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా న...

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో వచ్చిన ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన వర్ధన్ గుర్రాల ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. హీరోయిన్ గా నటించిన కృష్ణ ప్రియా నటన సినిమాకి ప్లస్ అయింది. 


అయితే ఈ ‘కాగితం పడవలు’ కథలో హీరో హీరోయిన్ల చైల్డ్ ట్రాక్ మైనస్ అయింది. స్టార్టింగ్ సీక్వెన్స్ ల్లో నటించిన నటీనటుల నటన కూడా సిల్లీగా అనిపిస్తోంది.అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. మొత్తంగా ‘కాగితం పడవలు’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ ఓకే అనిపించినా.. కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ అండ్ సిల్లీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, ఏ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.


Sep 18, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
5

Average

Kaagitham Padavalu movie review

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అని ప్రమోట్ చేయడం, పాటలు బాగుండటం, విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్స్ కి రావడంతో కాగితం పడవలు సినిమాపై ఆసక్తి వచ్చింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ హీరో – హీరోయిన్ లు చిన్నప్పటి నుంచి ప్రేమ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బాగా సాగదీశారు. చిన్నప్పటి స్కూల్ ఏజ్ కథ అంత సాగద...

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అని ప్రమోట్ చేయడం, పాటలు బాగుండటం, విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్స్ కి రావడంతో కాగితం పడవలు సినిమాపై ఆసక్తి వచ్చింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ హీరో – హీరోయిన్ లు చిన్నప్పటి నుంచి ప్రేమ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బాగా సాగదీశారు. చిన్నప్పటి స్కూల్ ఏజ్ కథ అంత సాగదీయాల్సిన అవసరం లేదు. ఇక మూవీలో రాజేష్ – స్వప్న ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసాక కులం వేరని పెద్దలు చేసే అరాచకాలతో బోలెడన్ని పాత సినిమాలు గుర్తుచేశారు. ఇక క్లైమాక్స్ లో కులం మీద ఓ నాలుగు డైలాగ్స్ వేసి ముగించారు. 


పెద్ద మైనస్ ఏంటంటే... సినిమా ఓపెనింగ్ స్కూల్ పిల్లలతో ఒక వరస్ట్ సీన్ తో మొదలు పెట్టారు. లవ్ సీన్స్ మాత్రం క్యూట్ గా రాసుకున్నారు. అన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. రెండు ప్రేమ జంటలకు లవ్ సీన్స్ బాగానే రాసుకున్నారు. క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఇచ్చే ఒక ట్విస్ట్ రెండూ ఊహిస్తాము. అసలు ఈ సినిమాకు కాగితం పడవలు అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. పరువు హత్యలు నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అందులో ఇదొకటి అంతే. మొత్తంగా ‘కాగితం పడవలు’ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఓ ప్రేమకథ. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

Sep 18, 2026 Read Review

Public Reviews

3 Avg: 3.7/10
T
Talari Snehalatha IT Employee
4

Below Average

Kaagitham padavalu movie review

ippude kagitham padavalu movie chusostunna... genral ga love storys ante naku chala istam. trailer kooda decent ga anipinci movie ki vellam friends andaram kalisi. but cinema chusaka ee year lo one of the worest movie chusina feeling vacchindi. edo real story ani cheppi... andariki telisina issueni...

ippude kagitham padavalu movie chusostunna... genral ga love storys ante naku chala istam. trailer kooda decent ga anipinci movie ki vellam friends andaram kalisi. but cinema chusaka ee year lo one of the worest movie chusina feeling vacchindi.


edo real story ani cheppi... andariki telisina issueni moviel lo chupinchadu. and prati dantlo cast godavalu lekunte cinema teeyalem annattu.. deentlo kooda casts picchi valle godavalu ani chupincharu... but movie concept lo antha depth ledu.


final ga ee cinema headdek ni marchipovalante 2 strong allam tea tagithe kani settavvadu.


Sep 19, 2026
V
Velugubantla Ramadurga Private Employee
3

Not Good

Kaagitham Padavalu movie review

Just now finished Kaagitham Padavalu First show. but its delivers a mixed experience. While the core romantic tracks offer genuine charm and cute lead chemistry, the narrative is weighed down by a poorly executed opening and an overstretched childhood backstory. The second half spirals into predicta...

Just now finished Kaagitham Padavalu First show. but its delivers a mixed experience. While the core romantic tracks offer genuine charm and cute lead chemistry, the narrative is weighed down by a poorly executed opening and an overstretched childhood backstory.


The second half spirals into predictable territory, heavily rehashing routine caste-based conflict and honor killing tropes without adding anything fresh. The preachy climax and predictable twists further pull down its impact.


Saved only by its sweet romantic moments and soundtrack, overall Kaagitham Padavalu remains an below average, routeen love drama.

Sep 19, 2026
A
Arige Srikanth Private Employee
4

Below Average

Kaagitham padavalu movie review

రియల్ ఇన్సిడెంట్స్, మంచి పాటలు, విశ్వక్సేన్ ప్రమోషన్ల హైప్‌ తో కాగితం పడవలు థియేటర్‌కి వెళ్లా! లవ్ సీన్స్ క్యూట్‌గా ఉన్నా, ఫస్టాఫ్‌ లో హీరో-హీరోయిన్ల చిన్నప్పటి స్కూల్ ట్రాక్ మాత్రం బోర్ కొట్టించేలా సాగదీశారు. ఓపెనింగ్ సీన్ వర్స్ట్‌గా అనిపించింది. ఇక రాజేష్-స్వప్న జంట ప్రేమ, పరువు హత్యలు, కులం గొడవల...

రియల్ ఇన్సిడెంట్స్, మంచి పాటలు, విశ్వక్సేన్ ప్రమోషన్ల హైప్‌ తో కాగితం పడవలు థియేటర్‌కి వెళ్లా! లవ్ సీన్స్ క్యూట్‌గా ఉన్నా, ఫస్టాఫ్‌ లో హీరో-హీరోయిన్ల చిన్నప్పటి స్కూల్ ట్రాక్ మాత్రం బోర్ కొట్టించేలా సాగదీశారు. ఓపెనింగ్ సీన్ వర్స్ట్‌గా అనిపించింది.


ఇక రాజేష్-స్వప్న జంట ప్రేమ, పరువు హత్యలు, కులం గొడవలు పాత సినిమాలను గుర్తుచేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే ఊహించేయొచ్చు, నాలుగు routeen డైలాగులతో సరిపెట్టేశారు. టైటిల్‌కి కథకి అస్సలు సంబంధం లేదు. overall గా పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మరో యావరేజ్ రొటీన్ డ్రామా ఇది.


Finally లవ్ సీన్స్, సాంగ్స్ ఓకే గానీ.. ఓవరాల్‌ గా ok ok !

Sep 19, 2026

About This Movie

Story :

 

స్కూల్ డేస్ నుండి రామ్ (వర్ధన్ గుర్రాల) – గోదావరి (కృష్ణప్రియా) ఒకర్నొకరు ఇష్టపడతారు. అయితే చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల రామ్ ను, గోదావరి దూరం పెట్టినా, కాలేజ్ డేస్ లో మళ్ళీ ఇద్దరూ ఒకటవుతారు. అలాగే రామ్ ఫ్రెండ్ రాజేష్ (MGR తుకారాం) గోదావరి ఫ్రెండ్ స్వప్న కూడా ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. కానీ, వీరి ఊర్లు, కులాలు వేరు కావడంతో అక్కడే సమస్య మొదలవుతుంది. ఈ క్రమంలో ఊళ్లలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరి స్నేహితులైన రాజేష్, స్వప్న వారి ప్రేమ పెద్దలు ఒప్పుకోని కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. వీరి చావు రామ్ - గోదావరిలో కూడా మార్పు తీసుకొచ్చి, వాళ్ళ పరిస్థితి తమకు రావద్దని భయపడి పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. మరి ఒక ప్రేమ జంట చావు వల్ల మారిన ఊళ్ళలో పరిస్థితులు, మరో ప్రేమ జంట కూడా విడిపోవడానికి కారణం అవుతాయా? లేదా వీరి ప్రేమ పెద్దల్ని ఎదిరించి గెలుస్తుందా? చివరికి రామ్ - గోదావరి లైఫ్ లు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points : 

 

ప్రేమ - పరువు హత్యల నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అందులో ఉన్న భావోద్వేగాలు అలాంటివి మరి. ఇక ఇప్పుడు విడుదలైన కాగితం పడవలు సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకునే తెరకెక్కించడం జరిగింది. సొసైటీ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ కూడా దక్కాయి. కథ పరంగా సింపుల్ గా... ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమ జంట.. కులాల కారణంగా విడిపోవాల్సి వస్తే.. ఆ జంట పరిస్థితి ఏంటి?  ఏం జరిగిందన్న అంశంతో తెరకెక్కిన ఈ సినిమా, లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ అంశాలతో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన వర్ధన్ గుర్రాల - కృష్ణ ప్రియా ఇద్దరూ తమ రోల్స్ లో సహజంగా నటించి మెప్పించారు. అలాగే కీ రోల్స్ లో నటించిన సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్ రాజులపాటి సినిమాకి ప్లస్ అయ్యారు. మిగిలిన వాళ్ళు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

 

Minus Points :

 

అయితే ఈ "కాగితం పడవలు" సినిమా కథ నేపథ్యం బాగానే ఎంచుకున్నా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత జరిగే సీన్స్ అన్ని ఊహించేయచ్చు. పైగా మూవీలో హీరో హీరోయిన్ల చైల్డ్ లవ్ ట్రాక్ మైనస్ అయింది. కొన్ని సీన్స్ వరెస్ట్ గా తీసాడు. సాంగ్స్ బాగున్నా ప్లేస్ మెంట్ కరెక్ట్ గా లేదు. పైగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల సాంగ్స్ పెద్దగా ఎక్కవు. క్లైమాక్స్ బాగున్నా, స్క్రీన్ ప్లే ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు. 

 

అన్నిటికి మించి ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ కి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సినిమా కథ ఎలా ఉన్నా కనెక్ట్ అవ్వొచ్చు. కానీ ఇందులో అవి కూడా సరిగా లేవు. సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలగడానికి మాత్రమే రియల్ స్టోరీని తీసుకున్నట్టు ఉంది గాని, ఆ కథని ఆడియన్స్ కి నచ్చే విధంగా చెప్పడంలో దర్శకుడు సీన్లు రాసుకోలేకపోయాడు. చాలా సీన్లు ఎక్కడో చూసినట్టే ఉంటాయి. 

 

Technical values :


ఇక టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పుకుంటే... ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం కథకుడిగా మంచి స్టోరీ లైన్ ని రాసుకున్నా, దర్శకుడిగా బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులు మెచ్చేలా ఆవిష్కరించడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే పూర్తిగా ఊహాజనితంగా ఉండడం వల్ల మెజారిటీ ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. ఇక సంగీత దర్శకుడు AIS.నౌఫల్ రాజా అందించిన సంగీతం బాగుంది. కానీ సాంగ్స్ ప్లేస్మెంట్ సరిగా లేదు. అనవసరమైన సీన్స్ ని ఎడిటర్ తగ్గించి ట్రిమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పల్లెటూరి సీన్స్ ని న్యాచురల్ గా చూపించారు.


Final Review : 

 

ఫైనల్ గా "కాగితం పడవలు" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా, కథ, కథనాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డల్ స్క్రీన్ ప్లే వల్ల, బోరింగ్ సీన్స్ తో, ఊహాజనిత సీన్లతో ఆడియన్స్ కి విసుగుపుట్టించింది. మెయిన్ క్యారెక్టరైజేషన్స్ కూడా సరిగా రాసుకోలేదు.  పైగా అన్ని సినిమాల్లో లాగానే ఇందులో కూడా కులాల గొడవనే హైలెట్ చేసారు, కానీ దానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. కొన్ని సిల్లీ సీన్లు మెయిన్ గా మైనస్ అవగా, రొటీన్ ఎండింగ్ వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. ఫైనల్ గా లవ్ స్టోరీస్ ఇష్టపడే ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

4.2
Overall Rating
Avg. of all reviews
5
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.0/10
Public
3.7/10
Why MRO?