Register as a Reviewer
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

19 Jun 2026
Overall Rating
6.2/10
33 Reviews

సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ "మా ఇంటి బంగారం". నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు ప్రొడ్యూస్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: BV Nandini Reddy
Cast: Samantha, Diganth, Gulshan Devaiah, Gautami, Manjusha, Sreemukhi and others

Available in:

Reviews

What critics and the public are saying about మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

Media Reviews

21 Avg: 5.9/10
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

Maa Inti Bangaram Movie Review

రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్ల...

రాక రాక వచ్చాడు.. యాభై ఏళ్ల వయసులో ఏదో వచ్చింది చేశాడూ.. వెల్కమ్ బ్యాక్ అనొచ్చు కదా అని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’‌పై ఓ లుక్కేస్తే.. సినిమా ప్రారంభం నుంచి టైటిల్‌కి తగ్గట్టుగా మనోడి ట్రాన్స్‌ఫర్‌లతోనే కథని లాగించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో త్రిమూర్తులు మంచోడే కానీ.. చుట్టూ ఉన్న వాళ్లంతా చెడ్డోళ్లే కాబట్టి.. మనోడి చేసే మంచి పనులు నచ్చక.. ట్రాన్స్‌ఫర్‌లు చేస్తుంటారు.


వడ్డే నవీన్ గత పదేళ్లుగా వెండితెరపైనే కాదు.. మరెక్కడా కనిపించకపోయినా కూడా.. ఆయన సినిమా తీస్తున్నారు అంటే.. ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ వైబ్స్ వినిపించాయి, కనిపించాయి. ఎందుకంటే.. నైటీస్‌లో ఆయన క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది మరి. కానీ సినిమాలో మాత్రం పెద్దగా విషయం లేదు. 20 ఏళ్ల క్రితం మూసేసిన పాత కేసుని.. పదేళ్ల గ్యాప్ తరువాత వడ్డే నవీన్ తిరగదోడినట్టే ఉంది. ఓవరాల్‌గా.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుతో వడ్డే నవీన్ వడ్డీ‌తో సహా ఎంటర్‌టైన్ చేస్తాడనుకుంటే.. కష్టమే త్రిమూర్తులూ అనిపించాడు.


Jun 23, 2026
Venky Reviews
Venky Reviews Twitter Channel
5

Average

Maa Inti Bangaram Movie Review

#MaaIntiBangaaram Familiar Story, Boring Execution!A familiar and predictable story narrated in a very flat manner from start to finish. While the second half picks up compared to the first, the ineffective backstory, weak villain thread, and lack of engaging moments make it difficult to stay invest...

#MaaIntiBangaaram Familiar Story, Boring Execution!


A familiar and predictable story narrated in a very flat manner from start to finish. While the second half picks up compared to the first, the ineffective backstory, weak villain thread, and lack of engaging moments make it difficult to stay invested. Emotions rarely land, and the film struggles to generate any real momentum throughout.


Samantha is neat in her role and a few subtle comedy moments work here and there. However, the subpar BGM and uninspired narration prevent the film from leaving much of an impact.


Below Average.


Rating: 2.25/5

Jun 19, 2026 Read Review
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం...

మా ఇంటి బంగారం... ఫస్ట్ అఫ్ అల్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎదో అలా ఒకే ఒకేలా ఉంది. అంటే మరీ ఎక్కడా బోర్ కొట్టలేదు. అక్కడక్కడా మంచి సీన్స్ వచ్చినపుడు ఎంజాయ్ చేశా. ఇది సమంత వెర్షన్ బాషా సినిమా అని చెప్పొచ్చు. మా ఇంటి బంగారం యూనిక్ సెన్స్ ఏందంటే... సమంత ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తుందో బాగానే చూపించారు.. బట్ వర్క్ అవలేదు. ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవలేదు. 


సమంత మాత్రం తన రోల్ లో అదరగొట్టింది. ఆ ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. బట్ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. విలన్ కి ఇవ్వాల్సిన వెయిట్ అస్సలు ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అవి ఇంకొన్ని ఎక్కువ చుపించాల్సింది అనిపించింది. అండ్ సమంత ఫ్రెండ్ గా చేసిన మంజు చాలా బాగా చేసింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బట్ రాజ్ నిడిమోరు, డైరెక్టర్ నందిని రెడ్డి నుండి మరింత ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ సినిమా లాస్ట్ లో ఎమోషనల్ సీన్స్ ని స్ట్రాంగ్ గా కనెక్ట్ చేసి వుంటే బాగా వర్కౌట్ అయ్యేది. ఫైనల్ వర్డ్ ఏంటంటే.. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే మా ఇంటి బంగారం నచ్చేయొచ్చు.

Jun 19, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Maa Inti Bangaram Movie Review

ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు.&nbs...

ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసొచ్చాను. సో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది... డల్ గా, లల్ గా అలా అలా విసుగు తెప్పించింది. డిస్సపాయింట్ చేసింది ఇంతకంటే నేనేం చెప్పలేను. సింపుల్ గా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుంటుంది. దీన్ని సాగదీసి దాగదీసి వదిలారు. 


సామ్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేసింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


బట్ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే మెయిన్ రన్ టైం. మరీ అన్ని సీన్స్ ని డిటైలింగ్ గా చెప్పాలంటే చాలా బోరింగ్ గా అనిపిస్తది. ఎదో మంచి సీన్ వస్తుంది అనుకునే లోపే.. అలా నార్మల్ గా వెళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత బాగా ఏం లేదు. బికాస్ విలన్ స్ట్రాంగ్ గా లేడు. హస్బెండ్ క్యారెక్టర్ కూడా అస్సలు సెట్ కాలేదు. అండ్ సినిమాలో కనీసం లిప్ సింక్ కూడా ఎవ్వరికి సెట్ కాలేదు. ఫైనల్ గా స్టోరీ చాలా డల్ గా ఎల్లిపోతుంది. సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అయితే నేను డిస్సపాయింట్ అయ్యా. ఏదైనా బాగుంది అంటే సమంత యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఓవరాల్ గా డిస్సపాయింట్ అయ్యాను. 

Jun 19, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
5

Average

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమం...

మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే.. ఫస్ట్ గా సమంత గారంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ అన్ ఫోర్చునట్లి సినిమా అయితే అసలు ఎం లేదు సినిమా. అసలు ఏందో సినిమా చూస్తున్నంత సేపు, ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రేమ్స్ లో సీరియల్ గానే అనిపిస్తుంది. అండ్ సమంత యాక్టింగ్ బాగానే ఉన్నా, ఫ్రెష్ ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే సినిమాలో సమంత గారి మోడ్యులేషన్ సెట్ అవలేదు. 


అండ్ ఉన్నంతలో కొంచెం సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఫన్ జెనరేట్ చేసారు. తర్వాత క్లైమాక్స్ బాగుంటది. ఒక ఆక్షన్ సీన్ ఉంటదక్కడా.. అది బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ కథ ఒక ఫ్లో లో వెళ్తున్న ఫీల్ కూడా రాదు. స్టోరీ మీద మరింత ఫోకస్ పెట్టుంటే బాగుండేది. అండ్ సినిమాలో సమంత గారి వాయిస్ పరంగా అప్ట్ అవ్వలేదు అంత. యాక్టింగ్ బాగానే చేసారు కానీ సెట్ అవలేదు అనిపించింది. ఓవరాల్ గా సినిమా వైబ్ అయితే రాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకు నేనైతే 2.5 బీలో ఇస్తాను. 

Jun 19, 2026 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Maa Inti Bangaram Movie Review

ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నా...

ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో సమంత ప్రతి ఫ్రేమ్ లో, అన్ని సీన్స్ లోనూ చితగ్గొట్టిందని చెప్పాలి. సింపుల్ గా సినిమాలో హీరోయిన్ ది ఒకటే ఎజెండా. ఫ్యామిలీని మెప్పించి కోడలిగా తన స్థానం ఫిక్స్ చేసుకోవాలి. 


ఇక ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, ఎక్కడో స్లో అయిందేమో అనిపిస్తుంది. అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కామెడి కన్నా, సామ్ తన ఐడెంటిటీని ఎలా సేవ్ చేసుకుంటూ, మ్యానేజ్ చేస్తూ అందర్నీ ఎలా కన్విన్స్ చేస్తుందో అదే సినిమా స్టోరీగా తీసారని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడా సమంత యాక్షన్ చేస్తుంటే కూడా ఫ్యాన్స్ కి అరుపులు వచ్చే లాంటి హై సీన్స్ కూడా ఉన్నాయి. ఓ భీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సినిమాను నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో చుస్తే బెటర్ మూవీ ని చూసేయొచ్చు. సింపుల్ గా ఒక మంచి మూవీని చూసి వచ్చాము అన్నట్టు ఉంటుంది సినిమా. 


Jun 19, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్...

మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. 


సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సమంత పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అండ్ ఫిమేల్ ఓరియెంటెడ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. బట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తే, ఫ్యామిలీ డ్రామా నుండి, ఆక్షన్ డ్రామాకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అప్పటినుండి సినిమా రొటీన్ టెంప్లెట్ కి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్రెష్ నెస్ కోరుకుంటే కష్టమే. 

Jun 19, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
5

Average

Maa Inti Bangaram Movie Review

మా ఇంటి బంగారం.. సినిమా ఎలా ఉంది రా అంటే.. ఎక్కువ లేదు, తక్కువ లేదు అలానే ఉంది. ఫస్ట్ ఏం వర్కౌట్ అయ్యాయి అంటే కామెడీ. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసిన ఆవిడ బాగా చేసింది. అలాగే హీరొయిన్ ఫన్ కూడా బాగుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా ఉన్నాయి. స్పెషల్లీ ఫైట్స్ హీరోయిన్ కి కొన్ని...

మా ఇంటి బంగారం.. సినిమా ఎలా ఉంది రా అంటే.. ఎక్కువ లేదు, తక్కువ లేదు అలానే ఉంది. ఫస్ట్ ఏం వర్కౌట్ అయ్యాయి అంటే కామెడీ. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసిన ఆవిడ బాగా చేసింది. అలాగే హీరొయిన్ ఫన్ కూడా బాగుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా ఉన్నాయి. స్పెషల్లీ ఫైట్స్ హీరోయిన్ కి కొన్ని బాగున్నా, ఇంకొన్ని సూట్ కాలేదనిపిస్తుంది. అండ్ సినిమాలో సెట్స్ కూడా అంత బాగా లేవు. 


డైరెక్టర్ చెప్పినట్టు ఇదేదో బాషా టెంప్లేట్, అని అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది గాని, ఎమోషనల్ అయితే లేదు. స్పెషల్లీ ఫ్యామిలీస్ మధ్య సీన్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సినిమాలో విలన్ కూడా స్ట్రాంగ్ గా లేడు. మొత్తం అతడు సినిమాని ఫిమేల్ వెర్షన్ లో దించినట్టుంటుంది. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే నేననుకున్న ఎమోషన్, కనెక్ట్ సినిమా నుండి అయితే రాలేదు. బట్ ఓవరాల్ గా కొంతమందికి నచ్చోచ్చేమో, ఓవరాల్ గా ఓసారి ట్రై చేయొచ్చు అన్నట్టుంది. 


Jun 19, 2026 Watch
Ideal Brain
Ideal Brain Twitter Channel
7

Hit

Maa inti Bangaram movie Review

ఇంటికి అందరు మహాలక్ష్మిలు కానక్కర్లేదు. కాళికా కూడా దేవతే.#MaaIntiBangaram is a well-made entertainer that showcases both Samantha’s star power and her acting prowess.Director Nandini Reddy and creator Raj Nidimoru deliver an action-packed story rooted in strong family emotions, striking a fine bala...

ఇంటికి అందరు మహాలక్ష్మిలు కానక్కర్లేదు. కాళికా కూడా దేవతే.


#MaaIntiBangaram is a well-made entertainer that showcases both Samantha’s star power and her acting prowess.


Director Nandini Reddy and creator Raj Nidimoru deliver an action-packed story rooted in strong family emotions, striking a fine balance between commercial appeal and sentiment.


One of the film’s unique highlights is Samantha appearing in sarees throughout the film - even during the action sequences- which adds a distinctive touch to her character.


Instagram influencer Manjusha shines in a well-written role as the protagonist’s friend and delivers a confident performance. Sreemukhi is equally impressive and leaves a mark with her presence.


I loved the way old classic “muthyamantha pasupu” song is fully used at the beginning of the film.


I particularly loved the moment where Sreelakshmi reads the “Nenu Rachayitri…” poem from a magazine - a delightful meta reference to her iconic track in Chantabbai.


The climax works wonderfully and provides a satisfying payoff.


A cameo by Vennela Kishore towards the end feels like the perfect dessert after a satisfying meal.


Samantha delivers with full force, and it feels like the good days are back for Telugu cinema this June.


A blockbuster!

Jun 19, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Maa Inti Bangaram movie Review

వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత...

వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. 


అయితే ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాసాడు రాజ్. తన స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. దర్శకురాలు నందిని రెడ్డి స్క్రీన్ ప్లే పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. కానీ తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసారు. ఓవరాల్ గా మా ఇంటి బంగారం.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. సమంత కోసం..!

Jun 19, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Maa Inti Bangaram movie review

సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్‌ లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. కథా కథనాలు రొటీన్ గానే ఉన్నా, ఫిమేల్ వెర్షన్ లో సినిమా ఫ్రెష్ గా అనిపిస్తు...

సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్‌ లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. కథా కథనాలు రొటీన్ గానే ఉన్నా, ఫిమేల్ వెర్షన్ లో సినిమా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ బాగున్నాయి. 


ఈ సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు ఫుల్ మీల్స్ లాంటింది. సమంత ఫ్యాన్స్‌ కు, రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి వర్క్‌ ను అభిమానించే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చుకోవాల్సిన సినిమా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నచిత్రం.. థియేటర్‌లోనే ఈ సినిమాను ఆస్వాదించండి.




Jun 19, 2026 Read Review
6

Above Average

Maa Inti Bangaram Movie Review

సమంత మూడేళ్ల గ్యాప్‌ తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన మూవీ `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్‌ నిడిమోరు నిర్మించిన ఈ మూవీ తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమాలో సమంత వన్ విమెన్ షోగా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కానీ కథ విషయంలో అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. దర్...

సమంత మూడేళ్ల గ్యాప్‌ తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన మూవీ `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్‌ నిడిమోరు నిర్మించిన ఈ మూవీ తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమాలో సమంత వన్ విమెన్ షోగా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కానీ కథ విషయంలో అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. దర్శకురాలు నందిని రెడ్డి డైరేక్షన్ వరకు బాగానే హ్యాండిల్ చేసినా, బలమైన కథా, కథనాలు అందించడంలో విఫలమయ్యారు. 


ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కాస్త చేయాల్సింది. ఓవరాల్ గా నటిగా సమంతకిది కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. కానీ సినిమాగా కమ్‌ బ్యాక్‌ ఇవ్వలేకపోయింది. ఓవరాల్‌ గా ఈ సినిమా మా ఇంటి బంగారం కాలేకపోయింది.

Jun 19, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Maa Inti Bangaram review

కథ ప రంగా చూస్తే ఇది కొత్త టెంప్లేట్ కాదు. గతం నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ సినిమాకు ప్రధాన బలం.కథలో పెద్దగా సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, సమంత ఎంటర్‌ట...

కథ ప రంగా చూస్తే ఇది కొత్త టెంప్లేట్ కాదు. గతం నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ సినిమాకు ప్రధాన బలం.


కథలో పెద్దగా సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, సమంత ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకుడు కథ కంటే సమంతను ఎలివేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. మాస్ యాక్షన్, షీరోయిజం ఇష్టపడే వారికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ వెర్డిక్ట్: కథ రొటీన్... కానీ సమంత మార్క్ యాక్షన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్. 

Jun 19, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Maa Inti Bangaram Movie Review

తెలుగు ప్రేక్షకులకు హీరో లేదా హీరోయిన్ గతం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. గతాన్ని వెనక్కి నెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రధాన పాత్రను పాత జీవితంలోని వ్యక్తులు, సంఘటనలు మళ్లీ వెంబడించడం అనేది చాలా సినిమాల్లో కనిపించే అంశం. ఆ గతం కారణంగా కొత్త జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నార...

తెలుగు ప్రేక్షకులకు హీరో లేదా హీరోయిన్ గతం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. గతాన్ని వెనక్కి నెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రధాన పాత్రను పాత జీవితంలోని వ్యక్తులు, సంఘటనలు మళ్లీ వెంబడించడం అనేది చాలా సినిమాల్లో కనిపించే అంశం. ఆ గతం కారణంగా కొత్త జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారు? తమకు ప్రియమైన వారిని ఎలా కాపాడుకున్నారు? అనే కథాంశంతో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కింది.


అయితే సినిమాలో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకునేది సమంత నటన మరియు ఆమె యాక్షన్ ప్రెజెన్స్. తెరపై ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ పరంగా చూస్తే పెద్దగా కొత్తదనం లేకపోయినా, సమంత స్క్రీన్ ప్రెజెన్స్ దానికి బలంగా నిలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కథను మరింత బలంగా రాసుకుని ఉంటె, సినిమా రేంజ్ మరోలా ఉండేది. 

Jun 19, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
6

Above Average

Maa Inti Bangaram Movie review

తెలుగు ప్రేక్షకులకు బాషా టెంప్లేట్ కొత్త కాదు. హీరోకి ఓ గతం ఉంటుంది. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోని నీడలా వెంటాడుతూ గతం జీవితం తాలుకా వ్యక్తులు వస్తారు. కొత్త జీవితంలో మనుషులకు గతం జీవితంలో మనుషుల నుంచి ఎదురయ్యే ప్రమాదం నుంచి హీరో ఎలా కాపాడాడు? అనేది ఈ తరహా సినిమాల్లో కనిపించే పా...

తెలుగు ప్రేక్షకులకు బాషా టెంప్లేట్ కొత్త కాదు. హీరోకి ఓ గతం ఉంటుంది. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోని నీడలా వెంటాడుతూ గతం జీవితం తాలుకా వ్యక్తులు వస్తారు. కొత్త జీవితంలో మనుషులకు గతం జీవితంలో మనుషుల నుంచి ఎదురయ్యే ప్రమాదం నుంచి హీరో ఎలా కాపాడాడు? అనేది ఈ తరహా సినిమాల్లో కనిపించే పాయింట్. సేమ్ తరహా కథతో ఫిమేల్ లీడ్ రోల్ నేపథ్యంలో నడిచే సినిమా మా ఇంటి బంగారం. 


అయితే యాక్షన్ సినిమాలు కొన్ని చూసినప్పుడు హీరో వన్ మ్యాన్ షో గురించి చెబుతాం. మా ఇంటి బంగారం చూశాక… సమంత షో కనబడుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమంత యాక్షన్ మాత్రమే గుర్తు ఉంటుంది. రొటీన్ టెంప్లేట్ కథను షీరోయిజంతో గట్టెక్కించాడు. కథ కంటే సమంతను హైలైట్ చేయడం కోసమే సినిమా తీశారని అనిపిస్తుంది. సామ్ అభిమానులకు నచ్చేలా, మెచ్చేలా తీసిన చిత్రమిది.

Jun 19, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

Maa inti Bangaram movie review

‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.&nbsp...

‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. 


అయితే ఎక్కడా కూడా థ్రిల్లింగ్‌ గా, వావ్ ఈ సీన్ కొత్తగా ఉందే అని అనిపించదు. ప్రతీదీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ కథలో జొప్పించారు. ఓవరాల్ గా ‘మా ఇంటి బంగారం’ కథ, కథనం పరంగా ఎక్కడో ఆగిపోయినట్టు అనిపించినా.. సమంత మాత్రం మ్యాజిక్ చేస్తుంది. సమంత ఫ్యాన్స్‌ కి ఓ ట్రీట్‌ లా ఈ సినిమా అనిపిస్తుంది. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటి? కలెక్షన్స్ పరంగా, కమర్షియల్‌ గా ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Jun 19, 2026 Read Review
Gulte
Gulte Website
6

Above Average

Maa Inti Bangaram Movie Review

Samantha's latest film, *Maa Inti Bangaram*, has been released in theaters and received a mixed response. After the debacle of Shaakuntalam, she took a break and then teamed up with B. V. Nandini Reddy, for ‘Maa Inti Bangaaram’.Positives:1.⁠ ⁠First Half2.⁠ ⁠Humour3.⁠ ⁠Background Score4.⁠ ⁠Action Seq...

Samantha's latest film, *Maa Inti Bangaram*, has been released in theaters and received a mixed response. After the debacle of Shaakuntalam, she took a break and then teamed up with B. V. Nandini Reddy, for ‘Maa Inti Bangaaram’.


Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Humour

3.⁠ ⁠Background Score

4.⁠ ⁠Action Sequences


Negatives:


1.⁠ ⁠Routine Second Half

2.⁠ ⁠Lack of Twists & Turns

3.⁠ ⁠Rushed Backstory


Overall, Maa Inti Bangaaram deserves a watch in theatres with friends and family for its very well-executed first half, clean humour, slick action sequences and Samantha’s performance. It is most likely to work well with the patronage of the family audience. However, the second half of the film did not completely live up to the expectations set by the first half. A bit more care in writing and executing the second half, would have made the film a sure-shot blockbuster.


Bottomline: Everything & Anything For ‘Family’.

Jun 19, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Maa Inti Bangaram Movie Review

సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా లేకపోగా, స్క్రీన్ ప్లే పరంగానూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీన్స్, అండ్ ఫ్యామిలీతో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ సమంత ఫ్లా...

సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా లేకపోగా, స్క్రీన్ ప్లే పరంగానూ ఫ్రెష్ ఫీల్ అయితే ఇవ్వలేదు. బట్ యాక్షన్ సీన్స్, అండ్ ఫ్యామిలీతో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 


కానీ సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మరీ క్రిమ్జ్ గా అనిపించి ప్లాట్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా కథ విషయంలో దర్శకురాలు నందిని రెడ్డి మరింత జాగ్రత్త వహిస్తే బాగుండేది. కానీ ఆవిడ డైరెక్షన్ పనితనాన్ని మెచ్చుకుని తీరాలి. అలాగే సమంత భర్త క్యారెక్టర్ చేసిన దిగంత్ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటె బాగుండేది. ఆ రోల్ కూడా కాస్త ఏజ్డ్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుండేది. ఓవరాల్ గా సామ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుంది, కానీ నార్మల్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. 

Jun 19, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
6

Above Average

Maa Inti Bangaram Movie Review

సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇ...

సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడం, అందులోనూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా, యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఫస్ట్ అఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. అయితే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్పి ఉంటే ఇంటర్వెల్ కి హీరోయిన్ గతం ఏంటి అనే ఉత్కంఠ నెలకొనేది.


అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సాంప్రదాయ కుటుంబాలు అందులో కోడళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అని సీన్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మోడ్ లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. అయితే ఈ సినిమా, క్లైమాక్స్ కూడా అతడు సినిమా గుర్తు చేస్తుంది. ఓవరాల్ గా సమంతను హీరోయిన్ గా పెట్టి ఇలా ఫ్యామిలీ యాక్షన్ సినిమాని బాగానే తెరకెక్కించారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమాకి సమంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా ఫ్యామిలీతో కలిసి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా చూడొచ్చు.


Jun 19, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Maa Inti Bangaram Movie Review

సమంత హీరోయిన్ గా తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా అందులో తనే టైటిల్‌ రోల్ ప్లే చేసింది. ఇక సామ్ ఇందులో గత సినిమాల కన్నా ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర...

సమంత హీరోయిన్ గా తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా అందులో తనే టైటిల్‌ రోల్ ప్లే చేసింది. ఇక సామ్ ఇందులో గత సినిమాల కన్నా ఎనర్జిటిక్‌గా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలనూ బాగా చేసింది. ఇది సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇతర ప్రధాన పాత్రల్లో కాస్తంత అతిగా ఉన్నా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. అయితే సమంత భర్తగా దిగంత్‌ అంతగా ఆనలేదు.


అయితే సంతోష్‌ నారాయణన్ (Santhosh Narayanan) సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇక 'ఓ బేబీ' తర్వాత సమంత, నందినీరెడ్డి కాంబోతో తెరకెక్కిన మూవీ కావడం, రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండడంతో 'మా ఇంటి బంగారం'పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది. అయితే థియేటర్‌ కు వచ్చిన ప్రేక్షకులు మాత్రం 'ఓకే బంగారం' అని సర్దుకు పోవచ్చు.

Jun 19, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

Maa Inti Bangaram Movie Review

సమంత హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఈ ఎమోషనల్...

సమంత హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పరంగా రొటీన్ గా ఉన్నా, మంచి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత నటన, గుల్షన్ దేవయ్య పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచాయి. 


ఇక మా ఇంటి బంగారం సినిమా ఇంట్రెస్టింగ్ ప్లే తో ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు సామ్ అండ్ ఆమె ఫ్యామిలీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.


Jun 19, 2026 Read Review

Public Reviews

12 Avg: 6.6/10
K
KOLUGURU SURESH Students & Youth
8

Super Hit

Maa Inti Bangaaram Review

Samantha is back with a bang, Samanta actions scenes are absolute and the decent movie with good story plot. Samantha is proved that the power of lady oriented movies are never die if the content is good. It has collected 50 cr mark in just 4 days it is the samantha's dynamic show. Overall the movie...

Samantha is back with a bang, Samanta actions scenes are absolute and the decent movie with good story plot. Samantha is proved that the power of lady oriented movies are never die if the content is good. It has collected 50 cr mark in just 4 days it is the samantha's dynamic show. Overall the movie is super with full of entertainment including action.

Jun 26, 2026 Watch
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
6

Above Average

Maa Inti Bangaram Movie Review

work finish ayyaka.. ఎదో బోర్ కొడుతోంది కదా.. అని మా ఇంటి బంగారం.... ఫ్యామిలీతో సినిమాకెళ్ళాం... సినిమా చూస్తే బాగానే ఎంటర్టైన్ అయ్యాం గాని... నాకే ఎదో మిస్ అయిన feel ఒచ్చింది. fresh story ఎం కనిపించలేదు. Saam Perfarmance brilliant. అండ్ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా మెచ్చుకోవాలి. but సినిమా మాత్రం...

work finish ayyaka.. ఎదో బోర్ కొడుతోంది కదా.. అని మా ఇంటి బంగారం.... ఫ్యామిలీతో సినిమాకెళ్ళాం... సినిమా చూస్తే బాగానే ఎంటర్టైన్ అయ్యాం గాని... నాకే ఎదో మిస్ అయిన feel ఒచ్చింది. fresh story ఎం కనిపించలేదు. Saam Perfarmance brilliant. అండ్ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా మెచ్చుకోవాలి.


but సినిమా మాత్రం ఇంటికొచ్చిన తర్వాత అంత గుర్తులేదు. as a movie lover గా ఏ సినిమా అన్నా.. నాకు నచ్చిందంటే ఇంటికొచ్చాక కూడా నా mind లో మూవీ తిరుగుతా ఉంటది... బట్ ఈ సినిమాకైతే అంత అనిపించలేదు. మా ఫ్యామిలి కైతే బానే అనిపించిందట.

Jun 23, 2026
7

Hit

Maa Inti Bangaram Movie Review

Strong emotions, solid performances, and an engaging second half make Maa Inti Bangaram a decent watch.


A few routine scenes slow things down, but the emotional payoff works.


A simple family drama powered by Samantha's charm and performance

Jun 23, 2026
B
Baru Sri Harshitha Students & Youth
7

Hit

Maa Inti Bangaram movie Review

MaaIntiBangaram...


Samantha carries the film with ease.. Good emotions, decent action, and a strong flashback episode.


Not perfect, but it delivers enough family drama and sentiment to keep you invested.

Jun 23, 2026
A
4

Below Average

Maa Inti Bangaram Movie Review

చాలా రోజులనుండి work busyలో ఉండి entertainment ki దూరమైపోయా. ఎదో weekend ఒచ్చిందికదా అని అలా relaxation కోసం 'మా ఇంటి బంగారం' మూవీకి వెళ్ళిపోయా... పరమ బోరింగ్ సినిమా ఇది... బాషా రేంజ్ సినిమా అంటున్నారు బైట... కానీ అంత లేదు.. సినిమా చూస్తే content ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. fresh story కూడ...

చాలా రోజులనుండి work busyలో ఉండి entertainment ki దూరమైపోయా. ఎదో weekend ఒచ్చిందికదా అని అలా relaxation కోసం 'మా ఇంటి బంగారం' మూవీకి వెళ్ళిపోయా... 


పరమ బోరింగ్ సినిమా ఇది... బాషా రేంజ్ సినిమా అంటున్నారు బైట... కానీ అంత లేదు.. సినిమా చూస్తే content ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. fresh story కూడా ఏం లేదనిపించింది. నాకైతే కనీసం ఎంటర్టైన్మెంట్ కాదు కదా... బట్ సామ్ perfarmance కి వంక పెట్టలేం. వన్ విమెన్ షో తో బెస్ట్ ఇచ్చింది. 

Jun 23, 2026
V
Velugubantla Ramadurga Private Employee
7

Hit

Maa Inti Bangaram Movie Review

Maa Inti Bangaram is a heartfelt family drama that shines because of Samantha's strong performance. The emotional moments and flashback sequences keep the film engaging, while the villain track adds decent intensity. Though the story follows a familiar path and a few scenes feel stretched, fina...

Maa Inti Bangaram is a heartfelt family drama that shines because of Samantha's strong performance. The emotional moments and flashback sequences keep the film engaging, while the villain track adds decent intensity. 


Though the story follows a familiar path and a few scenes feel stretched, finally.. Not extraordinary, but a decent emotional entertainer with Samantha as the biggest highlight.

Jun 23, 2026
A
Arige Srikanth Private Employee
6

Above Average

Maa Inti Bangaram movie Review

Maa Inti Bangaram is a decent emotional family drama that mainly works because of Samantha's performance. She carries the film with confidence and does a great job in both the emotional and action-packed scenes. The flashback episodes and the family emotions keep the story engaging for the most part...

Maa Inti Bangaram is a decent emotional family drama that mainly works because of Samantha's performance. She carries the film with confidence and does a great job in both the emotional and action-packed scenes. The flashback episodes and the family emotions keep the story engaging for the most part.


Overall, it's not a groundbreaking film, but it's an enjoyable one-time watch with good performances, emotional moments, and decent production values. If you like family dramas with a touch of action and sentiment, this movie is worth checking out.

Jun 23, 2026
M
Mulollu Praveen Kumar CA/Advocate
6

Above Average

Maa Inti Bangaram Movie Review

I felt "Maa Inti Bangaram" works mainly because of Samantha's sincere performance. The emotional depth and flashback portions keep the narrative engaging. While some scenes feel predictable and stretched, the film delivers enough heart to stay invested. Gulshan Devayya adds strength as the antagonis...

I felt "Maa Inti Bangaram" works mainly because of Samantha's sincere performance. The emotional depth and flashback portions keep the narrative engaging. While some scenes feel predictable and stretched, the film delivers enough heart to stay invested.


Gulshan Devayya adds strength as the antagonist. Not a perfect film, but an emotionally satisfying watch.

Jun 23, 2026
A
A Varadharaju Students & Youth
7

Hit

Maa Inti Bangram Movie Review

Maa Inti Bangaram...


Saam one women show...  Strong performance, Emotional climax, Good villain track

,Family emotions anni baga work ayyayi.


but Slow scenes, and Not fully mass-friendly


Overall ga Family + Samantha fans ki pakka watch!

Jun 22, 2026
B
Baburam Powdal Freelancer & Consultant
7

Hit

Maa Inti Bangaram movie Review

The film attempts to blend family drama, action, and emotional storytelling. Samantha's nuanced performance elevates material that occasionally slips into familiar territory.The flashback structure is effective, and the emotional payoff works. Though the screenplay could have been tighter, the techn...

The film attempts to blend family drama, action, and emotional storytelling. Samantha's nuanced performance elevates material that occasionally slips into familiar territory.


The flashback structure is effective, and the emotional payoff works. Though the screenplay could have been tighter, the technical aspects and performances make it a respectable entertainer.

Jun 19, 2026
P
Patwari Sinduja Homemaker / Housewives
7

Hit

Maa Inti Bangaram movie Review

chala days tarvatha one of the best female oriented movie chusa.. ade "Ma Inti Bangaram"... complete family emotions tho nadiche cinema. and action kooda bagane undi. Samantha performance movie ki back bone laga undi. Family bonding, emotions, flashback scenes baaga connect avuthayi. but K...

chala days tarvatha one of the best female oriented movie chusa.. ade "Ma Inti Bangaram"... complete family emotions tho nadiche cinema. and action kooda bagane undi. Samantha performance movie ki back bone laga undi. Family bonding, emotions, flashback scenes baaga connect avuthayi. 


but Konni scenes slow ga anipinchina overall ga maakaithe nacchindi. Weekend lo family tho choodadaniki decent choice. kakapothe story inka ekkuva expect chesa.

Jun 19, 2026
T
Talari Snehalatha Influencer
7

Hit

Maa Inti Bangaram Movie Review

థియేటర్లో సినిమా చూసి 3 వారాలైంది. చాలా బోరింగ్ గా ఉందనుకున్న టైం లో మంచి హై ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాకు మా ఇంటి బంగారం సినిమా పోస్టర్లు కనిపించాయి. అలా చూడగానే ఈవెనింగ్ work అయిపోయాక first show కి వెళ్ళిపోయా. సినిమా చూసాక సింపుల్ గా one word లో చెప్పాలంటే సామ్ వన్ ఉమెన్ షో... అంతే. ...

థియేటర్లో సినిమా చూసి 3 వారాలైంది. చాలా బోరింగ్ గా ఉందనుకున్న టైం లో మంచి హై ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాకు మా ఇంటి బంగారం సినిమా పోస్టర్లు కనిపించాయి. అలా చూడగానే ఈవెనింగ్ work అయిపోయాక first show కి వెళ్ళిపోయా. సినిమా చూసాక సింపుల్ గా one word లో చెప్పాలంటే సామ్ వన్ ఉమెన్ షో... అంతే. 


story, direction విషయంలో డిస్సపాయింట్ అయ్యా. బట్ సమంత కోసం చూసేయొచ్చు. ఎవరైనా ఎంటటైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే dissapoint అవుతారేమో... ఎదో timepass కోసం వెళ్ళండి అంతే.

Jun 19, 2026

About This Movie

Story :

కథ విషయానికి వస్తే.. అనాధ అయిన స్వప్న అలియాస్ ఝాన్సీ (సమంత) పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ (దిగంత్)  ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. కానీ వీళ్ళ ప్రేమను దిగంత్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల, ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడానికి స్వప్న చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫైనల్ గా అంతా ఒకటైపోయారు, స్వప్నను కోడలిగా ఇంట్లోకి అంగీకరించారు అనుకున్న టైం కి, స్వప్న గతం ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతుంది. కరుణ (గుల్షన్ దేవయ్య) అనే నక్సలైట్ స్వప్న పై పగబట్టి తనని, తన ఫ్యామిలీని చిక్కుల్లో పడేస్తాడు. అప్పుడు ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వప్న ఏం చేసింది. కరుణ ని ఎలా ఎదుర్కొంది తన కుటుంబానికి గత జీవితాన్ని చెప్పి కోడలిగా తన ఫ్యామిలీలో స్థానం నిలుపుకుందా? అనేది కథ.

 

Plus Point : 

ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంత అనే చెప్పాలి. సినిమా మొత్తం వన్ ఉమెన్ షోగా నడిపించి అదరగొట్టింది. కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటాయి. రెండు షేడ్స్ ఉన్న రోల్ ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి ఆకట్టుకుంది సామ్. తన లుక్స్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. ఇక దిగంత్ కూడా తన మార్క్ నటనతో మెప్పించాడు. గుల్షన్ దేవయ్య నెగిటివ్ షేడ్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. ఇక శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గౌతమి తదితరులు వాళ్ళ రోల్స్ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక దర్శకురాలు నందినిరెడ్డి తీసుకున్న స్టోరీ లైన్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ సీన్స్ కూడా బాగున్నాయి. 

 

Minus Point :

అయితే హీరోయిన్ సమంత పాత్రను కథ ఫ్లాష్ బ్యాక్ ను బాగానే రాసుకున్న దర్శకురాలు, అంతే స్థాయిలో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ను రాసుకోలేకయారు. అలాగే మూవీకి కావాల్సిన బలమైన ఎమోషన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. పైగా కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి.  కామెడీకి కూడా పెద్దగా స్కోప్ లేదు. అలాగే ఫ్రెష్ స్టోరీస్ కావాలనుకున్న ఆడియన్స్ కొంచెం డిస్సపాయింట్ అవొచ్చు.

 

Technical values :

ఇక టెక్నికల్ విషయానికి వస్తే... సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకి మంచి ప్లస్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. దర్శకురాలు నందిని రెడ్డి కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, దర్శకురాలిగా మరోసారి తన బెస్ట్ వర్క్ చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది, కాకపోతే కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

Final Review :

ఓవరాల్ గా "మా ఇంటి బంగారం" అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా సమంతకు మంచి కం బ్యాక్ లాంటి మూవీ అవుతుందని చెప్పొచ్చు. సమంత పెర్ఫార్మన్స్ తో పాటు నందినిరెడ్డి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, టేకింగ్ హైలెట్ అయ్యాయి. ఓవరాల్ గా రెగ్యులర్ మూవీ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.

Review Statistics

6.2
Overall Rating
Avg. of all reviews
33
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
5.9/10
Public
6.6/10
Why MRO?