కర్మాఖ్య (Karmakhya)
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
Available in:
Reviews
What critics and the public are saying about కర్మాఖ్య (Karmakhya)
Media Reviews
7 Avg: 5.7/10Above Average
Karmakhya Movie Review
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. అస్సాంలోని ఫేమస్ టెంపుల్, శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయంను లీడ్ గా తీసుకొని అదే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు. సి...
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. అస్సాంలోని ఫేమస్ టెంపుల్, శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయంను లీడ్ గా తీసుకొని అదే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు. సినిమా సగం వరకు ఒకే ఇంట్లో తీశారు. ఒకే ఇంట్లో అన్ని సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు.
కాకపోతే ఎడిటింగ్ లో మాత్రం కొన్ని సాగదీసిన సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. మొత్తంగా ‘కర్మాఖ్య’ చేతబడుల నేపథ్యంలో ఓ అమ్మాయి బలి నుంచి ఎలా తప్పించుకుంది అని ఆసక్తికరంగా తెరకెక్కించిన సినిమా.
Above Average
Karmakhya Movie Review
హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో కొదవలేదు. అదే తరహాలో కొంతకాలంగా తాంత్రిక పూజల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలో నరబలిని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలూ ఉన్నాయి. ఈ కర్మాఖ్య కూడా అదే తరహా సినిమా. చనిపోయిన వ్యక్తులు తాంత్రిక పూజలతో తిరిగి బ్రతుకుతారనే పిచ్చి నమ్మకంతో కొందరు శవా...
హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో కొదవలేదు. అదే తరహాలో కొంతకాలంగా తాంత్రిక పూజల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలో నరబలిని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలూ ఉన్నాయి. ఈ కర్మాఖ్య కూడా అదే తరహా సినిమా. చనిపోయిన వ్యక్తులు తాంత్రిక పూజలతో తిరిగి బ్రతుకుతారనే పిచ్చి నమ్మకంతో కొందరు శవాన్ని దహనం చేయకుండా రోజుల తరబడి ఇంటిలోనే దాచిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ప్రయత్నం చేయాలనుకున్న కుటుంబానికి ఎలాంటి శాస్తి జరిగిందన్నది 'కర్మాఖ్య'లో చూపించారు.
అయితే సినిమాలో చాలా సన్నివేశాలూ ఏమంత ఆసక్తిని కలిగించవు. సినిమా కథంతా ఒక ఇంటి దగ్గర అక్కడక్కడే తిరగడంతో ప్రేక్షకులలో చిన్నపాటి అసహనం మొదలవుతుంది. కానీ చివరిలోని నరబలి ట్విస్ట్ ఎవ్వరూ ఊహించనిది. ఆ సన్నివేశంతో సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ సినిమాకు 'కర్మాఖ్య' అనే టైటిల్ పెట్టడాన్ని ఆ సన్నివేశంతో జస్టిఫై చేసినట్టు అయ్యింది. చనిపోయిన వారు తిరిగి రారనే విషయాన్ని జీర్ణం చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదని దర్శకుడు చూపించినా... చివరలో సినిమాటిక్ ట్విస్ట్ తో శుభం కార్డు వేశారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను థియేటర్లలో కంటే ఓటీటీలో చూసినప్పుడు బెటర్‌గా అనిపిస్తాయి
Average
Karmakhya Movie Review
కామాఖ్య దేవి నేపథ్యం, మూఢనమ్మకాలు, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి దర్శకత్వం వహించారు.ఓవరాల్ గా కర్మాఖ్య మూవీ ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశ...
కామాఖ్య దేవి నేపథ్యం, మూఢనమ్మకాలు, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి దర్శకత్వం వహించారు.
ఓవరాల్ గా కర్మాఖ్య మూవీ ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రశంసనీయమే.. కానీ కథనం మరింత ఆసక్తికరంగా, భావోద్వేగాలు మరింత బలంగా ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేదని టాక్ వినిపిస్తోంది.
Above Average
Karmakhya Movie review
జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంప...
జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.
ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వకపోయినా, ఇటీవల వచ్చిన థ్రిల్లర్‌లతో పోలిస్తే కొత్త తరహా థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. భారీ అంచనాలు లేకుండా చూస్తే కర్మాఖ్య ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా కర్మాఖ్య ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్.
Above Average
Karmakhya Movie review
అదిరే అభి(అభినయ కృష్ణ) జబర్దస్త్ వదిలేసిన తర్వాత దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందు `చిరంజీవ` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `కర్మాఖ్య` అనే చిత్రాన్ని రూపొందించాడు. దీని అసలు పేరు `కామాఖ్య`. కానీ సెన్సార్, లీగల్ ఇబ్బందుల కారణంగా `కర్మాఖ్య`గా పేరు మార్చారు. దర్శకుడు అదిరే...
అదిరే అభి(అభినయ కృష్ణ) జబర్దస్త్ వదిలేసిన తర్వాత దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందు `చిరంజీవ` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `కర్మాఖ్య` అనే చిత్రాన్ని రూపొందించాడు. దీని అసలు పేరు `కామాఖ్య`. కానీ సెన్సార్, లీగల్ ఇబ్బందుల కారణంగా `కర్మాఖ్య`గా పేరు మార్చారు. దర్శకుడు అదిరే అభి ఈ మూవీని మిస్టీరియస్, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. కామాఖ్య దేవత శక్తిని ఆధారంగా చేసుకుని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. అయితే బయటకు ఇది హర్రర్ థ్రిల్లర్‌గా కనిపించినా, హర్రర్ అంశాలు లేవు. అదే సమయంలో సూపర్ నేచురల్ అంశాలు కూడా లేవు.
ట్విస్ట్ లు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కాకపోతే ఇటీవల వస్తోన్న థ్రిల్లర్ చిత్రాలతో పోల్చితే బెటర్ గానే ఉంది. కొత్తరకమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ని అందించే మిస్టీరియల్ సస్పెన్స్ థ్రిల్లర్ `కర్మాఖ్య`. అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకుంటుంది. థ్రిల్ నిస్తుంది.
Average
Karmakhya Movie Review
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". ఈ సినిమా గురించి చెప్పుకుంటే మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ మూఢ నమ్మకాల కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ ఆడియెన్స్ పై ముద్ర వేసే విధంగా ముగింపు...
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". ఈ సినిమా గురించి చెప్పుకుంటే మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ మూఢ నమ్మకాల కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ ఆడియెన్స్ పై ముద్ర వేసే విధంగా ముగింపు లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్.
నటీనటులు అభిరామి, ఆనంద్, సముద్రఖని అలాగే సమైరా కొత్త అమ్మాయి అయినప్పటికీ.. కథను తన భుజాల మీద మోసింది. శరణ్య ప్రదీప్ సపోర్టింగ్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కథ, సన్నివేశాలపై ఇంకా బెటర్‌గా ఆలోచించి ఉంటే మంచి డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ అయి ఉండేది. జబర్దస్త్ అభి తనదైన శైలిలో వినోధభరితంగా ఈ ఎమోషనల్ సబ్జెక్ట్ ను చెప్పి ఉంటే.. ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారని అనడానికి పార్ట్ 2 ఉండటమే కారణంగా భావించాలి.
Above Average
Karmakhya Movie Review
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య", థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ అన్న రేంజ్ లోనే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘కర్మాఖ్య’ సినిమాలో అక్కడక్కడా ఎంగేజ్ చేసే థ్రిల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంట...
జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య", థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ అన్న రేంజ్ లోనే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘కర్మాఖ్య’ సినిమాలో అక్కడక్కడా ఎంగేజ్ చేసే థ్రిల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి.
నటీనటుల పెర్ఫామెన్స్ లను దర్శకుడు అభినయ కృష్ణ బాగా రాబట్టారు. అలానే సెకండాఫ్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఫస్టాఫ్ లో కూడా ఈ మూమెంటం పూర్తి స్థాయిలో ఉంటే బాగుండేది. ఇవి పక్కన పెడితే ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఈ జానర్ సినిమాలని ఇష్టపడేవారికి నచ్చుతుంది.
Public Reviews
8 Avg: 6.1/10Above Average
Karmakhya movie review
weekend lo familitho karmakhya movie ki vellanu. edo kamakhya ante devtinoal feel untundi, socio fantacy anukunna gani.. chala dissapoint ayyam. kani cinemalo manchi point undi.. mooda nammakalanu nammakudadani, konchem different ga makers cheppadam naku nacchindi. anduke audiance okasari movie chud...
weekend lo familitho karmakhya movie ki vellanu. edo kamakhya ante devtinoal feel untundi, socio fantacy anukunna gani.. chala dissapoint ayyam. kani cinemalo manchi point undi.. mooda nammakalanu nammakudadani, konchem different ga makers cheppadam naku nacchindi. anduke audiance okasari movie chudocchu. but low expectations tho chuste meeke manchidi.
Hit
Karmakhya movie review
ippude karmakhya cinema chusa bro. cinema ayithe baga nacchindi. because nenedo timepass ki frineds tho ala college ayipoyaka vella. naku intrest kooda lekapothe friends forse chesi teesukellaru. but movie chusi baga thrill ayya. climax konchem dissapoint ayya. but its ok. because eerojullo horror t...
ippude karmakhya cinema chusa bro. cinema ayithe baga nacchindi. because nenedo timepass ki frineds tho ala college ayipoyaka vella. naku intrest kooda lekapothe friends forse chesi teesukellaru. but movie chusi baga thrill ayya. climax konchem dissapoint ayya. but its ok.
because eerojullo horror thriller concept movies lo comedy mix chesi penta chestunnaru. but ee movie chala serious ga undi naku manchi thrill feel icchindi. but low expectations tho velthe impress avutaru.
Above Average
Karmakhya movie Review
Just watched #Karmakhya... honestly, movie chala baaga nachindi.Horror thriller anukoni vellanu, kani movie ichina message matram unexpected. Screenplay konchem slow unna, suspense maintain chesaru. Climax kuda satisfying ga anipinchindi.Overall ga, different concept unna content-based thriller. Exp...
Just watched #Karmakhya... honestly, movie chala baaga nachindi.
Horror thriller anukoni vellanu, kani movie ichina message matram unexpected.
Screenplay konchem slow unna, suspense maintain chesaru. Climax kuda satisfying ga anipinchindi.
Overall ga, different concept unna content-based thriller. Expectations lekunda velthe definitely enjoy chestharu.
Above Average
Karmakhya movie review
Just watched #Karmakhya... concept bagundi but execution matram disappoint chesindi.Movie motham superstition valla life ela spoil avuthundo ane point meedha untundi. Message manchide, but screenplay slow ga undadam valla thrill antha workout avvaledu. Twists kuda easy ga guess cheyochu.Horror thril...
Just watched #Karmakhya... concept bagundi but execution matram disappoint chesindi.
Movie motham superstition valla life ela spoil avuthundo ane point meedha untundi. Message manchide, but screenplay slow ga undadam valla thrill antha workout avvaledu. Twists kuda easy ga guess cheyochu.
Horror thriller anukoni velthe definitely disappoint avtharu. Horror ledu, supernatural elements kuda almost levu. Suspense build-up kante lag ekkuva anipinchindi.
Different concept try chesinanduku appreciation undi... kani overall ga cinema expected impact ivvaledu. One-time watch anthe.
Average
Karmakhya movie review
Watched #Karmakhya with decent expectations, but it didn't quite work for me.The concept about how superstition ruins lives is interesting, but the execution feels underwhelming. The screenplay moves slowly, the twists are predictable, and the suspense never reaches the level it promises.If you're e...
Watched #Karmakhya with decent expectations, but it didn't quite work for me.
The concept about how superstition ruins lives is interesting, but the execution feels underwhelming. The screenplay moves slowly, the twists are predictable, and the suspense never reaches the level it promises.
If you're expecting a horror or supernatural thriller, you'll probably be disappointed. The film has a good message, but it lacks the gripping moments needed to keep you fully invested. A bold idea, but the storytelling could have been much sharper. overall one time watchable.. better to shift ott
Above Average
Karmakhya movie review
Walked into #Karmakhya with absolutely no expectations... walked out genuinely impressed.The biggest win for me was its message about the dangerous impact of superstition. Instead of relying on cheap horror or jump scares, the film keeps the focus on a thought-provoking idea wrapped in a mystery thr...
Walked into #Karmakhya with absolutely no expectations... walked out genuinely impressed.
The biggest win for me was its message about the dangerous impact of superstition. Instead of relying on cheap horror or jump scares, the film keeps the focus on a thought-provoking idea wrapped in a mystery thriller.
The biggest surprise? Finding out it was directed by Jabardasth Adhire Abhi after the movie. That's a solid leap as a filmmaker, and he definitely deserves appreciation.
If we keep supporting films with fresh concepts like this, we'll get more meaningful thrillers instead of the same old formula.
Above Average
Karmakhya movie Review
Just watched #Karmakhya and honestly, I loved it.What impressed me the most wasn't the mystery—it was the core message about how superstition can destroy people's lives. That theme really stayed with me.I went in with zero expectations, just looking to kill some time. But I was genuinely surprised t...
Just watched #Karmakhya and honestly, I loved it.
What impressed me the most wasn't the mystery—it was the core message about how superstition can destroy people's lives. That theme really stayed with me.
I went in with zero expectations, just looking to kill some time. But I was genuinely surprised to find out later that it was directed by Jabardasth Adhire Abhi. Didn't expect this kind of storytelling from him—huge respect!
At a time when comedy-horror is everywhere, it's refreshing to see a filmmaker attempt a serious mystery thriller with a meaningful concept. Definitely worth watching if you're into content-driven thrillers.
Hit
Karmakhya movie Review
ఫస్ట్ అఫ్ అల్ కర్మాఖ్య సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమాలో మెయిన్ గా మూఢ నమ్మకాల కారణంగా మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా ఎదో టైంపాస్ కి చూద్దామని ఏదో అలా వెళ్ళిపోయా. కానీ చూసాక సినిమా డైరెక్ట...
ఫస్ట్ అఫ్ అల్ కర్మాఖ్య సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమాలో మెయిన్ గా మూఢ నమ్మకాల కారణంగా మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే నాకు బాగా నచ్చింది.
అండ్ ఈ సినిమా ఎదో టైంపాస్ కి చూద్దామని ఏదో అలా వెళ్ళిపోయా. కానీ చూసాక సినిమా డైరెక్ట్ చేసింది జబర్దస్త్ అదిరే అభి అని తెలిసి షాకయ్యా. తనలో ఇంత టాలెంట్ ఉండడం మంచి విషయం. చాలా మంది కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సినిమాలు బాగుంటాయంటారు గాని, సీరియస్ థ్రిల్లర్ గా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ నిజంగా ఈ జెనరేషన్ కి కావాలి. మూఢ నమ్మకాల మధ్యలో నలిగిపోయే వారికీ ఈ సినిమా చూస్తే కనువిప్పు కలగాలి.
About This Movie
Story :
వైజాగ్ లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే కామాఖ్య (సమైరా), ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) క్లోజ్ ఫ్రెండ్స్. అయితే అనుకోకుండా ప్రవల్లిక వెళ్లాల్సిన ఓ ఇన్సూరెన్స్ పనిమీద ఓ ఫ్యామిలీ ఇంటికి కామాఖ్య వెళ్లాల్సివస్తుంది. ఆ ఇంట్లో ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ అయిన సరోజిని (అభిరామి), ప్రభాకర్ (ఆనంద్) తో పాటు మతిస్థిమితం సరిగా లేని వారి కొడుకు సాత్విక్ (వైష్ణవ్) ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ పనిమీద వచ్చిన వచ్చిన కామాఖ్య ఊహించని విధంగా వీళ్ళ ఇంటి నుంచి బయటకు రాకుండా చిక్కుకుపోతుంది. ఈ క్రమంలో అసలు కామాఖ్య వీరి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఇంటి నుంచి బయట పడటానికి కామాఖ్య చేసిన ప్రయత్నాలు ఏమిటి? అలాగే కామాఖ్యకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కామాఖ్య దేవతకు ఉన్న లింక్ ఏంటి? అలాగే సరోజిని ఇంటిలో ఉండే శవం వెనుక మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ తిరుపతి (సముద్రఖని) ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? ఫైనల్ గా కామాఖ్య అన్ని సమస్యల నుండి బయటపడిందా లేదా అన్నదే కథ.
Plus Points :
ఇక కామాఖ్య సినిమా గురించి చెప్పుకుంటే ట్రైలర్ చూసాకే సినిమాపై ఇండస్ట్రీలో మంచి హైప్ రాగా, ఈ మధ్య థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ కూడా బాగా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. అలాగే దర్శకుడు అభి ఈ సినిమాకు ఎంచుకున్న కోర్ కాన్సెప్ట్ బాగుంది. మంచి ట్విస్ట్ లతో కూడిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ కి వెళ్తున్న కొద్దీ వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి. అలాగే సమైరా, శరణ్య ప్రదీప్, అభిరామి వాళ్ళ రోల్స్ లో అదరగొట్టారు. అలాగే సముద్రఖని రోల్ క్లైమాక్స్ లో బాగున్నా, మరింత నిడివి ఉండాల్సింది. ఇక మధునందన్, ఆనంద్, వైష్ణవ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
Minus Points :
అయితే కామాఖ్య సినిమాకు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా, ట్రీట్మెంట్ ఆసక్తికరంగా లేదు. చాలా సీన్స్ లో ఇతర థ్రిల్లర్ మూవీస్ గుర్తొస్తాయి. అందువల్ల కొత్తరకమైన థ్రిల్స్ కోరుకునే ఆడియన్స్ నిరాశపడవచ్చు. సముద్రఖని లాంటి నటుల్ని మరింత వాడుకోవాల్సింది. క్లైమాక్స్ బాగున్నా, సినిమాలో ఇంట్రెసింగ్ కథనాన్ని ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటినుంచి మైంటైన్ చేసుంటే వేరే విధంగా ఉండేది. అలాగే క్లైమాక్స్ బాగున్నా అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది.
Technical Values :
ఇక టెక్నికల్ వాల్యూస్ గమనిస్తే.. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయింది. సాంగ్స్ పర్వాలేదనిపించాయి. ఈశ్వర్ పెంటి కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఇక దర్శకుడు అభినయ కృష్ణ రెండో సినిమాగా కామాఖ్యని మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకు హీరోహీరోయిన్లకు కంటే కథకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం బాగుంది.
Final Review :
ఓవరాల్ గా కామాఖ్య కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒకవర్గం ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. నటీనటుల నుండి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టడంలో, అలాగే టెక్నిషియన్స్ నుండి మంచి పనితనం రాబట్టడంలో దర్శకుడు అభినయ కృష్ణ బాగా సక్సెస్ అయ్యాడు. అయితే మరింత థ్రిల్లింగ్ గా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా కామాఖ్య సినిమా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ని కొంతవరకు మెప్పిస్తుంది.